రామ నైవేద్యం
పానకం
కావల్సినవి: బెల్లం తరుగు – 4 టేబుల్ స్పూన్లు నీళ్లు – 2 కప్పులు యాలకుల పొడి – చిటికెడు శొంఠి పొడి – చిటికెడు మిరియాల పొడి – చిటికెడు
తయారీ: గిన్నెలో నీళ్లు పోసి, బెల్లం తరుగు వేసి కరిగించాలి. ఈ మిశ్రమాన్ని జల్లితో వడకట్టాలి. దీంట్లో యాలకుల పొడి, శొంఠి, మిరియాల పొడి కలపాలి. గ్లాసులో పోసి నివేదించాలి.
వడపప్పు
కావల్సినవి:పెసరపప్పు – పావు కప్పు; నీళ్లు – 2 కప్పులుమామిడికాయ ముక్కలు (సన్నగా తరగాలి) – టేబుల్‌స్పూన్; పచ్చిమిర్చి – 1 (బాగా సన్నగా తరగాలి); పచ్చికొబ్బరి ముక్కలు (సన్నగా తరగాలి) – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – చిటికెడు
కొత్తిమీర తరుగు – అర టీ స్పూన్
తయారీ: పెసరపప్పును 2 గంటల పాటు నీళ్లలో నానబెట్టాలి. తర్వాత నీళ్లను వడకట్టాలి. ఈ పప్పులో సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు, పచ్చికొబ్బరి ముక్కలు, ఉప్పు, కొత్తిమీర తరుగు కలపాలి.
నోట్: ఏవీ కలపకుండా నానబెట్టిన పెసరపప్పును కూడా నివేదించవచ్చు.