Beauty Tips: చూడటానికి ఇది ల్యాండ్‌ ఫోన్‌లాగా.. కానీ ఇదొక బ్యూటీ మసాజర్‌..! | Kiski's Skin Rejuvenation Eye Wrinkle Remover Machine For Beauty | Sakshi
Sakshi News home page

Beauty Tips: చూడటానికి ఇది ల్యాండ్‌ ఫోన్‌లాగా.. కానీ ఇదొక బ్యూటీ మసాజర్‌..!

Published Mon, Apr 29 2024 12:46 PM | Last Updated on Mon, Apr 29 2024 2:29 PM

Kiski's Skin Rejuvenation Eye Wrinkle Remover Machine For Beauty

యవ్వనాన్ని కోరుకోంది ఎవరు! దాన్ని శాశ్వతం చేసుకోవడానికి ఇంటి చిట్కాల నుంచి శస్త్రచికిత్సల దాకా అన్నిటినీ ప్రయత్నిస్తారు. అయినా పరిష్కారాన్ని అందనివ్వదు పెరిగే వయసు.  ఆ వరుసలో ఇంకో ప్రయత్నంగా వచ్చింది ఇదిగో ఈ ‘కిస్కీస్‌ స్కిన్‌ రెజూవనేషన్‌ ఐ రికిల్‌ రిమూవర్‌ మెషిన్‌.’ నిత్య యవ్వనాన్ని ఇవ్వకపోయినా వృద్ధాప్యాన్నయితే వాయిదా వేస్తుంది..  కళ్ల దగ్గర ఏర్పడే మచ్చలు, ముడతలను పోగొట్టి!

చూడటానికి ఇది ల్యాండ్‌ ఫోన్‌  మాదిరిగా ఉంటుంది. ఫోన్‌ లిఫ్ట్‌ చేసినట్లుగా.. దీని మసాజ్‌ హెడ్‌ని చేత్తో పట్టుకుని.. కళ్ల చుట్టూ ఉన్న ముడతలు, మచ్చల మీద మసాజ్‌ చేసుకోవాలి. ఈ మెషిన్‌ తోపాటు కాథోడ్‌ క్లిప్‌ ఒకటి లభిస్తుంది. ట్రీట్‌మెంట్‌ తీసుకునేవారు ఈ క్లిప్‌ని చేతికి అటాచ్‌ చేసుకుని మసాజ్‌ స్టార్ట్‌ చేసుకోవాలి.

ఈ టూల్‌ సాయంతో ఐ బ్యాగ్స్, డార్క్‌ సర్కిల్స్‌ అన్నీ తొలగిపోతాయి. మొదట్లో పది రోజులకు ఒకసారి ఈ ట్రీట్‌మెంట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఆరు లేదా ఎనిమిదిసార్లు ఈ ట్రీట్‌మెంట్‌ తీసుకున్న తర్వాత రిజల్ట్‌ స్పష్టంగా కనిపిస్తుంది. ధర 876 డాలర్లు. అంటే 73,265 రూపాయలు అన్నమాట. ఇలాంటి మోడల్స్‌ మార్కెట్‌లో చాలానే ఉన్నాయి. క్వాలిటీ, ఆన్‌లైన్‌ రివ్యూస్‌ని బట్టి కొనుగోలు చేయడం ఉత్తమం. మోడల్‌ని బట్టి.. ఒక్కో గాడ్జెట్‌.. ఒక్కో ధర ఉండొచ్చు.

ఇవి చదవండి: గృహస్థాశ్రమ వైశిష్ట్యం : ఇష్టాయిష్టాలు కలిసాయా!?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement