ఎర్రచందనం పట్టివేత
ఇటిక్యాల, న్యూస్‌లైన్: ఎర్ర చందనాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారనే సమాచా రం మేరకు 44వ నెం బరు జాతీయ రహదారిపై పోలీసులు వల పన్ని పట్టుకున్నారు. శ నివారం అర్ధరాత్రి జా తీయ రహదారిపై ఎ ర్రవల్లిచౌరస్తా వద్ద ఇటిక్యాల ఎస్సై భగవంత్‌రెడ్డి వాహనాల తనిఖీలను ప్రా రంభించారు. ఏపీ 03 టీబీ 5646 వాహనాన్ని తనిఖీ చేయగా అందులో ఎర్రచందనం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాహనంలో పైన బత్తాయి పళ్ల సంచులతో నింపి అడుగు భాగాన గోనె సంచుల్లో ఎర్రచందనం దుంగలను ప్యాకింగ్ చేసి ఉంచి నట్లు గుర్తించారు.
పోలీసులకు అనుమానం వచ్చి వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అలంపూర్ సీఐ చంద్రశేఖర్ ఇటిక్యాల పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని వనపర్తి అటవీశాఖ అధికారుల సాయంతో ఎర్రచందనం దుంగలను పరిశీలించారు. ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలంటే ఆది వారం ఉదయం వరకు వేచి ఉండాలని అటవీశాఖ అధికారి అలంపూర్ సీఐకి తెలిపారు. ఆదివారం ఉదయం అటవీ, పోలీసులు పోలీస్‌స్టేషన్ కు చేరుకొ ని గోనెసంచుల్లో ఉన్న దుంగలను వెలికితీసి పరిశీలించి ఎర్రచందనం దుంగలేనని అటవీశాఖ అధికారి రామకృష్ణ నిర్ధారించారు. వా టిని తూకం వేయగా మొత్తం 31 ఎర్రచందనం దుంగలు 1388 కిలోలు ఉన్నట్లు గుర్తించారు.
ప్రభుత్వ ఖరీదు మేరకు దీని విలువ రూ. 20.77లక్షలు ఉంటుందన్నారు. ఎర్రచందనం తరలించే వాహనంతో పాటు వాహన డ్రైవర్ సాగిబండ వినోద్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ సమాచారం మేరకు ప్రకాశం జిల్లా మదనపల్లి ప్రాంతంలోని కుంట గ్రామంలో బత్తాయిపళ్లు, దుంగలు లోడ్ చేసినట్లు తెలిపారు. అక్కడి నుంచి బెంగుళూరుకు తరలిం చేందుకు తాను అద్దెకు మాట్లాడుకున్నట్లు తెలిపారు. కుంట గ్రామం నుంచి ప్రకాశం, నల్గొండ, మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం జిల్లాల మీ దుగా బెంగుళూరు చేరుకునేందుకు ప్రయాణిస్తున్నట్లు వివరించారు.