ఎండలు మండుతున్నాయి. ఈ సమయంలో చాలామందికి కళ్లు పొడిబారిపోవడం, కళ్లు ఎర్రబడి మంటలు రావడం సర్వ సాధారణం. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే ఉపశమనం కలుగుతుంది. ఆ చిట్కాలేమిటో చూద్దాం.
ఇలా చేయండి..
పాలలో కాని కలబంద రసంలో కానీ దూదిని ముంచి పదిహేను నిమిషాల పాటు కళ్ళపై పెట్టుకుంటే కళ్ళ అలసట తగ్గుతుంది
గంధం చెక్కని అరగదీసి కళ్ళ మీద రాసుకుంటే కళ్ళలోని ఎరుపు తగ్గుతుంది
నిద్ర పోయే ముందు నాలుగైదు తేనె చుక్కలు, నువ్వుల నూనె నాలుగైదు చుక్కలు కలిపి కళ్ళలో వేసుకుంటే ఉదయానికి కళ్ళు నిర్మలంగా,స్వచ్ఛంగా ఉంటాయి
కళ్ళు మంటగా వుంటే చల్లటి నీటితో కళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. ఆ నీరు కళ్ళ లోని దుమ్ముకణాలు, మలినాలను తీసివేయడంలో సహాయపడుతుంది
దూదిని రోజ్ వాటర్‌లో ముంచి కనురెప్పులపై 10–15 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా చేస్తే కంటిగాయాలకి, కళ్ళ మంటలకి ఉపశమనం లభిస్తుంది
దూదిని పాలలో ముంచి కంటిచుట్టు తుడవాలి. తర్వాత చల్లనినీటితో శుభ్రంగా కడుక్కోవాలి
దోసకాయ ముక్కల్ని కట్ చేసి కను రెప్పుల పై 15 నిమిషాల పాటు ఉంచినట్లయితే కళ్ళ మంట నుంచి ఉపశమనం పొందవచ్చు
శుభ్రమైన తెల్లటి వస్త్రాన్ని చల్లటి నీటితో తడిపి నీరంతా పిండేయాలి. ఆ వస్త్రంలో కొన్ని మల్లెపూలు లేదా నంది వర్ధనం పూలు ఉంచి కళ్లమీద ఆ వస్త్రాన్ని ఉంచుకుంటే చల్లగా ఉండడంతోపాటు తలనొప్పి తగ్గుతుంది
పచ్చి బంగాళదుంపను చక్రాల్లా తరిగి ఆ ముక్కలను కళ్ళపై పెట్టుకుంటే కళ్ళమంటల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇవి చదవండి: 'పుదీనా'తో.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో? మీకు తెలుసా!
Comments
Please login to add a commentAdd a comment