బెల్లం ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన శరీరానికి అవసరమైన మూలకాలు బెల్లంలో లభిస్తాయి. విటమిన్ ఎ, బి, గ్లూకోజ్, ఐరన్, కాల్షియం,పొటాషియం, జింక్, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు ఇందులో ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో బెల్లం క్రమం తప్పకుండా తీసుకోవాలని చెబుతారు. దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? రోజూ బెల్లం తినొచ్చా?
ఆరోగ్య ప్రయోజనాలు..
►బెల్లంలో ఉండే సహజ చక్కెరలు, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.దీనిలోని పొటాషియం, మెగ్నీషియం కారణంగా బెల్లం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
► పంచదారకు బదులు బెల్లం తినే వారి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.
► బెల్లంలో ఇనుము, మెగ్నీషియం, పొటాషియం ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవిగాక కొద్ది మొత్తంలో బి విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.
► ఇందులో ఉండే అధిక కార్బోహైడ్రేట్ కంటెంట్ కారణంగా శరీరానికి కావల్సిన తక్షణ శక్తిని అందిస్తుంది.
► కాలేయం తీరుని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపి రక్తాన్ని శుద్ది చేయడానికి ఉపయోగపడుతుంది.
► బరువు తగ్గాలనుకునేవారికి ఈ బెల్లం చక్కటి ప్రత్యామ్నాయం. ఇందులో కేలరీలు తక్కువుగా ఉంటాయి. అందువల్ల బరువుతగ్గాలనుకునే వారికి ఆరోగ్యకరమైన తీపి పదార్థంగా మంచి ఎంపిక.
► బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే గాక వృద్ధాప్య ఛాయలను ఎదుర్కొవడంలో మంచి ఔషధంగా ఉపకరిస్తుంది.
చలికాలంలో ఎందుకు?
శీతాకాలంలో జీవక్రియ మందగిస్తుంది. అందుకే ఈ కాలంలో బెల్లం తినడం వల్ల జీవక్రియను మెరుగుపరుస్తుంది. బెల్లం శరీరంలో వేడిని పెంచుతుంది. ఈ కాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బెల్లం తినడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. బెల్లంలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది శరీర రక్తకణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకండా చలికాలంలో చాలామందిని వేధించే కీళ్లనొప్పుల సమస్యను కూడా దూరం చేస్తుంది. ఎర్రరక్తకణాల ఉత్తత్తికి ఉపయోగడుతుంది. ముఖ్యంగా అనీమియాతో బాధపుడుతున్న రోగులకు ఇది మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది.
అసలు బెల్లాన్ని ఎలా గుర్తించాలి?
బెల్లం రంగును బట్టి అది అసలైనదా? నకిలీదా అనేది ఇలా తెలుసుకోవచ్చు.
బెల్లాన్ని కల్తీ చేయడానికి కాల్షియం కార్బోనేట్ మరియు సోడియం బైకార్బోనేట్ ఎక్కువగా వాడతారు. దీనివల్ల బెల్లం రంగు తెలుపు, లేదా పసుపు రంగులో ఉంటుంది. అలా కాకుండా ముదురు గోధుమ రంగులో ఉంటే అది అసలైన బెల్లం అన్నమాట. ఇక నకిలీ బెల్లాన్ని గుర్తించడానికి మరో పద్దతి.. ఓ బెల్లం ముక్క తీసుకొని నీటిలో వేస్తే అది పూర్తిగా మునిగిపోతే కల్తీదని భావించాలి. పైకి తేలినట్లయితే నిజమైన బెల్లం అని భావించాలి.
Comments
Please login to add a commentAdd a comment