National Highway No. 44
-
బైక్‌పై కోతుల దాడి: యువతి మృతి
డిచ్పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని చంద్రాయన్పల్లి అటవీ ప్రాంతంలో 44వ నెంబరు జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం ఓ బైకుపై కోతులు చేసిన ఘటనలో ఓ యువతి మృతి చెందింది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఏఎస్ఐ నారాయణ కథనం ప్రకారం దోమకొండ మండల కేంద్రానికి చెందిన బొమ్మసాని చంద్రశేఖర్ తన సోదరి రమాదేవితో కలిసి ఓ శుభకార్యానికి హాజరైందుకు పల్సర్ బైక్‌పై సికింద్రాపూర్‌కు బయలు దేరారు. వీరు డిచ్పల్లి మండలం చంద్రాయన్పల్లి అటవీ శివారు ప్రాంతానికి చేరుకునేటప్పటికి ఓ కోతుల గుంపు రోడ్డు దాటుతోంది. బైకుపై ఎర్ర రంగులో ఉన్న బ్యాగును చూసి ఒక కోతి దానిపై దూకింది. దీంతో వేగంగా ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి కిందపడింది. వెనుక కూర్చున్న రమాదేవి తలకు తీవ్రగాయాలు కాగా, చంద్రశేఖర్ కుడి చేయి విరిగింది. వీరిని 108 అంబులెన్స్‌లో కామారెడ్డికి తరలిస్తుండగా రమాదేవి మార్గమధ్యలో మృతి చెందింది. -
ఎట్టకేలకు మోక్షం..
డిచ్పల్లి: డిచ్పల్లి మండల కేంద్రంలోని 44 నెంబరు జాతీయ రహదారి నాగ్‌పూర్ రైల్వే గేటు నుంచి నిజామాబాద్ వరకు ఉన్న బీటీ రోడ్డుకు ఎట్టకేలకు ఫోర్‌లేన్ రోడ్డుగా మోక్షం లభించింది. ఎన్నో యేళ్లుగా డిచ్పల్లి-నిజామాబాద్ రోడ్డును విస్తరించాలని ప్రజలు డిమాండ్ చేస్తుంటే చివరకు తెలంగాణ ప్రభుత్వంలో వారి కల నెరవేరనుంది. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని పంచాయతీరాజ్, ఆర్అండ్బీ శాఖల రహదారులన్నింటిని వంద శాతం బాగు చేయాలని నిర్ణయించడంతో ప్రజలు ఆనందిస్తున్నారు. డిచ్పల్లి నుంచి నిజామాబాద్ వరకు ఉన్న 15 కిలోమీటర్ల రెండు లైన్ల బీటీ రోడ్డు ప్రస్తుతం పలు చోట్ల గుంతలు తేలి ఉంది. ప్రతి నిత్యం ఈ రోడ్డుపై వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. గుంతల రోడ్డుతో ఏదో చోట వాహనదారులు ప్రమాదాలకు గురవుతునే ఉన్నారు. పలు ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. పెరిగిన వాహనాలు, రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ రోడ్డును ఫోర్లైన్ల రోడ్డుగా విస్తరించాలని మండల వాసులు ఎన్నో సార్లు ప్రజాప్రతినిధులకు విన్నవించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. గత యేడాది కిత్రం నాగ్‌పూర్ గేటు నుంచి 2 కిలో మీటర్ల దూరం రోడ్డు విస్తరణ పనులకు నిధులు మంజూరు కాగా పనులు ప్రారంభించి మధ్యలో మానివేశారు. శుక్రవారం రాత్రి సీఎం కేసీఆర్ ఎట్టకేలకు ఈ రోడ్డును ఫోర్‌లేన్ రోడ్డుగా మార్చేందుకు రూ. 215 కోట్లు నిధులు మంజూరు చేయడంతో మండల ప్రజలు హర్షిస్తున్నారు. రోడ్డు విస్తీర్ణంపై స్పష్టత లేదు డిచ్పల్లి-నిజామాబాద్ రోడ్డును ఫోర్ లేన్ రోడ్డుగా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోడ్డు విస్తరణ పను లు చేపడితే డిచ్పల్లి రైల్వేస్టేషన్, నడిపల్లి, ధర్మారం(బి), మాధవ నగర్ గ్రామాల్లో రోడ్డుకు ఇరువైపులా ఉన్న నివాస గృహాలు, పంట పొలాలు కోల్పోనున్నాయి. ఫోర్‌లేన్ రోడ్డు విస్తీర్ణం వంద అడుగులా లేక నూటయాబై అడుగులు ఉంటుందా అనే విషయంలో స్పష్టత లేక స్థాని కులు అందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలా లు ఉన్న చోట ఎక్కువ స్థలం తీసుకుని, ప్రజల నివాసపు ఇళ్లు ఉన్న చోట తక్కువ విస్తీర్ణంలో రోడ్డు పనులు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు.కాగా రోడ్డు విస్తీర్ణం విషయమై వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని ఆర్అండ్బీ అధికారులు పేర్కొంటున్నారు. మాధవనగర్ వద్ద ఓవర్‌బ్రిడ్జి డిచ్పల్లి-నిజామాబాద్ ప్రధాన రహదారిపై మాధవనగర్ సాయిబాబా ఆలయం సమీపంలో రైల్వే గేటు ఉంది. ఇక్కడ రైల్వే గేటు వేసినప్పుడు పదుల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫోర్‌లైన్ రోడ్డు నిర్మిస్తే ఈ గేటు వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తారు. దీంతో రైల్వే గేటుతో సంబంధం లేకుండా వాహనదారులు నేరుగా నిజామాబాద్ నగరానికి చేరుకుంటారు. డిచ్పల్లి నుంచి నిజామాబాద్ వరకు 15 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ రోడ్డుపై ధర్మారం(బి) శివారులో రెండు చోట్ల, బోర్గాం (పి) వద్ద రెండు చోట్ల వంతెనలు నిర్మించే అవకాశాలున్నాయి. మారనున్న రూపు రేఖలు.. డిచ్పల్లి-నిజామాబాద్ రహదారి ఫోర్‌లేన్ రోడ్డుగా మారితే మండల కేంద్రం రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ఫోర్‌లేన్ రోడ్డుపై మధ్యలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తే రాత్రి వేళ మండల కేంద్రంతో పాటు రహదారిపై ఉన్న గ్రామాలు విద్యుత్ వెలుగులతో జిగేలు మంటాయి. -
ఎర్రచందనం పట్టివేత
ఇటిక్యాల, న్యూస్‌లైన్: ఎర్ర చందనాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారనే సమాచా రం మేరకు 44వ నెం బరు జాతీయ రహదారిపై పోలీసులు వల పన్ని పట్టుకున్నారు. శ నివారం అర్ధరాత్రి జా తీయ రహదారిపై ఎ ర్రవల్లిచౌరస్తా వద్ద ఇటిక్యాల ఎస్సై భగవంత్‌రెడ్డి వాహనాల తనిఖీలను ప్రా రంభించారు. ఏపీ 03 టీబీ 5646 వాహనాన్ని తనిఖీ చేయగా అందులో ఎర్రచందనం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాహనంలో పైన బత్తాయి పళ్ల సంచులతో నింపి అడుగు భాగాన గోనె సంచుల్లో ఎర్రచందనం దుంగలను ప్యాకింగ్ చేసి ఉంచి నట్లు గుర్తించారు. పోలీసులకు అనుమానం వచ్చి వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అలంపూర్ సీఐ చంద్రశేఖర్ ఇటిక్యాల పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని వనపర్తి అటవీశాఖ అధికారుల సాయంతో ఎర్రచందనం దుంగలను పరిశీలించారు. ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలంటే ఆది వారం ఉదయం వరకు వేచి ఉండాలని అటవీశాఖ అధికారి అలంపూర్ సీఐకి తెలిపారు. ఆదివారం ఉదయం అటవీ, పోలీసులు పోలీస్‌స్టేషన్ కు చేరుకొ ని గోనెసంచుల్లో ఉన్న దుంగలను వెలికితీసి పరిశీలించి ఎర్రచందనం దుంగలేనని అటవీశాఖ అధికారి రామకృష్ణ నిర్ధారించారు. వా టిని తూకం వేయగా మొత్తం 31 ఎర్రచందనం దుంగలు 1388 కిలోలు ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ ఖరీదు మేరకు దీని విలువ రూ. 20.77లక్షలు ఉంటుందన్నారు. ఎర్రచందనం తరలించే వాహనంతో పాటు వాహన డ్రైవర్ సాగిబండ వినోద్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ సమాచారం మేరకు ప్రకాశం జిల్లా మదనపల్లి ప్రాంతంలోని కుంట గ్రామంలో బత్తాయిపళ్లు, దుంగలు లోడ్ చేసినట్లు తెలిపారు. అక్కడి నుంచి బెంగుళూరుకు తరలిం చేందుకు తాను అద్దెకు మాట్లాడుకున్నట్లు తెలిపారు. కుంట గ్రామం నుంచి ప్రకాశం, నల్గొండ, మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం జిల్లాల మీ దుగా బెంగుళూరు చేరుకునేందుకు ప్రయాణిస్తున్నట్లు వివరించారు. -
‘అంగన్వాడీల’ ఆందోళన
మేడ్చల్, న్యూస్‌లైన్: తమ డిమాండ్ల సాధన కోసం హైదారాబాద్‌లో చేపట్టిన దీక్షలకు మద్దతుగా మేడ్చల్‌లో అంగన్వాడీలు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. విస్తరాకుల్లో మట్టితో వినూత్నం గా నిరసన వ్యక్తం చేశారు. డివిజన్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని మేడ్చల్, శామీర్‌పేట్, కీసర, కుత్బుల్లాపూర్ మండలాల అంగన్వాడీ కార్యకర్తలు పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయం నుంచి మేడ్చల్ ప్రధాన వీధుల మీదుగా బస్ డిపో వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్లను వెంటనే తీర్చాలన్నారు. 44వ జాతీయ రహదారిపై కార్యకర్తలు బైఠాయించి రాస్తారోకో చేశారు. దీంతో వాహనాలు నిలిచిపోయాయి. వినూత్న నిరసన ప్రభుత్వం తమకిస్తున్న వేతనాలతో కుటుంబానికి ఒక్కపూట భోజనం కూడా రావడం లేదని, దీంతో తాము వేతనాల పెంపు కోరుతున్నట్లు చెపాపరు. అంగన్వాడీ కార్యకర్తలు రహదారిపై సహ పంక్తిగా కూర్చొని విస్తరాకుల్లో మట్టి పోసుకుని నిరసన తెలిపారు. రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం కావడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అంగన్వాడీలతో వారికి సంఘీభావంగా తరలివచ్చిన సీఐటీయూ నాయకులను అరెస్ట్ చేసే యత్నం చేశారు. ఈక్రమంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు అంగన్వాడీ కార్యకర్తలను సముదాయించడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఉన్నారు. -
‘రియల్’ ఆక్రమణలు
తూప్రాన్, న్యూస్‌లైన్: తూప్రాన్ మండలంలో భూ దందా జోరుగా సాగుతోంది. హైదరాబాద్‌కు కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఇక్కడి భూములకు రెక్కలు వచ్చాయి. లక్షల విలువచేసే ప్రభుత్వ, అసైన్డ్ భూము లు అన్యాక్రాంతమవుతున్నాయి. ధనబలం, రాజకీయ పలుకుబడితో ప్రభుత్వ భూములను అక్రమించి ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికోడుతున్నారు. తూప్రాన్ మండలంలో 44వ జాతీయ రహదారి సుమా రు 20 కిలోమీటర్ల పొడవుగా ఉంటుంది. అంతేకాకుండ రైల్వే సదుపాయం కూడా ఉండడంతో ఇక్కడి భూములు రియల్ భూం కొనసాగిన రోజుల్లో ఎకరం కోటి రూపాయల వరకు పలికింది. కొన్ని నెలలు స్తబ్ధుగా ఉన్న రియల్ వ్యాపారం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో తిరిగి ఊపందుకుంది. దీంతో ఎక్కడ ఖాళీ స్థలం కనపడితే అక్కడ రియల్టర్లు వాలిపోతున్నారు. వెంచర్లుగా మారుస్తున్నారు. తూప్రాన్ మండలంలోని కాళ్లకల్, ముప్పిరెడ్డిపల్లి, కూచారం, జీడిపల్లి, మనోహరాబాద్, అల్లాపూర్, రామాయిపల్లి, ఇస్లాంపూర్ తదితర గ్రామాల్లోని కోట్ల విలువైన భూములు అక్రమార్కుల కబంధహస్తల్లో చిక్కుకున్నాయి. చెరువులు, కుంటల శిఖం భూములు, మాజీ సైనికోద్యుగులకు ఇచ్చిన భూముల అన్నీ కూడా ఆక్రమణలకు గురవుతున్నాయి. అయినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు వారి అండదండలతోనే ఆక్రమణలు చోటుచేసుకుంటున్నాయన్న విమర్శలు లేకపోలేదు. నిబంధనలకు తూట్లు తూప్రాన్ మండలం హైదరాబాద్ నగరానికి సమీపం దూరంలోనే ఉండడంతో హెచ్ఎండీఏ పరిధిలోకి వచ్చింది. అయితే ఇక్కడ ఎలాంటి భూ లావాదేవిలు జరుపలాన్నా, వెంచర్లు ఏర్పాటు చేయాలనన్నా ముం దుగా హెచ్ఎండీఏ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. అయితే కొందరు రియల్ వ్యాపారులు వెంచర్లు ఏర్పాటు చేసి నిబంధనలను తుంగలో తొక్కతున్నారు. పంచాయతీ అనుమతి లేకుండా, టౌన్ ప్లానింగ్ నిబంధనలు పాటించకుండా, లే అవుట్ కాకుండానే ఇష్టారాజ్యంగా ప్లాట్లను ఏర్పాటు చేస్తున్నా రు. పంచాయతీ రాజ్ చట్టం-67 ప్రకారం గ్రామ పంచాయతీ అనుమతి తీసుకుని ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం బెటర్మెంట్ చార్జీలు చెల్లిస్తూ, పంచాయతీకి డెవలప్మెంట్ ఫండ్ కింద 10 శాతం కట్టాలి. అనంత రం నాలా(వ్యవసాయేతర భూములుగా) ఆర్డిఓ నుంచి అనుమతులు పొందాలి. అప్పుడేు ఈ ప్లాట్లను విక్రయించాలి. కానీ ఈ నిబంధనలు గాలికొదిలేస్తున్నారు. తూప్రాన్ మండలంలో అన్యాక్రాంతమైన భూముల్లో మచ్చుకు కొన్ని... తూప్రాన్ మండలం మనోహరాబాద్ గ్రామ సమీపంలో వెంచర్‌లోని సర్వే నంబర్ 67, 71, 74, 105, 108లలో 10.20 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా చేశారని గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. మనోహరాబాద్ గ్రామానికి పక్కన ఏర్పాటు చేసిన వెంచర్‌లోని సర్వే నంబర్ 548లో .22 గుంటల ప్రభుత్వ భూమి, పురాతర దేవత విగ్రహాల తొలగింపు, చెరువుకు చెందిన చిన్నకాలువ పూడ్చివేత, గ్రామానికి అనుకొని ఉన్న 12 ఫీట్ల రోడ్డును అక్రమించి ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇస్లాంపూర్ గ్రామ సమీపంలో సర్వే నంబర్ 14లో ఓ రియల్ వ్యాపారి ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమించాడు. అయితే ఆ భూమిని ఓ మాజీ సైనికోద్యోగునికి ఇచ్చారని, అది తాము కొనుగోలు చేసినట్లు సదరు వ్యాపారి గ్రామస్తులకు వివరించారు. అయితే గ్రామస్తులు ఆందోళన చేయడంతో స్పందించిన రెవెన్యూ అధికారులు రికార్డులను పరిశీలించగా సైనికునికి ఇచ్చిన స్థలం మరో చోట ఉందని గుర్తించారు. కూచారం గ్రామ సమీపంలోని గ్రీన్ విల్లా పేరుతో 14 ఎకరాల్లో ఏర్పాటు చేసిన వెంచర్‌కు ఎలాంటి అనుమతులు లేవని రెవెన్యూ అధికారులు తెలిపారు. కాళ్లకల్ గ్రామ సమీపంలో 22 ఎకరాల్లో ఏర్పాటైన వెంచర్‌కు అనుమతులు లేవు.