మేడ్చల్, న్యూస్‌లైన్: తమ డిమాండ్ల సాధన కోసం హైదారాబాద్‌లో చేపట్టిన దీక్షలకు మద్దతుగా మేడ్చల్‌లో అంగన్‌వాడీలు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. విస్తరాకుల్లో మట్టితో వినూత్నం గా నిరసన వ్యక్తం చేశారు. డివిజన్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని మేడ్చల్, శామీర్‌పేట్, కీసర, కుత్బుల్లాపూర్ మండలాల అంగన్‌వాడీ కార్యకర్తలు పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయం నుంచి మేడ్చల్ ప్రధాన వీధుల మీదుగా బస్ డిపో వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్లను వెంటనే తీర్చాలన్నారు. 44వ జాతీయ రహదారిపై కార్యకర్తలు బైఠాయించి రాస్తారోకో చేశారు. దీంతో వాహనాలు నిలిచిపోయాయి.
వినూత్న నిరసన
ప్రభుత్వం తమకిస్తున్న వేతనాలతో కుటుంబానికి ఒక్కపూట భోజనం కూడా రావడం లేదని, దీంతో తాము వేతనాల పెంపు కోరుతున్నట్లు చెపాపరు. అంగన్‌వాడీ కార్యకర్తలు రహదారిపై సహ పంక్తిగా కూర్చొని విస్తరాకుల్లో మట్టి పోసుకుని నిరసన తెలిపారు. రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం కావడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అంగన్‌వాడీలతో వారికి సంఘీభావంగా తరలివచ్చిన సీఐటీయూ నాయకులను అరెస్ట్ చేసే యత్నం చేశారు. ఈక్రమంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు అంగన్‌వాడీ కార్యకర్తలను సముదాయించడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఉన్నారు.
‘అంగన్‌వాడీల’ ఆందోళన
Published Fri, Feb 14 2014 11:33 PM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM
Advertisement