jaggery powder
-
చలికాలంలో బెల్లం ఎందుకు తినాలి?నకిలీ బెల్లాన్ని ఎలా గుర్తించాలి?
బెల్లం ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన శరీరానికి అవసరమైన మూలకాలు బెల్లంలో లభిస్తాయి. విటమిన్ ఎ, బి, గ్లూకోజ్, ఐరన్, కాల్షియం,పొటాషియం, జింక్, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు ఇందులో ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో బెల్లం క్రమం తప్పకుండా తీసుకోవాలని చెబుతారు. దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? రోజూ బెల్లం తినొచ్చా? ఆరోగ్య ప్రయోజనాలు.. ►బెల్లంలో ఉండే సహజ చక్కెరలు, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.దీనిలోని పొటాషియం, మెగ్నీషియం కారణంగా బెల్లం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ► పంచదారకు బదులు బెల్లం తినే వారి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ► బెల్లంలో ఇనుము, మెగ్నీషియం, పొటాషియం ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవిగాక కొద్ది మొత్తంలో బి విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ► ఇందులో ఉండే అధిక కార్బోహైడ్రేట్ కంటెంట్ కారణంగా శరీరానికి కావల్సిన తక్షణ శక్తిని అందిస్తుంది. ► కాలేయం తీరుని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపి రక్తాన్ని శుద్ది చేయడానికి ఉపయోగపడుతుంది. ► బరువు తగ్గాలనుకునేవారికి ఈ బెల్లం చక్కటి ప్రత్యామ్నాయం. ఇందులో కేలరీలు తక్కువుగా ఉంటాయి. అందువల్ల బరువుతగ్గాలనుకునే వారికి ఆరోగ్యకరమైన తీపి పదార్థంగా మంచి ఎంపిక. ► బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే గాక వృద్ధాప్య ఛాయలను ఎదుర్కొవడంలో మంచి ఔషధంగా ఉపకరిస్తుంది. చలికాలంలో ఎందుకు? శీతాకాలంలో జీవక్రియ మందగిస్తుంది. అందుకే ఈ కాలంలో బెల్లం తినడం వల్ల జీవక్రియను మెరుగుపరుస్తుంది. బెల్లం శరీరంలో వేడిని పెంచుతుంది. ఈ కాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బెల్లం తినడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. బెల్లంలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది శరీర రక్తకణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకండా చలికాలంలో చాలామందిని వేధించే కీళ్లనొప్పుల సమస్యను కూడా దూరం చేస్తుంది. ఎర్రరక్తకణాల ఉత్తత్తికి ఉపయోగడుతుంది. ముఖ్యంగా అనీమియాతో బాధపుడుతున్న రోగులకు ఇది మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. అసలు బెల్లాన్ని ఎలా గుర్తించాలి? బెల్లం రంగును బట్టి అది అసలైనదా? నకిలీదా అనేది ఇలా తెలుసుకోవచ్చు. బెల్లాన్ని కల్తీ చేయడానికి కాల్షియం కార్బోనేట్ మరియు సోడియం బైకార్బోనేట్ ఎక్కువగా వాడతారు. దీనివల్ల బెల్లం రంగు తెలుపు, లేదా పసుపు రంగులో ఉంటుంది. అలా కాకుండా ముదురు గోధుమ రంగులో ఉంటే అది అసలైన బెల్లం అన్నమాట. ఇక నకిలీ బెల్లాన్ని గుర్తించడానికి మరో పద్దతి.. ఓ బెల్లం ముక్క తీసుకొని నీటిలో వేస్తే అది పూర్తిగా మునిగిపోతే కల్తీదని భావించాలి. పైకి తేలినట్లయితే నిజమైన బెల్లం అని భావించాలి. -
అనకాపల్లి బెల్లం పొడికి పేటెంట్
-
కలబంద ద్రావణంతో పంటలకు మేలు
ప్రకృతి నేర్పిన పాఠాలను ఆకళింపు చేసుకొని ప్రకృతి/సేంద్రియ సేద్యాన్ని ఔపోశన పట్టి, నేర్చుకున్న విషయాలను పదుగురు రైతులకు తెలియజెపుతూ చక్కని దిగుబడులు రాబడుతున్నారు మహిళా రైతు అప్పన్నగారి యశోదమ్మ. కలబంద వంటి అనేక మొక్కల ద్రావణాలతో ఆరోగ్యకరమైన పంటలు పండిస్తున్నారు. వైఎస్సార్ జిల్లా చిన్నమండెం మండలం చిన్ననర్సుపల్లె గ్రామానికి చెందిన యశోదమ్మ స్వతహాగా రైతు. పెట్టుబడిలేని ప్రకృతి సేంద్రియ వ్యవసాయ విభాగంలో క్లస్టర్ రిసోర్సు పర్సన్‌గా పనిచేస్తున్నారు. వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుము, పత్తి, టమాటా, వంగ, బెండ, మిరప, సొర, బీర తదితర కూరగాయ పంటలు, మామిడి, అరటి, బొప్పాయి వంటి పండ్ల తోటలను ఆశించే పలు రకాల పురుగులు, తెగుళ్ల నివారణకు కలబంద ద్రావణం చక్కటి పరిష్కార మార్గమని ఆమె అనుభవపూర్వకంగా చెబుతున్నారు. కలబంద ద్రావణం తయారీ ఇలా.. 2 కిలోల కలబంద ఆకులను దంచి పెట్టుకోవాలి. అలాగే, పావు కిలో కుంకుడు కాయలను పొడి చేయాలి. 5 లీటర్ల ఆవు మూత్రాన్ని, 5 కిలోల ఆవు పేడను సేకరించాలి. వీటిలో ఆవుపేడ తప్ప మిగతా అన్నిటినీ 200 లీటర్ల నీరుపట్టే డ్రమ్ములో వేసి.. తర్వాత ఎంతపడుతుందో అంత నీరు పోయాలి. ఆవు పేడను ఒక పలుచటి గొనె సంచిలో మూటకట్టి నీళ్ల డ్రమ్ములో వేలాడదీయాలి. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో పెద్ద కర్రతో కలియతిప్పాలి. వారం రోజులకు బాగా మురిగితే కలబంద ద్రావణం తయారవుతుంది. ద్రావణం పిచికారీ చేసే సమయంలో 20 లీటర్ల పిచికారీ డ్రమ్ములో 200 మిల్లీ లీటర్ల ద్రావణంతోపాటు 150 గ్రాముల పసుపు పొడి, 150 గ్రాముల రాళ్ల సున్నం వేసి మిగిలిన భాగం నీరు పోసుకొని.. పంట లేత ౖపైరు నుంచి మొగ్గ దశ వరకు ఏ పంటపై అయినా పిచికారీ చేసుకోవచ్చు. పూత సమయంలో పిచికారీ వద్దు పైరు మొలక దశలో 20 లీటర్ల నీటికి 150 మిల్లీ లీటర్లు, పూత దశకంటే ముందు 20 లీటర్ల నీటికి 200 మిల్లీ లీటర్లు, పిందె సమయంలో 20 లీటర్ల నీటికి 300 లీటర్ల ద్రావణాన్ని కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. పూత విచ్చుకున్న సమయంలో ఎట్టి పరిస్థితిలోనూ ద్రావణం పిచికారీ చేయవద్దని ఆమె హెచ్చరిస్తున్నారు. పచ్చపురుగు, తెల్లదోమ, రెక్కల పురుగులు, ముఖ్యంగా వరిలో పొడ తెగులు, దోమపోటు, ఉల్లికోడు తెగుళ్లను ఈ ద్రావణం నివారిస్తుంది. మిత్ర పురుగుల సంతతి పెరుగుతుంది.. పంటకు మేలు చేసే మిత్ర పురుగుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈ ద్రావణం మిత్ర పురుగులను ఆకర్షిస్తుంది. కందిరీగలు, తూనీగలు, తేనెటీగలు ఇతర మిత్ర పురుగులు పైరు పైకి వచ్చి చేరతాయి. పంటలో పూత నిలబడేలా దోహదపడుతుంది. íపిందె రాలడం తగ్గుతుంది. టమాటా పంట మూడు నెలలు ముగియగానే పాత మొక్క కింద మళ్లీ కొత్తగా చిగుర్లు వచ్చి యధావిధిగా పంటను ఇస్తుంది. రసాయనిక పురుగు మందులు వాడిన పంటలకంటే అధిక దిగుబడి వస్తుందని యశోదమ్మ(88979 31488) ధీమాగా చెబుతున్నారు. – మాచుపల్లె ప్రభాకరరెడ్డి, సాక్షి, వ్యవసాయం, వైఎస్సార్ జిల్లా కలబంద ద్రావణం -
బెల్లం పొడి భలే..
♦ ఎకరాకు రూ. 4 లక్షలకు పైగా నికరాదాయం ♦ ప్రకృతి సేద్యంలో మహిళా రైతు ప్రస్థానం ఎటువంటి యంత్రాలు వాడకుండానే సంప్రదాయ పద్ధతుల్లోనే నాణ్యమైన బెల్లం పొడిని తయారు చేసి విక్రయిస్తున్నారు విజయనగరం జిల్లాలోని మెరకముడిదాం మండలం గరుగుబిల్లి గ్రామానికి చెందిన ఆదర్శ మహిళా రైతు అల్లూరి విజయ. ఎంఎస్సీ కమ్యూనిటీ హెల్త్ సెన్సైస్ అండ్ న్యూట్రిషన్ కోర్సు చదువుకున్న ఆవిడ... లండన్‌లో ఒకటిన్నర సంవత్సరం ఉద్యోగం చేశారు. 2011లో స్వగ్రామానికి తిరిగొచ్చి సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో 30 ఎకరాల్లో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. తొలి ఏడాదే టన్ను విక్రయించాం.. ప్రకృతి వ్యవసాయంలో పండించి, తయారు చేస్తున్న బెల్లం, బెల్లం పొడికి మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. ఈ ఏడాదే ప్రారంభించినా ఇప్పటి వరకు టన్ను బెల్లం పొడిని విక్రయించాం. ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకొని సరఫరా చేస్తున్నాం. బెల్లం దిమ్మల విక్రయాలతో పోల్చితే.. బెల్లం పొడి ద్వారా 50 శాతం అధిక ఆదాయం లభిస్తుంది. దీనికి భవిష్యత్తులో మరింత గిరాకీ పెరగవచ్చు. చెరకు రైతులు దీనిపై దృష్టి సారిస్తే మిల్లుపై ఆధారపడకుండా స్వతంత్రంగా మరింత ఆదాయం పొందవచ్చు. - అల్లూరి విజయ (97017 06432), గరుగుబిల్లి, విజయనగరం జిల్లా బెల్లం పొడితో పెరిగిన ఆదాయం 8 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ పద్దతుల్లో చెరకును పండించి నాణ్యమైన బెల్లం పొడిని తయారు చేస్తున్నారు విజయ. బెల్లం దిమ్మెల తయారీలో అనుసరించే ప్రక్రియనే పొడి తయారీలోను అనుసరిస్తారు. తొలుత చెరకును నీటితో కడిగి, యంత్రాల ద్వారా రసం తీసి బాణలిలో పోస్తారు. బాణలిని పొయ్యిపై ఉంచి నాలుగైదు గంటలు వండితే బెల్లం పాకం వస్తుంది. బెల్లం పాకాన్ని పూర్తిగా ఎండబెట్టి జల్లిస్తారు. తరువాత బొరిగెలు వంటి ఇనప పరికరాలతో తురుముతారు. దీంతో పొడి వస్తుంది. 4.8 శాతం తేమ ఉండేలా ఎండబెట్టిన పొడిని అర కిలో, కిలో ప్యాకెట్లుగా తయారు చేస్తున్నారు. ముందుగా ఆర్డర్లు తీసుకొని పొడిని తయారు చేసి విశాఖ పట్నం, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు పంపుతున్నారు. బెల్లం పొడిని కిలో రూ. 120 చొప్పున విక్రయిస్తున్నారు. నాణ్యత చెడకుండా చెరకు గడల నుంచి రసం తీయడం దగ్గర్నుంచి ప్యాకింగ్ వరకు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పొడి తయారీ, ప్యాకింగ్ దశల్లోను కూలీల చేతులకు గ్లౌజులు వాడుతున్నారు. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనూ బెల్లం పొడి చెడిపోకుండా ఉండేందుకు యంత్రం సహాయంతో గాలి చొరబడకుండా ప్యాకింగ్ చేస్తారు. ప్రవాస భారతీయులు బెల్లం పొడిపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ప్రకృతి పద్ధతుల్లో సాగు చేయటం వల్ల వీరి పొలంలో ఎకరాకు 50 టన్నుల చెరకు దిగుబడి వస్తోంది. దీని నుంచి 4 టన్నుల బెల్లం వస్తుంది. దీన్ని విక్రయిస్తే రూ. 2.80 లక్షల ఆదాయం వస్తుంది. బెల్లం పొడిగా మార్చి విక్రయిస్తే ఎకరాకు రూ. 4.80 లక్షలకు పైగా ఆదాయం వస్తుంది. అంతర పంటల ద్వారా ఖర్చులు వస్తున్నాయి. అంటే బెల్లం పొడి లేదా దిమ్మెల ద్వారా వచ్చేదంతానికరాదాయమేనని విజయ చెప్పారు. ఎకరాకు 50 టన్నుల చెరకు దిగుబడి రసాయన సేద్యం చేసిన రైతులు ఎకరాకు 25 - 30 టన్నుల దిగుబడి వస్తుండగా విజయ మాత్రం 50 టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. పైగా చెరకులోనే అంతర పంటలుగా కంది, పెసర, మినుము వంటి పంటలను సాగు చేసి ఎకరాకు 5 బస్తాల దిగుబడి సాధించారు. వీటిని పప్పులుగా చేసి తామే విక్రయించటం ద్వారా మంచి ఆదాయం పొందుతున్నారు. వేరు శనగలో ఎకరాకు 15 బస్తాల దిగుబడి వచ్చింది. గింజల నుంచి గానుగతో నూనె తీసి విక్రయిస్తున్నారు. ఈ ఆదాయంతో చెరకు సాగు ఖర్చులు వచ్చేస్తున్నాయి. ప్రకృతి సేద్యంలో వరి పంటను సాగు చేసి ఆమె ఎకరాకు 30 బస్తాల దిగుబడి సాధించారు. హుద్‌హుద్ తుపాన్ తాకిడికి కూడా తమ తోటలో అరటి చెట్లు పడిపోలేదన్నారు. ప్రకృతి వ్యవసాయానికి ఉన్న శక్తి అదేనని ఆమె అన్నారు. - సతీష్ కుమార్ మరిపి, చీపురుపల్లి, విజయనగరం జిల్లా