దొంగ 'ముద్దు'.. జైలుకు పంపింది! | Jewel thief captured by DNA after kissing captive | Sakshi
Sakshi News home page

దొంగ 'ముద్దు'.. జైలుకు పంపింది!

Published Wed, Feb 5 2014 7:01 PM | Last Updated on Sat, Sep 2 2017 3:22 AM

దొంగ 'ముద్దు'.. జైలుకు పంపింది!

దొంగ 'ముద్దు'.. జైలుకు పంపింది!

లండన్: ఫ్రాన్స్లో ఇద్దరు దొంగలు ఓ బంగారు నగల దుకాణం యజమానిని బెదిరించి డబ్బు, నగలు దోచుకున్నాడు. ఓ దొంగ అంతటితో ఆగకుండా ఆమెను ముద్దాడాడు. చివరకు ఈ ముద్దే దొంగలు పోలీసులకు దొరికేలా చేసింది. వివరాలిలా ఉన్నాయి.

యజమాని ఒంటరిగా ఉన్న సమయంలో దొంగలు ఆమె  ఇంట్లోకి ప్రవేశించారు. తాము చెప్పినట్టు వినకుంటే చంపేస్తామంటూ ఆమె తలపై పెట్రల్ పోసి బెదిరించారు. యజమాని నుంచి బంగారు నగల దుకాణం తాళం చెవి తీసుకుని ఓ దొంగ వెళ్లాడు. మరొకడు ఆమె దగ్గరే ఉన్నాడు. దొంగ వెళ్లి దుకాణంలో డబ్బు, నగలు అందినకాడికి దోచుకున్నాడు. పని పూర్తవగానే ఇంట్లో ఉన్న మరో దొంగ కక్కుర్తి పడి 56 ఏళ్ల యజమాని బుగ్గపై ముద్దుపెట్టుకుని వెళ్లాడు. బాధితురాలి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి జరిగిన విషయం చెప్పింది. ఫోరెన్సిక్ బృందం ఆమె బుగ్గపై దొంగ ముద్దుపెట్టుకున్న ఆనవాళ్లను సేకరించింది. డాటాబేస్లో దొంగ డీఎన్ఏను గుర్తించారు. ఇంకేముంది దొంగ ఎవర్నది తేలిపోయింది. పోలీసులు వలపన్ని దొంగలను జైలుకు పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement