ఈ ఫేస్ అండ్ బాడీ మసాజర్.. ఆయుర్వేద పద్ధతులతో ప్రేరణ పొందిన వెల్నెస్ టూల్. నాణ్యమైన కాంస్యంతో రూపొందిన ఈ మసాజర్‌తో మసాజ్ చేసుకుంటే బాడీకి చక్కటి విశ్రాంతి కలుగుతుంది. ఒత్తిడి, అలసట వంటివి మాయమై రక్తప్రసరణ మెరుగుపడుతుంది. చర్మం పునరుజ్జీవమవుతుంది.
ముఖం, కంటి చుట్టూ ఉండే కండరాలను బిగుతుగా చేసి, వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. టేక్‌వుడ్ హ్యాండిల్, సీడ్ ఫ్రీ–బ్రాంజ్ మెటల్ క్యాప్‌తో.. తేలికగా.. వినియోగించడానికి అనువుగా ఉంటుంది. ఈ టూల్‌ని స్వయంగా ఎవరికి వారే ఉపయోగించుకోవచ్చు.
ముఖం, పాదాలు, చేతులు, ఇతర ప్రాంతాలకు ఇష్టమైన సీరం లేదా నూనెను అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి. ఈ టూల్‌కి ఒకవైపున్న చిన్న వృత్తాకారపు భాగాన్ని ముఖం, నుదురు ప్రాంతాల్లో ఆనించి.. గుండ్రంగా కదిలించాలి. అలా కంటివైపు క్రమంగా కదులుతూ.. కనుబొమ్మలు, బుగ్గలు, చెవుల చుట్టూ, గడ్డం, పెదవుల చుట్టూ, మెడవైపూ సున్నితంగా గుండ్రంగా తిప్పుతూ మసాజ్ చేసుకోవాలి.
మసాజ్ తర్వాత ఈ టూల్ లోహపు భాగాలను సబ్బుతో లేదా తడి గుడ్డతో క్లీన్ చేసుకోవాలి. ఈ మసాజర్స్‌లో పలు మోడల్స్‌ల్లో, పలు సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి మార్కెట్‌లో 5 వందల రూపాయల నుంచీ అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే ముందు రివ్యూస్ చూసి కొనుగోలు చెయ్యడం మంచిది.
Comments
Please login to add a commentAdd a comment