సంప్రదాయక తియ్యటి పదార్థం బెల్లం. ఆరోగ్యపరంగా బెల్లమే మంచిదని మన పెద్దవాళ్లు పదే పదే చెబుతుంటారు. అదీగాక ఇటీవల కాలంలో షుగర్ వ్యాధిగ్రస్తులు విపరీతంగా పెరిగిపోయారు. దీంతో పలు ఛానెళ్లలోనూ, ఆరోగ్య నిపుణులు పంచదారకు బదులు బెల్లాన్ని ఉపయోగించండి, పంచదారను అస్సలు దగ్గరకు రానియ్యకండి అంటూ ఊదరగొట్టేస్తున్నారు. ఇందులో వాస్తవం ఎంతుంది. ఇది ఎంతవరకు నిజం? తదితరాలు గురించే ఈ కథనం.
పంచదార లేదా చక్కెర అనేది రిఫైన్డ్ చేసినది. కానీ బెల్లం చెరుకు రసంతో తయారు చేసిన అన్ రిఫైన్డ్ పదార్థం. అందుకే దీన్ని నాన్ సెంట్రీఫూగల్ కేన్ షుగర్ అంటారు. ఐతే ఆరోగ్య నిపుణులు పంచదార కంటే బెల్లమే మంచిదైనపట్టికీ కాలాల వారికి వాటిని వినియోగించాలని చెబుతున్నారు. పూర్తిగా పంచదారను దూరం పెట్టేయకూడదని, మన శరీరానికి తగు మోతాదులో అందాల్సిన ఘగర్‌ని తీసుకోవచ్చని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే పంచదార తెల్లగా కనిపించేందుకు ఎక్కువ కెమికల్స్ వినియోగిస్తారు. దీని బదులు ఆర్గానిక్ పద్ధతిలో అంటే పటికి బెల్లం రూపంలో ఉండే షుగర్‌ని వినియోగించుకోవచ్చు. ఈ రెండింటిని కాలాల వారిగా వినియోగించుకుంటే సులభంగా మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందగలరని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
శీతకాలం జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. అందువల్ల ఆ కాలంలో బెల్లంతో చేసిన వంటకాలు లేదా భోజనం అయిన వెంటనే కొద్ది మొత్తంలో బెల్లాన్ని సేవిస్తే మంచిది. ఇక వేసవి కాలం చెమట రూపంలో నీరంతా బయటకు వెళ్లిపోయి గ్లూకోజ్ స్థాయిలు పడిపోతాయి. ఆ సమయంలో మనకు తక్షణ శక్తిని ఇచ్చే గ్లూకోజ్ రూపంలో పంచదారను తీసుకోవచ్చు. అదికూడా ఎక్కువగా ప్రాసెస్ చేయనిది పటికి బెల్లం రూపంలోని పంచదారని తీసుకుంటే ఎలాంటి హాని ఉండదని చెబుతున్నారు.
బెల్లంలో రకాలు ప్రయోజనాలు..
ఇక బెల్లం దగ్గరకు వస్తే..చెరుకుని ఉడకబెట్టి తయారు చేసే సాధారణ బెల్లం గాక పలురకాలు బెల్లాలు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. అవేంటంటే..
చెరుకు బెల్లం: ఇది అందరికీ తెలిసిన సాధారణ బెల్లం. చెరకు రసాన్ని ఉడకబెట్టి తయారు చేస్తారు. ఈ బెల్లం ఎంత ముదురు రంగులో ఉంటే అంత మంచిదని అంటారు. ఇది ఎన్నోరకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరచడంలో ఎంతగానో సహయపడుతుంది. దీనిలో సమృద్ధిగా పోషకాలు ఉంటాయి.
తాటిబెల్లం: తాటి చెట్ల రసంతో తయారు చేస్థారు. ఈ తాటి బెల్లంలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఐరన్ లోపంతో బాధపడుతున్న వ్యక్తులకు చాలా మంచిది ఈ తాటి బెల్లం.
ఖర్జూర బెల్లం: ఖర్జూర రసం నుంచి తయారు చేస్తారు. దీనిలో ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ బెల్లాన్ని ఆసియా వంటకాల్లో ప్రసిద్దిగా ఉపయోగిస్తారు.
కొబ్బరి బెల్లం: కొబ్బరి, తాటి చెట్ల రసం నుంచి తయారు చేస్తారు. ఈ కొబ్బరి బెల్లంలో పొటాషియం పుష్కలంగా ఉంటుఒంది. పంచదార పాకం వంటి రుచిని ఇస్తుంది. భారత్‌లో కొన్ని చోట్ల ఈ కొబ్బరిబెల్లం బాగా ప్రాచుర్యం పొందింది.
నల్లబెల్లం: సాంప్రదాయ ఆయుర్వేద ఔషధాలను రూపొందించడానికి ఈ రకమైన బెల్లాన్ని వివిధ మూలికలు, సుగంధ ద్రవ్యాలను చేర్చి తయారు చేస్తారు. అందువల్ల ఇందులో ఇతరత్ర బెల్లముల కంటే అదనంగా ఔషధ గుణాలు ఉంటాయి.
నువ్వుల బెల్లం: వేయించిన నువ్వులకు బెల్లాన్ని జతచేసి తయారు చేస్తారు. ఇందులో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది.
ఆరోగ్య ప్రయోజనాలు..
- బెల్లంలో ఇనుము, మెగ్నీషియం, పొటాషియం ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవిగాక కొద్ది మొత్తంలో బి విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.
- ఇందులో ఉండే అధిక కార్బోహైడ్రేట్ కంటెంట్ కారణంగా శరీరానికి కావల్సిన తక్షణ శక్తిని అందిస్తుంది.
- కాలేయం తీరుని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపి రక్తాన్ని శుద్ది చేయడానికి ఉపయోగపడుతుంది.
- దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలకు చక్కని నివారిణిగా ఈ బెల్లం ఉపయోగపడుతుంది.
- ఎర్రరక్తకణాల ఉత్తత్తికి ఉపయోగడుతుంది. ముఖ్యంగా అనీమియాతో బాధపుడుతున్న రోగులకు ఇది మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది.
- బరువు తగ్గాలనుకునేవారికి ఈ బెల్లం చక్కటి ప్రత్యామ్నాయం. ఇందులో కేలరీలు తక్కువుగా ఉంటాయి. అందువల్ల బరువుతగ్గాలనుకునే వారికి ఆరోగ్యకరమైన తీపి పదార్థంగా మంచి ఎంపిక.
- బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే గాక వృద్ధాప్య ఛాయలను ఎదుర్కొవడంలో మంచి ఔషధంగా ఉపకరిస్తుంది.
(చదవండి: కంటి రెప్పపై కురుపులు లేదా గడ్డలు ఇబ్బంది పెడుతున్నాయా?)
Comments
Please login to add a commentAdd a comment