పెడిక్యూర్‌ స్క్రబ్బర్‌ను ఎప్పుడైనా వాడి చూశారా!? | Pedicure Scrubber Beautizer Beauty Tips | Sakshi
Sakshi News home page

పెడిక్యూర్‌ స్క్రబ్బర్‌ను ఎప్పుడైనా వాడి చూశారా!?

Published Sun, Jul 7 2024 2:34 AM | Last Updated on Sun, Jul 7 2024 2:34 AM

Pedicure Scrubber Beautizer Beauty Tips

సౌందర్య పోషణలో ‘పాదాల సంరక్షణ’ కూడా ముఖ్యమైనదే! అందుకే చాలామంది ఫేషియల్, వాక్సింగ్‌ కోసమే కాదు.. పెడిక్యూర్‌ కోసం కూడా పార్లర్‌ల చుట్టూ తిరుగుతుంటారు. చిత్రంలోని ఎలక్ట్రిక్‌ కాలస్‌ రిమూవర్‌ ఇంట్లో ఉంటే పార్లర్‌కి బై చెప్పొచ్చు. నిమిషాల్లో పాదాలను మెరిపించుకోవచ్చు.

ఈ మల్టీఫంక్షనల్‌ పెడిక్యూర్‌ కిట్‌ను వినియోగించడం చాలా తేలిక. ఇది డెడ్‌ స్కిన్‌ రిమూవల్‌ హెడ్‌తో పాటు, నెయిల్‌ బఫర్‌ హెడ్, పాలిషింగ్‌ హెడ్‌.. ఇలా 3 రోలర్‌ హెడ్స్‌తో రూపొందింది. వాటర్‌ప్రూఫ్‌ కూడా అయిన ఈ డివైస్‌కి ముందువైపు సేఫ్‌ స్టార్ట్‌ పవర్‌ బటన్‌  ఉంటుంది. దాన్ని నొక్కితే పైన అమర్చిన హెడ్‌ గుండ్రంగా తిరుగుతూ పని చేస్తుంది. ఇందులో లో స్పీడ్, హై స్పీడ్‌ అనే రెండు ఆప్షన్‌ ్స ఉంటాయి. అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు.

త్రీడీ డిజైన్‌ తో తయారైన ఈ ఫుట్‌ స్క్రబ్బర్‌ మెషిన్‌కి గంటన్నర పాటు ఫుల్‌ చార్జింగ్‌ పెడితే.. సుమారు 150 నిమిషాల వరకు ఆగకుండా పని చేస్తుంది. ఈ డివైస్‌తో పెడిక్యూర్‌ చేసుకోవడం చాలా సులభం. ఇది పాదాల కింది మృతకణాలను తొలగించి పాదాలను మృదువుగా మార్చడమే కాకుండా బ్యాక్టీరియా పెరుగుదలనూ నిరోధిస్తుంది. దీన్ని చేతి గోళ్లను శుభ్రం చేసుకోవడానికీ వినియోగించుకోవచ్చు. ధర సుమారు 800 రూపాయలు మాత్రమే.

ఇవి చదవండి: మనల్ని నాశనం చేయడానికి ప్రతి ఇంట్లో బోన్లు పెట్టి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement