బైక్‌పై కోతుల దాడి: యువతి మృతి | Monkeys attack on the bike | Sakshi
Sakshi News home page

బైక్‌పై కోతుల దాడి: యువతి మృతి

Published Wed, Dec 17 2014 4:56 AM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM

బైక్‌పై కోతుల దాడి: యువతి మృతి

బైక్‌పై కోతుల దాడి: యువతి మృతి

డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని చంద్రాయన్‌పల్లి అటవీ ప్రాంతంలో 44వ నెంబరు జాతీయ రహదారిపై మంగళవారం సాయంత్రం ఓ బైకుపై కోతులు చేసిన ఘటనలో ఓ యువతి మృతి చెందింది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఏఎస్‌ఐ నారాయణ కథనం ప్రకారం దోమకొండ మండల కేంద్రానికి చెందిన బొమ్మసాని చంద్రశేఖర్ తన సోదరి రమాదేవితో కలిసి ఓ శుభకార్యానికి హాజరైందుకు పల్సర్ బైక్‌పై సికింద్రాపూర్‌కు బయలు దేరారు.

వీరు డిచ్‌పల్లి మండలం చంద్రాయన్‌పల్లి అటవీ శివారు ప్రాంతానికి చేరుకునేటప్పటికి ఓ కోతుల గుంపు రోడ్డు దాటుతోంది. బైకుపై ఎర్ర రంగులో ఉన్న బ్యాగును చూసి ఒక కోతి దానిపై దూకింది. దీంతో వేగంగా ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి కిందపడింది. వెనుక కూర్చున్న రమాదేవి తలకు తీవ్రగాయాలు కాగా, చంద్రశేఖర్ కుడి చేయి విరిగింది. వీరిని 108 అంబులెన్స్‌లో కామారెడ్డికి తరలిస్తుండగా రమాదేవి మార్గమధ్యలో మృతి చెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement