మృగశిర కార్తెకు ఆ పేరే ఎలా వచ్చింది? బెల్లం ఇంగువ ఎందుకు తింటారు? | Mrigasira karthi 2024: What Is Mrigasira Karthi Why People Eat Fish | Sakshi
Sakshi News home page

మృగశిర కార్తెకు ఆ పేరే ఎలా వచ్చింది? బెల్లం ఇంగువ ఎందుకు తింటారు?

Jun 8 2024 10:04 AM | Updated on Jun 8 2024 10:04 AM

Mrigasira karthi 2024: What Is Mrigasira Karthi Why People Eat Fish

మృగశిర కార్తె అంటే.. ఆశ్విని మొదలుకుని రేవతి వరకూ మనకున్న 27 నక్షత్రాల్లో సూర్యుడి ప్రవేశం ఆధారంగా కార్తె నిర్ణయం జరుగుతుంది. భారతీయ జ్యోతిష్య సాంప్రదాయం ప్రకారం.. ఒక్కో కార్తెలో ఒక్కో విధంగా ప్రకృతిలో మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించి నాటినుంచి నైరుతి రుతుపనాలు వస్తాయి. వాతావరణం ఒక్కసారి చల్లబడటం , ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకునే నేపథ్యంలో అనేక రకాల చెడు సూక్ష్మక్రిములు వంటివి పునురుత్పత్తి అవుతాయి.

మానవునిలో రోగ నిరోధకశక్తి తగ్గి జ్వరం , దగ్గు , శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి. మృగశిర కార్తెలో బెల్లంలో ఇంగువ కలుపుకుని తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది. బెల్లంలో ఇంగువ కలుపుకుని  తినడం వల్ల ముఖ్యంగా గుండె జబ్బులు , ఆస్తమా , మధుమోహ వ్యాధి ఉన్నవారు , గర్భిణులు ఈ సమయంలో బెల్లంలో ఇంగువ కలుపుకుని తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. దీని వెనుక ఆరోగ్య రహస్యం దాగివుంది.  ఇది శరీరంలో ఉష్ణోగ్రత ప్రేరేపించి వర్షాకాలంలో సోకే వ్యాధులను అడ్డుకుంటుందని పెద్దల విశ్వాసం. 

ఇది మన పూర్వీకుల నుంచి ఆనాదిగా వస్తోంది. ఎండకాలం తర్వాత వాతావరణం చల్లబడటంతో మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ క్రమంలో వేడిగా ఉండేందుకు బెల్లంలో ఇంగువ కలుపుకుని  తింటారు. దీని వల్ల గుండె జబ్బులు , ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. ఇదేకాక ఈ సీజన్‌లో చాలా మందికి జీర్ణశక్తితోపాటు రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. జ్వరం , దగ్గు బారిన పడతారు. ఇలాంటి వాటి నుంచి గట్టెక్కాలంటే బెల్లంలో ఇంగువ కలుపుకుని  తినాల్సిందే.

ఇక మాంసాహారులైతే ఈ సీజన్‌లో కోళ్లు, పొట్టేళ్లు, మేకపోతులు, చేపలు వంటి వాటిని తింటారు. కార్తె ప్రారంభం శుక్రవారం అయినా కొంత మంది మాంసాహారాన్ని తీసుకోకపోవడంతో శని, ఆదివారాల్లో తీసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆరోగ్య పరంగా చెప్పుకుంటే కోడి మాంసం వేడి చేస్తుందని, తద్వారా శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుందని, సీజనల్‌గా వచ్చే వ్యాధులు రావన్నది అందరికీ తెలిసిందే. ఈ సీజన్‌లోనే చేప మందు ఇవ్వడం జరుగుతుంది. చేపలు తినడం ద్వారా గుండె జబ్బులు, అస్తమా రోగులకు ఉపశమనం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో చేపలను ఇంగువలో, చింతచిగురులో పెట్టి తీసుకుంటారు.

ఈ కార్తెలు ఎందుకంటే..
పంచాంగ ప్రకారం ఆరుద్ర నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సమయంలోని తిథి , వార , నక్షత్ర , యోగ , కరణాలు , శకునాలు తదితర అంశాల ఆధారంగా చేసుకుని ఆ సంవత్సరం యొక్క వర్షాన్ని నిర్ణయించడం జరుగుతుంది. ఈ విధంగా వ్యవసాయదారులకు నిత్యజీవనోపయోగిగా,వ్యవసాయం పనులకు మార్గదర్శకంగా ఈ కార్తెలు ఉపయోగపడుతున్నాయి.

పురాణగాధ ప్రకారం
మృగశిరస్సు కలిగిన మృగవ్యాధుడు అను వృతాసురుడు వరప్రభావంచే పశువులను , పంటలను హరించి వేయడం ప్రకృతి భీభత్సాలాను సృష్టించడం , వర్షాలకు అడ్డుపడటం జరుగుతూ ఉండేడిది. ఇతను చనిపోకుండా అనేక వరాలు కలిగి ఉండటంచేత ఇంద్రుడు సముద్రఅలల నుండి వచ్చే నురుగును ఆయుధంగా చేసి చంపేస్తాడు.

ప్రకృతి మార్పు ప్రభావం
ఈ కథ ఆధారంగా ఖగోళంలో ఇంద్ర నక్షత్రమైన జ్యేష్టాకు మృగశిరకు 180 డిగ్రీల దూరంలో ఉండటం వలన తూర్పు ఆకాశంలో ఇంద్ర నక్షత్రం ఉదయించగానే వృతాసుర నక్షత్రం అస్తమిస్తుంటుంది. ఇక్కడ నురుగు అనేది ఋతుపవనాలకు , వర్షాలకు సూచన. ఇంద్ర నక్షత్రమైన జ్యేష్ట ఉదయించినపుడు సూర్యుడు మృగశిరలోకి ప్రవేశించడం వలన మృగశిరకార్తె ప్రవేశిస్తుంది. వర్షాలు పడకుండా అడ్డుపడ్డ మృగాసురుని చంపిన ఇంద్రున్ని వర్షప్రదాతగా , వర్షదేవుడుగా పిలుస్తారు. ఇది కథ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement