సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం తరలిస్తున్న వ్యక్తిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మిర్యాలగూడ అర్బన్: సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం తరలిస్తున్న వ్యక్తిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్ర ప్రాంతంలోని దాచేపల్లి నుంచి అక్రమంగా సార బెల్లాన్ని తరలిస్తుండగా సమాచాం మేరకు తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటోలో తరలిస్తున్న 2క్వింటాళ్ల నల్లబెల్లం, 50కిలోల పట్టికను స్వాధీనం చేసుకున్నారు. బెల్లాన్ని తరలిస్తున్న వ్యక్తి ధరవత్ రమేష్‌తో ఆటోను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సీఐ బి.సుధాకర్, ఎస్‌ఐ అక్రం అలీతో పాటు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.