Capture
-
మొక్కల ఊసులు రికార్డయ్యాయి ఇలా!
ఇంతకుమునుపు మొక్కలు మాట్లాడతాయని, అవి కూడా బాధలకు ప్రతిస్పందిస్తాయని విన్నాం. అందుకు సంబంధించిన విషయాలను శాస్త్రవేత్తలు పరిశోధన పూర్వకంగా వెల్లడించారు కూడా. ఎప్పుడు ఎలా కమ్యూనికేట్ చేసుకుని ప్రతిస్పందిస్తాయన్నది ఓ మిస్టరీగా మిగిలిపోయింది. దీన్ని పరిశోధకులు తాజాగా చేధించడమే గాక మొక్కలు మాట్లాడుకోవడాన్ని కెమెరాలో బంధించి మరీ వివరించారు. వివరాల్లోకెళ్తే..జపాన్‌కి చెందిన శాస్త్రవేత్తల బృందం అందుకు సంబంధించిన ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేసింది.మొక్కలు ఒకదానికొకటి మాట్లాడుకోవడం నిజమేనని వీడియోలో బంధించి మరీ ప్రూవ్ చేసి చూపించారు. మొక్కలు కమ్యూనికేట్ చేయడానికి గాలిలో ఉండే సమ్మేళనాలను వినియోగించుకుంటాయిని, అవి పొగమంచుతో చుట్టబడి ఉంటాయని అన్నారు. ఈ సమ్మెళనాలను వాసనలుగా వినియోగించుగకుని ప్రమాదం గురించి మరొక మొక్కను హెచ్చరిస్తాయని చెబుతున్నారు. ఈ మేరకు జపాన్ శాస్త్రవేత్తలు రికార్డ్ చేసిన వీడియోలో.. మొక్కలు ఎలా ఆ సిగ్నల్స్‌ని స్వీకరించి ప్రతిస్పందిస్తాయన్నది ప్రత్యక్షంగా చేసి చూపించారు. సైతామ యూనివర్సిటీకి చెందిన మాలిక్యులర్ బయాలజిస్ట్ మసాత్సుగు టొయోటా నేతృత్వంలోని పరిశోధకులు బృందం ఈ విషయాన్నికమ్యూనికేషన్స్ జర్నల్‌లో వెల్లడించింది. ఇక్కడ మొక్కలు కీటకాలు లేదా ఇతరత్ర కారణాల వల్ల గాయపడిన లేదా దెబ్బతిన్న మొక్కలు మరోక మొక్కను హెచ్చరించేందుకు అస్థిర కర్బన సమ్మేళనాలను(వీఓసీ) విడుదల చేస్తుందని తెలిపారు పరిశోధకులు. గాల్లో విడుదలైన ఆ వీఓసీలను గాయపడిన మొక్కలు గ్రహించి తక్షణమే వివిధ రక్షణ ప్రతిస్పందనలు ప్రేరేపిస్తాయని తెలిపారు. అస్థిర కర్బన సమ్మేళనాలలో కాల్షియం అయాన్లు ఉండటం వల్ల మొక్కలు జరిపే ఈ కమ్యూనికేషన్ ప్రక్రియను కాల్షియం సిగ్నలింగ్ అని పిలవొచ్చని సైంటిస్టులు అన్నారు. ఈ ప్రయోగంలో భాగంగా రెండు టమాటా మొక్కలు, ఆవాల జాతికి చెందిన రెండు అరబిడోప్సిస్ థాలియానా జాతి కలుపుమొక్కలను పక్కపక్కన తొట్టిల్లో ఉంచారు. కాల్షియం సిగ్నలింగ్ అనేది మొక్కల ఆకులపై స్పష్టంగా కనిపించేలా ఈ మొక్కలకు బయో సెన్సర్లను బిగించారు. అనంతరం ఒక టమాటా మొక్క, ఒక అరబిడోప్సిస్ థాలియానా మొక్క ఉన్న తొట్టిలలోకి గొంగళి పురుగులను వేశారు. ఆ వెంటనే పురుగులు మొక్కలపైకి ఎక్కి ఆకులను తినడం ప్రారంభించాయి. దీంతో ఈ మొక్కలు స్పందించి.. వెంటనే కాల్షియం సిగ్నళ్లను రిలీజ్ చేశాయి. ఆ పక్కనే ఆరోగ్యకర స్థితిలో ఉన్న రెండు మొక్కలు ఈ సిగ్నళ్లను గ్రహించడం కూడా జరిగిపోయింది. దీంతో వెంటనే మొక్కల్లోని బయోసెన్సర్లు స్పందించి.. ఆకుల్లో కాల్షియం అయాన్లు యాక్టివేట్ అయిన ప్రదేశాన్ని మెరుస్తున్నట్లుగా హైలైట్ చేసి చూపించాయి. ఇదంతా లైవ్‌లో కెమెరాలో రికార్డయింది. If #plants could talk, they’d do so thru chemical signals about predators (aphids, caterpillars, gardeners with shears/pesticides…). Plants CAN talk (which we’ve known), but molecular biologists at Saitama University in Japan caught it 1st on film. https://t.co/44gXzMerK5 pic.twitter.com/DcLAlV1iti — HoneyGirlGrows (@HoneyGirlGrows) January 20, 2024 (చదవండి: మగవాళ్లు రోజూ వేడినీటి స్నానాలు చేయకూడదా? పరిశోధనలో షాకింగ్ విషయాలు) -
లక్ష సైనికుల కోటి కన్నుల కెమెరా!
నా చేతిలో కెమెరా ఉంటే నాకు భయమనేదే లేదు’ అనేది ఫొటోగ్రాఫర్ గౌరీ గిల్‌కు ఇష్టమైన మాట. ఈ కారణం వల్లే కావచ్చు ఆమె ఏ భయమూ లేకుండా మారుమూల పల్లెల నుంచి మహా అరణ్యాల వరకు వెళ్లింది. తన భుజాల మీద కెమెరా ఉంటే, తన చుట్టూ లక్షల సైన్యం ఉన్నట్లే. వర్తమాన చరిత్ర, సంస్కృతి, సంబరాన్ని తన కెమెరా కంటితో పట్టుకుంది గౌరీ గిల్. తన ఫొటో సిరీస్ ‘నోట్స్ ఫ్రమ్ ది డిజర్ట్’తో ప్రతిష్ఠాత్మకమైన ప్రిక్స్ పిక్టెట్ అవార్డ్ గెలుచుకుంది. స్విట్జర్లాండ్‌కు చెందిన మల్టీనేషనల్ ప్రైవేట్ బ్యాంక్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ పిక్టెట్ ‘ప్రిక్స్ పిక్టెట్’ (ఇంటర్నేషనల్ అవార్డ్ ఇన్ ఫొటోగ్రఫీ)కి 2008లో శ్రీకారం చుట్టింది... చండీగఢ్‌లో పుట్టిన గౌరి గిల్ దిల్లీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌లో బీఎఫ్ఏ చేసింది. న్యూయార్క్‌లోని ‘పార్సన్ స్కూల్ ఆఫ్ డిజైన్’లో ఫొటోగ్రఫీలో బీఎఫ్ఏ, స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీలో ఫొటోగ్రఫీలో ఎంఎఫ్ఏ చేసింది. అమెరికా, ఇండియాలో ఉన్న బంధువులను ఫొటోలు తీయడంతో తన ప్రయాణం మొదలైంది. రాజస్థాన్‌లోని అట్టడుగు వర్గాల జీవితాలను అధ్యయనం చేసిన తరువాత తాను చేసిన ఫొటో ప్రాజెక్ట్ ‘నోట్స్ ఫ్రమ్ ది డెజర్ట్’కు మంచి పేరు వచ్చింది. ‘ది మార్క్ ఆన్ ది వాల్’ ‘జన్నత్’... మొదలైన ఎగ్జిబిషన్లు, ప్రాజెక్ట్‌లతో ప్రశంసలు అందుకుంది. నోట్స్ ఫ్రమ్ ది డెజర్ట్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే... ఈ ప్రాజెక్ట్ కోసం రాజస్థాన్‌లోకి అడుగు పెట్టినప్పుడు అక్కడి పరిస్థితుల గురించి పెద్దగా ఏమీ తెలియదు. ఒక్కొక్క అడుగు వేస్తూ అక్కడి సమాజాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించింది. సంచారుల నుంచి రైతుల వరకు ఎంతోమందితో మాట్లాడింది. కాలాలతో పాటు మారే వ్యక్తుల జీవితాలను గమనించింది. తాను పరిశీలించిన జీవితాల గురించి డైరీలో రాసుకుంది. ఆ తరువాత తన కెమెరా ప్రయాణం రాజస్థాన్ మారుమూల ప్రాంతాల నుంచి మహారాష్ట్రలోని ఆదివాసుల ఇళ్ల దగ్గరకు చేరింది. వర్లీ ఆర్ట్‌ను ఒడిసిపట్టుకుంది. ఫలానా ఊళ్లో ఫలానా ప్రత్యేకత ఉందనే మాట చెవికి సోకగానే రెక్కలు కట్టుకొని అక్కడ వాలుతుంది. మోహడా అనే ఊళ్లో గ్రామస్థులు పురాణ పాత్రల మాస్క్‌లను ధరించి పెద్ద ఊరేగింపు తీస్తారు. ఈ మాస్క్‌లనే సబ్జెక్ట్‌గా తీసుకొని ఫొటోప్రాజెక్ట్ చేసింది. ఒకరోజు ఒక గ్రామంలోని పశువుల ఆస్పత్రికి వెళ్లింది. డాక్టర్ లేడు. అయితే ఆ డాక్టర్ సీట్లో దోమ మాస్క్ పెట్టుకొని ఒక వ్యక్తి కూర్చున్నాడు. పేషెంట్ సీట్లో కూర్చున్న వ్యక్తి ఏదో మాస్క్ పెట్టుకున్నాడు. ఆ ఆస్పత్రిలోని పాత సామాను, గోడలకు వేసిన రంగులు, ఆస్పత్రి చుట్టుపక్కల రకరకాల ఆవులు, వాటిని కాచుకు కూర్చున్న రైతులు... ఈ అంశాలన్నీ వచ్చేలా ఫొటోలు తీసింది. ఈ ఫోటోల నుంచి ఆలోచించిన వారికి ఆలోచించినన్ని కోణాలు కనిపిస్తాయి. ఎవరి వ్యాఖ్యానాలూ అవసరం లేకుండానే సమాధానాలు దొరుకుతాయి. మొదట్లో ఒక పక్షపత్రికలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేసింది గౌరి. తన ఆసక్తి గ్రామాలు, మారుమూల పల్లెల్లోని స్కూళ్లపై ఉండేది. అయితే తన ఉద్యోగం ద్వారా పల్లెలకు వెళ్లే అవకాశం రాలేదు. దీంతో పల్లెబాట పట్టడానికి ఉద్యోగాన్ని వదిలింది. ఎన్నో స్కూళ్ల చుట్టూ తిరిగింది. ‘ఇది స్కూల్ కాదు. ఇదే అసలు సిసలు ప్రపంచం’ అనుకుంది. ‘ది మార్క్ ఆన్ ది వాల్’ ప్రాజెక్ట్‌తో ప్రభుత్వ పాఠశాలల్లోని గోడలపై ఉన్న రాతలు, చిత్రాలను డాక్యుమెంట్ చేసింది. ‘ట్రేసెస్’ పేరుతో సమాధులపై చేసిన ప్రాజెక్ట్ మరో అద్భుతం. నిజానికి గౌరీ గిల్ అద్భుతాలు సృష్టించడానికి కెమెరా పట్టుకోలేదు. భిన్న సంస్కృతులు, భౌగోళిక అందాలపై ఆసక్తే అద్భుతాలను సృష్టించి ఆమెను అంతర్జాతీయ ఫొటోగ్రాఫర్‌ని చేశాయి. 2011లో కెనడాలోని ప్రతిష్ఠాత్మకమైన ఫొటోగ్రఫీ అవార్డ్ గ్రాంజ్ గెలుచుకొని ప్రపంచ దృష్టిని ఆకర్షించిన గౌరికి వినడం ఇష్టమైన పని. విన్న విషయాలను విశ్లేషించుకొని తన కెమెరాకు ముడిసరుకుగా మార్చుకోవడం మరింత ఇష్టమైన పని. (చదవండి: కార్ డిజైనర్ థార్ డిజైనర్!) -
అడవిలో వీడియో తీస్తున్న వ్యక్తిపై పిడుగు పడితే?
సోషల్ మీడియాలో పిడుగుపాటుకు సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే ఒక వీడియో వైరల్‌గా మారింది. వన్యప్రాణి నిపుణుడు, జీవశాస్త్రవేత్త ఒకరు ఫ్లోరిడాలోని ఎవర్గ్లేడ్స్ సిటీలో వీడియో రికార్డింగ్ చేస్తున్నప్పుడు పిడుగుపాటుకు గురయ్యారు. ఆ భయానక క్షణం వీడియోలో నిక్షిప్తమై, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫాక్స్ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల 35 ఏళ్ల ఫారెస్ట్ గాలంటే సౌత్ ఫ్లోరిడాలో తన యూట్యూబ్ ఛానెల్ కోసం వీడియోను షూట్ చేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. వీడియోలోని వివరాల ప్రకారం అడవిలోని నీటిలో నిలుచుకున్న ఫారెస్ట్ గాలంటే మాట్లాడుతూ ‘మాకు అద్భుతమైన షాట్లు వస్తున్నాయి. ఇది అందమైన రోజు. ఇక్కడి నీరు నిలకడగా ఉంది. షూటింగ్ అద్భుతంగా జరుగుతోంది. ఇక షూటింగ్ చివరి దశలో ఉంది. వర్షం పడడం మొదలవుతోంది. ఇది ఫ్లోరిడా. ఇక్కడ తరచూ వర్షాలు కురుస్తుంటాయి. అన్ని వేళలా మెరుపులు, ఉరుములు కనిపిస్తాయి’ అని చెప్పాడు. ఇంతలో అతని పక్కనే పిడుగుపడింది. దీంతో అతను నీటిలోకి కొద్దిగా ఒరిగాడు. ఈ ఘటన తర్వాత అతను మాట్లాడుతూ ‘ఆ సమయంలో కాంతిని చూడలేకపోయాను. ఆకస్మిక పిడుగు దాడితో నా మైండ్ మొద్దుబారిపోయింది. విపరీతమైన వెలుగు రావడంతో నేను ఏమీ చూడలేకపోయాను. ఈ ఘటనలో నాకు, నా బృందానికి పెద్దగా గాయాలు కాలేదని, అయితే తనకు శరీరమంతా నొప్పిగా ఉందని, తన గొంతు ఎండిపోయినట్లుందని’ గాలంటే తెలిపారు. ఇది కూడా చదవండి: 200 ఏళ్లనాటి జైలు ఎందుకు మూతపడింది? How close have you come to being hit by lightning? This is insane. The host of Discovery Plus and Animal Planet, @ForrestGalante, was actually hit by lightning while recording. In the video, you can see he was discussing the importance of having a GPS device, when a huge bolt… pic.twitter.com/lseyEzgNUZ — Ed Krassenstein (@EdKrassen) October 2, 2023 -
అప్పు తీసుకున్న వ్యక్తి తల్లిని బంధించి..
జగిత్యాల: తీసుకున్న అప్పుపై వడ్డీ కట్టక జాప్యం చేస్తుండడంతో రుణం ఇచ్చిన వ్యక్తి కనీస మానవత్వం మరచి.. దాష్టీకం ప్రదర్శించిన ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని ఆత్మకూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పుప్పాల సందీప్ అదే గ్రామానికి చెందిన ఏశవేని గణేశ్‌కు జరుపుల సాగర్ అనే వ్యక్తి నుంచి రూ.1,12,000ను గత మార్చిలో అప్పుగా ఇప్పించాడు. అప్పు పత్రం గణేశ్‌కు బదులు సందీప్ పేరు మీద రాసుకున్నాడు. ప్రతినెలా వడ్డీ కడుతూ వస్తున్న గణేశ్ రెండునెలల నుంచి చెల్లించడం లేదు. దీంతో ఆగ్రహంతో సాగర్ ఆదివారం సందీప్ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో సందీప్ తల్లి ఒక్కరే ఉన్నారు. ఆమెను చంపుతానని బెదిరించి, బూతులు తిట్టి ఇంట్లో బంధించి తాళం వేశాడు. గమనించిన స్థానిక మహిళ మీరా సాగర్‌ను మందలించి తాళం తీసి బాధితురాలిని బయటకు తీసుకొచ్చింది. సందీప్ ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
భూ బకాసురులు! రూ.50 కోట్ల స్థలం పై కన్ను
బంజారాహిల్స్ (హైదరాబాద్): నగరంలో భూ బకాసురులు మరోసారి రెచ్చిపోయారు. ఫోర్జరీ పత్రాలు, బోగస్ సర్వే నంబర్లతో బంజారాహిల్స్‌లోని రూ.50 కోట్ల విలువైన స్థలం కైంకర్యం చేయడానికి యత్నించారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కబ్జా గుట్టురట్టు చేశారు. నలుగురిని అరెస్టు చేసి, మరికొందరి కోసం గాలిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం... ప్రవాస భారతీయుడైన న్యావనంది పూర్ణచందర్‌కు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 13లోని సర్వే నంబర్ 129/40/1లో 2,538 చదరపు గజాల స్థలం ఉంది. ఆయన అమెరికాలో ఉన్న సమయంలో ఈ స్థలంపై రేవ ఇన్ఫ్రా ఎండీ బాలా ప్రవీణ్ కన్నుపడింది. తొలుత కొన్ని ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారుచేసి.. టి.ప్రతాప్ అనే వ్యక్తి ద్వారా నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ కొనుగోలుదారులను సృష్టించాడు. ఖదీర్ బేగం అనే మహిళ నుంచి ఈ స్థలాన్ని వీళ్లు కొనుగోలు చేసినట్లుగా బోగస్ పత్రాలు చేశాడు. వీటితో అడ్డా కూలీలను యజయానులుగా చూపించి ఈ ప్లాట్‌ను రిజిస్ట్రేషన్ కూడా చేయించాడు. విషయం తెలిసిన అసలు యజమాని పూర్ణచందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూలీ యజమానులకు రూ.10వేలు ఈ కేసులో ఖదీర్ బేగం, ఎండీ మొయినుద్దీన్, పరాంకుశం సురేందర్, దొంతుల సుధాకర్, బాలా ప్రవీణ్, టి.ప్రతాప్, సింగిరెడ్డి వీర హనుమరెడ్డి, బూరుగు సత్యనారాయణగౌడ్, కె.హరికృష్ణారెడ్డి, దీపక్ దేశ్‌ముఖ్ తదితరులను పోలీసులు నిందితులుగా చేర్చి అభియోగాలు నమోదు చేశారు. ఖదీర్ బేగం కొన్నేళ్ల క్రితమే చనిపోయినట్లు దర్యాప్తులో తేలింది. యజమానుల అవతారమెత్తిన అడ్డా కూలీలకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు చెల్లించారని తేలింది. పి.సురేందర్, దొంతుల సుధాకర్, మొయినుద్దీన్, ముజాహిదీన్లను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న ప్రధాన సూత్రధారి బాలా ప్రవీణ్‌తోపాటు టి.ప్రతాప్ కోసం గాలిస్తున్నారు. పక్కా పథకం ప్రకారం ఈ వ్యవహారం నడవడం, ఈ స్థలం నకిలీ యజమానుల పేరుతో రిజిస్ట్రేషన్ కావడం తదితర పరిణామాల నేపథ్యంలో తెర వెనుక పెద్దలు ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. (చదవండి: అమ్మాయిని కాళ్లతో తన్నుతూ చిత్ర హింసలు.. రంగంలోకి దిగిన సీఎం) -
కసాయితల్లి.. 28 ఏళ్లుగా గదిలోనే బంధించింది
స్టాక్‌హోం: 24 గంటల పాటు కదలకుండా ఒకే ప్రదేశంలో ఉంటే ఎలా ఉంటుంది.. ఊహించుకోవడానికే భయంకరంగా ఉంది కదా. కానీ ఓ వ్యక్తిని దాదాపు 28 ఏళ్ల పాటు ఓ గదిలో బంధించి ఉంచారు. ప్రస్తుతం నలభయ్యేళ్ల వయసులో ఉన్న ఆ వ్యక్తి సరైన పోషణ లేక.. శరీరం కుంగిపోయి.. నోట్లో పళ్లు అన్ని ఊడి పోయి.. నడవలేక.. అత్యంత దీన స్థితిలో జీవచ్ఛవంలా మారాడు. అతడి పరిస్థితి చూసి పోలీసులే కంట తడి పెట్టారు అంటే ఎంతటి దయనీయ స్థితిలో ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు. మరో షాకింగ్ న్యూస్ ఎంటంటే కన్న తల్లే అతడని ఇన్నేళ్లపాటు గదిలో బంధించి ఉంది. అవును మీరు చదివింది నిజమే. తల్లే అతడి పాలిట ఇంత కర్కషంగా ప్రవర్తించింది. మహిళ దూరపు బంధువు సమాచారంతో ఈ దారుణం వెలుగు చూసింది. ఈ హృదయవిదారక ఘటన స్వీడన్లో చోటు చేసుకుంది. బాధితుడు 12వ ఏట విద్యార్థిగా ఉన్న సమయంలో తల్లి అతడిని స్కూల్ నుంచి బలవంతంగా ఇంటికి తీసుకువచ్చి గదిలో బంధించింది. తిండి, నిద్ర, మలమూత్ర విసర్జన అంతా అక్కడే. ఈ 28 ఏళ్ల కాలంలో ఆ మహాతల్లి గదిని ఒక్కసారి కూడా శుభ్రం చేసిన దాఖలాలు కనిపించలేదని తెలిపారు పోలీసులు. ప్రస్తుతం బాధితుడి వయసు 41 ఏళ్లు కాగా.. అతడి తల్లి వయసు 70 సంవత్సరాలు. ఈ ఆదివారం వృద్ధురాలు అనారోగ్యం పాలైంది. దీని గురించి దూరపు బంధువుకు సమాచారం అందించడంతో వృద్ధురాలిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి ఆమె అపార్టుమెంట్‌కి వచ్చింది. ఆ సమయంలోనే బాధితుడిని గుర్తించింది. దీని గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని బాధితుడిని గది నుంచి తీసుకువచ్చి ఆస్పత్రిలో చేర్చారు. అతడిని పరీక్షించిన వైద్యులు ప్రాణానికి ప్రమాదం లేదని తెలిపారు. బాధితుడిని ఎంతో కాలం నుంచి గదిలో బంధించడమే కాక సరైన ఆహారం కూడా ఇవ్వలేదని వైద్యులు తెలిపారు. బాధితుడి నోట్లో పళ్లే లేవన్నారు. ఇక అతడి శరీరంపై ఉన్న గాయాల వల్ల ప్రాణాలకు పెద్దగా ప్రమాదం లేదని.. కాకపోతే మానసికంగా ఎంతో వేదన అనుభవించాడు కనుక కోలుకోవడానికి సమయం పడుతుందని తెలిపారు డాక్టర్లు. (చదవండి: చిత్తుగా కొట్టి.. మలం తినిపించి..) ఇక బాధితుడి బంధువు మాట్లాడుతూ.. ‘నిందితురాలు అనారోగ్యానికి గురైందని తెలియడంతో వారి అపార్ట్‌మెంట్‌కు వెళ్లాను. అక్కడ పరిసరాలు చూసి నాకు కడుపులో దేవింది. ఏళ్లుగా ఇంటిని శుభ్రం చేయడం లేదనుకుంటాను చెత్త, చెదారం, మలమూత్రాలు అన్ని కలిసి పోయి భరించలేదని దుర్వాసన వస్తోంది. అంబులెన్ప్‌కి కాల్ చేసి వారి సాయంతో మహిళను ఆస్పత్రికి చేర్చాను. ఆ సమయంలోనే బాధితుడి గురించి తెలిసింది. అతడిని ఆ పరిస్థితుల్లో చూసి షాక్ అయ్యాను. నా గుండే పగిలిపోయింది. అతడి దీని స్థితి గురించి నాకు తెలియడానికి 28 ఏళ్లు పట్టింది. చివరకు ఆమె అనారోగ్యం కారణంగా బాధితుడికి సాయం చేసే అవకాశం దక్కింది’ అన్నారు. బాధితుడి గురించి ఎప్పుడు ప్రశ్నించినా.. బాగానే ఉన్నాడని చెప్పి టాపిక్ డైవర్డ్ చేసేదన్నారు. ఇంత దారుణం జరుగుతున్న ఇరుగుపొరుగు వారికి వ్యక్తి దీని స్థితి గురించి తెలియకపోవడం వింతగా ఉంది. దీని గురించి పోలీసులు వారిని ప్రశ్నించగా.. వృద్ధురాలు ఎవరిని ఇంటి చుట్టుపక్కలకి రానిచ్చేది కాదని.. కొడుకు గురించి అడిగితే బాగానే ఉన్నాడు.. మీకేందుకు అని గొడవపడేదని తెలిపారు. -
రెనాల్ట్ ‘కాప్చర్’ మోడర్న్ సేఫ్టీ ఫీచర్లతో
సాక్షి, న్యూఢిల్లీ : ఫ్రాన్స్ కార్ మేకర్ రెనాల్ట్ సరికొత్త సేఫ్టీ ఫీచర్ల అప్డేట్తో స్పోర్ట్ యుటిలిటీ వెహికల్ ‘కాప్చర్’ మోడల్ కారును లాంచ్ చేసింది. తాజా కేంద్ర నిబంధనలు అనుగుణంగా భద్రతా ప్రమాణాలతో మార్కెట్లోకి విడుదల చేసింది. రూ.9.5- రూ.13 లక్షల ( ఎక్స్ షోరూం -న్యూఢిల్లీ) మధ్య ధరలను నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ అధికారులు నిర్దేశించిన ఎక్సీడ్ ఫ్రంటల్, లాటరల్, పెడెస్ట్రైన్ సేఫ్టీ ఫీచర్లను జోడించినట్లు రెనాల్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. డ్యుయల్ ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ (ఈబీడీ)తోపాటు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్), బ్రేక్ అసిస్ట్, స్పీడ్ అలర్ట్, రేర్ పార్కింగ్ సెన్సర్, డ్రైవర్ అండ్ కో డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్ లాంటి ఫీచర్లను కొత్త కాప్చర్లో అదనంగా పొందుపర్చింది. ఈ సేఫ్టీ ఫీచర్లు అన్ని వర్షన్లతో కూడిన న్యూ రెనాల్ట్ కాప్చర్ మోడల్ కార్లలో అందుబాటులో ఉంటాయి. అంతేకాదు వీటితోపాటు పలు ప్రీమియం ఫీచర్లు కూడా చేర్చామని రెనాల్ట్ తెలిపింది. -
311 సబ్సిడీ గొర్రెల పట్టివేత
చివ్వెంల(సూర్యాపేట) : అక్రమంగా తరలిస్తున్న 311 సబ్సిడీ గొర్రెలను శుక్రవారం పోలీసులు వేర్వేరు చోట్ల పట్టుకుని స్టేషన్లకు తరలించారు. చివ్వెంల మండలం దురాజ్‌పల్లి ఆవాసం ఖాసీంపేట గ్రామంలో 200 గొర్రెలు, దామరచర్ల మండలం వాడపల్లి అంతరాష్ట్ర చెక్‌పోస్టు వద్ద 111 గొర్రెలను పట్టుకున్నారు. వివరాలు.. తొండ తిరుమలగిరికి చెందిన నలుగురు వ్యక్తులు 200 గొర్రెలను ఆంధ్రాలో విక్రయించేందుకు నడక దారిన తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మండల పరిధిలోని ఖాసీంపేట గ్రామ శివారులో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు విచారణ చేపట్టారు. సబ్సిడీ గొర్రెలను అమ్మేందుకు తమకు కూలి ఇచ్చి పంపించారని వారు తెలపడంతో పోలీసులు గొర్రెలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఎస్ఐ బి.ప్రవీణ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. వాడపల్లి చెక్‌పోస్టు వద్ద.. దామరచర్ల(మిర్యాలగూడ) : అక్రమంగా తరలిస్తున్న 111 సబ్సిడీ గొర్రెలను దామరచర్ల మండలం వాడపల్లి అంతరాష్ట్ర చెక్‌పోస్టు వద్ద పట్టుకున్నట్టు వాడపల్లి ఎస్ఐ నగేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన వాడపల్లిలో విలేకరులతో మాట్లాడారు. సిరిసిల్ల నుంచి గురువారం రాత్రి లారీలో గుం టూరు జిల్లా వెల్దుర్తికి గొర్రెలను తరలిస్తుండగా పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించామన్నారు. లారీలో 122 గొర్లు ఉన్నాయని, వీటిలో 111 సబ్సిడీ గొర్రెలు ఉన్నాయని మండల పశువైద్యాధికారి తెలిపారు.లారీ ఓనర్, డ్రైవర్లతో పాటుగా గొర్రెలను తరలిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
రెనో నుంచి క్యాప్చర్ ఎస్యూవీ
న్యూఢిల్లీ: దేశీ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల విభాగంలో స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా... ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనో తన ’క్యాప్చర్’ వాహనాన్ని సోమవారం భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 9.99 లక్షలు – రూ. 13.88 లక్షలుగా ఉంటుంది. పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వేరియంట్లలో లభిస్తుంది. పెట్రోల్ ఆప్షన్లో 5 స్పీడ్ ట్రాన్స్మిషన్, లీటరుకు 13.87 కిలోమీటర్ల మైలేజీ, డీజిల్ ఆప్షన్లో 6 స్పీడ్ ట్రాన్స్మిషన్.. లీటరుకు 20.37 కి.మీ. మైలేజీ ఉంటుంది. ఆధునిక ఫీచర్స్‌తో స్టయిలిష్‌గా ఉండే ఎస్‌యూవీలను ఇష్టపడుతున్న కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా క్యాప్చర్‌ని తీర్చిదిద్దినట్లు రెనో ఇండియా ఆపరేషన్స్ కంట్రీ సీఈవో సుమిత్ సాహ్నీ తెలిపారు. భారత్‌లో ఈ ఏడాది 46 శాతం మేర పెరిగిన ఎస్యూవీ విభాగంలో తమ వాటా మరింత పటిష్టం చేసుకునేందుకు క్యాప్చర్ తోడ్పడగలదని చెప్పారాయన. ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ డేటైమ్ రనింగ్ లైట్స్, ఆడియో సిస్టమ్ తదితర 50 ఫీచర్లు క్యాప్చర్‌లో ఉంటాయి. పెట్రోల్ ఆప్షన్ రేటు రూ.9.99 లక్షల నుంచి రూ. 11.69 లక్షల దాకా, డీజిల్ వెర్షన్ రేటు రూ. 11.39 లక్షల నుంచి రూ. 13.88 లక్షల దాకా ఉంటుంది. హ్యుదాయ్ క్రెటా, మహీంద్రా స్కార్పియో మొదలైన వాటితో క్యాప్చర్ పోటీపడనుంది. -
ప్రత్యేకత ఉంటేనే వారసత్వ సంపద!
ఏది పడితే అది వారసత్వ సంపద కాదు: సీఎం కేసీఆర్ ► చారిత్రక ప్రాధాన్యం ఉండాలి ► వారసత్వ సంపద గుర్తింపు కోసం కమిటీ ► సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు.. ప్రతిపక్ష నేతకూ చోటు ► రాష్ట్రవ్యాప్తంగా కోటలు, ప్రాధాన్యమున్న గడీలను గుర్తిస్తాం ► ప్రాధాన్యమున్న వాటిని సంరక్షిస్తాం.. పనికిరాని వాటిని తొలగిస్తాం ► ప్రైవేటు కట్టడాలను హెరిటేజ్ జాబితాలో ఉంచబోం ► వాటిపై హక్కులను సంబంధీకులకే వదిలేస్తామని వెల్లడి ► తెలంగాణ వారసత్వ కట్టడాల బిల్లుకు ఆమోదం సాక్షి, హైదరాబాద్: చారిత్రక ప్రాధాన్యత, ప్రత్యేకతలున్న వాటినే ఇక నుంచి వారసత్వ సంపదగా పరిగణిస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు తెలిపారు. దేనిని పడితే దానిని వారసత్వ సంపదగా పేర్కొనే విధానానికి స్వస్తి పలుకుతామని చెప్పారు. ఆదివారం శాసనసభలో ‘తెలంగాణ ప్రత్యక్ష, పరోక్ష వారసత్వ సంపద సంరక్షణ, పరిరక్షణ, పునరుద్ధరణ, నిర్వహణ బిల్లు’ను ప్రవేశపెట్టిన కేసీఆర్.. దాని ఉద్దేశాలను వివరించారు. ‘‘వారసత్వ సంపద అంటే అర్థం పర్థం ఉండాలె. గతంలో ఇష్టం వచ్చినట్టు చేశారు. వాటివల్ల ఇప్పుడు ఇబ్బందులు వస్తున్నాయి. సుప్రీంకోర్టు చెప్పిందన్న పేరుతో గతంలో కేంద్రం కొన్ని ఆదేశాలిస్తే... రాష్ట్రాలు కనిపించిన ఖాళీ భూములన్నింటినీ అటవీ భూములుగా మార్చాయి. ఇప్పుడు గజం స్థలం సేకరించాలంటే.. గ్రీన్ ట్రిబ్యునల్ అని, ఆ ట్రిబ్యునల్ అని, ఈ ట్రిబ్యునల్ అని తిరగాల్సి వస్తోంది. ఈ పద్ధతి మంచిది కాదు.. అందుకే ప్రత్యేక ప్రాధాన్యమున్న వాటినే వారసత్వ జాబితాలో చేరుస్తాం..’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. అధ్యయనం చేసి నిర్ణయిస్తాం.. మనకంటూ ఉన్న చరిత్ర, ఇతర ప్రాధాన్యానికి గుర్తుగా ఉన్న కట్టడాలు, స్థలాలు, కళలను పరిరక్షించాలని.. అదే సమయంలో భావి అవసరాలకు తగ్గట్టు జరిగే అభివృద్ధికి నిరోధకంగా మారే విధానాలను మార్చుకోవాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకొచ్చిన వారసత్వ చట్టంలో అనేక లొసుగులున్నాయన్నారు. హైదరాబాద్ పరిధిలో ఎన్నో చారిత్రక అవశేషాలు ఉన్నాయని, వాటిని విస్మరించారని చెప్పారు. మరోవైపు కొన్ని ప్రైవేటు భవనాలను వారసత్వ సంపద కిందకు తీసుకొచ్చారని.. గ్రీన్‌ల్యాండ్ గెస్ట్‌హౌస్‌ను కూడా అందులో చేర్చడమేమిటని పేర్కొన్నారు. వారసత్వ సంపద అంటే హైదరాబాద్‌కే పరిమితం కాకూడదని.. రాష్ట్రవ్యాప్తంగా కోటలు, చారిత్రక కట్టడాల వంటివాటిపై సమగ్ర అధ్యయనం చేసేందుకు సీఎస్ నేతృత్వంలో కమిటీ వేశామని కేసీఆర్ వెల్లడించారు. ఆ కమిటీలో ప్రతిపక్ష నేతకు కూడా చోటు కల్పించనున్నట్టు తెలిపారు. గందరగోళం తప్పేలా ఉండాలి పురావస్తు శాఖ పరిధిలో ఉన్న జోగు ళాంబ దేవాలయంలో కొత్తగా ఎక్కడైనా దీపం పెడదామంటే పంచాయితీ ఉందని.. ఢిల్లీలో ఎర్రకోట వద్ద జాతీయ పతాకాన్ని ఎగురేసినట్టు మన గోల్కొండ కోటలో ఎగరే యాలంటే ప్రతిసారి కేంద్ర పురావస్తు శాఖ అనుమతి పొందాలని.. ఈ గందరగోళ మంతా ఎందుకని కేసీఆర్ పేర్కొన్నారు. సచివాలయంలో సమాధిలాగా మారిన పురా తన జీబ్లాక్ భవనాన్ని కూల్చి వేద్దామంటే దిక్కుమాలిన హెరిటేజ్ నిబంధన అడ్డం వస్తోందన్నారు. కోటలు, ప్రముఖ గడీలతో పాటు ముఖ్యమైన చారిత్రక కట్టడాలను సంరక్షించి, పునరుద్ధరించుకోవాల్సిన అవస రముందని.. పనికిరాని కట్టడాలను తొలగిం చాల్సిందేనని పేర్కొన్నారు. ‘‘బ్రెజిల్‌లోని ప్రముఖ నగరం రియో కు మేయర్‌గా వచ్చిన ఓ వ్యక్తి.. పట్టణ ప్రాంతాల భూవినియోగ ప్రాధాన్యాన్ని గుర్తించి తీసుకున్న నిర్ణయాల ఫలితంగా ఇప్పుడా నగరం ప్రపంచంలోనే ముఖ్యమైన హరిత నగరాల్లో ఒకటిగా భాసిల్లుతోంది. జనం పెరుగుతున్న తరు ణంలో వారి అవసరాలకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది’’ అని చెప్పారు. కబ్జాలు, ఆక్రమణలు నిరోధించండి చారిత్రక ప్రాంతాల్లో కబ్జాలను నిరోధించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ సభ్యుడు సంపత్ ప్రభుత్వానికి సూచించారు. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు వద్ద ఆక్రమణలు లేకుండా చూడాలన్నారు. తాను చిన్నప్పటి నుంచి చూస్తున్న బంజారాహిల్స్ రోడ్డు నం.14లోని ఓ హెరిటేజ్ ప్యాలెస్ ఉన్నట్టుండి కనుమరుగైందని, దానికి కారణమేమిటని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్.. ఆ ప్యాలెస్ హెరిటేజ్ జాబితాలో లేదని సమాధానమిచ్చారు. ప్రైవేటు వ్యక్తులకు చెందిన కట్టడాలను వారసత్వ సంపద జాబితాలో ఉంచబోమని.. వాటిపై హక్కు వారికే వదిలేస్తామని, వాటి నిర్వహణను ప్రభుత్వం ఎలా తీసుకుంటుందని చెప్పారు. అనంతరం బిల్లు ఆమోదం పొందినట్టు స్పీకర్ ప్రకటించారు. -
ఔటర్ రింగ్ రోడ్డులో ఎర్రచందనం స్వాధీనం
శంషాబాద్(రంగారెడ్డి జిల్లా): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఆటోలో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ముగ్గురు వ్యక్తులు ఆటోను వదిలి పారిపోయారు. ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. -
నీలి కిరోసిన్ పట్టివేత
డోన్ టౌన్ : పట్టణంలోని కేవీఎస్ పెట్రోల్ బంకు వెనుకాల గల గోడౌన్‌పై సోమవారం తహసీల్దార్ మునికృష్ణయ్య ఆకస్మిక దాడులు జరిపి అక్రమంగా నిల్వ ఉంచి, లెక్కచూపని 10, 280 లీటర్ల నీలి కిరోసిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక కిరోసిన్ హోల్‌సేల్ డీలర్.. కేవీఎస్ కంపెనీ వారికి జనవరి నెలలో 67 వేల లీటర్ల కిరోసిన్‌ను కేటాయించగా.. 54వేల లీటర్లను మాత్రమే పంపిణీ చేశారని తహసీల్దార్ తెలిపారు. అక్రమంగా 10,280 లీటర్ల కిరోసిన్‌ను గోడౌన్లో నిల్వచేయగా దాడులు జరిపి గోడౌన్‌ను సీజ్ చేశాన్నారు. మిగిలిన 2,720 లీటర్ల కిరోసిన్ ఏమయిందనే విషయంపై సరైన రికార్డులను కేవీఎస్ కంపెనీ చూపలేకపోయిందని ఆయన తెలిపారు. ఈ విషయంపై జిల్లా అధికారులకు సమగ్ర నివేదిక పంపినట్లు తహసీల్దార్ స్పష్టం చేశారు. -
ఐదు క్వింటాళ్ల గంజాయి పట్టివేత
చింతూరు(తూర్పుగోదావరి): తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయి భారీగా పట్టుబడింది. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు చింతూరు మండలం మోతుగూడెం పెదవాగు వద్ద మంగళవారం కాపు కాశారు. ఈ సందర్భంగా వారు అనుమానాస్పదంగా వస్తున్న లారీని ఆపి సోదాలు జరిపారు. అందులో దాచి ఉంచిన రూ.26 లక్షల విలువైన 530కిలోల గంజాయిని గుర్తించారు. ఈ సందర్భంగా ఇద్దరినీ అదుపులోకి తీసుకుని, గంజాయి సహా లారీని స్టేషన్‌కు తరలించారు. -
కరీంనగర్లో 176 క్వింటాళ్ల బియ్యం పట్టివేత
-
180 బస్తాల బియ్యం పట్టివేత
సోమందేపల్లి : స్టోర్ బియ్యం అక్రమంగా కర్ణాటకాకు తరలిస్తూ పట్టుబడిన సంఘటన మంగళవారం రాత్రి 10 గంటలకు మండలంలో చోటుచేసుకుంది. ధర్మవరం నుంచి ఐచర్ వాహనంలో స్టోర్ బియ్యం కర్ణాటకలోని కోలార్ ప్రాంతానికి తరలిస్తున్నట్లు విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ అనిల్ బాబుకు సమాచారం వచ్చింది. దీంతో ఆ శాఖ సీఐ గంగనాథ్ బాబు, ఎస్ఐ రామకృష్ణ సోమందేపల్లి వై జంక్షన్ వద్ద వాహనాన్ని తనిఖీ చేయగా 180 బస్తాల బియ్యం పట్టుబడ్డాయి. చెక్‌పోస్టులు, ఇతర తనిఖీ కేంద్రాల వద్ద ఎటువంటి అనుమానాలు రాకుండా బియ్యం బస్తాలపై వరిగడ్డి ఏర్పాటు చేసుకుని టార్పల్ కప్పుకుని జాతీయ రహదారిపై పోలీసుల కళ్లు గప్పి తీసుకెళుతున్నట్లు అధికారులు తెలిపారు. నిత్యం అనంతపురం, ధర్మవరం, తాడిపత్రి ప్రాంతాల నుంచి స్టోర్ బియ్యం అక్రమ రవాణా అవుతున్నట్లు తెలుస్తోంది. పట్టుబడ్డ వాహనాన్ని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్థానికంగా రెవెన్యూ అధికారులు లేకపోవడంతో గుడిపల్లి వీఆర్వో రవిచంద్రరెడ్డికి పట్టుబడ్డ బియ్యాన్ని అందించారు. -
రూ.8 లక్షల కొత్త కరెన్సీ పట్టివేత
-
రూ.8 లక్షల కొత్త కరెన్సీ పట్టివేత
ఖమ్మం: ఖమ్మం రైల్వే స్టేషన్లో రాములు అనే వ్యక్తి నుంచి రూ.8 లక్షల కొత్త కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి అన్నీ రూ.2 వేల నోట్లే కావడం విశేషం. అతడిని ప్రశ్నించగా తాను కమీషన్ వ్యాపారం చేస్తుంటానని, తనకు పలువురి నుంచి రావాల్సిన నగదు వచ్చిందని పోలీసులకు చెప్పాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. -
ముంబైలో భారీగా 2వేలనోట్లు పట్టివేత
-
భారీగా ఎర్రచందనం పట్టివేత
చంద్రగిరి(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని శేషాచలం అడవుల్లో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం వేకువజామున కూంబింగ్ నిర్వహించారు. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న ముగ్గురు తమిళకూలీలను అరెస్ట్‌చేయడంతో పాటు, 21 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. చంద్రగిరి మండలం చీకటికోన సమీపంలో ఎర్రచందనం చెట్లను నరికి తరలిస్తుండగా పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. -
సంగారెడ్డి జిల్లాలో భారీ నల్ల మందు స్వాదీనం
-
81 బస్తాల పప్పుశనగ పట్టివేత
రాజకీయ ఒత్తిళ్లతో వదిలేసిన వైనం పామిడి: మండలంలోని ఓబుళాపురంలో టీడీపీకి చెందిన వెంకటేశు అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా దాచి ఉంచిన 81 బస్తాల విత్తన పప్పుశనగను సోమవారం మండల వ్యవసాయాధికారి మల్లీశ్వరి గుర్తించారు. వీటిని అధికార పార్టీకి చెందిన గుంతకల్లు మండల స్థాయి ప్రజాప్రతినిధి ఒకరు అక్రమంగా దాచి ఉంచారని తెలుస్తోంది. విత్తనాన్ని సీజ్ చేశారన్న విషయం వెలుగు చూడడంతో అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి కూడా ఫోన్ చేశారని తెలిసింది. దీంతో అధికారులు పట్టుబడిన విత్తనం రైతులదని ప్రకటించారు. ఏఓ మల్లీశ్వరి మాట్లాడుతూ స్వాధీనం చేసుకున్న బస్తాలు తమవేనని రైతులు తెలిపారన్నారు. స్థలాభావంతో అక్కడ నిల్వ ఉంచినట్లు రాతపూర్వకంగా తెలిపారన్నారు. దీంతో పప్పుశనగ బస్తాలను తిరిగి అప్పగించామన్నారు. ఎస్ఐ రవిశంకర్‌రెడ్డిని విచారించగా.. ఏఓ సమాచారం మేరకు ఓబుళాపురానికి పోలీసులను పంపినట్లు చెప్పారు. అంతకుమించి తనకేమీ తెలియదన్నారు. ఈ వ్యవహారం ఏఓకు సంబంధించిన విషయమని ఆయన దాటవేశారు. -
రేషన్ బియ్యం పట్టివేత
సుల్తానాబాద్: మండల కేంద్రంలోని శ్రీరాంపూర్ కూడలి వద్ద ఆటోలో తరలిస్తున్న రేషన్‌బియ్యాన్ని శనివారం వాహనాల తనీఖీలో పట్టుకున్నట్లు ఎస్సై జీవన్ తెలిపారు. సుల్తానాబాద్ మార్కండేయ కాలనీకి చెందిన బండారి వంశి అనే వ్యక్తి ఏడు క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకుని ఆటోను సీజ్‌చేసి స్టేషన్‌కు తరలించినట్లు ఆయన తెలిపారు. కేసు నమోదు చేసి బియ్యాన్ని పంచనామా కోసం డీటీసీఎస్ అధికారులకు సిఫార్సు చేశామన్నారు. ఇసుక ఆటో పట్టివేత సుల్తానాబాద్ మండలంలోని కదంబాపూర్ నుంచి పెద్దపల్లికి సన్నపు (జీరో) ఇసుకను ఆటోలో అక్రమంగా తరలిస్తుండగా శివాలయం వద్ద శనివారం పట్టుకున్నట్లు ఎస్సై జీవన్‌తెలిపారు. మైనింగ్ అధికారులకు జరిమానా కోసం సిఫార్సు చేసినట్లు చెప్పారు. అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
రైల్లో అక్రమంగా తరలుతున్న పటిక పట్టివేత
మధిర : రైల్లో అక్రమంగా తరలిస్తున్న సారాతయారీకి ఉపయోగించే పటికను మధిర రైల్వేపోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం ఇంటికన్నె తండాకు చెందిన నలుగురు ఏపీలోని కష్ణాజిల్లా కొండపల్లి నుంచి సుమారు రెండు క్వింటాళ్ల సారా పటికను కొనుగోలు చేశారు. ఇంటికన్నె తండాకు చెందిన అజ్మీరాస్వాతి, గుగులోతు వెంకన్న, బోడ బుజ్జి, భూక్యా శాంతి సారాతయారీకి ఉపయోగించే పటిక, బెల్లం తదితర వాటిని సేకరించి సొంతంగా సారాతయారుచేసి నెక్కొండ, కేసముద్రం తదితర ప్రాంతాల్లో విక్రయిస్తుంటారని రైల్వేపోలీసులు తెలిపారు. కొండపల్లిలో కొనుగోలు చేసిన పటికను ఎవరికీ అనుమానం రాకుండా సరుకులు తీసుకువెళ్లే సంచుల్లో, పాత చీరెల్లో మూటలుగా కట్టి విజయవాడ నుంచి ఖాజీపేట వైపు వెళ్లే పాసింజర్ రైల్లో తరలిస్తున్నారు. రైలుబండిలోని బాత్రూంలో ఈ మూటలను దాచి ఉంచారు. అంతేకాకుండా వారు బాత్ రూమ్‌కు బయటవైపు ఉండి వ్యూహాత్మకంగా లోపలివైపు గడియ పెట్టారు. బాత్రూం తలుపును ఎంతకీ తీయకపోవడంతో అనుమానం వచ్చిన కొంతమంది ప్రయాణికులు మధిర రైల్వేపోలీసులకు సమాచారం అందించారు. దీంతో పాసింజర్ రైలు మధిర రైల్వేస్టేష¯ŒSకు చేరుకున్న తరువాత రైల్వేహెడ్‌కానిస్టేబుల్ తుమ్మల బాలస్వామి ఆధ్వర్యంలో పోలీసులు ఎ¯ŒS.రమేష్, ఎస్బి.శ్రీనివాసులు దాడి చేసి బాత్రూం గడియను తొలగించారు. అందులో ఉన్న మూటలను జాగ్రత్తగా పరిశీలించగా సారాపటిక అని తేలింది. పటికను అక్రమంగా తరలిస్తున్న నలుగురిలో ముగ్గురు పరారు కాగా అజ్మీరా స్వాతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ సంఘటనపై పంచనామా నిర్వహించడం జరిగిందని, ఖమ్మం రైల్వే ఎస్ఐ కె.నరేష్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారని రైల్వే హెడ్ కానిస్టేబుల్ తుమ్మల బాలస్వామి తెలిపారు. -
టేకు కలప పట్టివేత
నల్లబెల్లి : బోలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలను సోమవారం తెల్లవారుజామున నల్లబెల్లి పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై మేరుగు రాజమౌళి కథనం ప్రకారం.. నల్లబెల్లి పోలీసులు సోమవారం తెల్లవారుజామున పెట్రోలింగ్ చేస్తుండగా లెంకాలపల్లి వైపు నుంచి ఓ బోలెరో వాహనం వేగంగా వస్తుండగా ఆపే ప్రయత్నం చేశారు. డ్రైవర్ ఆపకుండా వెళ్లడంతో వెంబడించి అడ్డుకున్నారు. తనిఖీ చేయ గా ఆ వాహనంలో 80 ఫీట్లుగల 22 టేకు దుంగలను ఉంచి పైనుంచి పరదా కప్పి ఉంచారు. డ్రైవర్ బొడరెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించగా నర్సంపేటకు చెందిన మేకల రాంబా బు చత్తీస్‌గఢ్ నుంచి కలపను నర్సంపేటకు కల ప తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. టేకు దుంగల విలువ మార్కేట్లో రూ.2.40 లక్షలు ఉంటుంద ని తెలిపారు. దాడిలో హెడ్‌కానిస్టేబుల్ యాక య్య, కానిస్టేబుళ్లు దేవ్‌సింగ్, సాధన్, రమేష్, సుకేందర్, పాషా, హెచ్‌జీ రాజు పాల్గొన్నారు. -
గ్రావెల్ తోలుతున్న వాహనాల పట్టివేత
ఒక జేసీబీ, డోజర్, 10 ట్రాక్టర్లు సీజ్ బర్లగూడెం వద్ద ఇసుకర్యాంపునకు దారి వేస్తుండగా దాడులు పినపాక : అటవీ భూముల నుంచి నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్న వాహనాలను శుక్రవారం రాత్రి ఏడూళ్లబయ్యారం అటవీ క్షేత్ర కార్యాలయ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. ట్రైనీ ఐఎఫ్ఎస్, రేంజర్ లక్ష్మణ్రంజి™Œ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం... మండల పరిధిలోని పద్మాపురం పంచాయతీ బర్లగూడెం–అల్లేరుగూడెం గ్రామాల మధ్య గల అటవీ భూముల నుంచి నిబంధనలకు విరుద్ధంగా గ్రావెల్ క్వారీ ఏర్పాటు చేసి అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా గ్రావెల్‌ను తరలిస్తున్నారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు రేంజర్ తన సిబ్బందితో పాటు కరకగూడెం పోలీసుల సహకారంతో అల్లేరుగూడెం అడువుల్లో ఏర్పాటు చేసిన గ్రావెల్ క్వారీ వద్దకు చేరుకున్నారు. కాగా ముందుగానే అధికారులు వస్తున్నారన్న సమాచారం అందుకున్న వాహనాల యజమానులు అక్కడి నుంచి వాహనాలను అటవీ ప్రాంతంలోకి తీసుకవెళ్లి దాచి ఉంచారు. ఈ క్రమంలో రేంజర్ ఆధ్వర్యంలో అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా దాచి ఉంచిన ఒక జేసీబీ, ఒక డోజర్ ట్రాక్టర్, 10 ట్రాక్టర్లను అధికారులు గుర్తించారు. అనంతరం వాటిని స్వాధీనం చేసుకొని ఏడూళ్లబయ్యారం రేంజ్ కార్యాలయానికి తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు.. లక్ష్మణ్‌రంజిత్‌నాయక్, ట్రైనీ ఐఎఫ్ఎస్ అల్లేరుగూడెం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఇసుక క్వారీకి రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు గ్రావెల్‌ను తోలుతున్నట్లు తమ విచారణలో తేలింది. అక్రమంగా తరలించిన గ్రావెల్ విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు డీఎఫ్‌ఓకు నివేదించాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. -
రెండు బియ్యం లారీల పట్టివేత
చిలమత్తూరు : చిలమత్తూరు మండలం కొడికొండ సమీపంలోని జిలాచర్ల క్రాస్‌లో బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న రెండు లారీలను వాణిజ్య పన్నుల శాఖ స్పెషల్ ఏసీటీ ఓ బేబీ నందా మంగళవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. కొత్తచెరువు ప్రాంతం నుంచి రెండు లారీలలో 33 టన్నుల బియ్యం బస్తాలను కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా బంగారుపేటకు అక్రమంగా తరలిస్తుండగా వెంబడించి పట్టుకున్నామని ఆమె తెలిపారు. అనంతరం వాటిని స్థానిక పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు వివరించారు. అయితే లారీల్లోని సరుకు స్టోర్లదా, లేక ఇతర బియ్యమా అనే వివరాలు ఓపెన్ చేస్తే తెలుస్తుందన్నారు. కాగా లారీలను వదిలిపెట్టాల్సిందిగా అధికార పార్టీ నేతల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వచ్చినట్లు తెలిసింది. అప్పటికే ఆ లారీలను ఆమె పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. -
నల్ల బెల్లం పట్టివేత
మిర్యాలగూడ అర్బన్: సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం తరలిస్తున్న వ్యక్తిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్ర ప్రాంతంలోని దాచేపల్లి నుంచి అక్రమంగా సార బెల్లాన్ని తరలిస్తుండగా సమాచాం మేరకు తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటోలో తరలిస్తున్న 2క్వింటాళ్ల నల్లబెల్లం, 50కిలోల పట్టికను స్వాధీనం చేసుకున్నారు. బెల్లాన్ని తరలిస్తున్న వ్యక్తి ధరవత్ రమేష్‌తో ఆటోను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సీఐ బి.సుధాకర్, ఎస్ఐ అక్రం అలీతో పాటు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. -
220 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
కొత్తగూడెం రూరల్ : అక్రమంగా తరలిస్తున్న 220 క్వింటాళ్ల రేషన్ బియ్యం లారీని సివిల్ సప్లై అధికారులు కొత్తగూడెం సమీపంలో మంగళవారం పట్టుకున్నారు. సివిల్ సప్లై డీటీ కృష్ణప్రసాద్ కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లోని వెంకటసాయి ట్రేడర్స్ నుంచి 220 క్వింటాళ్ల రేషన్ బియ్యం లోడు లారీ సోమవారం రాత్రి 9 గంటలకు అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడకు బయలుదేరింది. ఈ క్రమంలో కొత్తగూడెం మండలం లక్ష్మీదేవిపల్లిలోని లోతు వాగు వద్ద డీటీలు కృష్ణప్రసాద్, రామకృష్ణ, జగదీష్, సోందు మాటువేసి బియ్యం లారీని పట్టుకున్నారు. అందులోనివి రేషన్ బియ్యం అని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కొంత బియ్యాన్ని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. తర్వాత లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్ షణ్ముఖ, లారీ యజమాని గార్లపాటి రాధాకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు డీటీ కృష్ణప్రసాద్ తెలిపారు. -
డ్రంక్&డ్రైవ్‌లో పట్టుబడ్డ స్కూల్ ఆటో డ్రైవర్
-
చెన్నైలో రూ.16కోట్ల ఎర్రచందనం పట్టివేత
-
ఈ పెళ్లి ఫోటోలను చూస్తే.. మీరు ఇలాగే ప్రయత్నిస్తారు!
సాధారణంగా వివాహానికి ముందు, వివాహ సమయంలో జంటలు ఫోటోలు దిగుతుంటారు. వాటిని తీసే ఫోటోగ్రాఫర్లు కొన్ని స్టాండ్లు, లైట్లను ఉపయోగించి తీస్తుండటం చూసుంటారు. కానీ, ఫోటోలను తీయడం కోసం చిత్ర విచిత్రమైన పొజిషన్లను మారుస్తూ కొంతమంది ఫోటోగ్రాఫర్లు ఓ జంటకు చేసిన ప్రీ వెడ్డింగ్ షూట్ ఫోటోలు ప్రస్తుతం ఆన్ లైన్ లో వైరల్ అయ్యాయి. రోజూ కనిపించే సాధారణ ప్రాంతాల్లోనే ఎక్కువశాతం ఫోటోలు తీసిన వీరి ఆలోచనల్లోని సృజనాత్మకత ఫోటోలు వచ్చిన తర్వాత బయటపడింది. దాదాపు ప్రకృతిలోని అన్ని వనరులను వాడుకుంటూ చేసిన ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ఫోటోలను ఒకసారి తిలకించారంటే మీకు కూడా ఇలానే షూట్ చేయాలనిపించక మానదు. -
ఇస్తాంబుల్ దాడి సూత్రధారులు వారే..
టర్కీ పేలుళ్ళ సూత్రధారులను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. ఎయిర్ పోర్టులో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డవారుగా భావిస్తున్నవారి ఫోటోలను స్థానిక మీడియా వెల్లడించింది. రైఫిళ్ళు చేత పట్టుకొని ముగ్గురు దుండగులు దాడులకు తెగబడినట్లుగా ఫోటోలనుబట్టి తెలుస్తోంది. పర్యాటక నగరం ఇస్తాంబుల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రక్తపాతం సృష్టించిన ఉగ్రవాదులను సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు. తుపాకులు, బాంబులతో మారణహోమానికి తెగబడి, 41 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు. ఉన్మాదుల దాడిలో 230 మంది వరకూ తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే ఈ దాడులు ఇస్లామిక్ స్టేట్ పనేనని టర్కీ ప్రధాని బినాలీ ఇల్ డ్రిం అంటున్నారు. మృతుల్లో ఐదుగురు సౌదీకి చెందినవారు, ఇద్దరు ఇరాక్ దేశస్థులు, ఇంకా జోర్దాన్, టునీషియా, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, ఉక్రెయిన్ లకు చెందిన 13 మంది విదేశీయులున్నారు. ప్రస్తుతం విడుదలైన వీడియోలను బట్టి చూస్తే దాడికి పాల్పడిన ఉగ్రవాదులు ముగ్గురు, కాల్పులు జరిపిన అనంతరం తమను తాము రైఫిళ్ళతో పేల్చేసుకున్నట్లు తెలుస్తోంది. గత మార్చిలో బ్రసెల్స్ లో కూడా ఇదే తరహాలో జరిగిన దాడుల్లో 32 మంది మరణించారు. అయితే ప్రస్తుత దాడుల్లో ఉగ్రవాదులెవరూ ఎయిర్ పోర్టు ప్రధాన ద్వారం నుంచీ ప్రవేశించలేదు. ముందుగా ఓ వ్యక్తి టర్మినల్ కు బయటే తనను తాను పేల్చేసుకోగా.. సందట్లో సడేమియాగా మిగిలిన ఇద్దరూ ఎయిర్ పోర్టు భవనంలోకి ప్రవేశించినట్లు తెలిసింది. బిల్డింగ్ దగ్గరకు నడుచుకుంటూ వెడుతున్నటెర్రరిస్టు, మరో ఫోటోలో నల్లని డ్రస్ ధరించి రైఫిల్ చేత పట్టుకొని కాల్పులు జరుపుతున్న దృశ్యాలు బయటపడటంతో పోలీసులు ఆ ఫుటేజీని విడుదల చేశారు. -
పేదల భూముల్లో ‘నీరు-చెట్టు’ పనులా ?
రైతు కూలీ సంఘం నాయకులు విజయనగరం కంటోన్మెంట్ : భూస్వాములు కబ్జా చేసిన చెరువులను వదిలేసి, దళిత,ఆదివాసీలు సాగు చేసుకుంటున్న చెరువుల్లో (నీరు లేనివి) ‘నీరు-చెట్టు’ పనులు ఎలా చేపడతారని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెలగాడ కృష్ణ, పి. మల్లిక్, ప్రగతి శీల మహిళా సంఘ జిల్లా కన్వీనర్ పి. రమణి, తదితరులు ప్రశ్నించారు. ఈ మేరకు రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చెరువు గర్భాల్లో సాగు చేసుకుంటున్న దళితులకు భవిష్యత్‌లో ప్రభుత్వం సాగు హక్కు కల్పించే అవకాశం ఉందన్నారు. వారి పొట్టకొట్టడానికే ప్రభుత్వం ‘నీరు-చెట్టు’లో భాగంగా జేసీబీతో పనులు చేపడుతోందని తెలిపారు. టీడీపీ నాయకులకు లాభం చేకూరేలా ఈ పనులు జరుగుతున్నాయని ఆరోపించారు. పెత్తందారులు స్థానిక ఎమ్మెల్యే, అధికారులు కుమ్మక్కై పేదలు సాగు చేస్తున్న చెరువుల్లోనే పనులు చేపట్టడం దారుణమన్నారు. అనంతరం కలెక్టర్ నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. -
రేషన్ బియ్యం పట్టివేత
చాపాడు: వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం కుందూ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 24 బస్తాల రేషన్ బియ్యాన్ని ఎంఆర్ఓ జ్ఞానమూర్తి సోమవారం సాయంత్రం పట్టుకున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన శ్రీరాములు అనే వ్యక్తి 24 బస్తాల రేషన్ బియ్యాన్ని బద్వేలుకు ఆటోలో తరలిస్తుండగా పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న బియ్యం బస్తాలను పోలీసు స్టేషన్‌కు తరలించి శ్రీరాములుపై కేసు నమోదు చేశారు. -
ప్రభుత్వ భూమికి ఎసరు
♦ చెరువులో 6.13 ఎకరాలు కబ్జా.. ♦ మామిడితోట సాగు చేస్తున్న ఇద్దరు నగరవాసులు వికారాబాద్: కొంతకాలంగా హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు 6.13 గుంటల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని మామిడి తోట సాగుచేస్తున్నారు. అదే గ్రామంలో ఎమ్మెల్యే పర్యటన ఉండటంతో వికారాబాద్ తహసీల్దార్ గౌతంకుమార్ ఆ గ్రామాన్ని మంగళవారం సందర్శించారు. అటువైపు ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించుకుంటూ రాగా.. చెరువులో యధేచ్ఛగా మామిడి తోట సాగు చేస్తున్న దృశ్యం కనిపించింది. దీంతో స్పందించిన తహసీల్దార్ సాగు చేస్తున్న ఆక్రమణదారులకు రెవెన్యూ యాక్టు 1905 సెక్షన్ 7 కింద నోటీసులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మదన్‌పల్లి గ్రామంలోని చెరువులో ఉన్న ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 154లో మూడెకరాలు.. మరో సర్వే నంబర్ 170లో మూడెకరాల 16 గుంటల భూమిని కబ్జా చేసి కొంత కాలంగా హైదరాబాద్‌కు చెందిన లతీఫ్ హమ్మద్, షేక్ మహరూఫ్ మామిడి తోట సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే సంజీవరావు పర్యటన అదే గ్రామంలో మరో రెండు రోజుల్లో ఉండటంతో ముందుజాగ్రతగా తహసీల్దార్ గౌతంకుమార్ ఆ గ్రామాన్ని మంగళవారం రోజు సందర్శించారు. ప్రభుత్వ కార్యక్రమం చేపట్టే స్థలంతోపాటు అటువైపు ఉన్న ప్రభుత్వ భూములను, చెరువులను తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. చెరువులో ఏదో తోట ఉన్నట్లుంది.. అని అనుమానం వచ్చి చెరువు దగ్గరకు వెళ్లి చూడగా.. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి మామిడి తోటను సాగుచేస్తున్న దృశ్యం ఆయన కంటపడింది. దీంతో ఆగ్ర హించిన ఆయన సంబంధిత వీఆర్ఓను తీవ్రస్థాయిలో మందలించారు. ఓ పక్క ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చెరువులను, కుంటలను పునరుద్ధరించాలని చెబుతుంటే.. కొంతకాలంగాా సాగు చేస్తున్న తోటను యజమానులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ఈ సందర్భంగా వీఆర్ఓను మందలించారు. ‘పద్దతి మార్చుకో.. లేదంటే నీపై వేటు వేయాల్సి ఉంటుంది’ అని తహసీల్దార్ వీఆర్ఓను హెచ్చరించారు. అనంతరం అక్కడినుంచి వికారాబాద్ కార్యాలయానికి వచ్చి మండలంలోని వీఆర్‌ఓలందరినీ పిలిచి వెంటనే తన చాంబర్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను ఎవరైన కబ్జా చేసినా.. దాంట్లో ఎలాంటి పంటలను సాగు చేసినా.. బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, లేకుంటే మీపై నేనే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అక్రమార్కులకు కొమ్ముకాసే పరిస్థితి తీసుకురావద్దని హితవు పలికారు. అనంతరం ఆయన మదన్‌పల్లి చెరువును ఆక్రమించి మామిడి తోట సాగు చేస్తున్న వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 10వ తేదీన వికారాబాద్ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి మీ సంజాయిషీ ఇవ్వాలని ఆయన ఆదేశించారు. -
105 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
ఖమ్మం రూరల్ : మండలంలోని తెల్దారుపల్లి గ్రామం నుంచి కాకినాడ పోర్టుకు తరలిస్తున్న 105 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ ఏనుగు వెంకటేష్, సివిల్ సప్లై డీటీ వేణుగోపాల్ మంగళవారం దాడి చేసి పట్టుకున్నారు. సీఐ కథనం ప్రకారం... తెల్దారుపల్లి గ్రామానికి చెందిన శ్రీను, రాజేందర్ ఇద్దరూ కలిసి మండలంలోని పొన్నేకల్, తల్లంపాడు, గుర్రాలపాడు, తెల్దారుపల్లి, మద్దులపల్లి తదితర గ్రామాల్లో పీడీఎస్ బియ్యాన్ని కొనుగోలు చేసి తెల్దారుపల్లి గ్రామంలో ఓ చోట నిల్వ ఉంచారు. అనంతరం కొనుగోలు చేసిన బియ్యాన్ని మహబూబాబాద్‌కు చెందిన మురళీకృష్ణ రైస్‌మిల్లు యజమానులైన సతీష్, రాధాకృష్ణలకు కేజీకి రూ.14చొప్పున 105 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అమ్మారు. రైస్‌మిల్లు యజమానులు మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ పేరుపై తప్పుడు వేబిల్లులు సృస్టించి కాకినాడ పోర్టుకు తరలించడానికి బియ్యాన్ని వాహనాల్లోకి లోడ్ చేస్తున్నారు. సమాచారం అందడంతో విజిలెన్స్, సివిల్సప్లై అధికారులు మాటువేసి పట్టుకున్నారు. కాకినాడకు చెందిన లారీ డ్రైవర్ సత్తిబాబు, బోనకల్ మండలం గోవిందాపురానికి చెందిన బొలేరో వాహనం డ్రైవర్ ఎస్కె అబ్దుల్నబీ, రైస్‌మిల్లు యజమానులు సతీష్, రాధాకృష్ణ, బియ్యాన్ని అమ్మిన బాణోత్ శ్రీను, బోడపట్ల రాజేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పట్టుకున్న బియ్యం విలువ రూ.12.50 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. పట్టుకున్న బియ్యాన్ని రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు వారిపై క్రిమినల్ కేసులు న మోదు చేశామని సీఐ వెంకటేష్ తెలిపారు. దాడుల్లో డీటీ సునీల్‌రెడ్డి, ఏఎస్ఓ బాలరాజు, విజిలెన్స్ హెడ్‌కానిస్టేబుల్ పి.నారాయణరెడ్డి పాల్గొన్నారు. -
బిడ్డ చివరి క్షణాలు సేవకోసం..!
జీవించాలంటే ఎంతో ధైర్యం ఉండాలి.. జీవితకాలంలో ఎదురయ్యే ప్రతి విషయాన్నీ తేలిగ్గా తీసుకోడానికి మనోనిబ్బరం కలిగి ఉండాలి. అదే విషయాన్ని నమ్మారు ఆ నూతన దంపతులు. తమకు పుట్టిన బిడ్డ కొన్ని గంటల్లోనే మరణిస్తాడని తెలిసినా కృశించిపోలేదు. తమ ఆవేదన మరెవ్వరికీ కలగకుండా ఉండాలంటే తాము నిరాశ చెందకూడదని నిర్ణయించుకున్నారు. వెంటనే తమ బిడ్డతో చివరి క్షణాల్లో గడిపిన ప్రతి అనుభవాన్ని రికార్డు చేశారు. ఆస్పత్రిలోని ఇన్సెంటివ్ కేర్ యూనిట్లో సేవలు పెంచేందుకు కావలసిన విరాళాల సేకరణ కోసం ఆ వీడియోను వినియోగించారు. సిడ్నీకి చెందిన దంపతులు నాన్సీ, ఛార్లీ మెక్లీన్ తమకు బిడ్డ పుట్టగానే ఎంతో సంతోషించారు. కానీ.. ఆ తర్వాత అతడు అత్యంత అరుదైన నాన్ కెటోటిక్ హైపర్ గ్లైసినేమియాతో జన్మించాడని తెలిసి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. శరీరం అమెనో యాసిడ్లను తయారుచేయడాన్ని నిరోధించే ఈ పరిస్థితి దాపురించడంతో ఎడిసన్ ఊపిరి తీసుకునేందుకు కూడా వెంటిలేటర్ పైనే ఆధారపడాల్సిన స్థితికి చేరుకున్నాడు. అయితే ఎవ్వరూ తమ బిడ్డ చనిపోవాలని కోరుకోరు. కానీ అతడి స్థితిని తెలుసుకున్న తల్లిదండ్రులు పరిస్థితిని అర్థం చేసుకున్నారు. వెంటిలేటర్ తీస్తే బిడ్డ చనిపోతాడని తెలిసినా ఎడిసన్ పుట్టిన ఐదు రోజుల తర్వాత తల్లిదండ్రులు చార్లీ, మెక్లీన్ వెంటిలేటర్ పై ఊపిరి అందించడాన్ని నిలిపివేశారు. ఏం చేసినా చనిపోతాడని తెలిసిన తర్వాత.. సొంత ఊపిరితో ఎంతకాలం బతుకుతాడో అంతే బతకనిచ్చేందుకు సిద్ధమయ్యారు. కానీ తమ బిడ్డ జన్మ మరెందరికో సహాయపడాలని నిర్థారించుకున్న ఆజంట.. గత సంవత్సరంలో తమ పెళ్లిఫొటోలు తీసిన ఫొటోగ్రాఫర్ జేమ్స్ ను పిలిపించారు. ఎడిసన్ చివరి క్షణాల్లో తమతో గడిపిన క్షణాలను కెమెరాలో బంధించారు. అవే చిత్రాలను స్థానిక మిడ్‌వైవ్స్ అండ్ నియోనాటల్ ఇన్సెంటివ్ కేర్ సర్వీస్ లో మరిన్ని సేవలను పెంచేందుకు విరాళాల కోసం వినియోగించారు. క్రౌడ్ ఫండింగ్ పేరున ఓ పేజీని ఎడిసన్ జ్ఞాపకార్థం ప్రారంభించిన ఛార్లీ, మెక్లీన్.. తమ బిడ్డ తమకు మంచి పాఠం నేర్పించాడంటూ పేజీలో రాసుకున్నారు. ''మీరు ప్రేమించేవారిని ఆనందంగా ఉంచేందుకు ప్రతిక్షణం వినియోగించండి, ప్రతిక్షణాన్ని చివరి క్షణంగా భావించి ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నించండి... మనకోసం ఏ క్షణం ఆగదు, ఉన్న సమయాన్ని వృధా చేయకుండా మీరు ఆనందంగా ఉండేందుకు, ఇతరులను సంతోషంగా ఉంచేందుకు వినియోగించండి'' అంటూ సూచించారు. తమ బిడ్డతో సంబంధం ఏడు రోజులే అయినా ఏడుజన్మల బంధంగా భావించామని, ఆ సమయాన్ని ప్రేమ కోసమే వినియోగించామని అన్నారు. తమ ముద్దుల బిడ్డ జ్ఞాపకార్థం 20 వేల డాలర్ల వరకూ ఫండ్స్ సేకరించి రాయల్ ఉమెన్స్ హాస్పిటల్ మిడ్ వైవ్స్, నియోనాటల్ ఇన్సెంటివ్ కేర్ యూనిట్ కు అందించాలన్న ఆశయంతోనే ఈ ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 6700 డాలర్ల వరకూ సేకరించినట్లు వివరించారు. -
చెరలో రూ.వంద కోట్ల భూమి!
మారేడుపూడిలో జోరుగా కబ్టాల పర్వం మాయమవుతున్న చెరువులు, వాగులు {పభుత్వ భూములకు రక్షణ కరువు మా హయాంలో కాదంటున్న రెవెన్యూ సిబ్బంది జాతీయ రహదారికి అనుకొని ఉంది మారేడు పూడి గ్రామం. అభివృద్ధిలో వెనుకబడినప్పటికీ విలువైన సహజ నిక్షేపాలకు కొదవలేదు. భవిష్యత్‌లో ఎంతో అభివృద్ధి చెందేందుకు అవకాశాలు పుష్కలం. ఇంకేముంది ఆ గ్రామ భూములపై భూ రాబందులు, కబ్జాకోరులు, ఆక్రమణదారులు కన్నేశారు. ఇదే తడవుగా అనుమతి, ఎటువంటి పత్రాలు లేకుండా ఇళ్లు నిర్మించేందుకు ఒక ముఠా ఏర్పడింది. అనుమతులు లేకుండా లే-అవుట్లు వేసి అమాయకులకు విక్రయించడం మరో ముఠా పని. ఇలా అన్ని రకాలుగా మారేడుపూడిలో కబ్జాకు గురికానున్న ప్రభుత్వ భూముల విలువ అక్షరాలా రూ. 100 కోట్ల పైమాటే. అనకాపల్లి: అనకాపల్లి మండలంలో మారేడుపూడి పంచాయతీ కేంద్రం. ఈ పంచాయతీ పరిధిలో బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, గన్నువానిపాలెం, చిన సాలాపువానిపాలెం ఉన్నాయి. పంచాయతీ జనాభా 2300 కాగా ఓటర్లు 1700 మంది ఉన్నారు. సుమారు 159 సర్వే నంబర్ల పరిధిలో 395.24 ఎకరాల విస్తీర్ణంలో కొండ, వాగులు, చెరువులు, బందలు ఉన్నాయి. ఐదు గ్రామాల పరిధిలో 700 వరకూ ఇళ్లు ఉండగా, అధికారికంగా అసెస్మెంట్ ఉన్న ఇళ్లు 404. కొద్ది నెలల క్రితం సమాచార హక్కు చట్టం ద్వారా స్థానికుడు సేకరించిన సమాచారం మేరకు 2011లోనే అనుమతి ఉన్న ఇళ్ల సంఖ్య 346కాగా, ఈ నాలుగే ళ్లలో అధికారికంగా158 ఇళ్లు, అనధికారికంగా మూడొందలకు పైగా ఇళ్లు నిర్మించారు. అక్రమ లేవుట్లు.. మారేడుపూడి కేంద్రంగా అక్రమ లే-అవుట్లు పుట్టుకొచ్చాయి. స్థానికులు కొందరు అక్రమ లే-అవుట్ నిర్మాణదారులకు సహకారం అందించడంతో విలువైన ప్రభుత్వ స్థలాలు అక్రమార్కుల పాలవుతున్నాయి. పంచాయతీ పరిధిలో అధికారికంగా ఒక ప్రైవేట్ లే-అవుట్ ఉండగా, అనధికారికంగా నాలుగైదు లే-అవుట్లు నిర్మించి విక్రయాలు కూడా జరిపారు. ఈ దశలోనే చెరువు బంద మీదుగా దారి వేసుకునేందుకు అనుమతి ఇచ్చినందుకు గ్రామంలో గుడి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయిలు ఇస్తామని లే-అవుట్ నిర్వాహకులు నమ్మబలికారు. దీంతో కొండ ఎగువ ప్రాంతం నుంచి చెరువులకు, లోతట్టు ప్రాంతాలకు వెళ్లాల్సిన వర్షపు నీరు అక్రమ నిర్మాణాల కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోతోంది. పలువురు అక్రమ లే-అవుట్లో ఇళ్లు కొన్నారు. తరువాత అసలు విషయం తెలిసి లబోదిబోమంటున్నారు. ప్రత్యేక ముఠా.. ఈ ప్రాంతంలో కొందరు మేస్త్రీలతో పాటు కొందరు స్థానిక ప్రతినిధులు ఒక ముఠాగా ఏర్పడ్డారు. సర్వే నంబర్ 357 వంటి ప్రభుత్వ స్థలాలను ఎరగా చూపించి నకిలీ పట్టాలు సృష్టిస్తున్నారు. వెంటనే ఇళ్లు నిర్మించి లక్షలాది రూపాయలకు విక్రయిస్తున్నారు. చివరకు ఆ ఇళ్లు అధికారంగా వచ్చినవి కాదని తెలుసుకొని కొనుగోలుదారులు అధికారుల చుట్టూ క్రమబద్ధీకరణ కోసం తిరుగుతున్నారు. కంపెనీలు పెడతామని మరికొందరు... : మారేడుపూడిలో కంపెనీ పెడతామని ఇటీవల భూ దళారులు రంగంలోకి దిగారు. ప్రభుత్వ స్థలం ఇస్తే కంపెనీ నిర్మిస్తామని దర ఖాస్తు కూడా చేసుకున్నారు. చెరువు బందలో నిర్మించిన అక్రమ నిర్మాణాల గురించి రెవెన్యూ అధికారులను వివరణ అడిగితే ఆ నిర్మాణాలు మా హయాంలో కావని తప్పించుకోవడం గమనార్హం. రూ. 100 కోట్ల పైమాటే.. : మారేడుపూడిలో 159 సర్వే నంబర్ల పరిధిలో 395.24 ఎకరాల కొండ, చెరువులు, బంధలు, వాగులు ఉన్నాయి. ఇప్పటికే వాగులు దాదాపు మాయమయ్యాయి. సర్వే నంబర్ 357లో 211.65 ఎకరాల కొండతో కూడిన భూమి ఉంది. ఇది కాకుండా వాగులు, చెరువులు, బందలు కలిసిపోయాయి. ఈ ప్రాంతంలో ప్రస్తుతం సెంటు భూమి లక్ష రూపాయిలు పలుకుతోంది. ఈ మేరకు నిటారుగా ఉన్న కొండ ప్రాంతాలను పక్కకు పెట్టినా మిగిలిన 200 ఎకరాలను కాపాడుకోకపోతే రూ. 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూములకు రక్షణ లేనట్లే. ప్రధానంగా సర్వే నంబర్ 357లో స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఎటువంటి పత్రాలు లేకుండా ఇళ్లు నిర్మించేందుకు పూనుకోవడంతో రెవెన్యూ యంత్రాంగం తొలగించింది. ఆ సమయంలో ఆ ప్రజాప్రతినిధి అధికారులతో వాగ్వాదానికి దిగి, ‘మారేడుపూడిలో అనేక అక్రమ నిర్మాణాలు ఉన్నాయి.. తొలగిస్తే అన్నీ తొలగించండి’ అని చెప్పడం ద్వారా అక్రమాలను అధికార పార్టీ నేతే అంగీకరించినట్లు స్పష్టమయింది. -
చెరువుల కబ్జాదారులపై చర్యలేవీ?
హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్లు, హెచ్ఎండీఏ కమిషనర్‌పై లోకాయుక్త ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో చెరువులు, కుంటలు కబ్జాలకు గురవుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘‘నగరం (హైదరాబాద్) నడిబొడ్డున ఉండే నాగమయ్య కుంట, బతుకుమ్మ కుంట ఏమయ్యాయి? మంచినీటిని అందించే దుర్గం చెరువు చుట్టూ అక్రమ కట్టాడాలు ఎలా వెలిశాయి? నగరంలోని కుంటలన్నీ కబ్జాలతో కనుమరుగవుతున్నా... కళ్ల ముందే కబ్జాలు జరుగుతున్నా చర్యలు చేపట్టరా?’’ అంటూ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, హెచ్ఎండీఏ కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎండీఏ పరిధిలోని కుంటలు, చెరువులు కబ్జాకు గురవుతున్నాయంటూ చెరువుల పరిరక్షణ సమితి, సోల్ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌పై లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. వాదనల సందర్భంగా జస్టిస్ సుభాషణ్‌రెడ్డి స్పందిస్తూ తాను తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో కబ్జాదారులపై గూండా, బూట్లెగ్గర్ యాక్టుల కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించానని, తన ఆదేశాలకు అనుగుణంగా దాదాపు 4 వేల కేసులు నమోదు చేసి కబ్జాలను అక్కడి ప్రభుత్వం నియంత్రించిందన్నారు. ఇక్కడ ఆ తరహా కేసులు ఎందుకు పెట్టట్లేదని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ ఏం చేస్తోందని నిలదీశారు. కిందిస్థాయి నుంచి మంచి అధికార యంత్రాంగంతో కూడిన నెట్వర్క్ ఉన్నా ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసుల సహకారంతో కబ్జాలను నియంత్రించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇప్పటికే చెరువులు ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టిన వారి జాబితాను సమర్పించడంతోపాటు చెరువులు, కుంటల పరిరక్షణకు తీసుకున్న చర్యలపై సమగ్ర కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటల పూర్తిస్థాయి నీటి మట్టానికి సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను రూపొందించి హెచ్ఎండీఏకు అందజేయాలని హైదరాబాద్, రంగారెడ్డి కలెక్టర్లకు సూచించారు. -
‘పేట’లో 100 కిలోలగంజాయి పట్టివేత?
* పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు * గంజాయితో పాటు స్కోడాకారు స్వాధీనం * విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు * తరలిన పోలీస్‌బృందం సూర్యాపేటమున్సిపాలిటీ : కారులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకులను శుక్రవారం సూర్యాపేట పట్టణం ఖమ్మం క్రాస్‌రోడ్డులో స్థానిక పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల కథనం మేరకు..ఖమ్మం జిల్లా నుంచి ఖరీదైన స్కోడాకారు డిక్కీలో గంజాయి తీసుకుని ముగ్గురు యువకులు హైదరాబాద్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు తెలిసిన విశ్వసనీయ సమాచారం మేరకు ఖమ్మం క్రాస్‌రోడ్డులో వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన స్కోడాకారును పక్కకు నిలిపి డిక్కీ తెరువగా అందులో గంజాయి కనిపించింది. వెంటనే ఉన్నతాధికారులతో పాటు పోలీసులు అప్రమత్తమై కారును చుట్టముట్టి నిందితులును అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితుల వద్ద లభ్యమైన గంజాయి వంద కిలోలకుపైగా ఉండవచ్చునని సమాచారం. అనంతరం గంజా యి తరలిస్తున్న ముఠా వెనుక ఎవరి హస్తం ఉందో విచారణ చేపట్టేందుకు వెం టనే నిందితులతో పాటు పోలీస్‌బృందం హైదరబాద్‌కు వెళ్లినట్లు సమాచారం. -
అబ్బుర పరుస్తున్న'బర్త్ ఫొటోగ్రఫీ'
జీవితంలో కొన్ని విలువైన క్షణాలను ఫోటోల రూపంలో దాచుకోవడం మామూలే. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పాటు ఫొటోగ్రఫీ రంగం కూడా అనేక కొత్త పుంతలు తొక్కింది. ఈ నేపథ్యంలో విభిన్నరకాల ఫొటోలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. వీటిలో చెప్పుకోదగ్గది బర్త్ ఫొటోగ్రఫీ. మిగతావాటితో పోలిస్తే ఇది ప్రత్యేకమైనదనే చెప్పాలి. భూ ప్రపంచంలో జీవి పుట్టుకను మించిన అందమైనది మరేదీ లేదన్న లిండ్సే స్ట్రాడ్నర్ మాటలు అక్షర సత్యాలు. బర్త్ ఫొటోగ్రాఫర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ (IAPBP) ప్రచురించిన కొన్ని ఫొటోలు చూస్తే ఇదే నిజమనిపిస్తుంది. 2016 సంవత్సరానికి నిర్వహించిన బర్త్ ఫొటోగ్రఫీ విజేతలను సంస్థ ఇటీవల ప్రకటించింది. ఈ ఫొటోలను సంస్థ వ్యవస్థాపకుడు లిండ్సే వెలువరించారు. ఈ రంగంలో ప్రావీణ్యం కలిగిన ఫొటోగ్రాఫర్లు తీసిన అద్భుతమైన షాట్లు పలువురిని ఆకట్టుకున్నాయి. ఒక కొత్త జీవి ప్రపంచంలోకి అడుగుపెట్టే క్షణాలను అపురూపంగా చిత్రించిన తీరు పలువురిని విస్మయపర్చింది. భావోద్వేగంతో కూడిన ఆ ఆనంద క్షణాలను పదిలంగా ఒడిసిపట్టుకున్న తీరు అద్భుతంగా నిలిచింది. ఈ కళలో ఆర్టిస్టుల నైపుణ్యాన్ని అభినందించి తీరాల్సిందే. ఆ ఫొటోలలో కొన్ని మీ కోసం... -
కమర్షియల్ ట్యాక్స్ తనిఖీలు..రూ.14 కోట్ల నగలు పట్టివేత
-
నెల్లూరు జిల్లాలో ఎర్ర్రచందనం డంప్ పట్టివేత
-
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
జగదేవ్‌పూర్ : అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం గుట్టు రట్టయింది.. ఇన్నాళ్లూ రేషన్ బియ్యంతో వ్యాపారం చేస్తూ పేదలపొట్ట కొడుతున్న వ్యాపారులకు కళ్లెంపడింది. రేషన్ బియ్యంతో దందా చేస్తూ లక్షలకు పడగలెత్తిన వ్యాపారి రెడ్ హ్యండ్‌గా దొరికాడు. సుమారు 15 టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా కొనుగోలు చేసి లారీలో లొడు చేస్తున్న సమయంలో స్థానిక తహశీల్దార్ పరమేశం రెడ్‌హ్యాండెడ్‌గా దాడి చేసి, షాపును సీజ్ చేశారు. ఈ సంఘటన ఎక్కడో కాదు స్వయంగా సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం ఉన్న జగదేవ్‌పూర్ మండలంలో బుధవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జగదేవ్‌పూర్ మండల కేంద్రంలో గత కొన్నేళ్లుగా రేషన్ బియ్యం వ్యాపారం గుట్టుగా కొనసాగుతోంది. జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉండడంతో అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తారనే ఉద్దేశంతో జగదేవ్‌పూర్‌లో కొంత మంది వ్యాపారులు రేషన్ బియ్యం కొనుగోలు చేయడం, అమ్మడం ప్రారంభించారు. జగదేవ్‌పూర్ మండలంతో పాటు, వరంగల్ జిల్లాలోని కొన్ని గ్రామాలు, నల్గొండ జిల్లా తుర్కపల్లి, రాజాపేట మండలాల నుంచి, రంగారెడ్డి జిల్లా సరిహద్దు గ్రామాల నుంచి కొందరు గిరిజనులు ఊరురా తిరుగుతూ రేషన్ బియ్యం సేకరిస్తూ మండల కేంద్రమైన జగదేవ్‌పూర్‌లో కొంత మంది వ్యాపారుల వద్ద కిలో రూ. 10ల చొప్పున విక్రయించేవారు. అయితే చట్ట ప్రకారం రేషన్ బియ్యం అమ్మినా, కొన్నా నేరం. అయితే ఇక్కడి వ్యాపారులకు మాత్రం చట్టం చుట్టమే. ఎలా పట్టుకున్నారంటే.. జగదేవ్‌పూర్‌లో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు స్థానిక తహశీల్దార్ పరమేశంకు సమాచారం అందడంతో బుధవారం ఉదయం జగదేవ్‌పూర్ వచ్చారు. అక్కడ రోడ్డు పక్కనే బుద్ద చిన్న సత్యం దుకాణం వద్ద లారీలో బియ్యం లోడు చేస్తూ కనిపించడంతో అక్కడి వెళ్లారు. పరిశీలించి చూడగా అవి రేషన్ బియ్యంగా తేలింది. అప్పటికే లారీలో 60 క్వింటాళ్ల బియ్యం లోడు చేసి ఉంది. అలాగే దుకాణంలో తనిఖీలు చేయగా రాసి పోసిన బియ్యంతో పాటు సంచులలో బియ్యం కనిపించాయి. వెంటనే వాటిని కూడా సీజ్ చేశారు. పట్టుకున్న రేషన్ బియ్యాన్ని మొత్తం తహశీల్దార్ సీజ్ చేశారు. వ్యాపారి జిమ్మక్కులు.. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్థానిక తహశీల్దార్ పట్టుకొవడంతో సదరు వ్యాపారుడు అవి రేషన్ బియ్యం కావని.. మొత్తం నూకలంటూ తప్పించకునే ప్రయత్నం చేశాడు. అయితే బియ్యన్ని పరిశీలించి చూడగా కొన్ని నూకలు, పసుపు కలిపిన బియ్యంగా తహశీల్దార్ గుర్తించారు. జగదేవ్‌పూర్‌కు చెందిన ప్రజాప్రతినిధులు వ్యాపారికి వత్తాసు పలికే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో వ్యాపారి లొడు చేసిన లారీని తప్పించే ప్రయత్నం చేశారు. వెంటనే తహశీల్దార్ పరమేశం లారీని వెంటనే ఇక్కడికి తీసుకరావాలని, లేనిపక్షంలో చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని హెచ్చరించడంతో లారీని ఘటన స్థలానికి రప్పించారు. దీంతో పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకున్నారు. పట్టుబడిన బియ్యాన్ని గదిలోనే ఉంచి సీజ్ చేశారు. ఒకే లారీలో 60 క్వింటాళ్ల బియ్యం, గదిలో 60 పైగా రేషన్ బియ్యం పట్టుబడడంతో ఇవి ఒకే వ్యాపారికి చెందినవా.. లేక మరికొందరు దీని వెనుక ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తహశీల్ధార్ పరమేశం మాట్లాడుతూ నమ్మ దగిన సమాచారం మేరకే దాడి చేసి రేషన్ బియ్యన్ని పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుకున్న బియ్యంలో కొన్ని నూకలు, పసుపు కలిసిన బియ్యం ఉన్నట్లు చెప్పారు. సంగారెడ్డి ప్రాంతంలో బీరు కంపెనీలకు తరలిస్తున్నట్లు తెలిసిం దని వివరించారు. పట్టుకున్న బియ్యన్ని ఫోరెన్సిక్‌కు పంపించినట్లు తెలిపారు. -
చెరువులనూ మింగేశారు
జిల్లావ్యాప్తంగా 20 వేల ఎకరాల చెరువు స్థలాలు కబ్జా పట్టణ ప్రాంతాల్లోనూ విలువైన భూముల ఆక్రమణ {పతి చెరువులో 15 నుంచి 20 ఎకరాలు కబ్జా కొన్నిచోట్ల ఇళ్ల నిర్మాణం, రియల్ వ్యాపారం మరికొన్ని చోట్ల బోర్లు వేసి పంటల సాగు మితిమీరిన అధికార పార్టీ నేతల ఆగడాలు చిత్తూరు: అధికార పార్టీ నేతల చూపు చెరువులపై పడింది. జిల్లాలో చెరువు స్థలాలను వారు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, శ్రీకాళహస్తి, మదనపల్లె, పుంగనూ రు, కుప్పం పట్టణ ప్రాంతాల్లో విలువైన విలువైన స్థలాలను అధికార పార్టీ నేతలు ఇప్పటికే ఆక్రమించారు. ఈ ఆక్రమణల పర్వంలో ఎంపీ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం ఉన్నారు. ఆక్రమిత స్థలాల్లో కొందరు రియల్ వ్యాపారాలు చేస్తుండగా, మరికొందరు ఏకంగా ఇళ్లే నిర్మించి, విక్రయించి, కోట్లు దండుకుంటున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో చెరువులను ఆక్రమించిన కొందరు నేతలు బోర్లు వేసి పంటలు సైతం సాగు చేస్తున్నారు. తిరుపతి పరిధిలో ఆక్రమణల వివా దం మరింత ముదిరింది. తాజాగా అధికార పార్టీ ప్రజాప్రతినిధి, బంధువులు కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని ఆక్రమించడంపై పెద్ద వివాదమే రేగింది. అంతకుముందు చిన్నగొట్టిగల్లు చెరువులో స్థానిక అధికార పార్టీ నేత 20 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి సాగు చేశా డు. ఆక్రమణలను తొలగించేందుకు ప్రయత్నించిన తహశీల్దార్ నారాయణమ్మపై ఏకంగా దాడికే ప్రయత్నించాడు. ఇదే మండలంలో 70 ఎకరాలకు పైగా చెరువు స్థలా లు ఆక్రమణకు గురైనట్లు తహశీల్దార్ నారాయణమ్మ అప్పట్లో ప్రకటించారు. తిరుపతి రూరల్ మండలంలోని ఓటేరు చెరువు 18 ఎకరాల విలువైన స్థలాన్ని అధికార పార్టీకి చెందిన ఓ నేత కబ్జా చేశాడు. దీంతోపాటు వినాయకసాగర్ చెరువు, మంగళం చెరువు, దామినీడు చెరువు రేణిగుంట పరిధిలోని వెంకటాపురం, కరకంబాడి చెరువు లు సైతం పెద్ద ఎత్తున కబ్జాకు గురయ్యాయి. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలోని చెరువుల్లో 90 శాతం చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. జిల్లాలో పంచాయతీరాజ్, చిన్ననీటి పారుదల శాఖల పరిధిలో 8,063 చెరువులున్నాయి. వీటిలో 100 ఎకరాలలోపు ఆయకట్టు ఉన్న చెరువులు 7,395, నూరు ఎకరాల ఆయకట్టుకు మించి ఉన్న చెరువులు 668 ఉన్నాయి. వీటి పరిధిలో 3.03 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఒక్కొక్క చెరువులో 15 నుంచి 20 ఎకరాల వరకు ఆక్రమణలకు గురైనట్లు అధికారులు గుర్తించారు. పట్టణ ప్రాంతాల్లోని చెరువుల్లో 60 శాతానికి పైగా కబ్జా అయినట్లు తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా చెరువుల పరిధిలో 20వేల ఎకరాలకు పైగా కబ్జాకు గురైనట్లు నీటిపారుదల, రెవెన్యూ అధికారులు చెబుతున్నా వాస్తవానికి ఈలెక్క మరింత ఎక్కువగా ఉంది. కొందరు రెవెన్యూ అధికారులు అధికార పార్టీ నేతలకు సహకరిస్తూ లక్షల్లో దండుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. చెరువుల ఆక్రమణలు తొలగించి, సరిహద్దులను ఏర్పాటు చేసి, ఆధునీకరణ పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా అది అమలు కాలేదు. జిల్లావ్యాప్తంగా 8,063 చెరువులుండగా కేవలం 300 చెరువులు మాత్రమే సర్వే చేసినట్లు అధికారులు చెప్పడం చూస్తే ఆక్రమణల తొలగింపులో వారి చిత్తశుద్ధి ఏపాటిదో ఇట్టే బోధపడుతుంది. చిత్తూరులో గంగినేని చెరువు, కట్టమంచి చెరువు, కాజూరు చెరువుతోపాటు దాదాపు 22 చెరువులు పెద్దఎత్తున కబ్జాకు గురయ్యాయి. గిరింపేట గంగినేని చెరువులో 4.5 ఎకరాలు, అన్పుపల్లె పెద్ద చెరువు 8 ఎకరాలు, కట్టమంచి చెరువు 2 ఎకరాలు. మురకంబట్టు అగ్రహారం చెరువు 4 ఎకరాలు, నరిగిపల్లె పెద్ద చెరువు 4.8 ఎకరాలు, తేనెబండలోని కొత్త చెరువు పరిధిలో 4 ఎకరా లు కబ్జా అయ్యింది. మొత్తంగా నగర పరిధిలోని 22 చెరువల పరిధిలో దాదాపు 70 ఎకరాలకు పైగా చెరువు స్థలాలు ఆక్రమణలకు గురైనట్లు రెవెన్యూ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. -
కబ్జా కోరల్లో నగర సరస్సులు
బెంగళూరు: ఉద్యాననగరిలోని సరస్సులను కబ్జా చేయడానికి తెరవెనక ప్రయత్నాలు మొదలయ్యాయి. ప్రభుత్వంలోని కొంత మంది బడా నాయకులే కబ్జాదారులతో చేతులు కలిపి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపిస్తున్నారని దీంతో మరి కొన్నేళ్లలో నగరంలో సరస్సులు ఉన్న ప్రాంతాల్లో భవనాలు వెలిసే ప్రమాదం ఉందని పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీబీఎంపీ పరిధిలో 183 సరస్సులు బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీ ఎంపీ) పరిధిలో 183 సరస్సులు ఉన్నట్లు ఆ విభాగం గుర్తించింది. ఈ సరస్సులు 7,209 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి. అయితే వీటిలో 80 శాతం సరస్సుల్లో పూడిక పేరుకుపోవడం, నాచు పెరిగింది. దీంతో ఆహ్లాదాన్ని పంచాల్సిన సరస్సులు అధ్వానం గా తయారయ్యాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి నగరంలో అవసాన దశలో ఉన్న 132 సరస్సులను అభివృద్ధికి గాను దాదాపు ఐదేళ్ల క్రితం ప్రభుత్వం బీబీఎంపీకి నిధులు విడుదల చేసింది. సరస్సులోని పూడిక, నాచును తొలగించడం దాని చుట్టూ ఉన్న భూభాగం ఆక్రమణకు గురికాకుండా చూడటం బీబీ ఎంపీ ప్రధానవిధి. చుట్టుపక్కల పర్యాటకులను ఆకర్షించేలా రాళ్లతో కృత్రిమ శిల్పాలు నెలకొల్పడం, చెట్లు పెంచడం, చిన్నచిన్న రెస్టారెంట్లు ఏర్పాటు చేయడం కూడా సరస్సుల అభివృద్ధి, ఆధునికీకరణలో భాగమే. మొదట్లో బాగానే సాగిన పనులు హ ఠాత్తుగా ఆగిపోయాయి. తమ వద్ద తగిన సిబ్బంది లేరని అందువల్ల సరస్సులను పర్యవేక్షించడానికి సాధ్యం కాదని బీబీఎంపీ చేతులెత్తేసింది. ఈమేరకు ప్రభుత్వానికి ఆరునెలల ముందు నివేదిక అందజేసింది. దీంతో వెంటనే ప్రభుత్వం సరస్సుల అభివృద్ధిని బెంగళూరు డెవెలప్మెంట్ అథారిటీ (బీడీఏ)కి అప్పగించింది. అయితే ఈ విషయం లక్ష్మణరావు కమిటీ సిఫార్సులకు వ్యతిరేకమని పలువురు పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నివేదిక ఏం చెబుతుంది... నగరంలో సరస్సుల అభివృద్ధిపై 1988లో ప్రముఖ సామాజిక పర్యావరణ వేత్త లక్ష్మణరావు నేతృత్వంలోని కమిటీ అప్పటి ప్రభుత్వానికి నివేదిక అందించింది. దీని ప్రకారం సరస్సుల అభివృద్ధిని ప్రభుత్వమే చేపట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకాని, ప్రభుత్వ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలకు గాని అందచేయకూడదనేది ఆనివేదికలోని ప్రధాన సారాంశం. బీడీఏ అనేది ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చే సంస్థ. దీని ప్రధాన విధి నగరంలోని ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని వాటిని అభివృద్ధి చేసి ప్రైవేట్ వ్యక్తులకు కానీ, సంస్ధలకు కానీ అప్పగించడం. అందువల్ల సరస్సుల అభివృద్ధిని బీడీఏకి అప్పగిస్తే అభివృద్ధి ముసుగులో సరస్సులు, వాటి చుట్టుపక్కల ఉన్న భూభాగంలో వాణిజ్య భవంతులను నిర్మించి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పై బీడీఏ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘ బీబీఎంపీ నుంచి ప్రభుత్వానికి లేఖ రాయించడం, తర్వాత ఆ పనులు బీడీఏకు దక్కడం వెనక రాష్ట్ర మంత్రి మండలిలో ప్రముఖ స్థానంలో ఉన్న ఓ మంత్రితో పాటు బెంగళూరు గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి హస్తం ఉంది. బీడీఏ పనులన్ని ఆయన కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. అభివృద్ధి పేరుతో సరస్సులకు చెందిన భూ భాగాన్ని ఆక్రమించడమే ఆయన ముందున్న లక్ష్యం’. అని పేర్కొన్నారు. -
రూ.9 కోట్ల భూకబ్జాకు యత్నం
అడ్డుకున్న రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు తిరుపతి రూరల్ : తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలో జాతీయ రహదారికి సమీపంలోని రూ.9 కోట్ల విలువైన ప్ర భుత్వ భూమిని అధికార పార్టీకి చెంది న ఓ చోటా నాయకుడు కబ్జా చేసేం దుకు యత్నించాడు. అధికారులు సదరు భూమిలో హెచ్చరిక బోర్డులు ఏర్పా టు చేశారు. అధికార అండతో ఆ కబ్జాదారుడు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం విమర్శలకు తావిచ్చింది. బినామి పేరు చెప్పి.. తుమ్మలగుంటలోని సర్వే నంబర్ 46/5, 7, 8లో మొత్తం 86 సెంట్ల ప్రభుత్వ స్థలం ఉంది. రెవెన్యూ రికార్డు ల్లో ఇది అనాధీనం భూమిగా రికార్డయింది. దానిపై అదే పంచాయతీకి చెందిన ఓచోట నాయకుడి కన్ను పడిం ది. అతడు గతంలో టీడీపీ, కాంగ్రెస్, టీడీపీ ఇలా మూడుముక్కలాట ఆడిన ట్టు తెలుస్తోంది. మొదట్లో మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అనుచరుడుగా ఉన్న అతడు ఇటీవల ఎమ్మెల్సీ పదవి రావడంతో గాలి ముద్దుకృష్ణమనాయుడు పంచన చేరినట్టు సమాచా రం. అధికార అండతో స్థానికంగా ఉన్న దళితులను బినామీలుగా చూపు తూ అతడు కబ్జాకు యత్నించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 46/5, 7, 8లో రెండు రోజుల క్రితం రాత్రికి రాత్రే ఇళ్లు నిర్మించేందుకు యత్నించా డు. దీనిపై మాజీ మంత్రి గల్లా అరుణకుమారి అనుచరులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యం లో రూరల్ తహశీల్దార్ యుగంధర్ తన సిబ్బందితో ఇళ్లు నిర్మించేందుకు తీసిన పునాదులను శనివారం పూడ్చివేశారు. పంచాయతీకి చెందిన టీడీపీ నాయకుడు దొడ్ల కరుణాకర్‌రెడ్డి తన అనుచరులతో వచ్చి రెవెన్యూ, పంచాయతీ అధికారులతో వాగ్వాదానికి దిగారు. రైతులు నిర్మించుకుంటున్న ఇళ్లను అడ్డుకుంటారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూమి లో ఆక్రమణలకు దిగితే క్రిమినల్ కే సులు పెడతామని అధికారులు హెచ్చరించడంతో వారు వెనక్కు తగ్గారు. ఆ పై రెవెన్యూ అధికారులు ఆ భూమిలో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. అది ప్రభుత్వ భూమే.. తుమ్మలగుంటలోని సర్వే నంబర్ 46/5, 7, 8లోని 86 సెంట్లు ప్రభుత్వ భూమే. అందులో ఎవరు ప్రవేశించినా క్రిమినల్ కేసులు పెడతాం. అందులో ఉన్న ఆక్రమణలు అన్నీ కూల్చివేస్తాం. - యుగంధర్, తహశీల్దార్, తిరుపతి రూరల్ -
అరచేతిలో ఆస్తులు
- కబ్జా కాకుండా జీహెచ్ఎంసీ చర్యలు - టాబ్లెట్ పీసీల్లో వివరాలు - అభివృద్ధి పథకాల సమాచారం నిక్షిప్తం సాక్షి, సిటీబ్యూరో: కోట్లాది రూపాయల ఆస్తులున్నా... వివరాలు లేవు. ఏయే ప్రాంతాల్లో.. ఏయే షాపింగ్ కాంప్లెక్స్‌లలో ఎవరు ఉంటున్నారో తెలియదు. ఎన్ని ఖాళీ స్థలాలు?... ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో... ఎంత మేరకు లీజులో ఉన్నాయో తెలియదు. ఏ పార్కు కబ్జాకు గురైందో సమా చారం లేదు ... ఇదీ ఘనత వహించిన జీహెచ్ఎంసీ పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే మాయమైన ఆస్తులను గుర్తించే సంగతి అటుంచి... కనీసం ఉన్న వాటినైనా కాపాడుకునేందుకు .. ప్రస్తుతం చేపడుతున్న వివిధ పనుల వివరాలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు. దీని కోసం 500 టాబ్లెట్ పీసీలను కొనుగోలు చేస్తున్నారు. ఆస్తుల వివరాలను ఫొటోలతో సహా వీటిలో నిక్షిప్తం చేయనున్నారు. తద్వారా ఏయే ఆస్తులున్నాయి? దేనికోసం వినియోగిస్తున్నారు? ప్రస్తుతం వాటి పరిస్థితి ఎలా ఉందన్న సమాచారం అధికారులకు అందుబాటులో ఉంటుంది. ఎప్పుడైనా కబ్జాకు గురైనా... ఇతర అవసరాలకు దారి మళ్లించినా తెలుసుకునే వీలుంటుంది. దీంతోపాటు జీహెచ్ఎంసీ చేపట్టనున్న వివిధ ప్రాజెక్టుల వివరాలు సైతం వీటిలో పొందుపరిచే యోచనలో ఉన్నారు. సామర్థ్యాన్ని పరిశీలించేందుకు... ఇటీవల జీహెచ్ఎంసీ వివిధ పనులకు శ్రీకారం చుడుతున్న సంగతి తెలిసిందే. వీటిలో మోడల్ మార్కెట్లు, మల్టీ పర్పస్ ఫంక్షన్ హాళ్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు (ఎఫ్‌ఓబీలు), బస్‌బేలు, శ్మశాన వాటికలు, చెరువుల సుందరీకరణ, కొత్త పార్కులు ఉన్నాయి. హరిత హారంలో భాగంగా యాభై లక్షల మొక్కలు నాటనున్నారు. ఈ వివరాలు అందుబాటులో ఉండేందుకు టాబ్లెట్ పీసీలు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. ప్రయోగాత్మకంగా వాటి పనితీరును పరిశీలించేందుకు.. జీహెచ్ఎంసీ అవసరాలకు వాటి సామర్ధ్యం సరిపోతుందో లేదో తెలుసుకునేందుకు తొలుత 30 టాబ్లెట్లను తీసుకున్నారు. పనితీరును బట్టి మిగతావి తీసుకుంటారు. స్థలాలపై సర్వే నగరంలోని వివిధ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీకి అత్యంత విలువైన ఆస్తులెన్నో ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యం, రికార్డులు గల్లంతు కావడం వంటి కారణాలతో జీహెచ్ఎంసీ వద్ద ప్రస్తుతం ఆ వివరాలు లేవు. గతంలో ఈ దిశగా కొంత కసరత్తు చేసిన అధికారులు నానా తంటాలు పడి 272 ఆస్తులు లీజులో ఉన్నట్లు గుర్తించారు. వాటిలోనూ 104 ఆస్తుల (1.20 లక్షల చదరపు గజాలు) సమాచారమే రికార్డుల్లో ఉంది. మిగతా వాటికి సంబంధించిన వివరాల్లేవు. వాస్తవంగా ఇప్పుడవి ఎవరి అజమాయిషీలో ఉన్నాయో... ఏ అవసరాలకు వినియోగిస్తున్నారో తెలియదు. అధికారుల అంచనాల మేరకుజీహెచ్ఎంసీ ఆస్తులు 1500 దాకా ఉంటాయి. కానీ.. అవి ఎక్కడున్నాయో.. ఎవరి అధీనంలో ఉన్నాయో తెలియడం లేదు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఖాళీ స్థలాలపై సర్వే చివరి దశలో ఉంది. వీటి చుట్టూ ప్రహరీలు నిర్మించనున్నారు. ఆ వివరాలు టాబ్లెట్ పీసీల్లో ఉంచాలని భావిస్తున్నారు. స్థల పరిమాణాన్ని బట్టి వాటిలో వివిధ సదుపాయాలు కల్పించనున్నారు. -
మేత భూమినీ మేసేశారు
పశువుల మేత పోరంబోకు భూములు, ప్రభుత్వ భూములు యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నాయి. ఇది ప్రభుత్వ భూమి అంటూ హెచ్చరిక బోర్డులు పెట్టినా...గుట్టుచప్పుడు కాకుండా దున్నేసి ఏకంగా పంటలు సాగుచేస్తున్నారు. వెలిగండ్ల మండలంలోనే దాదాపు 200 ఎకరాలు కబ్జాదారుల కోరల్లో చిక్కుకున్నాయి. - యథేచ్ఛగా ప్రభుత్వ భూముల ఆక్రమణ - 200 ఎకరాలు కబ్జా - హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినా ఆగని దందా వెలిగండ్ల : ప్రభుత్వ భూమి ఖాళీగా కనిపిస్తే చాలు.. దర్జాగా కబ్జా చేసేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా రాత్రిళ్లు పొక్లెయిన్లు పెట్టి భూములను బాగుచేసి, ట్రాక్టర్లతో దున్నుతున్నారు. పైర్లు సాగు చేస్తున్నారు. మండలంలోని బొంతగుంట్ల, ఇమ్మడిచెరువు, పద్మాపురం, రామలింగాపురం, వెలిగండ్ల, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో సుమారు 200 ఎకరాలకు పైగా ఆక్రమణలకు గురయ్యాయి. ఆక్రమణ దారులు దర్జాగా భూములు సాగు చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల గ్రామస్తుల ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు పశువుల మేత భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ రాత్రిళ్లు గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్నారు. ఒక ఊరి పొలాలను వేరొక ఊరు వాళ్లు ఆక్రమించుకొని సాగు చేస్తున్నారని ఇరు గ్రామాలకు చెందిన ఆక్రమణదారులు పరస్పరం ఫిర్యాదు చేసుకుంటున్నారు. బొంతగుంట్లపల్లిలో సర్వే నంబర్లు 65, 66,69, 77,70,59/16, 59/18, 59/2, 58, 20,19/2, 42 నంబర్లలో 704.42 ఎకరాలు రెవిన్యూ రికార్డుల ప్రకారం పశువుల మేత గ్రేజింగ్ పోరంబోకు భూమిగా ఉంది. ఆ భూముల్లో సుమారు 150 ఎకరాలు ఆక్రమణకు గురైంది. ఆక్రమించుకున్న భూముల్లోని 9 సర్వేనెంబర్లలో రెవిన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కానీ ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. ఇమ్మడిచెరువులో సర్వే నంబర్ 50లో 18 ఎకరాల పశువుల మేత పోరంబోకు భూమిని ఆ గ్రామానికి చెందిన మాజీ వీఆర్వో ఆక్రమించుకొని సాగు చేస్తున్నట్లు ఎంపీపీ ముక్కు జయరామిరెడ్డి గతంలో పనిచేసిన తహ శీల్దార్ కావేటి వెంకటేశ్వర్లకు ఫిర్యాదు చేయడంతో గ్రామంలో దండోరా వేయించి పనులు ఆపివేశారు. మళ్లీ మూడు రోజుల నుంచి పనులు చేస్తుండటంతో ఎంపీపీ తహ శీల్దార్ పుల్లారావుకు ఫిర్యాదు చేశారు. పనులు ఆపి, బోర్డులు ఏర్పాటు చేయాలని తహ శీల్దార్ వీఆర్వోను ఆదేశించారు. కానీ ఆ భూమిలో మాత్రం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. పద్మాపురంలో ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 13,14,15లో 40 ఎకరాలు ఆక్రమణలకు గురయ్యాయి. ఇలాగే రామలింగాపురం, వెలిగండ్ల, నాగిరెడ్డిపల్లి తదితర గ్రామాల్లో ప్రభుత్వ భూములు, పశువుల మేత పోరంబోకు భూములు కబ్జా అయ్యాయి. ఇకనైనా రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు స్పందించి మండలంలో ఆక్రమణలకు గురవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు. హెచ్చరిక బోర్డులు పెట్టాం బొంతగుంట్లలో ఆక్రమణలకు గురైన పశువుల మేత భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. ఇమ్మడిచెరువులో సర్వే నంబర్ 50లో హెచ్చరిక బోర్డులు పెట్టాలని వీఆర్వోను ఆదేశించాను. ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాను. -వి.పుల్లారావు, తహశీల్దార్ -
కబ్జా చెరలో చెరువులు
పట్టించుకోని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు లక్షలాది ఎకరాలకు పూర్తిస్థాయిలో అందని సాగునీరు ఉన్న చెరువులను సైతం రికార్డుల్లో చూపని వైనం చోడవరం: భూముల ధరలకు రెక్కలు రావడంతో కబ్జాదారుల దందా రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు ఆక్రమించేస్తున్నారు. చెరువులు.. గెడ్డలు.. వేటినీ వదలడం లేదు. సాగునీటి వనరులు కుదించుకుపోయి రై తులు అల్లాడుతున్నారు. వీటిని పరిరక్షిం చాల్సిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో సాగునీటి వెతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొన్ని చోట్ల బడా రైతులు చెరువులను ఆక్రమించి తమ సాగులోకి తెచ్చుకుంటుండగా, మరికొన్ని చోట్ల కబ్జాచేసిన ప్రభుత్వ భూములను ప్లాట్లుగా వేసి దర్జాగా అమ్మేసుకుంటున్నారు. మేజర్ చెరువులు ఆక్రమించుకొని తోటలు కేపీఅగ్రహారంలో 4 చెరువులున్నాయి. సుమారు 800 ఎకరాల ఆయక ట్టు ఉంది. చెరువులు ఆక్రమించుకొని సరుగుడు, చెరకు తోటలు వేసుకొని అనుభవిస్తున్నారు. నీలం చెరువు కింద నాకు 2ఎకరాలు భూమి ఉంది. పూర్తిస్థాయిలో నీరందడంలేదు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. -యన్నంశెట్టి గోపి, రైతు, కేపీఅగ్రహారం ఇరిగేషన్లో ఉన్న చెరువుల కంటే మైనర్ ఇరిగేషన్లో ఉన్న సాగునీటి చెరువులు ఎక్కువగా ఆక్రమణలకు గురయ్యాయి. ప్రధాన రోడ్లకు ఆనుకొని ఉన్న చెరువుల ఆక్రమణ మరీ ఎక్కువగా ఉంది. మైదాన జిల్లాలో సుమారు 1500 సాగునీటి చెరువులు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. చోడవరం నియోజకవర్గంలోనే సుమారు 246 చెరువులు ఉండగా వీటిలో 180 చెరువుల వరకు కబ్జాలో ఉన్నాయి. ఆక్రమణల వల్ల చెరువులు కుదించుకుపోయి సాగునీరు నిల్వ ఉండే విస్తీర్ణం తగ్గిపోయింది. దీంతో ఎక్కువ రోజులు పంటకు నీరందక రైతులు నష్టపోతున్నారు. కొన్ని చెరువుల్లో ఆక్రమణలకు ఏకంగా పట్టాదారు పాసుపుస్తకాలే ఇచ్చేశారంటే ఆయా శాఖల పర్యవేక్షణ ఏమేరకు ఉందో అర్థమౌతుంది. చోడవరం మండలంలో అడ్డూరు చెరువు ఆక్రమణకు అడ్డులేకుండాపోయింది. ఖండిపల్లిలో చెరువును కొందరు రైతులు ఆక్రమించుకోవడంతో అక్కడ చెరువు గర్భమే కనిపించడంలేదు. వెంకన్నపాలెం చెరువును ఎకరా వరకు రియల్టర్లు ఆక్రమించి ప్లాట్లు వేసి అమ్మేస్తుండగా లక్కవరం, బెన్నవోలు, గంధవరం, దుడ్డుపాలెం, గవరవరం, లక్ష్మీపురం, నర్సయ్యపేట, గాంధీగ్రామం చెరువులు కొందరి ఆధీనంలో ఉన్నాయి. బుచ్చెయ్యపేట మండలం వడ్డాది, ఎర్రవాయు ప్రాంతంలో ఉన్న చెరువులు, రావికమతం, రోలుగుంట మండలాల్లో పెద్దచెరువులు కబ్జాదారుల కబంధహస్తాల్లో ఉన్నాయి. మండలాల వారీగా ఎన్ని చెరువులు ఉన్నాయన్న వివరాలు ఇరిగేషన్ శాఖ వద్దే లేకపోవడం ఆ శాఖ అసలత్వాన్ని ఎత్తిచూపుతోంది. వీరి నిర్లక్ష్యం రియల్టర్లు, కబ్జాదారులకు వరంగా మరింది. చోడవరం మండలంలో మైచర్లపాలెంలో-3, జీజేపురంలో-2 చెరువులతోపాటు మరో 11 చెరువులు ఇరిగేషన్ జాబితాలో లేకపోవడం అందర్నీ అవాక్కుచేసింది. ఆక్రమణలో ఉన్న భూములను స్వాధీనం చేసుకోకుండా ఉపాధి పనుల్లో గట్లు వేయడం కబ్జాదారులకు మరింత లాభదాయకంగా మారింది. జిల్లాలో సుమారు 2లక్షల ఎకరాల సాగుభూమికి పూర్తిస్థాయిలో నీరందని పరిస్థితి నెలకొంది. నీలకంఠపురంలో 3 చెరువులున్నాయి. ఇవన్నీ ఆక్రమణకు గురయ్యాయి. వర్షాధారంపైనే ఆధారపడి సాగుచేస్తున్నాం. ఆక్రమణలు వల్ల చెరువు గర్భం కుదించుకుపోయింది. పెదకట్టు చెరువు కింద నాకు 2ఎకరాల భూమి ఉంది. నీరులేక ఇబ్బంది పడుతున్నారు. చెరువల ఆక్రమణపై అధికారులు చర్యలు తీసుకోవాలి. -జి.సత్యనారాయణ, రైతు, నీలకంఠపురం. -
సెల్ఫీ... సో ఈజీ!
సాక్షి, హైదరాబాద్: సెల్ఫీ.. సెల్ఫీ. .సెల్ఫీ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే మాట. ఈ 21వ శతాబ్దాన్ని తన మాయలో ముంచేసి, ప్రధానుల దగ్గర నుంచి సామాన్యుల వరకూ తమ ఆనందాలను పెంచుకునేలా చేస్తోంది ఈ సెల్ఫీ. అయితే కొన్ని పరిస్థితుల్లో సెల్ఫీ తీసుకునేటప్పుడు క్లిక్ బటన్‌పై వేలితో నొక్కడానికి అసౌకర్యంగా ఉంటుంది. ఇప్పుడు ఆ అసౌకర్యాన్ని తగ్గించేలా.. కేవలం సెల్ఫీ తీసుకునేందుకు అనుగుణంగా మొబైల్‌ను ఉంచి కేవలం ‘క్యాప్చర్’ లేదా ‘ఛీజ్’అని ఆర్డరేస్తే చాలు దానంతట అదే సెల్ఫీ తీసుకునే మొబైల్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ లావా ఐరిస్ ఎక్స్ 1 పేరుతో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో సెల్ఫీ ఇబ్బందులను తగ్గించేందుకు వాయిస్ ఫోటో కంట్రోల్ సిస్టంను ఏర్పాటు చేశారు. దీంతో సెల్ఫీలు మరింత సులువు కానున్నాయి. -
చెరువులను చెరబట్టారు
జిల్లాలోని చెరువులను అధికార పార్టీ నేతలు చెరబట్టారు. ప్రభుత్వ భూములు అయిపోయాయేమో.. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులను పోటీలుపడి ఆక్రమిస్తున్నారు. వాటిల్లో బోర్లువేసి, మోటార్లు బిగించి పంటలు సాగుచేస్తున్నారు. అధికారులు సైతం వారిని అడ్డుకునేందుకు సాహసించలేకపోతున్నారు. - శ్రుతిమించుతున్న అధికార పార్టీ నేతల ఆగడాలు - బోర్లు వేసి పంటలు సాగుచేస్తున్న వైనం - జిల్లా వ్యాప్తంగా చెరువుల్లో 5వేల ఎకరాల ఆక్రమణ సాక్షి,చిత్తూరు : జిల్లాలో ఆక్రమణల పరంపర కొనసాగుతోంది. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తున్నారు. చిన్నగొట్టిగల్లు మండలంలోనే 72 ఎకరాల చెరువు భూములు ఆక్రమణలకు గురయ్యాయని తహశీల్దార్ నారాయణమ్మ చెప్పడం చూస్తే ఆక్రమణలు ఏ స్థాయిలో జరిగాయో తెలుస్తోంది. ఒక్క చిన్నగొట్టిగల్లు చెరువులోనే అధికార పార్టీ నేతలు 15 ఎకరాల భూమిని ఆక్రమించి సాగుచేస్తున్నారు. ఆక్రమణలను తొలగించేందుకు పూనుకుంటే అధికారపార్టీ నేతలు దాడులకు దిగుతున్నారని, ఇటాంటి పరిస్థితిలో ఉద్యోగాలు చేయడమే కష్టంగా ఉందని తహశీల్దార్ నారాయణమ్మ శనివారం కలెక్టరేట్ వద్ద విలేకరులతో వాపోయారు. జిల్లా వ్యాప్తంగా అధికార పార్టీ నేతలది ఇదే తీరు. జిల్లాలో పంచాయతీరాజ్, చిన్ననీటి పారుదల శాఖల పరిధిలో 8,083 చెరువులున్నాయి. వీటిలో వంద ఎకరాలలోపు ఆయకట్టు ఉన్న చెరువులు 7,395 ఉండగా, వంద ఎకరాల పైబడి ఆయకట్టు ఉన్న చెరువులు 683 ఉన్నాయి. శ్రీకాళహస్తి, సత్యవేడు, చిత్తూరు, చంద్రగిరి, పూతలపట్టు, జీడీనెల్లూరుతోపాటు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో చెరువులు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురయ్యాయి. 66 మండలాల పరిధిలో 5 వేల ఎకరాలకు పైనే ఆక్రమణకు గురయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఆక్రమిత చెరువుల్లో పంటలు సాగు చేస్తుండగా తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు, మదనపల్లె తదితర నగర, పట్టణ ప్రాంతాల చెరువులను ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కోట్లు దండుకుంటున్నారు. కొందరు రెవెన్యూ అధికారులు సైతం అధికారపార్టీ నేతలకు సహకరిస్తూ లక్షల్లో దండుకంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని అన్ని చెరువుల ఆక్రమణలు తొలగించి ఆధునికీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించినా ఆచరణలో అమలుకు నోచుకోలేదు. ఏ ఒక్క చెరువులోనూ ఆక్రమణలు తొలగించేందుకు అధికారులు ముందుకు రాలేదు. మరోవైపు చెరువుల ఆధునికీకరణ ముందుకు సాగలేదు. వేసవి ప్రారంభం నుంచే పనులు మొదలు పెట్టి చేయా ల్సి ఉన్నా, వేసవి ముగింపు సమయంలో 3,715 చెరువులు, చిన్న కుంటల్లో మాత్రమే అధికారులు పనులు చేపట్టడంపై విమర్శలు ఉన్నాయి. ఇప్పటికీ 60 శాతానికి పైగా చెరువుల్లో పనులు మొదలు కాలేదు. ఆధునికీకరణ పనులు పూర్తికాకపోతే చెరువుల్లో వాననీరు పూర్తి స్థాయిలో నిలిచే పరిస్థితి ఉండదు. అదే జరిగితే రైతులకు వ్యవసాయ పనులకేకాక భూగర్భ జలాల పెరుగుదలకూ నష్టమే. జిల్లా వ్యాప్తంగా దాదాపు 90 శాతానికి పైగా చెరువుల కట్టలు, తూములు, పంటకాలువలు ఇప్పటికే దెబ్బతిన్నాయి. -
కబ్జాలతో ‘జలాశయాల’ ఉనికికే ప్రమాదం
- సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ - చెట్ల నరికివేతతో మానవ మనుగడ ప్రశ్నార్థకం - పెద్దషాపూర్లో మొక్కలను నాటిన సీపీ పెద్దషాపూర్ (శంషాబాద్ రూరల్): నగరవాసుల దాహార్తిని తీర్చే జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. కబ్జాలను అరికట్టకుంటే భవిష్యతులో ఈ చెరువులు ఆనవాళ్లు కోల్పోయే ప్రమాదం ఉంద ని ైసైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా మండలంలోని పెద్దషాపూర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం ఆవరణలో శంషాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం మొక్కలను నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. జీవన చక్రానికి ఆధారమైన చెట్లను ప్రజలు ఇష్టానుసారంగా నరికివేస్తుండడంతో జీవనాధారం కోల్పోయి.. మానవుడి మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. చెట్లను నరికివేస్తూ మన బతుకులను మనమే నాశనం చేసుకుంటున్నామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హరితహారం కార్యక్రమాన్ని అందరూ ఓ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరు మొక్క నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులు మొక్కల పెంపకంపై వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. శాంతి భద్రతల పర్యవేక్షణ, నేరాల నియంత్రణతో పాటు సైబరాబాద్ పోలీసులు సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నట్లు కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్‌తో పాటు మిషన్ కాకతీయ, హరితహారం కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. సైబరాబాద్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఆవరణలో మొక్కలను పెంచడానికి 10 రోజుల్లోనే 1.7 లక్షల గుంతలు తీసినట్లు పేర్కొన్నారు. వర్షాలను బట్టి వచ్చే మూడు నెలల్లో మొక్కలు నాటుతామని చెప్పారు. శంషాబాద్ ఠాణాకు కొత్త భవనం.. శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌కు గ్రామీణ ప్రాంతంలో అనువైన చోట రెండు ఎకరాలు స్థలం కేటాయిస్తే కొత్త భవనం నిర్మిస్తామని సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, స్థానిక సర్పంచ్ సత్యనారాయణ అభ్యర్థనకు స్పందించిన ఆయన పోలీస్‌స్టేషన్‌ను రూ.2 కోట్ల కేటాయించి సకల సౌకర్యాలు ఉండేలా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఐటీ కారిడార్‌తో పాటు వివిధప్రాంతాల్లో షీ టీంలతో మహిళలపై దాడుల నివారణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సైబరాబాద్‌లోని ప్రతి జోన్, డివిజన్ పరిధిల్లో ఓ మహిళా పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. మహిళా సిబ్బంది కొరత ఉందని, కొత్తగా చేపట్టే నియామకాల్లో మహిళలకు ఎక్కువ శాతం అవకాశాలు ఇస్తామని తెలిపారు. అంతకుముందు కళాజాత బృందం మొక్కల పెంపకంపై పాటల రూపంలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, సర్పంచ్ సత్యనారాయణ, డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ సుదర్శన్, ఇన్స్పెక్టర్లు ఉమామహేశ్వర్రావు, సుధాకర్, తహసీల్దార్ వెంకట్‌రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు కె.చంద్రారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు టి.రమేష్, నాయకులు రాజశేఖర్, విద్యార్థులు పాల్గొన్నారు. -
వర్సిటీ భూముల జోలికి వెళ్లొద్దు: సీపీఎం
హైదరాబాద్: పేదల ఇళ్ల నిర్మాణం పేరిట విశ్వవిద్యాలయాల భూముల జోలికి వెళ్లొద్దని సీపీఎం రాష్ట్ర కమిటీ మంగళవారం ఒక ప్రకటనలో రాష్ర్ట ప్రభుత్వానికి సూచించింది. కబ్జా భూములను స్వాధీనం చేసుకుని వాటిల్లో పేదల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేసింది. -
రూ.1.5 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత
రేణిగుంట (చిత్తూరు జిల్లా): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో ఎర్రచందనం దొంగలు చెలరేగిపోయారు. అడ్డమొచ్చిన అటవీ సిబ్బంది, పోలీసులపై రాళ్ల వర్షం కురిపించి పరారయ్యారు. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి తరువాత (సోమవారం ఉదయం)2 గంటల సమయంలో చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం కృష్ణాపురం అటవీ ప్రాంతంలో జరిగింది. వివరాలు.. తమిళనాడుకు చెందిన 220 మంది కూలీలు ఎర్రచందనం దుంగలను తరలించేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న అటవీ సిబ్బంది వారిపై దాడి చేశారు. పోలీసుల సహాయంతో అటవీ సిబ్బంది దాడి చేయడంతో కూలీలు వీరిపై రాళ్ల వర్షం కురిపించారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడంతో కూలీలు అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా అటవీ సిబ్బంది 180 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విమానాశ్రయంలో 1.2 కేజీల బంగారం పట్టివేత
శంషాబాద్: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఇద్దరు ప్రయాణికుల నుంచి 1.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులు కౌలాలంపూర్ నుంచి బయలుదేరి బుధవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో వారు అనుమానాస్పదంగా కస్టమ్స్ అధికారులకు కన్పించారు. దీంతో అధికారులు వారిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వారి లోదుస్తుల్లో నుంచి 1.2 కేజీల బరువున్న బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికులు శ్రీలంక దేశానికి చెందిన వారుగా గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎక్కడ చూసినా సర్కార్ భూములే!
ఈ భూమి విలువ రూ.350 కోట్లు ఇదిగో.. ఈ ఫొటోలో కనిపిస్తున్న భూమి విలువ రూ.350 కోట్లు. అమీన్‌పుర్‌లోని 993 సర్వే నంబర్లో ఉంది. మొత్తం 110 ఎకరాలు. కబ్జా కబంధ హస్తాల నుంచి బయటపడి, ఇటీవలే ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కింది. కబ్జాదారులను బలవంతంగా వెళ్లగొట్టారు. చైనా వాల్ మాదిరిగా చుట్టూ పటిష్టమైన గోడ కట్టారు. సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెతుకు సీమలో ఎక్కడ చూసినా.. ప్రభుత్వ భూములే కనిపిస్తున్నాయి. ఇటీవల సీఎం కేసీఆర్ సమీక్షలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా యంత్రాంగం స్పందించి, ప్రభుత్వ భూముల గుర్తింపు వేట ఆరంభించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1 లక్షా 59 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించింది. ఈ భూముల విలువ సుమారు రూ.75 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ ప్రత్యేక చొరవతో అనతి కాలంలోనే ఇంత భారీస్థాయిలో ప్రభుత్వ భూమిని గుర్తించడమేగాక స్వాధీనం కూడా చేసుకున్నారు. అనంతరం వీటి వివరాలను ప్రభుత్వ రికార్డుల్లో పొందుపరిచి ప్రభుత్వానికి నివేదిక అందించారు. కంది గ్రామ సర్వే నంబర్ 400 సీరీస్‌లో 12 నంబర్లతో 200 ఎకరాలు.. నర్సాపూర్ పట్టణం 76 సర్వే నెంబర్లో 48 ఎకరాలు.. కాజిపల్లి పారిశ్రామికవాడ సర్వే నంబర్ 181లో 25 ఎకరాలు.. ముత్తంగి గ్రామంలో 25 ఎకరాలు.. రామచంద్రాపురంలో 60 ఎకరాలు ఇలా ఒక్కొక్క ఎకరాను లెక్కగట్టి చూస్తే మెదక్ జిల్లా వ్యాప్తంగా 1 లక్షా 59 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్టు జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ నిర్ధారించారు. దీని విలువ రూ.70 నుంచి రూ.75 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. గ్రేటర్ హైదరాబాద్‌కు సమీపంలోని పటాన్చెరు, గజ్వేల్, నర్సాపూర్, సంగారెడ్డి నియోజకవర్గాల్లోనే 60 శాతం ప్రభుత్వ భూములు ఉన్నాయి. ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకున్న 1 లక్షా 59 వేల ఎకరాల భూమిలో 1,620 ఎకరాలు అత్యంత విలువైనదిగా, 3,500 ఎకరాలు జనావాసాలకు సమీపంలో ఉండి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పనికి వచ్చే విలువైన భూమిగానూ 16,551 ఎకరాలు పారిశ్రామిక వాడలకు, 35 వేల ఎకరాలు హెచ్ఎండీఏ అవసరాలకు, మిగిలిన భూమి వ్యవసాయానికి ఉపయోగపడేదిగానూ గుర్తించారు. ఈ భూములకు రెవెన్యూ రికార్డులు సరిగా లేకపోవడం, ఐఏఎస్ అధికారులకు రెవెన్యూ రికార్డులు, వాటి అమలు తీరుపై సమగ్రమైన పట్టు లేకపోవడం, పైగా రెవెన్యూ శాఖలోనే కింది స్థాయి అధికారులు కబ్జాదారులకు అండగా నిలబడటంతో ప్రభుత్వ భూమిపై ప్రైవేటు వ్యక్తులు పట్టుబిగిస్తూ వచ్చారు. ఓ యజ్ఞమే జరిగింది... ప్రభుత్వ భూముల గుర్తింపు వెనుక జాయింట్ కలెక్టర్ శరత్ ఓ యజ్ఞమే చేశారు. ఏడు రికార్డుల విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ముందుగా ప్రతి రైతుకు రెవెన్యూ సహకారాన్ని అందించారు. రికార్డులన్నీ భూ యజమానులకు అందేలా చేశారు. తరువాత ఒక్కో నియోజక వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఎంచుకున్న నియోజకవర్గంలోని ప్రభుత్వ భూముల సర్వే నంబర్లు, కబ్జాలో ఉన్నవారి వివరాలు, కబ్జాకు అనుకూలించిన పరిణామాలు తదితర వివరాలను ముందుగా సేకరించారు. రెండో దశలో ‘మీరు ఆక్రమణలో ఉన్నది ప్రభుత్వ భూమి కాదు అని నిరూపించడానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏమిటో చూపించాలి’ అని ఆయా వ్యక్తులకు నోటీసులు పంపిచారు. ఈ తంతుతో భూ బకాసురుల బండారం బయటకు వచ్చింది. ఆధారాలు చూపిన వారిని వదిలేసి మిగిలిన వారిమీద పడ్డారు. మూడో దశలో పోలీసుల సహకారం తీసుకొని నిర్ధారించిన ప్రభుత్వ భూముల చుట్టూ కంచె వేయించారు. -
20 కిలోల గంజాయి పట్టివేత
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా రోలుగుంట మండలంలో 20 కిలోల గంజాయిని పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. పట్టణానికి చెందిన బత్తిని అప్పలనాయుడు 20 కిలోల గంజాయిని ఆటోలో తరలిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు రోలుగుంట మండల శివారులో అతడిని పట్టుకున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. (రోలుగుంట ) -
దర్జాగా కబ్జా
అనంతపురం టౌన్: అనంతపురం నగర పరిధిలో సెంటు స్థలం విలువ రూ.10 లక్షలకు పైగా ఉంది. అదే అభివృద్ధి చెందిన ప్రాంతంలో అయితే రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంది. నగర పాలక సంస్థకు చెందిన అత్యంత విలువైన ఇలాంటి స్థలాలపై అధికార పార్టీకి చెందిన నేతలు కన్నేస్తున్నారు. ఇలాంటి సంఘటన నీరుగంటి వీధిలో చోటు చేసుకుంది. ఏకంగా రూ.60 లక్షలు విలువ చేసే స్థలాన్ని కబ్జా చేశారు. ఈ ప్రాంతంలో సంస్థకు సంబంధించి 2081 సర్వే నెంబరులో ఎనిమిది సెంట్ల స్థలం ఉంది. ఇక్కడ సెంటు విలువ రూ.15 లక్షల వరకు ఉంది. దీంతో ఈ స్థలంపై అధికార పార్టీకి చెందిన ఒక చోటా ప్రజాప్రతినిధి కన్ను పడింది. ఆ స్థలంలో 4.50 సెంట్లకు సంబంధించి 2008లో పట్టా పొందినట్లుగా నకిలీ పట్టా సృష్టించి గదులు నిర్మించారు. అది కార్పొరేషన్ స్థలమని తెలుసుకున్న స్థానికులు వాయిల శ్రీనివాసులు అలియాస్ బండలశీనా, కె.సురేష్‌రెడ్డి అనే వ్యక్తులు కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఫిర్యాదు చేశారు. ఆ స్థలానికి పట్టా ఉందంటూ ఇక్కడి అధికారులు తిప్పిపంపారు. దీంతో వారు తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి సదరు స్థలానికి పట్టా ఇచ్చారా లేదా తెలపాలని సమాచార హక్కు చట్టం కింద కోరారు. దీనిపై విచారణ చేసిన తహసిల్దార్ అక్కడి స్థలానికి పట్టా ఇవ్వలేదంటూ ఎండార్స్మెంట్ ఇచ్చారు. తహసిల్దార్ ఇచ్చిన ఎండార్స్మెంట్ని కార్పొరేషన్ అధికారులకు అందజేశారు. దీంతో సర్వే చేసిన అధికారులు అది సంస్థ స్థలంగా నిర్ధారించారు. దీన్ని బట్టి చూస్తే రూ.60 లక్షలకు పైగా విలువ చేసే స్థలాన్ని కైవసం చేసుకున్నారనేది స్పష్టమవుతోంది. ఈ కథంతా అధికార పార్టీకి చెందిన ఒక చోటా ప్రజాప్రతినిధి నడిపినట్లు తెలుస్తోంది. అది సంస్థ స్థలమే : రమణ, టౌన్‌ప్లానింగ్ సూపర్వైజర్ నీరుగంటి వీధిలో గదులు నిర్మించిన స్థలం సర్వే చేశాము. అది సంస్థ స్థలంగానే గుర్తించాము. ఒక లే అవుట్‌కి సంబంధించి ఓపెన్ స్థలం అది. అక్కడ ఎంత స్థలం ఉందనేది సర్వేయర్ ద్వారా సర్వే చేయించి హద్దులు వేయించాలని బిల్డింగ్ ఇన్స్పెక్టర్కు సూచించాము. విషయూన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వారి అనుమతితో నోటీసులు జారీ చేసి కూల్చివేస్తాము. -
యథేచ్ఛగా కబ్జా!
సాక్షి ప్రతినిధి, కర్నూలు : జిల్లాలోని వక్ఫ్ ఆస్తులను ఆక్రమణదారులు దర్జాగా కబ్జా చేసేస్తున్నారు. వక్ఫ్ బోర్డుకు చెందిన విలువైన స్థలాలను ముక్కలు ముక్కలు చేసి కేకుల్లా పంచుకుతింటున్నారు. వీటిని కాపాడుకోవాల్సిన వక్ఫ్ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. వక్ఫ్‌బోర్డుకు చెందిన స్థలమని తెలిసినప్పటికీ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఇతరుల పేరు మీద బదిలీ చేస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఈ ఆస్తులను కాపాడేందుకు కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఎలాంటి చర్యలు తీసుకోలేక నామమాత్రంగా ఉంది. ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క వక్ఫ్ స్థలాన్ని కూడా కాపాడిన దాఖలాలు లేవు. మొత్తం మీద వక్ఫ్ బోర్డుకు చెందిన ఒక్కో స్థలం క్రమంగా కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. విలువైన ఆస్తులపై కబ్జాదారుల కన్ను కర్నూలు జిల్లాలో ప్రధానంగా నగరం చుట్టూ పక్కల మండలాల్లో వక్ఫ్ బోర్డుకు చాలా విలువైన స్థలాలు ఉన్నాయి. ఈ స్థలాలపై మొదటి నుంచీ కబ్జాదారుల కన్ను ఉంది. ఈ నేపథ్యంలో 1983లోనే ఏయే ప్రాంతాల్లో ఏయే సర్వే నెంబర్లల్లో వక్ఫ్‌స్థలాలు ఉన్నాయనే విషయాన్ని పేర్కొంటూ గెజిట్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ గెజిట్ ప్రకారం కల్లూరులోని సర్వే నెంబరు 356లోని 21 ఎకరాల 79 సెంట్ల స్థలం వక్ఫ్‌బోర్డుకు చెందినది. అయితే, ఇప్పుడు తాజాగా ఈ సర్వే నెంబరును 356, 356/1, 356/2,356/3లుగా విడదీసి.. ముక్కలు ముక్కలు చేసి వేర్వేరు వ్యక్తులు అమ్ముకున్నారు. వారి పేరు మీద పాసుపుస్తకాలు కూడా సిద్ధమయ్యాయి. ఇది వక్ఫ్ ఆస్తి అని తెలిసినప్పటికీ రిజిస్ట్రేషన్‌శాఖ సిబ్బంది కాస్తా మాముళ్లకు అలవాటు పడి వేర్వేరు వ్యక్తుల పేరు మీద రిజిస్ట్రేషన్లు చేశారు. ఈ ఆస్తులను కాపాడుకోవాల్సిన వక్ఫ్ అధికారులు లంచాల మత్తులో జోగుతూ కబ్జాదారులతో చేతులు కలుపుతున్నారు. గెజిట్‌లో స్పష్టంగా కల్లూరులోని సర్వే నెంబరు 356లోని స్థలం వక్ఫ్‌బోర్డుదని ఉన్నా... ఇతరుల పరమైపోయింది. అయితే, ఈ పాసుపుస్తకాలను రద్దు చేసి, తిరిగి వక్ఫ్‌బోర్డు పేరు మీద స్థలాన్ని మార్చే అధికారం ఉన్నా... జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందన్న విమర్శలున్నాయి. కల్లూరు మండలంలోనే మరో సర్వే నెంబరు 124 కూడా వక్ఫ్ ఆస్తి అని.. ఈ సర్వే నెంబరును ఎవరి పేరుమీద రిజిస్ట్రేషన్లు చేయవద్దని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు వక్ఫ్ బోర్డు స్పష్టంగా లేఖ కూడా రాసింది. అయినప్పటికీ జిల్లా రిజిస్ట్రార్ సెలవులో ఉన్న సమయాన్ని చూసి.. 2014 ఆగస్టు నెలలో ముక్కలు ముక్కలు చేసి ఏకంగా 31 మందికి ప్లాట్లుగా రిజిస్ట్రేషన్ చేశారు. మొత్తం మీద జిల్లాలో వక్ఫ్ ఆస్తులను ఎవరూ పట్టించుకోవడం లేదని.. దీనిని అత్యంత ప్రాధాన్యత లేని అంశంగా చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి వక్ఫ్ ఆస్తులను కాపాడేందుకు సర్వాధికారాలు ఉన్న జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఏమాత్రమూ వీటి గురించి పట్టించుకుంటున్న పాపాన పోలేదు. నామ్‌కే వాస్త్‌గా కమిటీ..! వాస్తవానికి వక్ఫ్ ఆస్తులను కాపాడేందుకు ప్రభుత్వం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వక్ఫ్ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యతను తీసుకోవాలని స్పష్టం చేసింది. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో మరో 10 మంది సభ్యులు ఉంటారు. ఎస్పీతో పాటు జాయింట్ కలెక్టర్, ఆర్డీవో, జిల్లా వక్ఫ్ అధికారి, రెవెన్యూ, మునిసిపల్, ఆర్ అండ్ బీ, అటవీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, పంచాయతీ శాఖల నుంచి నామినేట్ చేసే అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీకి జిల్లా వక్ఫ్ అధికారి కన్వీనరుగా వ్యవహరిస్తారు. అయితే, ఈ కమిటీ కేవలం పేరుకు మాత్రమే ఉంది. వక్ఫ్ ఆస్తులను ఆక్రమించిన కబ్జాదారులపై క్రిమినల్ కేసులను నమోదు చేసే అధికారం ఈ కమిటీకి ఉంది. అంతేకాకుండా ఆస్తులను ఆక్రమించిన వారి పాసుబుక్కులను రద్దు చేసి.. వక్ఫ్‌బోర్డు పేరు మీద ఆస్తిని బదిలీ చేయాలి. జిల్లాలో ఒక్కటంటే ఒక్క ఆక్రమిత ఆస్తిని కూడా తిరిగి వక్ఫ్‌బోర్డు పేరు మీద ఇప్పటివరకు బదిలీ కాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. రికార్డులూ లేవు.. వాస్తవానికి వక్ఫ్‌బోర్డుకు చెందిన ఆస్తుల వివరాలన్నీ సమగ్రంగా ఒక రికార్డు రూపంలో తయారుచేసుకోవాలి. ఈ రికార్డులను వక్ఫ్ అధికారులు జాగ్రత్తంగా నిర్వహించాలి. ఈ రికార్డులను జిల్లా రెవెన్యూ అధికారికి ఇచ్చి భద్రపరచడంతో పాటు.. ఈ వివరాలను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు కూడా ఇవ్వాలి. తద్వారా ఈ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయవద్దని స్పష్టంగా లిఖితపూర్వకంగా లేఖ రాయాలి. అయితే... జిల్లాలో ఈ ప్రక్రియ ఏ మాత్రమూ సాగటం లేదన్న విమర్శలు ఉన్నాయి. అంతేకాదు వక్ఫ్ ఆస్తులపై ఎప్పటికప్పుడు కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ సమావేశం కావాల్సి ఉన్నా.. ఏ మాత్రమూ పట్టించుకున్న దాఖలాలు లేవు. -
పోరంబోకుల దందా.!
ఏదైనా తప్పు చేస్తే దున్నపోతులా ఉన్నావ్ బుద్ధిలేదా అంటారు ... కానరాని పని చేస్తే పశువులా ఎందుకిలా ప్రవర్తించావ్ అంటారు... చిల్లర పనులు చేస్తే ఎద్దులా ఉన్నావ్ ఆ మాత్రం తెలియదా అని అదిలిస్తారు... మీరు చేసే అవకతవకలకు కూడా నోరులేని మూగజీవులమని చూడకుండా చెడామడా మమ్మల్నే మీ మధ్యకు లాగుతారు మరి.. మీరు చేసిందేమిటి... పశువుల మేత పోరంబోకును కూడా మేసేస్తారా... మీరు మేశారు సరే ... రక్షించాల్సిన అధికార గణానికేమయింది... చదువులేని వాడు వింత పశువంటారే... మరి మీరంతా చదువుకున్న వారే కదా... మీ భాషలోనే చెబుతున్నా... దున్నపోతుపై వర్షం కురిసిన చందంగా ఎందుకు ముందుకురకడం లేదు ప్రేక్షకపాత్ర వహించే మీ ప్రవర్తననేమనాలి...? తమ భూములను ఆక్రమించుకుంటే ఎవరైనా ఇలాగే ఆగ్రహిస్తారు. కళ్లముందే కరిగిపోతున్న భూమి... అందులో మేత కనుమరుగైతే మూగజీవైనా దానికి మనసుంటుంది కదా ... దానికీ కోపతాపాలుంటాయి కదా ... 1200 ఎకరాల్లో ప్రకృతి ప్రసాదించిన పచ్చ గడ్డిని మేస్తూ వస్తున్న ఆ పశువులు క్రమేపీ ఆ అదృష్టానికి దూరమయ్యాయి. అక్కడే మేత మేస్తూ ఆ ప్రదేశంలోనే సేదదీరుతూ... కుంటల్లో ఈదుతూ... పరుగులు తీసే ప్రదేశం నేడు అదృశ్యమయింది. ఇంత జరుగుతున్నా సంబంధితాధికారులు మొద్దునిద్ర వీడడం లేదు. ఒకటి కాదు రెండు కాదు నాలుగు పోరంబోకు స్థలాలను చేజిక్కించుకొని చదును చేసేస్తున్నారు... ఆ పశువుల కడుపు కొడుతున్నారు...ఆ కథేమిటో మీరే చదివేయండి... తర్లుపాడు : కాదేదీ ఆక్రమణలకు అనర్హమంటున్నారు ఈ ఆక్రమణదారులు...ఏ భూమైనా ఫర్వాలేదు ఆక్రమించేద్దాం ... అమ్మేద్దామనే సూత్రాన్ని పాటిస్తూ దాదాగిరీకి దిగుతున్నా పట్టించుకునేవారంతా ప్రేక్షకపాత్ర వహించడంతో మరింత రెచ్చిపోతున్నారు. 1200 ఎకరాలున్న పోరంబోకు భూముల్లో ఇప్పుడు కేవలం 12 సెంట్లే మిగిలిదంటే కబ్జా ఎంత దర్జాగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు అంతే లేకుండాపోతుందనడానికి ఇదే ఉదాహరణ. పశువులమేత పొరంబోకు, కొండపోరంబోకు, వాగు పోరంబోకు, రస్తా పోరంబోకు తదితర భూములకు పట్టాలివ్వాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంది. ఇవేవీ చేయకుండానే అధికారులను ప్రసన్నం చేసుకొని ఆక్రమణకు తెరదీస్తుండడంతో పరిసర గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని గానుగపెంట రెవెన్యూ గ్రామంలో సుమారు 1200 ఎకరాలు పశువుల మేత, పొరంబోకు భూమి ఉంది. నేడు పశువులు మేసేందుకు 12 సెంట్ల భూమి లేదని పశుపోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ సిబ్బంది చేతివాటం ప్రదర్శించి అయిన వారికి అనుమతులిస్తూ సాగుకు సన్నద్ధం చేస్తున్నారు. సర్వే నెంబర్ 10లో 168.40 ఎకరాల పశువుల మేత పోరంబోకు భూమి ఉంది. గతంలో ఈ సర్వే నెంబర్లో 60 ఎకరాల పట్టాలను కూడా మంజూరు చేశారు. మిగిలిన 108.40 ఎకరాల భూమిని పలువురు అధికారుల అండదండలతో సాగు చేసుకుంటున్నారు. కొందరు మరికొంత ముందుకెళ్లి ఆ భూమి తమదిగా విక్రయించేసుకున్నారు కూడా. సర్వే నెంబర్ 10లో ఇటీవల మార్కాపురం మండలం రాయవరం గ్రామానికి చెందిన కొందరు తమ పూర్వీకులు కొనుగోలు చేశారని, పదెకరాల భూమిని ఇటీవల చదును చేసి పంట పొలంగా మార్చే ప్రయత్నాలు చేపట్టారు. దీంతో గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు సమాచారమందించారు. తహశీల్దార్ కేవీఆర్వీ ప్రసాద్ ఆదేశాల మేరకు ఆర్.ఐ. శ్రీనివాస్, వీఆర్వో నాగేశ్వరరావు ఆక్రమిత భూములను పరిశీలించి తహశీల్దార్‌కు నివేదిక అందజేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పశువుల మేత, పొరంబోకు భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకొని పశువుల మేతకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌ను సంప్రదించనున్నట్లు తెలిపారు. పశువులు మేసేందుకు సెంటు భూమి లేదు పోటు గురవయ్య గ్రామంలో సుమారు 20 వేల వరకు జీవధనం ఉంది. గ్రామానికి సంబంధించి సుమారు 1200 ఎకరాలు పశువుల మేత, పొరంబోకు భూములున్నాయి. నేడు పశువులు మేసేందుకు సెంటు భూమి కూడా లేకపోవటంతో పశుపోషకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పశువుల బీడును ఆక్రమిస్తే చర్యలు తప్పవు- కేవీఆర్వీ ప్రసాదరావు, తహశీల్దార్ పశువుల మేత, పొరంబోకు భూములను, ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ భూముల జోలికి ఎవరూ వెళ్లవద్దు. ప్రభుత్వ భూముల్లో బోర్డులను ఏర్పాటు చేసి గ్రామస్తులకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటాం. -
450 లీటర్ల డీజిల్ పట్టివేత
గుంతకల్లు టౌన్ : ఆయిల్ ట్యాంకర్ నుంచి డీజిల్‌ను కొట్టేసి బ్లాక్ మార్కెట్లో విక్రయించేందుకు పోర్టర్స్‌లైన్‌లోని ఓ గోడౌన్లో అక్రమంగా నిల్వ ఉంచిన 450 లీటర్ల డీజిల్‌ను గుంతకల్లు రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి డీజిల్ దందాతో సంబంధం కలిగిన వ్యక్తిని కేసు నుంచి తప్పించి స్వామిభక్తిని చాటుకున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి. సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం మధ్యాహ్నం తహశీల్దార్ యల్లమ్మతో పాటు ఇతర రెవెన్యూ అధికారులంతా పోర్టర్స్‌లైన్ దర్గా ఏరియాకి వెళ్లారు. ఆ సమయంలో కొందరు వ్యక్తులు ఓ ట్యాంకర్ నుంచి డీజిల్‌ను కొట్టేసి క్యాన్లలో నింపుకుంటున్నారు. తహశీల్దార్ కారును ఆపి ఘటనా స్థలానికి వెళ్లారు. డీజిల్ ట్యాంకులను గోడౌన్లో పడేసి పరారైయ్యారు. డీజిల్ నిల్వ ఉంచిన గోడౌన్ షట్టర్‌కి తహశీల్దార్ తాళం వేయించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తరువాత ఆర్ఐ కేశవరెడ్డి, వీఆర్వోలు గురుప్రసాద్, కృష్ణ ఆ డీజిల్‌ను లెక్కించారు. అక్రమంగా డీజిల్‌ను నిల్వ చేసిన ఈశ్వర్ అనే యువకుడిపై సెక్షన్ 6ఎ సివిల్ సప్లయ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఆర్ఐ వెల్లడించారు. ఆయిల్ ట్యాంకర్ మాయం: పట్టణంలోని పోర్టర్స్‌లైన్ దర్గా సమీపంలో ఓ ఆయిల్ ట్యాంకర్ నుంచి డీజిల్‌ను కొట్టేస్తున్న సమయంలో రెవెన్యూ అధికారులను చూసి ఆ ట్యాంకర్ మాయం కావడం అనేక అనుమానాలకి తావిస్తోంది. అధికారులు డీజిల్‌ను పట్టుకున్న వెంటనే చమురు దందాను చేసే టీడీపీకి చెందిన అసలు సూత్రధారి హుటాహుటిన ఆ పార్టీ ప్రజాప్రతినిధులతో రెవెన్యూ అధికారులకి ఫోన్ చేయించడంతోనే ఈ ట్యాంకర్‌ను వదిలేసినట్లు స్థానికు లు ఆరోపిస్తున్నారు. పైగా డీజిల్ దందా చేసే వ్యక్తికి తని ఖీలకు వచ్చిన ఓ రెవెన్యూ ఉద్యోగికి మాంచి మిత్రుడు కావడంతో ట్యాంకర్‌తో పాటు అసలు సూత్రధారిని కేసుల్లో నుంచి తప్పించారన్న విమర్శలు వినిపిస్తున్నా రుు. ఈ విషయమై ఆర్ఐ కేశవరెడ్డిను వివరణ కోరగా తాము కారు దిగుతుండగానే ట్యాంకర్ వేగంగా వెళ్లిపోయిందని, తామేమి తప్పించలేదని సమాధానమిచ్చారు. అధికారులతో మాట్లాడాం.. కవరేజీ చేయకండి : అధికారుల కు పెద్దొళ్లతో ఫోన్ చేసి చెప్పించాం.. మీడి యా వారిని మేనే జ్ చేసుకోవాలని నేతలు కార్యకర్తలకు సలహా ఇచ్చారు. దీంతో దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోండి.. మీకేమైనా కావాలంటే ఇస్తామంటూ కొందరు టీడీపీ మద్దతుదారులు అక్కడున్న విలేకరులను బ్రతిమలాడారు. అయితే విలేకర్లు పట్టించుకోకపోవడంతో కేవలం 50 లీటర్లు దొరికిందనైనా రాయండన్నా అంటూ ఈ డీజిల్ దందాతో సంబంధమున్న ఓ వ్యక్తి బుజ్జగింపులకు దిగాడు. ఏది ఏమైనప్పటికీ అధికారులు మాత్రం టీడీపీ ఒత్తిళ్లకు తలొగ్గే ‘మామూలే’నంటూ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. -
రూ.4 కోట్ల స్థలం కబ్జా!
సాక్షి ప్రతినిధి,కడప: ప్రభుత్వ భూమి పక్కాగా అన్యాక్రాంతమైంది. పరిరక్షించాల్సిన యంత్రాంగం మత్తులో ఉంది. ప్రభుత్వ భూమికే ప్రజాధనం పరిహారంగా అప్పగించాలని రాష్ట్ర ఘనుల శాఖ సిద్ధమౌతోంది. ఓ రాజకీయ నాయకుడు, ఉన్నతాధికారి పరస్పర అవగాహనతో ఈ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా సాగించారు. అక్రమంగా పరిహారం పొందేందుకు సిద్ధం చేశారు. గ్రామస్థుల గతి ఏం కావాలి.. అని ప్రశ్నించిన నేరానికి వేధింపులు, ఛీత్కారాలు ఎదురవుతున్న వైనమిది. వివరాలిలా ఉన్నాయి. ఓబులవారిపల్లె మండలం మంగంపేట పంచాయతీ కాపుపల్లె పరిధిలో సర్వే నంబర్ 8లో 72.77 ఎకరాలు ప్రభుత్వ భూమిగా రికార్డులు ధ్రువీకరిస్తున్నాయి. అందులో సుమారు 20 ఎకరాలు ఓ మాజీ ప్రజాప్రతినిధి బినామీ పేర్లతో సొంతం చేసుకున్నట్లు సమాచారం. మరో 5ఎకరాలను ఏపీఎండీసీ ఆక్రమించి వేస్ట్ డంప్ వేస్తోంది. ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతోంది, పరిర క్షించండి అంటూ 2013లో గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికీ హైకోర్టులో రిట్ పిటిషన్ పెండింగ్‌లోనే ఉంది. అయితే అనూహ్యంగా ఏపీఎండీసీ ఉన్నతాధికారి ఒకరు మాజీ ప్రజాప్రతినిధితో రహస్య ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమేరకు ప్రభుత్వ భూమికి అక్రమంగా ప్రజాధనం అప్పగించేందుకు వేగంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. భూసేకరణ ముసుగులో.... ఏపీఎండీసీ వేస్ట్ డంపు కోసం భూమి అవసరం ఉందని, 150 ఎకరాలు కేటాయించాలని దరఖాస్తులు చేసుకుంది. ఏపీఎండీసీ ఆశిస్తున్న 150 ఎకరాల భూమికి మధ్యలో సర్వేనంబర్ 8లోని 72.77 ప్రభుత్వ భూమి సైతం ఉంది. దానిలోని 20 ఎకరాలను ఇప్పటికే బినామీ పేర్లుతో రాజకీయ నేత దక్కించుకున్నారు. ఓ వైపు తహశీల్దార్ మొత్తం 72.77 ఎకరాలు ప్రభుత్వ భూమి అని ప్రకటించారు. అయితే ఆ భూమిని స్వాధీనం చేసుకోవడంలో రెవిన్యూ యంత్రాంగం విఫలం అవుతోంది. కాగా రెవిన్యూ యంత్రాంగానికి భూమి కావాలని అభ్యర్థించే వరకూ ఏపీఎండీసీ నిర్ణయాన్ని తప్పుబట్టాల్సిన పనిలేదు. అయితే పలానా చోట 150 ఎకరాలు అవసరం.. భూసేకరణలో భాగంగా అప్పగించండి అని కోరడం వెనుక మతలబును పలువురు ఎత్తిచూపుతున్నారు. ప్రభుత్వ పరిహారం ఎకరాకు రూ.20 లక్షలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఆ రకంగా 20 ఎకరాలు బినామీల పేరుతో దక్కించుకున్న నేతకు రూ.4కోట్లు కీలక అధికారి నజరానా ముట్టజెప్పనున్నట్లు తెలుస్తోంది. గ్రామస్థుల వేదన ఆరణ్య రోదన.... అన్యాక్రాంతమైన భూమిని పరిరక్షించాలని, కాట్రేవుడి గుడి, శ్మశానం, పశువుల మేత బీడు భూముల్ని కాపాడాలని 2013లో హైకోర్టులో గ్రామస్థులు రిట్ పిటిషన్ విపి నెంబర్-13660 దాఖలు చేశారు. అప్పటి నుంచి గ్రామస్థులు, రాజకీయ నేత మధ్య వివాదం తలెత్తింది. ఈపరంపరలో గ్రామంలో దాడులు సైతం చోటుచేసుకున్నారుు. పరస్పర కేసుల వరకూ దారితీశాయి. కాగా ఏపీఎండీసీ కేవలం గ్రామం వరకూ 150 ఎకరాలు మాత్రమే తీసుకుంటే, గ్రామస్థులు అక్కడ నివాసం ఉండే పరిస్థితి లేదు. మొత్తం గ్రామం ఖాళీ చేస్తాం, పరిహారం చెల్లించండి, లేదంటే గ్రామానికి దూరంగా భూసేకరణ చేపట్టండండి అని మొరపెట్టుకుంటున్నా విన్పించుకునే స్థితిలో యంత్రాంగం లేదని సమాచారం. అందుకు పక్కా వ్యూహం ప్రకారం ప్రభుత్వ భూమికి పరిహారం పొందాలనే అసలు లక్ష్యం ఉండడమే ముఖ్య ఉద్దేశమని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా గ్రామస్థుల అభ్యర్థనను పరిగణలోకి తీసుకోని ప్రభుత్వ భూమిని, ప్రజాధనాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పలువురు కోరుతున్నారు. -
‘గార్లకుంట’ గజ గజ
రెండెకరాల్లో రియల్టర్ల పాగా ప్లాట్లు చేస్తూ విక్రయూలు స్థలం విలువ రూ. 3 కోట్లపైనే నిద్ర నటిస్తున్న అధికార యంత్రాంగం నేరుగా కుంటను ఆక్రమించేందుకు నామోషీ కాబోలు! మొదట దాని పక్క స్థలాన్ని కొంటారు. తీరిగ్గా కుంటను కలుపుకుంటారు. తర్వాత ప్లాట్లు చేసి విక్రరుుస్తూ అమాయకులను బుక్ చేస్తారు. ఆమ్యామ్యాలతో అధికారులను కట్టడి చేస్తారు. ఎక్కడికక్కడ ఇలా పక్కాగా రియల్టర్లు కబ్జా పర్వాన్ని కొనసాగిస్తున్నారు. వీరి డబ్బు యూవకు గార్లకుంట ‘చిన్న’బోతోంది. జనగామ : పట్టణ శివారు ఏసిరెడ్డి నగర్ సమీపంలో గార్లకుంట ఉంది. 177 సర్వే నంబర్లోని ఈ కుంట విస్తీర్ణం 11.22 ఎకరాలని రెవెన్యూ రికార్డులు స్పష్టంచేస్తున్నారుు. ప్రస్తుతం ఇంత స్థలంలో కుంట లేదు. రెండు నుంచి మూడెకరాల స్థలం ఆక్రమణకు గురైనట్లు తెలుస్తోంది. ఈ ఆక్రమిత శిఖం భూముల విలువ సుమారు రూ. 3 కోట్లపైమాటే. ఆక్రమణలు, ఆపై ప్లాట్ల విక్రయూలతో నిబంధనలకు తూట్లు పొడుస్తున్నా.. రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు అడ్డుకునే సాహసం చేయట్లేదు. కారణం.. కాసులు ముట్టడమేనని ఆరోపణలు విన్పిస్తున్నారుు. హద్దులు చెరిగిన గార్లకుంట రియల్టర్ల ధనదాహం ధాటికి గార్లకుంట హద్దులు చెరిగిపోయాయి. ఇటీవల రెవెన్యూ అధికారులు హద్దుల కోసం ఓ వైపు కాల్వ తవ్వించగా కబ్జాదారులు కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఎఫ్టీఎల్(ఫీట్ ట్యాంకు లెవల్) నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. ఎఫ్టీఎల్ ప్రకారం.. కుంట సరిహద్దుకు 100 మీటర్ల దూరంలోని పట్టా భూముల్లోనైనా నిర్మాణాలకు అనుమతి ఉండదు. ఈ భూమిలోని రైతులు సాగు చేసుకోవడానికి మాత్రమే అనుమతి ఉంటుంది. కుంటలోకి నీరొచ్చే సమయంలో 100 మీటర్ల పరిధిలో ముంపునకు గురయ్యే అవకాశం ఉండడంతో ఈ నిబంధన పెట్టారు. రియల్టర్లు దీన్నేమాత్రం ఖాతరు చేయట్లేదు. ఇప్పట్లో కుంటలు నిండే పరిస్థితి లేకపోవడాన్ని అదునుగా తీసుకుని కబ్జాకు పూనుకుంటున్నారు. కుంటల సమీపంలోని పట్టా భూములు కొని ప్లాట్లు చేస్తున్నారు. క్రమంగా కుంట స్థలాన్నీ ఆక్రమిస్తున్నారు. రెవెన్యూ అధికారుల అండదండలతో అంతా ‘సవ్యంగా’ సాగుతోంది. కానీ ప్లాట్లు కొన్న వాళ్లు చుక్కలు చూస్తున్నారు. నిర్మాణాలు.. తదితర అనుమతుల కోసం మళ్లీ భారీ మొత్తంలో ఖర్చు చేయూల్సి వస్తోంది. కబ్జా స్థలాన్ని కాపాడలేరా? కుంట సమీపంలో ప్లాట్లకు గజానికి రూ. 4 వేల ధర చెబుతున్నారు. ఎకరాకు 4800 గజాలు తేలుతాయి. రెండెకరాలకు లెక్కేసినా ఎటు లేదన్నా కబ్జా స్థలం విలువ రూ. 3 కోట్లుపైనే ఉంటుందని రియల్ ఎస్టేట్ వర్గాలే చెబుతున్నారుు. ఇంత విలువైన స్థలాన్ని కాపాడేందుకు అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ‘కుంట భూమి కొంత ఆక్రమణకు గురైనట్లు గుర్తించాం. దీన్ని ఆక్రమించిన వారి కోసం ఆరా తీస్తున్నాం. ఎఫ్టీఎల్ నిబంధనలు బేఖాతరు చేస్తూ చుట్టుపక్కల వారు ప్లాట్లు చేసినట్లు మా దృష్టికి వచ్చింది. ఉన్నతాధికారులకు నివేదిస్తాం’ అని రెవెన్యూ అధికారులు వివరణ ఇచ్చారు. -
బరితెగిస్తున్న టీడీపీ నేతలు
రెవెన్యూ అధికారులపై దాడులు తిరుపతి రూరల్ : తిరుపతి రూరల్ మండలంలో టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. ప్రభుత్వ భూములను ఇష్టారాజ్యంగా కబ్జా చేస్తున్నారు. అడ్డుకునేందుకు వెళ్లిన రెవెన్యూ అధికారులపై దాడులకు పాల్పడుతున్నారు. మూడు రోజుల క్రితం పేరూరు పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చెంచుమోహన్‌యాదవ్ తన అనుచరులతో కలసి ఆక్రమణలను అడ్డుకోవడానికి వచ్చిన ఆర్ఐ శంకరయ్య, వీఆర్వోలు భాస్కర్, నాగరాజు, వెంకటరమణ, ఈశ్వరయ్య, నూతన్కుమార్రెడ్డిపై దౌర్జన్యానికి దిగారు. బూతులు తిడుతూ ఆర్ఐపై భౌతిక దాడులకు యత్నించారు. ప్రభుత్వ విధుల్లో ఉన్న అధికారులను అడ్డుకోవడానికి ప్రయత్నించడమే కాకుండా భౌతిక దాడులకు యత్నించిన టీడీపీ నాయకుడు చెంచుమోహన్‌యాదవ్, అతని అనుచరులపై కేసు నమోదుకు అనుమతి ఇవ్వాలని ఆర్ఐ శంకరయ్య తహశీల్దార్ యుగంధర్‌ను కోరారు. దీనిపై మూడు రోజులుగా తహశీల్దార్ స్పందించలేదు. ఈ వ్యవహారంలో తహశీల్దార్‌పై కాసుల ప్రభావంతో పాటు మాజీ మంత్రి ఒత్తిడి ఉందని రెవెన్యూ వర్గాలు ఆరోపించాయి. ఆర్ఐ శంకరయ్యను ఫ్యాక్టరీకి పిలిపించి ‘ఏం నీకు పోస్టింగ్ ఇచ్చింది కేసులు పెట్టడానికా!’ అంటూ బెదిరించినట్లు తెలుస్తోంది. ఉద్యోగులకు అండగా నిలవాల్సిన రెవెన్యూ ఉద్యోగుల సంఘం నాయకులు ఒకరు ఆర్ఐని తీసుకుని వెళ్లి మరీ తిట్టించినట్లు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తుండంతో ఎట్టకేలకు టీడీపీ నేతలపై పోలీసులకు తహశీల్దార్ ఫిర్యాదు చేశారు. -
నకిలీ పట్టాతో మోసం !
కోర్టుకు టోకరా వేసేందుకు యత్నం న్యాయమూర్తి అప్రమత్తతో బండారం బట్టబయలు విచారణకు ఆదేశించిన న్యాయమూర్తి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం హైదరాబాద్ : వందల కోట్ల రూపాయల విలువ చేసే భూమిని ‘మొబైల్ వెల్ఫేర్ సొసైటీ’ పేరుతో కబ్జా చేసిన ఓ ప్రబుద్ధుడు హైకోర్టుకే టోకరా వేసే ప్రయత్నం చేశాడు. అత్యంత ఖరీదైన గచ్చిబౌలి ప్రాంతంలో ప్రభుత్వం తమకు 99 ఎకరాల భూమిని ఉచితంగా ఇచ్చిందని చెప్పడంతో, అనుమానించిన హైకోర్టు ఒరిజినల్ పట్టాను తమ ముందుంచాలని ఆ వ్యక్తిని ఆదేశించింది. దీంతో తన బండారం బట్టబయలు అవుతుందని గ్రహించిన ప్రబుద్ధుడు, అతని తరఫు న్యాయవాది తదుపరి విచారణకు హాజరు కాలేదు. దీంతో అప్రమత్తమైన హైకోర్టు, రికార్డులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి పిటిషన్‌తో పాటు ఆ ప్రబుద్ధుడు జత చేసిన పట్టా కాపీ నకిలీదని తేల్చింది. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సైబరాబాద్ కమిషనర్‌ను ఆదేశించింది. నకిలీ డాక్యుమెంట్లు పెట్టి కోర్టును తప్పుదోవ పట్టించినందుకు మొబైల్ వెల్ఫేర్ సొసైటీ జీపీఏ హోల్డర్, ఇతర ఆఫీస్ బేరర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. కబ్జాలో ఉన్న భూముల్లోని ఆక్రమణదారులను వెంటనే ఖాళీ చేయించి, ఆ భూమిని నిజమైన హక్కుదారులకు స్వాధీనం చేయాలని కమిషనర్‌కు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు నాలుగు రోజుల క్రితం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ, పోలీసు అధికారులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కోర్టు ఉత్తర్వులను అడ్డం పెట్టుకుని ఇటువంటి సొసైటీలు పబ్బం గడుపుకుంటున్నాయని న్యాయమూర్తి ఈ సందర్భంగా తన ఉత్తర్వుల్లో వ్యాఖ్యానించారు. ‘ఇటువంటి సొసైటీలన్నీ కూడా వారివారి అనైతిక కార్యకలాపాలకు న్యాయస్థానాలను వేదికలుగా చేసుకుంటున్నాయి. కోర్టు ఉత్తర్వులను రక్షణ కవచంలా చేసుకుని పోలీసులు, రెవెన్యూ అధికారులను కోర్టు ధిక్కారం పేరుతో బెదిరిస్తూ బాధితులకు సాయం చేయకుండా అడ్డుకుంటున్నాయి. ఈ కేసులో పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టించి, కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేశారు. ఇటువంటి చర్యలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉంది. శాంతి,భద్రతల పరిరక్షణ పోలీసుల విధి. శాంతి, భద్రతలు లేని సమాజంలో అరాచకం చోటు చేసుకుంటుంది. దీని వల్ల అశాంతి నెలకొంటుంది. ఈ కేసు విచారణ బాధ్యతలను పోలీసులకు అప్పగిస్తున్నాం.’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మోసం ఇలా.. రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, గచ్చిబౌలి గ్రామంలోని 32 నుంచి 40 వరకు గల సర్వే నంబర్లలోని 99 ఎకరాల భూమిని ప్రభుత్వం తమ సొసైటీకి ఉచితంగా ఇచ్చిందని, ఆ భూమి నుంచి తమను ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ మొబైల్ వెల్ఫేర్ సొసైటీకి చెందిన ఎస్.రాంబాబు 2012లో హైకోర్టును ఆశ్రయించారు. దీనిని అప్పట్లో విచారించిన హైకోర్టు, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి వాయిదాలు పడుతూ వస్తున్న ఈ కేసు ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు ముందుకు విచారణకు వచ్చింది. వృద్ధాశ్రమాల నిర్మాణం, నిరుపేదలకు ఇళ్ల నిర్మాణం, వీధి బాలల పునరావాస కేంద్రాల నిర్మాణం కోసం తమకు ప్రభుత్వం ఈ భూమిని కేటాయించిందని పిటిషనర్ కోర్టుకు నివేదించారు. అందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ పేరుతో జారీ చేసిన పట్టా కాపీని కోర్టు ముందుంచారు. దీనిని పరిశీలించిన న్యాయమూర్తి, ఒరిజినల్ పట్టాను కోర్టు ముందుంచాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 25కి వాయిదా వేశారు. ఈ నెల 25న ఈ కేసు విచారణకు రాగా, అటు పిటిషనర్ గానీ, ఇటు పిటిషనర్ తరఫు న్యాయవాది గానీ వాదనలు వినిపించేందుకు రాలేదు. దీంతో పిటిషనర్ తీరుపై అనుమానంతో రికార్డులను మొత్తం పరిశీలించారు. పిటిషనర్ తన పిటిషన్‌తో పాటు కోర్టు ముందుంచిన పట్టా కాపీ నకిలీదని తేల్చారు. రాంబాబు.. దొరికాడిలా పిటిషనర్ రాంబాబు కోర్టు ముందుంచిన పట్టా కాపీలో దానిని తమకు కలెక్టర్ జారీ చేసినట్లు పేర్కొన్నారు. దానిపై కలెక్టర్ సంతకం ఉంది. ఇక్కడే రాంబాబు అడ్డంగా దొరికిపోయారు. రెవెన్యూశాఖ (సాంఘిక సంక్షేమం) పేరుతో కలెక్టర్ ఆ ఉత్తర్వులిచ్చినట్లు న్యాయమూర్తి గమనించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రధాన కార్యదర్శి మాత్రమే ఉత్తర్వులు ఇస్తారని, కలెక్టర్ స్థాయిలో ఇవ్వరు కనుక అది నకిలీదని న్యాయమూర్తి తేల్చారు. వివాదాస్పద భూముల్లో ఎటువంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టరాదని, కేవలం చిన్నపాటి నివాసాలు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని కూడా ఉండటాన్ని న్యాయమూర్తి గుర్తించారు. దీంతో న్యాయమూర్తి, ఓ వ్యక్తికి ప్రభుత్వం ఏకంగా 99 ఎకరాల భూమిని కేటాయిస్తుందా..? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పేదల కోసం ప్రభుత్వం భూమిని కేటాయించిందని చెబుతున్న పిటిషనర్ సొసైటీకి, ఆ భూములను ఇతరులకు అమ్మే హక్కు ఎక్కడదని ప్రశ్నించారు. ఓ పక్కా ప్రణాళిక, వ్యూహంతో పిటిషనర్ సొసైటీ కథ మొత్తం నడిపిందన్న న్యాయమూర్తి, ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి, 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలని సైబరాబాద్ కమిషనర్‌ను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. -
దర్జాగా కబ్జా
పరుల చేతుల్లోకి ప్రభుత్వ భూమి సాక్షి ప్రతినిధి, మహ బూబ్‌నగర్ : జిల్లాలో లక్షలాది ఎకరాల ప్రభుత్వ, వక్ఫ్ భూములున్నట్లు రెవెన్యూ రికార్డులు వెల్లడిస్తున్నాయి. వాటిలో చాలావరకు అక్రమార్కుల కబ్జాలకు గురయ్యాయి. అయినా, అధికారులు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ మొదలుకుని రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఆవిర్భావం వరకు ప్రభుత్వ, ఇతర మిగులు భూమిని వివిధ వర్గాలకు అసైన్ చేస్తూ వచ్చారు. లబ్ధిదారుల జాబితాలో ఎస్సీ, ఎస్టీలతో పాటు ఇతరులు కూడా ఉన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 1956 నుంచి 2014 వరకు 1,67,290 మంది లబ్ధిదారులకు 2,83,267.24 ఎకరాలు ప్రభుత్వం అసైన్ చేసింది. అయితే దశాబ్ధాల కాలంలో వివిధ వర్గాల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం కేటాయించిన భూమి కొన్నిచోట్ల చేతులు మారింది. అసైన్డ్ భూమి విక్రయించినా, కొనుగోలు చేసినా నేరమనే నిబంధన ఎక్కడా అమలు కావడం లేదు. నిబంధనలు బేఖాతరు చేస్తూ కొందరు అసైన్డ్ భూముల్లో పాగా వేయగా, మరికొందరు ప్రభుత్వ భూముల్లో కబ్జాలకు పాల్పడ్డారు. దేవాదాయ, వక్ఫ్ భూముల విషయంలోనూ ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. అయితే అసైన్డ్, ప్రభుత్వ భూములు ఎంత మేర అన్యాక్రాంతమయ్యాయనే వివరాలు మాత్రం రెవెన్యూ యంత్రాంగం వద్ద లేకపోవడం గమనార్హం. పట్టణ ప్రాంతాల్లో భూమి విలువ గణనీయంగా పెరగడంతో రియల్ఎస్టేట్ వ్యాపారులు, కబ్జారాయుళ్ల కన్ను అసైన్డ్, ప్రభుత్వ, వక్ఫ్, దేవాదాయ శాఖ భూములపైనా పడింది. ప్రభుత్వ భూమిని పరిరక్షించేందుకు కొన్నిచోట్ల అధికార యంత్రాంగం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. పలుచోట్ల చెరువు శిఖం భూములు కూడా కబ్జాకు గురయ్యాయనే సమాచారం ఇటీవల నీటిపారుదల శాఖ నిర్వహించిన చెరువుల, కుంటల సర్వేలోనూ బయటపడింది. వక్ఫ్‌భూముల్లో కబ్జాల పర్వం జిల్లాలోని వేలాది ఎకరాల వక్ఫ్ భూమి కబ్జాకు గురై కోర్టు కేసుల్లో నలుగుతోంది. మహబూబ్‌నగర్ పట్టణ నడిబొడ్డున 600 ఎకరాలకు పైగా వక్ఫ్‌భూమిని కొందరు బోగస్ రికార్డు లు సృష్టించి సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గతంలో భూమిని దానం చేసిన వారికి వారసులుగా పేర్కొంటూ, రెవెన్యూ అధికారుల అండతో కొందరు వక్ఫ్ భూములకు ఎసరు పెట్టారు. వక్ఫ్‌భూములను కాపాడే లక్ష్యంతో అధికారులు 1200 ఎకరాల కు సంబంధించి నోటీసులు జారీ చేశారు. ఇలా నోటీసులు అందుకున్న వారందరూ కోర్టును ఆశ్రయించడంతో విలువై న భూమి ఎవరికి చెందుతుందో తెలియన పరిస్థితి నెల కొంది. అప్పన్నపల్లి, బోయపల్లి, నాగర్‌కర్నూలు తదితర చో ట్లా వక్ఫ్‌భూమి పెద్ద ఎత్తున అన్యాక్రాంతమైంది. ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం, అసైన్డ్ భూమి పరుల హస్తాల్లోకి వెళ్లడంపై అసెంబ్లీలో బుధవారం చర్చ జరిగి హౌస్‌కమిటీ ఏర్పాటుకు దారితీసింది. జిల్లాలోని అసైన్డ్, మిగులు, ప్ర భుత్వ, దేవాదాయ, వక్ఫ్ భూముల అన్యాక్రాంతంపైనా దృష్టిసారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగు చూసే అవకాశముంది. ఆరు విడతల్లో ప్రభుత్వ భూ పంపిణీ (ఎకరాల్లో) కేటగిరీ లబ్ధిదారులు పంపిణీ ఎస్సీలు 5,800 7,755.37 ఎస్టీలు 2,197 3,374.07 బీసీలు 8,579 12,701.30 మైనార్టీలు 131 249.32.00 ఇతరులు 1154 1,970.14 మొత్తం 17,861 26,052.00 -
దర్జాగా.. కబ్జా
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు.. అది గుడిదయినా.. బూడిదయినాసరే.. కబ్జా పెట్టేద్దాం.. లేదంటే రికార్డులు సృష్టించి తక్కువకు కొనేద్దాం... అనే రీతిలో జిల్లాలో కూడా ఏళ్ల తరబడి కబ్జాల కథ సాగుతూనే ఉంది. రెవెన్యూ భూములతో పాటు అసైన్డ్, వక్ఫ్, భూదాన్, దేవాదాయ.. ఇలా అన్ని రకాల ప్రభుత్వ భూములను అక్రమార్కులు కబ్జా చేసి అనుభవిస్తూనే ఉన్నారు. రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం, కొంతమంది సిబ్బంది లాభాపేక్ష, ‘రియల్’ వ్యాపారుల ధనార్జన కారణంగా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కావడంతో కోట్ల రూపాయల ప్రజాధనం పరులపాలవుతోంది. ఈ కబ్జాల పర్వాన్ని నిగ్గు తేల్చేందుకు శాసనసభా సంఘాన్ని ఏర్పాటు చేస్తామని బుధవారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించడంతో అక్రమార్కులకు గుబులు పట్టుకుంది. సీఎం ప్రకటన నేపథ్యంలో జిల్లాలో ప్రభుత్వ భూములెక్కడ ఉన్నాయి.. వాటిలో ఆక్రమణల కు గురైన భూముల వివరాలను సేకరించేం దుకు జిల్లా యంత్రాంగం హడావుడి చేస్తోంది. అసైన్డ్ రికార్డుల్లేవంట.. ముఖ్యంగా పేదలకు ప్రభుత్వం అసైన్ చేసిన భూముల కొనుగోలు అంశం జిల్లాలో పెద్ద ఎత్తున సాగుతోంది. ప్రభుత్వం ఇచ్చిన భూమిని నిర్ణీత కాలపరిమితి వరకు అమ్మే అవకాశం లేకపోయినా, పేదల నుంచి అక్రమార్కులు కొనుగోలు చేసి అనుభవిస్తున్నారు. ఇదే విషయమై వారు గ్రీవెన్స్‌లో పలుమార్లు ఫిర్యాదు చేసినా, వాటికి ఇంకా పరిష్కారం లభించలేదు. 2004 నుంచి ఏడు విడతలుగా జరిగిన భూపంపిణీ కార్యక్రమంలో దాదాపు 27, 534 ఎకరాలను ప్రభుత్వం పేదలకు అసైన్ చేసింది. అందులో ఎంతభూమిని నిజంగా లబ్ధిదారులు అనుభవిస్తున్నారన్నది ప్రశ్నార్థకమే. ఇక, అంతకు ముందు ప్రభుత్వాలు అసైన్‌చేసిన భూముల వివరాలు రికార్డు కాలేదని అధికారు లు చెబుతుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న సభాసంఘం ఈ అసైన్డ్ భూముల గుట్టు తేల్చనుంది. వక్ఫ్... అంతులేని వ్యథ ఇక, వక్ఫ్ భూముల వ్యవహారం జిల్లాలో ఎప్పుడూ చర్చనీయాంశమే. జిల్లాలో దాదాపు 5,530 ఎకరాల వక్ఫ్ భూములన్నాయని రికార్డులు చెబుతున్నాయి. అయితే వాటిని సంరక్షించాల్సిన వారే కాసుల కోసం అన్యాక్రాంతం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వక్ఫ్ భూముల్లో 75 శాతం ఆక్రమణలకు గురయ్యాయని అధికారులే చెబుతున్నా.. ఈ భూములను ఓ పద్ధతి ప్రకారం సర్దేందుకు గాను కనీసం సర్వే చేసే సిబ్బంది కూడా లేకపోవడం గమనార్హం. ఇక, దేవరకొండలో అయితే వక్ఫ్ భూమిలోనే ప్రభుత్వ కార్యాలయాలు నడుస్తుండడం, జిల్లాలో కొన్ని చోట్ల గోదాములు, సినిమా హాళ్లు, షాపింగ్కాంప్లెక్సులు, పెట్రోల్‌బంకులు కట్టడం చూస్తే ఈ వక్ఫ్ భూముల కబ్జా వ్యవహారం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. అయితే, ఇందుకు సంబంధించిన వివాదాలన్నీ కోర్టుల్లో లేదంటే ఆర్డీఓ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉండడం గమనార్హం. బోర్డు రికార్డులో ఓ తీరు.. ప్రభుత్వ రికార్డుల్లో మరో తీరు ఇక భూదాన్ భూముల విషయానికి వస్తే అసలు ఆ భూములకు సంబంధించిన రికార్డులకే జిల్లాలో పొంతన కుదిరే పరిస్థితి లేదు. ఈ భూములకు సంబంధించి భూదాన్ బోర్డు దగ్గర ఉన్న రికార్డులకు, ప్రభుత్వం దగ్గర ఉన్న రెవెన్యూ రికార్డులకూ పొంతన కుదరడం లేదని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో మొత్తం 35,449 ఎకరాల భూదాన్ భూములుండగా, అందులో 9,069 ఎకరాలు పంపిణీ చేసినట్టు బోర్డు లెక్కలు చెబుతోంది. అయినా, మిగిలిన భూములు ఎక్కడున్నాయన్నది ప్రశ్నార్థకమే. ఇందులో సగానికి పైగా అన్యాక్రాంతమైనట్లు సమాచారం. అదే విధంగా జిల్లాలో దాదాపు 14వేలకు పైగా ఉన్న దేవాదాయ భూముల్లోనూ కబ్జాల పర్వం సాగుతూనే ఉంది. ఈ భూముల్లో దాదాపు 3వేల ఎకరాలు పరుల పాలైనట్లు అంచనా. అంతా సురక్షితమేనా! ఇక, జిల్లాలో మొత్తం 5,17,189 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని రికార్డులు చెబుతుండగా, ఆ భూమి అంతా సురక్షితంగా ఉందా లేదా అన్న దానిపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. కలెక్టర్ చిరంజీవులు ఆదేశాల మేరకు.. ప్రభుత్వ భూముల్లో కబ్జా ఉన్నవారెవరు? ఎన్ని ఎకరాలు కబ్జాలో ఉంది అనే వివరాలను సేకరించే పనిలో ఆర్డీఓలు, తహసీల్దార్లు ఉన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు మరో మూడు, నాలుగు రోజుల్లో అందే అవకాశం ఉందని, ఈ వివరాలు వచ్చాక ప్రభుత్వానికి నివేదిక పంపుతామని రెవెన్యూ వర్గాలంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే సభాసంఘం ఈ భూములపై ప్రత్యేక దృష్టి సారిస్తే అక్రమార్కుల లీలలు వెలుగులోకి వస్తాయని ప్రజాసంఘాలంటున్నాయి. -
పెన్నాపై కబ్జా పంజా
నెల్లూరు(బృందావనం): నగరవాసుల దాహార్తిని తీరుస్తూ, డెల్టా రైతులకు సాగునీటిని అందిస్తూ వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్న పెన్నానది పైనా కబ్జాకోరుల కళ్లుపడ్డాయి. అక్రమార్కులు ఎవరికి తోచిన విధంగా వారు ఆక్రమణలకు పాల్పడుతూ పెన్నమ్మ ఒడిలో కాసుల పంట పండించుకుంటున్నారు. దీంతో నగరం పరిధిలో పెన్నమ్మ రూపురేఖలు మారిపోతున్నాయి. ఏటి పొరంబోకులో పెద్ద ఎత్తున ఆక్రమణలు జరుగుతున్నప్పటికీ సాగునీటి పారుదల శాఖ గాని మున్సిపల్ కార్పొరేషన్ గాని పట్టించుకోవడంలేదు. అంతేకాకుండా ఆక్రమణలకు పరోక్షంగా అండదండలు అందిస్తున్నారనే అపవాదును కూడా అధికారులు మూటగట్టుకుంటున్నారు. నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలోనే జరుగుతున్న ఆక్రమణలు అధికారులకు తెలియవనుకుంటే పొరబాటే. ఆక్రమణల ఫలితంగా పెన్నాకు వరదలు వచ్చిన సమయంలో పలు ప్రాంతాలు జలమయమైన సందర్భాలు ఉన్నాయి. ఈ ఆక్రమణల పర్వం ఏటికేటికి విస్తరిస్తూనే ఉంది. దీంతో ఎప్పుడు వరదలు వచ్చినా నగరవాసులకు ముప్పు తప్పదనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పెన్నమ్మ ఆక్రమణలపై దృష్టిసారించకపోతే ప్రమాద ఘంటికలు మోగిన ట్టేనని అంటున్నారు. ఏటి పోరంబోకులో సవకతోటలు, కంపచెట్ల పెంపకం, ఇసుక అక్రమ తరలింపు, రియల్ఎస్టేట్ వ్యాపారం, తాగునీటి ప్లాంట్ల ఏర్పాటు ఇలా ఎవరికి తోచిన విధంగా వారు పెన్నానదిని దోచుకుంటున్నారు. దీంతో పెన్నా నదీపరివాహక ప్రాంతం రూపురేఖలు కోల్పోతోంది. పాత నగరపాలక సంస్థ కార్యాలయానికి ఉత్తర,పడమటి వైపున ఉన్న పెన్నానది తీరం వెంట ఉన్న నీటిపారుదలశాఖ ‘ఏటి పోరంబోకు’ను రియల్టర్లు దర్జాగా ఆక్రమించేస్తున్నారు. నదీపరివాహకప్రాంతంలో నగరపాలక సంస్థ యంత్రాంగం వ్యర్థపదార్ధాలతో నింపేస్తూ రియల్టర్లుకు మరింత సహకారం అందిస్తోంది. వ్యర్థపదార్థాలను యంత్రాలతో చదునుచేసి పెన్నమ్మ ఆనవాలు లేకుండా చేసేస్తున్నారు. రియల్ ఎస్టేట్ తరహా ప్లాట్లుగా మలిచారు. లోపాయకారిగా నగరపాలకసంస్థయంత్రాంగం రియల్టర్లుకు సహకరిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాత నగరపాలక సంస్థ కార్యాలయం వెనుకభాగాన వరహాలరావుతోట, నాగేంద్రస్వామిపుట్టకి ఉత్తరంవైపున ఏటిపోరంబోకు స్థలం ఇప్పటికే కబ్జాఅయ్యింది.. ఇక్కడ అంకణం *30 నుంచి *50 వేలుకు ఓ రియల్టర్ అమ్మకం సాగిస్తున్నారు. నాగేంద్రస్వామి పుట్టకు ఎదురుగా ఏటిపోరంబోకులో ఓ మల్లెతోటను కబ్జాదారులు కొంత కాలం సాగుచేశారు. ఆ స్థలాన్ని వేరేవారికి విక్రయించేశారు. కొనుగోలుచేసిన వారు ఆ తోటను చదనుచేసి ఇళ్లప్లాట్లుగా మార్చారు. స్ధానికులు ఏటి పోరంబోకు కబ్జాను అప్పటి కలెక్టర్ శ్రీధర్, కమిషనర్ టీఎస్ఆర్ ఆంజనేయులు దృష్టికి తీసుకెళ్లడంతో ప్లాట్లలో వేసిన రాళ్లను తొలగించారు. తదుపరి ఆ స్థలం చేతులు మారి నేడు బాణసంచా తయారీదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇదిలా ఉంటే పెన్నాపోరంబోకు స్థలంలో ఒక పార్టీ నాయకుడు గతంలో సవకచెట్లు పెంచి, సొమ్ముచేసుకునేవారు. ఇతని వ్యవహారశైలిపై విమర్శలురావడంతో, నీటిపారుదలశాఖ అధికారులు చేసిన హెచ్చరికలతో గత రెండేళ్ల క్రితం సవకచెట్లును తొలగించారు. గత రెండేళ్ల నుంచి సవకచెట్లస్థానంలో కర్రతుమ్మచెట్లును పెంచుతూ వీటి ద్వారా ఆదాయం పొందుతున్నారు. ఎవరైనా ఈ ప్రాంతానికి వస్తే ఆయన తన పార్టీ పేరుచెబుతూ బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఉయ్యాల కాలువ మురుగునీటిని పెన్నానదిలోకి కలపడంతో దాదాపు తాగునీరు కలుషితైమై పోతోంది. దీంతోసమీపప్రాంత ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందకుండాపోయింది. దీనిని అదునుగా తీసుకున్న ప్రైవేట్ వ్యక్తి ఒకరు వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేసుకుని దర్జాగా వ్యాపారాన్ని సాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇదిలాఉంటే దర్జాగా ఏర్పాటు చేసుకున్న అక్రమ రహదారులలో పట్టపగలు ఎడ్లబండ్ల, రాత్రి వేళల్లో ట్రాక్టర్లతో టన్నులకొద్ది ఇసుక తరలిపోతోంది. ఒక మాజీ కౌన్సిలర్ అన్నీ తామై పరిస్థితిని చక్కబెడుతుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. అంగబలం,అర్థబలం ఉన్న వీరిని నియంత్రించేందుకు స్థానికులు జంకుతుండడంతో వీరి దందాకు అడ్డూఅదుపు లేకుండా ఉంది. ఏటి పోరంబోకు ఆక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం- -వి.కోటేశ్వరరావు, సూపరింటెండెంట్ ఇంజనీరు, నీటిపారుదలశాఖ ఏటిపోరంబోకును ఆక్రమించడం చట్టపరంగా నేరం. పెన్నానది పరివాహక ప్రాంతంలో ఎటువంటి అక్రమకట్టడాలు నిర్మించరాదు. అక్రమలేఅవుట్లు తొలగిస్తాం. ఇసుక అక్రమరవాణాపై చర్యలు తీసుకుంటాం. నగరపాలక సంస్థకుచెందిన వ్యర్థపదార్ధాలతో పెన్నానది కలుషితమౌతున్న విషయమై ఇంజినీరింగ్ అధికారులతో పరిశీలనచేస్తాం. -
భారీగా ఎర్రచందనం పట్టివేత
పెనుకొండ/అనంతపురం/తాడిపత్రి : జిల్లాలో గురువారం భారీఎత్తున ఎర్రచందనం పట్టుబడింది. మూడు వేర్వేరు ప్రాంతాల్లో 185 దుంగలను అటవీ శాఖాధికారులు, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.15 లక్షలు ఉం టుందని అధికారులు తెలిపారు. పెనుకొండ మండలం రాంపురం- వెంకటరెడ్డిపల్లి మధ్య 44వ జాతీయ రహదారిపై రూ.10 లక్షల విలువచేసే 150 దుంగలను జిల్లా అటవీ అధికారి (డీఎఫ్ఓ) రాఘవయ్య, అధికారులు చంద్ర బాలాజీ, శ్రీధర్‌రావు బృందం పట్టుకుంది. వీటిని ఐచర్ వాహనంలో బెంగళూరు వైపు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఈ బృందం కాపు కాసింది. అక్రమ రవాణాదారులు రాప్తాడు మండలంలోని మరూరు టోల్గేట్ వద్ద సైతం వాహనాన్ని ఆపకుండా పక్కదారి గుండా తప్పించుకొని పెనుకొండ వైపు వెళ్లారు. హైవే పెట్రోలింగ్ పోలీసుల సహకారంతో అటవీ శాఖ అధికారులు ఆ వాహనాన్ని వెంటాడారు. పెనుకొండ సమీపంలో హైవే పెట్రోలింగ్ వాహనాన్ని చాకచక్యంగా అడ్డుపెట్టి ఐచర్‌ను ఆపారు. అందులోని ముగ్గురు వ్యక్తులు కిందకు దూకి కంపచెట్లలోకి పారిపోయారు. హరిపురం గ్రామస్తుల సహాయంతో తమిళనాడుకు చెందిన సతీష్ అనే నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు దొరకలేదు. వాహనంలో 150 దుంగలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిని వాహనంతో సహా అటవీ శాఖ పెనుకొండ రేంజ్ కార్యాలయానికి తరలించారు. స్కార్పియో వాహనంలో సీట్ల కింద ఆరు ఎర్రచందనం దుంగలను దాచి .. నంద్యాల నుంచి బెంగళూరుకు అక్రమంగా తరలిస్తుండగా మా రూరు టోల్గేట్ వద్ద అటవీ శాఖ మొబైల్ టీం సభ్యులు పట్టుకున్నారు. నలుగురు దొంగలను అరెస్టు చేశారు. స్కార్పియో వాహనంతో పాటు దొంగలను అనంతపురం తరలించారు. దుంగలవిలువ రూ.3 లక్షల పైగా ఉంటుందని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రామచంద్రనాయక్ తెలిపారు. కర్నూలు జిల్లా మహాదేవపురం నుంచి బెంగళూరుకు స్కార్పియో వాహనంలో తరలిస్తున్న రూ.2 లక్షల విలువ చేసే 605 కిలోల 29 ఎర్రచందనం దుంగలను తాడిపత్రి మండలం భోగసముద్రం వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఆరుగురిని అరెస్టు చేశారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇవి పట్టుబడినట్లు తాడిపత్రి రూరల్ సీఐ వెంకటరెడ్డి, ఎస్ఐ నారాయణరెడ్డి తెలిపారు. మహాదేవపురం గ్రామానికి చెందిన మహబూబ్‌బాషా, వైఎస్సార్ జిల్లా ముద్దునూరుకు చెందిన గుజరీ వ్యాపారి బాబ్జీ, డోన్ పట్టణానికి చెందిన వాహన డ్రైవర్ గురుమూర్తి, అంకిరెడ్డిపల్లికి చెందిన భాస్కర్‌రెడ్డి, కూలీలు విజయరెడ్డి, బాషాను అరెస్టు చేశామన్నారు. -
రూ. 2 కోట్ల విలువైన పంచలోహ విగ్రహాలు పట్టివేత
కరీంనగర్ క్రైం : నాలుగున్నర సంవత్సరాలుగా మిస్టరీగా మారిని ముస్తాబాద్ మండలం పోత్గల్ రామాలయ విగ్రహాల చోరీ కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. దొంగతనానికి గురైన నాలుగు విగ్రహాలను స్వాధీనం చేసుకుని ఓ దొంగను అరెస్టు చేశారు. శనివారం సాయంత్రం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎస్పీ శివకుమార్ వివిధ కేసులకు సంబంధించి వివరాలు వెల్లడించారు. సిరిసిల్ల మండలం గండిలచ్చపేటకు చెందిన బుర్రసాయిలు, బొమ్మనగారి తిరుపతి, లోకని ఎల్లయ్య ముఠాగా ఏర్పడ్డారు. ఎల్లయ్య పలు కేసుల్లో నిందితుడు. జైలుకూ వెళ్లివచ్చాడు. పోత్గల్ రామాలయంలోని 18వ దశాబ్దానికి చెందిన కాకతీయుల కాలం నాటి శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, గోదాదేవి పంచలోహ విగ్రహాలను 2010 జనవరి 21వ తేదీన దొంగలించారు. అనంతరం వాటిని స్వగ్రామానికి తరలించి దాచారు. పోలీసుల నిఘా ముమ్మరం కావడంతో వాటిని అమ్మలేదు. ఈ క్రమంలో దొంగల్లో తిరుపతి, ఎల్లయ్య ఇద్దరు మృతిచెందారు. బతికి ఉన్న బుర్రసాయిలు ఇటీవలే విగ్రహాలను అమ్మడానికి ప్రయతన్నాలు ప్రారంభించాడు. సమాచారం అందుకున్న సీసీఎస్ సీఐ మాధవి, ఎస్సైలు సృజన్‌రెడ్డి, ఉపేందర్, కానిస్టేబుళ్లు రాజేశ్, నాయక్, సాగర్లు శనివారం ఉదయం సిరిసిల్లలోని గండిలచ్చకపేటలోని బుర్రసాయిలు అదుపులోకి తీసుకుని విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. సాయిలును రిమాండ్‌కు తరలించారు. అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు.. క్రమశిక్షణ లేని జీవితం.. బాధ్యతరాహిత్యంతో జవాన్ ఉద్యోగం కోల్పోయి నేరాలకు పాల్పడ్డాడు. రెండుసార్లు జైలుకు వెళ్లివచ్చినా ప్రవర్తనలో మార్పురాలేదు. అంతేకాదు జైళ్లో పరిచయమైన వ్యక్తితో బయట చోరీలకు పాల్పడ్డాడు. సీసీఎస్ పోలీసులు పట్టుకుని కటకటాలపాలు చేశారు. కాటారం మండలం దేవరాంపల్లి గ్రామానికి చెందిన చల్లా మహేశ్‌రెడ్డి అలియాస్ మహేశ్ 2004లో ఆర్మీలో జవాన్‌గా ఉద్కోగంలో చేరాడు. 2007లో వరంగల్ జిల్లాలోని కేసముద్రంలో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. అనంతరం ఉద్యోగం పోగొట్టుకున్నాడు. అనంతరం బెయిల్‌పై విడుదలై పలు చోరీలకు పాల్పడ్డాడు. పోలీసులు మరోసారి అరెస్టు చేసి జైలు తరలించారు. మల్యాల మండలంలోని బల్వంతపూర్ గ్రామానికి చెందిన బొమ్మకంటి శ్రావణ్‌తో పరిచమైంది. 2013 జైలు నుంచి విడుదల తర్వాత మహేశ్ కలిసి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో 11 నేరాలకు పాల్పడ్డారు. చోరీ చేసిన బంగారాన్ని అమ్మేబాధ్యత శ్రావణ్‌కు అప్పగించాడు. బంగారం అమ్ముతున్నారన్న పక్కా సమాచారంతో రూరల్ సీఐ న రేందర్, సీసీఎస్ సీఐ మాధవి, రూరల్ ఎసై శ్రీనివాస్ ఆధ్వర్యంలో కరీంనగర్లో అపోలో రీచ్‌వద్ద శనివారం ఉదయం పట్టుకున్నారు. వారి నుంచి రూ. 7.80 లక్షల విలువైన 52 తులాల బంగారం, 86 తులాల వెండి ఆభరణాలు, రూ. 55 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. 12 గంటల్లోనే దొంగ పట్టివేత శుక్రవారం రెండు చోరీలు చేసిన వెంటనే 12 గంటల్లోనే జిల్లా పోలీసులు దొంగను పట్టుకున్నారు. మెట్‌పల్లిలోని బోయవాడకు చెందిన శేక్ ఇమ్రాన్ అలియాస్ ముకేశ్ పాత నేరస్తుడు. జైలుకు వెళ్లి నాలుగు రోజుల క్రితమే బయటకు వచ్చాడు. శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో మెట్పల్లిలో రోడ్డు వెంట వెళ్తున్న తాడురి గంగమ్మ నుంచి తులం చైన్ చోరీ చేశాడు. రాత్రి 10 గంటలకు దైవరాశెట్టి గౌరమ్మ ఇంట్లో చొరబడి ఆమెపై ఉన్న 7 తులాల బంగారు ఆభరణాలు చోరీచేశాడు. నిందితుడి కోసం రంగంలోకి దిగిన పోలీసులు 12 గంటల్లోనే చోరీ చేసిన శేక్ ఇమ్రాన్ పట్టుకుని ఆయన నుంచి 8 తులాల బంగారం రివకరీ చేశారు. పోలీసులకు రివార్డులు... జిల్లాలో జరిగిన పలు చోరీ కేసులు ఛేదించిన రూరల్ సీఐ నరేందర్, సీసీఎస్ సీఐ మాధవి, మెట్పల్లి సీఐ రాజశేకఖరరాజు, సీసీఎస్ ఎస్సైలు సృజన్‌రెడ్డి, ఉపేందర్, కరీంనగర్ రూరల్ ఎస్సై శ్రీనివాస్, మెట్పల్లి ఎస్సై రాజేశ్, సీసీఎస్ హెడ్‌కానిస్టేబుళ్లు సలీం, కానిస్టేబుళ్లు ఆంజనేయులు, సాగర్, రూరల్ కానిస్టేబుళ్లు సుధాకర్‌రెడ్డి, బషీర్, రవినాయక్, అశోక్‌ల, మెట్పల్లి కానిస్టేబుళ్లు నసీర్‌ఖాన్, అశోక్‌కు ఎస్పీ శివకుమార్, అదనపు ఎస్పీ జనార్ధన్‌రెడ్డిలు రివార్డులు ప్రకటించారు. వారిని ప్రత్యేకంగా అభినందించారు. -
ఎర్ర చందనం దుంగలు పట్టివేత
జాతీయ రహదారిలో అటవీ సిబ్బందికి కారుతో సహా పట్టుబడిన దొంగ కనగానపల్లి: మండల పరిధిలోని పర్వతదేవరపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిలో రూ.1.5 లక్షల విలువ చేసే 14 ఎర్రచందనం దుంగలు పట్టుబడ్డాయి. డీఎఫ్ఓ శ్రీనివాసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం జాతీయ రహదారిపై మరూరు టోల్ గేట్ సమీపంలో ఉన్న ఫారెస్ట్ సిబ్బంది పద్మావతి, అయూబ్‌బాషా, జరీఫాలు.. అనంతపురం నుంచి బెంగుళూరు వైపు అనుమానాస్పందంగా వెళ్తున్న క్వాలీస్ కారును గుర్తించారు. వెంటనే వారు దానిని వెంబడించారు. పర్వతదేవరపల్లి సమీపంలో కారు ఆపి అందులోని ఉన్న వారు దిగి పరుగు తీశారు. కాగా గ్రామస్తులు కూడా అటవీ సిబ్బందికి సహకరించడంతో మణి అనే ఒక దొంగ పట్టుబడ్డాడు. అనంతరం కారును పరిశీలించగా అందులో 14 ఎర్ర చందనం దుంగలు ఉండటాన్ని గుర్తించారు. చిత్తూరు జిల్లా తిరుపతి సరిహద్దు ప్రాంతం నుంచి వీటిని తీసుకు వస్తున్నట్లు తెలిసిందని, పట్టుబడిన దొంగ, పారిపోయిన మహిళా దొంగ తిరుపతికి చెందిన వారని డీఎఫ్ఓ తెలిపారు. దుంగల్ని అనంతపురంలోని జిల్లా అటవీ కార్యాలయానికి తరలించి కేసు నమోదు చేశారు. -
ఫొటోగ్రఫీ ప్రేమికుల కోసం ‘కెమెరా 51’
ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఒక గైడ్‌లాగా ఉపయోగపడుతుంది ఈ అప్లికేషన్. ఫోటోను క్యాప్చర్ చేయడానికి తగు సూచనలు ఇస్తూ మీ చేత బెస్ట్ ఫోటోలను తీయిస్తుందని ఈ అప్లికేషన్ రివ్యూల్లో పేర్కొన్నారు. ఆటో ఫ్రేమింగ్, ఆటో కంపోజిషన్ టెక్నాలజీతో ఉంటుంది ఈ ఆప్. ప్రత్యేకించి సెల్ఫీలను తీసుకోవడం విషయంలో కూడా ఇది చక్కటి గైడ్‌గా ఉంటుందట. మరి స్మార్ట్‌ఫోన్ కెమెరాను మరింత స్మార్ట్‌గా తీర్చిదిద్దుకోవడానికి ఈ అప్లికేషన్ ఉపయోపడుతుంది. -
ఉరేసుకుంటం కానీ.. జాగా ఖాళీ చెయ్యం ..!
- జలాల్‌పురంలో ‘బీఎస్ఎఫ్’ స్థల పరిశీలన - అడ్డుకున్న రైతులు, అధికారులతో వాగ్వాదం భూదాన్‌పోచంపల్లి: ‘‘తాత, ముత్తాతల కాలం నుంచి ఈడనే సేద్యం చేసుకుంటున్నం.. ఏళ్లుగా కబ్జాలో ఉంటున్న ప్రభుత్వ భూమిని మాకే కేటాయించాలి.. ఇంకేవరికో కేటాయిస్తమంటే ఊరుకునేది లేదు.. అవసరమైతే ఈడనే ఉరేసుకుంటం.. కానీ జాగా మాత్రం ఖాళీ చెయ్యం’’ అని మండలంలోని జలాల్పురం గ్రామ రైతులు స్పష్టం చేశారు. గ్రామంలోని 80వ సర్వే నంబర్ ప్రభుత్వ భూమిలో కాలనీ నిర్మాణం కోసం శుక్రవారం బీఎస్ఎఫ్ అధికారులు స్థల పరిశీలన చేశారు. అయితే విషయం తెలుసుకున్న అదే భూమిలోఅరవై ఏళ్లుగా కబ్జాలో ఉన్న రైతులతో పాటు సర్పంచ్ శాపాక భిక్షపతి, ఉపసర్పంచ్ పాలకూర్ల ఆగయ్యలు సంఘటన స్థలానికి చేరుకుని బీఎస్ఎఫ్ అధికారులను అడ్డుకున్నారు. వారితో వాగ్వాదానికి దిగారు. దాంతో బీఎస్ఎఫ్ అధికారులు వెంటనే అక్కడి నుంచి వెళ్లి తహసీల్దార్ ఎం.విజయకుమారితో సమావేశమయ్యారు. స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమి అనువుగా ఉందని, 50 ఎకరాల పైన ఇస్తే బీఎస్ఎఫ్ కుటుంబాల కోసం కాలనీ నిర్మాణంతో పాటు సైనిక పాఠశాల, ఆస్పత్రి నిర్మాణం చేపడతామని సరిహద్దు దళాల(బీఎస్ఎఫ్) డీఐజీ సుమేర్‌సింగ్ తహసీల్దార్ దృష్టికి తీసుకొచ్చారు. అయితే స్థల కేటాయింపు మా పరిధిలో లేదని, ఈ విషయాన్ని కలెక్టర్‌కు నివేదిస్తామని ఆమె పేర్కొన్నారు. అదీకాక రైతులు ఈ స్థల విషయమై కోర్డులో పిటిషన్ కూడా వేశారని తెలిపారు. డీఐజీ స్పందిస్తూ కలెక్టర్‌తో గతంలోనే మాట్లాడామని చెప్పారు. రైతులకు నష్టం కలుగకుండా వారికి నష్టపరిహారం కూడా చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అందరి దృష్టి సర్వే నంబర్ 80 పైనే.. జలాల్పురం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 80లో గల ప్రభుత్వ భూమిపైన అందరి దృష్టిపడింది. ఈ సర్వే నంబర్లో 110 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అయితే చాలా కాలంగా గ్రామానికి చెందిన రైతులు ఆ ప్రభుత్వ భూమిలో కబ్జాలో ఉండి సేద్యం చేసుకుంటున్నారు. 2007లో ఇదే భూమిలో 80 ఎకరాలు ఇఫ్ల్యూ యూనివర్సిటీకి ఇచ్చారు. కానీ వారు నిర్మాణం చేపట్టకపోవడంతో దానిని రద్దు చేశారు. తరువాత అపార్డ్ అధికారులు చూసి వెళ్లారు. ఇటీవల చెత్త డంపింగ్ యార్డు కోసం జీహెచ్ఎంసీ అధికారులు సర్వే కోసం వస్తే గ్రామస్తులు అడ్డుకోవడంతో వారూ వెనుదిరిగారు. ఇప్పుడు బీఎస్ఎఫ్ అధికారులు స్థలపరిశీలన చేయడంతో గ్రామస్తులలో ఆందోళన మొదలైంది. ఎన్నో ఏళ్లుగా కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూమిని తమకు కాకుండా మరెవరికో ఎలా కేటాయిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. రైతులకు అసైన్డ్చేయాలని అధికారులకు ఎన్నోసార్లు మొరపెట్టుకుంటున్నా ఫలితం లేదని వారు వాపోతున్నారు. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న భూదాన్‌పోచంపల్లి మండలంలో ప్రభుత్వ భూమిని అసైన్డ్ చేయడం బ్యాన్‌లో ఉంది. ఇదిలా ఉంటే సర్వే నంబర్ 80లో గల 110 ఎకరాల భూమి ప్రభుత్వ రికార్డులో మాత్రం ఖాళీగా ఉంది. -
ఎర్రచందనం పట్టివేత
ఇటిక్యాల, న్యూస్‌లైన్: ఎర్ర చందనాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారనే సమాచా రం మేరకు 44వ నెం బరు జాతీయ రహదారిపై పోలీసులు వల పన్ని పట్టుకున్నారు. శ నివారం అర్ధరాత్రి జా తీయ రహదారిపై ఎ ర్రవల్లిచౌరస్తా వద్ద ఇటిక్యాల ఎస్సై భగవంత్‌రెడ్డి వాహనాల తనిఖీలను ప్రా రంభించారు. ఏపీ 03 టీబీ 5646 వాహనాన్ని తనిఖీ చేయగా అందులో ఎర్రచందనం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాహనంలో పైన బత్తాయి పళ్ల సంచులతో నింపి అడుగు భాగాన గోనె సంచుల్లో ఎర్రచందనం దుంగలను ప్యాకింగ్ చేసి ఉంచి నట్లు గుర్తించారు. పోలీసులకు అనుమానం వచ్చి వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అలంపూర్ సీఐ చంద్రశేఖర్ ఇటిక్యాల పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని వనపర్తి అటవీశాఖ అధికారుల సాయంతో ఎర్రచందనం దుంగలను పరిశీలించారు. ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలంటే ఆది వారం ఉదయం వరకు వేచి ఉండాలని అటవీశాఖ అధికారి అలంపూర్ సీఐకి తెలిపారు. ఆదివారం ఉదయం అటవీ, పోలీసులు పోలీస్‌స్టేషన్ కు చేరుకొ ని గోనెసంచుల్లో ఉన్న దుంగలను వెలికితీసి పరిశీలించి ఎర్రచందనం దుంగలేనని అటవీశాఖ అధికారి రామకృష్ణ నిర్ధారించారు. వా టిని తూకం వేయగా మొత్తం 31 ఎర్రచందనం దుంగలు 1388 కిలోలు ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ ఖరీదు మేరకు దీని విలువ రూ. 20.77లక్షలు ఉంటుందన్నారు. ఎర్రచందనం తరలించే వాహనంతో పాటు వాహన డ్రైవర్ సాగిబండ వినోద్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ సమాచారం మేరకు ప్రకాశం జిల్లా మదనపల్లి ప్రాంతంలోని కుంట గ్రామంలో బత్తాయిపళ్లు, దుంగలు లోడ్ చేసినట్లు తెలిపారు. అక్కడి నుంచి బెంగుళూరుకు తరలిం చేందుకు తాను అద్దెకు మాట్లాడుకున్నట్లు తెలిపారు. కుంట గ్రామం నుంచి ప్రకాశం, నల్గొండ, మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం జిల్లాల మీ దుగా బెంగుళూరు చేరుకునేందుకు ప్రయాణిస్తున్నట్లు వివరించారు. -
దొంగ 'ముద్దు'.. జైలుకు పంపింది!
లండన్: ఫ్రాన్స్‌లో ఇద్దరు దొంగలు ఓ బంగారు నగల దుకాణం యజమానిని బెదిరించి డబ్బు, నగలు దోచుకున్నాడు. ఓ దొంగ అంతటితో ఆగకుండా ఆమెను ముద్దాడాడు. చివరకు ఈ ముద్దే దొంగలు పోలీసులకు దొరికేలా చేసింది. వివరాలిలా ఉన్నాయి. యజమాని ఒంటరిగా ఉన్న సమయంలో దొంగలు ఆమె ఇంట్లోకి ప్రవేశించారు. తాము చెప్పినట్టు వినకుంటే చంపేస్తామంటూ ఆమె తలపై పెట్రల్ పోసి బెదిరించారు. యజమాని నుంచి బంగారు నగల దుకాణం తాళం చెవి తీసుకుని ఓ దొంగ వెళ్లాడు. మరొకడు ఆమె దగ్గరే ఉన్నాడు. దొంగ వెళ్లి దుకాణంలో డబ్బు, నగలు అందినకాడికి దోచుకున్నాడు. పని పూర్తవగానే ఇంట్లో ఉన్న మరో దొంగ కక్కుర్తి పడి 56 ఏళ్ల యజమాని బుగ్గపై ముద్దుపెట్టుకుని వెళ్లాడు. బాధితురాలి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి జరిగిన విషయం చెప్పింది. ఫోరెన్సిక్ బృందం ఆమె బుగ్గపై దొంగ ముద్దుపెట్టుకున్న ఆనవాళ్లను సేకరించింది. డాటాబేస్‌లో దొంగ డీఎన్ఏను గుర్తించారు. ఇంకేముంది దొంగ ఎవర్నది తేలిపోయింది. పోలీసులు వలపన్ని దొంగలను జైలుకు పంపారు. -
రూ.లక్ష విలువైన ఖైనీ, గుట్కాల పట్టివేత
గజపతినగరం, న్యూస్‌లైన్:నిషేధిత ఖైనీ,గుట్కాల వ్యాపారం చేస్తున్న గజ పతినగరంలోని అమృతస్వీట్ షాపు యజమాని సరుకును పోలీసులు గురువారం సీజ్ చేశారు. షాపు యజ మాని రాము విజయనగరంనుంచి సుమారు రూ.లక్ష విలువైన ఖైనీ, గుట్కాలను తెస్తుండగా స్థానికులు పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు విషయంలో తమకు సంబంధంలేదని ఆహారకల్తీ నిరోధక శాఖ అధికారులకు తెలియపరచాలని పోలీసులు చెప్పడంతో విజయనగరానికి చెందిన ఫుడ్ ఇన్స్పెక్టర్ వీరభద్రరావుకు స్థానికులు సమాచారం అందజేశారు. పట్టుబడిన గుట్కాలు, ఖైనీలను పోలీ సులు స్వాధీనం చేసుకుని పంచనామా జరిపిన తరువాతే తాము చర్యలు తీసుకోగలమని ఫుడ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ఇలా ఈ రెండు శాఖల అధికారుల మధ్య సుమారు రెండు గంటల పాటు హైడ్రామా నడించినప్పటికీ ఏ ఒక్క అధికారీ సంఘటనా స్థలానికి రాలేదు. వ్యాపారులకు అధికారుల మద్దతు ఉండడంతోనే ఈ అక్రమ వ్యాపారాలకు అడ్డుఅదుపూ లేకుండా పోతోం దని స్థానికులు అగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఎస్ఐ టి.కామేశ్వరరావు అమృత షాపులో ఉన్న రెండు బస్తాల ఖైనీ, గుట్కాలను స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనిపై ఫుడ్ ఇన్స్పెక్టర్ను వివరణ కోరగా తాను విజయనగరంలో కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నందున గజపతినగరం రాలేనని స్థానిక పోలీసలు కేసు నమెదు చేసి పంచనామా జరిపిన తరువాత చట్టపరమైన చర్యలు తీసుకోగలనన్నారు. -
నక్సల్స్‌ను పట్టుకోండి: నజరానా అందుకోండి
రాష్ట్ర ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తున్న ఏడుగురు మావోయిస్టులను పట్టుకోవాలని నితీష్ సర్కార్ సంకల్పించింది. అందుకోసం ఆ మావోయిస్టులను ప్రజలు పట్టుకుని తమకు అప్పగిస్తే రూ. 3 నుంచి 5 లక్షల నజరానా అందజేస్తామని ప్రకటించింది. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులు గురువారం బీహార్ రాజధాని పాట్నాలో ఓ ప్రకటన విడుదల చేశారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అరవింద్ కుమార్ అలియాస్ అరవింద్ సింగ్ పట్టుకుంటే రూ.5 లక్షలు, అలాగే బీహార్ ఏరియా ప్రతేక దళ సభ్యుడు విజయ్ యాదవ్ అలియాస్ సందీప్, శివశంకర్ దోబి అలియాస్ త్యాగీ, పర్వేశ్ అలియాస్ అంజు, రామ్ బాబు రామ్, ప్రజాపతి, చిరగ్లను పట్టుకుంటే రూ. 3 లక్షల నగదు బహుమతి అందజేస్తామని పేర్కొంది. ఆ మావోయిస్టులు నాయకులంతా జహెనాబాద్, ఔరంగబాద్, గయ, జుమాయి,మోతహరీ ప్రాంతాలకు చెందిన వారని పోలీసుల విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. -
రూ.50 లక్షల విలువైన గంజాయి పట్టివేత
పాడేరు, న్యూస్‌లైన్ : ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాల నుంచి తమిళనాడుకు భారీ స్థాయిలో రవాణా చేస్తున్న గంజాయిని ఎక్సయిజ్ శాఖాధికారులు మంగళవారం ఉదయం పట్టుకున్నారు. పాడేరు-పెదబయలు రోడ్డులోని గంపరాయి సమీపంలోని వంతెన వద్ద గంజాయితో వెళ్తున్న వ్యాన్‌ను గుర్తించిన ఎక్సయిజ్ డిప్యూటీ కమిషనర్ ఎం.సత్యనారాయణ, ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ నాగేంద్రలు తమ సిబ్బందితో మెరుపుదాడి చేశారు. వ్యాన్‌లో ఎవరికీ అనుమానం రాకుండా అమర్చిన 250 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 500 కిలోల బరువున్న గంజాయి విలువ రూ.50 లక్షలుంటుందని ఎక్సయిజ్ డిప్యూటీ కమిషనర్ ఎం.సత్యనారాయణ విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా పాడేరుకు చెందిన కొర్రా గణేష్, రాజాపురం గ్రామానికి చెందిన గెమ్మెలి రవికుమార్, కొర్రా మహేష్, కూడా పోతురాజులను అరెస్టు చేశామన్నారు. పరారైన జి.మాడుగుల మండలానికి చెందిన శేఖర్‌పై కూడా కేసు నమోదు చేశామని తెలిపారు. జి.మాడుగుల, పెదబయలు మండలాల సరిహద్దు ప్రాంతం నుంచి పెదబయలు మీదుగా విశాఖపట్నం వరకు గంజాయిని తరలిస్తున్నారని, అక్కడి నుంచి చెన్నై ప్రాంతానికి తరలిస్తారని పేర్కొన్నారు. వ్యాన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నామని, ఈ ఏడాది ఏజెన్సీలో సాగవుతున్న గంజాయి తోట లను కూడా ధ్వంసం చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిపారు. దాడు ల్లో అనకాపల్లి ఎక్సయిజ్ సూపరింటెం డెంట్ మూర్తి, పాడేరు పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాసరావు, మొబైల్ పార్టీ సీఐ ఉపేంద్ర, సిబ్బంది పాల్గొన్నారు. కాలినడకన తరలిస్తుండగా పట్టివేత ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు కాలినడకన గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు తమిళనాడు వ్యాపారస్తులను సోమవారం సాయంత్రం పాడేరు ఘాట్‌లోని అమ్మవారి పాదాలు వద్ద అరెస్టు చేశామని పాడేరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ ప్రసాద్ విలేకరులకు తెలిపారు. తమిళనాడుకు చెందిన పేరిరాజు, పడిత్రేయిల నుంచి పది కిలోల గంజాయి, రూ.20 వేలు నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు. -
475 క్వింటాళ్ల సబ్సిడీ బియ్యం పట్టివేత
బనగానపల్లె, న్యూస్‌లైన్:అక్రమంగా సరిహద్దులు దాటుతున్న సబ్సిడీ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బనగానపల్లె పట్టణంలోని యోగీశ్వర రైస్ మిల్లు యజమాని శ్రీనివాసులు టర్బో వాహనంలో 210 క్వింటాళ్లు, డీసీఎం వాహనంలో 80 క్వింటాళ్ల బియ్యాన్ని కర్ణాటకలోని తుమ్ముకూరు, బంగారుపేటకు తరలించే ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం వాహనాలు రైస్ మిల్లు నుంచి బయలుదేరగా సమాచారం అందుకున్న విజిలెన్స్ సీఐలు పవన్‌కిషోర్, శ్రీనివాసులు, వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు, సిబ్బంది శ్రీనివాసులు, నజీర్, శివ ఆకస్మిక దాడి చేసి యాగంటిపల్లె వద్ద వాహనాలను అడ్డుకున్నారు. రెండు వాహనాల్లోని సబ్సిడీ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటిని స్థానిక సివిల్ సప్లయ్ స్టాక్ పాయింట్‌కు తరలించారు. అనంతరం యోగీశ్వర రైస్‌మిల్లులో తనిఖీలు చేయగా అక్కడ కూడా 185 క్వింటాళ్ల బియ్యం అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించి సీజ్ చేశారు. రూ. 10 లక్షల విలువైన 475 క్వింటాళ్ల సబ్సిడీ బియ్యాన్ని సీజ్ చేసినట్లు సీఐ పవన్ కిషోర్ తెలిపారు. ప్రభుత్వ రేషన్‌కార్డుల ద్వారా పంపిణీ చేసే కిలో రూపాయ బియ్యం అక్రమంగా ఎలా తరులుతున్నాయని, అందుకు బాధ్యులు ఎవరన్న విషయం దర్యాప్తులో వెలుగు చూస్తుందన్నారు.