rasta roko
-
విశాఖలో నినదించిన ఉక్కు నినాదం..
-
విశాఖలో నినదించిన ఉక్కు నినాదం..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరం ఉక్కు నినాదాలతో మార్మోగింది. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలంటూ కార్మికులు రోడ్డెక్కారు. గత కొంతకాలంగా దీక్షలు చేపట్టిన ఉద్యమకారులు శుక్రవారం ఉదయం 11 గంటలకు నగరంలోని అన్ని రోడ్లపై బైఠాయించారు. జాతీయ రహదారిపై గాజువాక, ఇసుకతోట, మద్దిలపాలెం జంక్షన్ వద్ద నిరసనను వ్యక్తం చేశారు. రోడ్డెక్కి రాస్తారోకో నిర్వహించారు. గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు.. నిలువరించడానికి ప్రయత్నించినప్పటికీ ఉద్యమకారులు వెనక్కి తగ్గలేదు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించుకుంటామంటూ నినాదాలు చేశారు. ఈ పరిస్థితుల మధ్య పోలీసులకు ఉద్యమకారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. చదవండి: చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి సవాల్.. బాబు బూతు పురాణం: రెచ్చగొట్టి.. రచ్చచేసి! -
విద్యార్థి రవితేజ మృతదేహంతో రాస్తారోకో
అర్ధవీడు: ప్రియురాలికి ఇమ్మన్న ప్రేమలేఖ చించివేశాడని విద్యార్థిపై పెట్రోలు పోసి నిప్పంటించిన ఘటనలో చికిత్సపొందుతున్న బాలుడు మృతిచెందగా శనివారం బంధువులు మృతదేహంతో ఆందోళకు దిగారు. అర్ధవీడు మండలం అంకభూపాలెంకు చెందిన 7వ తరగతి విద్యార్థి మెట్ల రవితేజపై మరో యువకుడు ఈనెల 7న పెట్రోలు పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రవితేజను గుంటూరు ప్రభుత్వ వైద్యశాల చేర్చారు. అక్కడ చికిత్స పొందుతున్న బాలుడు శుక్రవారం మృతి చెందాడు. మృతదేహాన్ని శనివారం స్వగ్రామానికి తెస్తున్నారని తెలిసి మృతుడి బంధువులు మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ఘటనకు కారణమైన ఇంటర్ విద్యార్థిని కఠినంగా శిక్షించాలని, రవితేజ మృతి సమయంలో ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఘటనలో మరి కొందరు ఉన్నారని వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాల వద్ద రోడ్డుకు అడ్డంగా రాళ్లు పెట్టి బస్సులను నిలిపివేశారు. సమీపంలోని చీమలేటిపల్లె వద్ద సైతం ఆందోళన చేశారు. సమాచారం తెలుసుకున్న మార్కాపురం సీఐ భీమానాయక్, కంభం, మార్కాపురం రూరల్ ఎస్సైలు రామానాయక్, మల్లికార్జునలు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌తో అర్ధవీడు వచ్చి ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు. నిందితుడిని కోర్టులో హాజరు పరిచామని ఇంక ఎవరిపైనైనా అనుమానాలు ఉంటే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారించి, చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇచ్చారు. ఇంతలో మృతదేహం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో గ్రామానికి తెచ్చినపుడు తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కసారిగా మృతుడి తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. గ్రామ పెద్దలు, బంధువులతో సీఐ, ఎస్సైలు, ఉపవిద్యాశాఖాధికారి పీసీహెచ్ వెంకటరెడ్డి, ఎంఈఓ వెంకటేశ్వరనాయక్లు బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు విద్యాశాఖ ద్వారా కలెక్టర్‌కు నివేదిక పంపించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తృప్తి చెందని రవితేజ బంధువులు మళ్లీ మృతదేహాన్ని అర్ధవీడు చర్చి సమీపంలోని రోడ్డుపై ఉంచి అర్ధరాత్రి వరకు బైఠాయించారు. తమ డిమాండ్లు పరిష్కరించేదాకా ధర్నా విరమించేదిలేదని జోరు వానలోనూ ఆందోళన చేశారు. ఎట్టకేలకు రాత్రి 11 గంటల తర్వాత మార్కాపురం ఆర్డీవో పెంచల కిషోర్, డీఎస్పీ రామాంజనేయులు వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
మమ్ముల్ని విడిచి వెళ్లొద్దు సారూ..
తలమడుగు: ‘ప్లీస్ సార్.. మమ్ముల్ని విడిచి వెళ్లొ ద్దు సారూ..’ అంటూ విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు. విద్యార్థులు తనపట్ల చూపిస్తున్న అభిమానానికి భావోద్వేగంతో ఆ ఉపాధ్యాయుడి కళ్లూ చెమ్మగిల్లాయి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం ఈ దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ పాఠశాలలో ఉపాధ్యాయుడు శ్రీకాంత్ ఆరేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. తన ఏకైక కుమార్తె లహస్యను తాను పనిచేస్తున్న ప్రభుత్వ పాఠశాలలోనే ఐదో తరగతి వరకు చదివించారు. ప్రస్తుతం ఆరో తరగతి కూడా పక్కనే ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిస్తున్నారు. అలాగే శ్రీకాంత్ బోధనలోనూ ఆందరికి అదర్శంగా నిలిచారు. తరగతి పేపర్ల మూల్యాంకనానికి వచ్చే డబ్బులను విద్యార్థులకు, పాఠశాల అభివృద్ధికి ఖర్చు పెట్టారు. తన సొంత డబ్బుతో పేద విద్యార్థులకు బూట్లు, నోట్‌బుక్స్ అందించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి తన వంతు కృషి చేశారు. తాజా బదిలీల్లో ఆయన భీంపూర్ మండలం అంతార్గావ్ పాఠశాలకు బదిలీ అయ్యారు. గురువారం పాఠశాల నుంచి వెళ్తుండగా విద్యార్థులు, గ్రామస్తులు అడ్డుకుని, తమను విడిచి వెళ్లవద్దని వేడుకున్నారు. ఉద్యోగులకు బదిలీ సహజమేనని, మిమ్మల్ని వీడి వెళ్తున్నందుకు తనకూ బాధగా ఉందని పేర్కొనడంతో విద్యార్థులు కంటతడి పెట్టుకోవడం కనిపించింది. మా ఉపాధ్యాయులు మాకు కావాలి జన్నారం(ఖానాపూర్): ‘ఇన్ని రోజులు మాకు చక్కగా చదువు చెప్పిన సార్లను బదిలీ చేశారు. మా ఉపాధ్యాయులను బదిలీ రద్దు చేసి ఇక్కడే కొనసాగించాల’ని కోరుతూ విద్యార్థులు ఏకంగా రోడ్డెక్కి రాస్తారోకో చేశారు. మంచిర్యాల జి ల్లా ఇందన్పల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజునాయక్, తెలుగు ఉపాధ్యాయుడు సుభాష్ ఇటీవల బదిలీ అయ్యారు. మా యోగక్షేమాలు చూసుకోవడమే కాకుండా మం చిగా చదువు నేర్పించిన ఉపాధ్యాయులను బది లీ చేయొద్దని కోరుతూ ప్రధాన రహదారిపై గం టసేపు రాస్తారోకో చేశారు. డీఈవో స్పందించి తమకు న్యాయం చేయాలని విద్యార్థులు కోరారు. మిగతా ఉపాధ్యాయులు వారికి నచ్చజెప్పి ఈ విషయాన్ని డీఈవో దృష్టికి తీసుకెళ్తామని తెలపడంతో రాస్తారోకో విరమించారు. -
కేంద్రం మెడలు వంచేదిశగా వైఎస్సార్సీపీ పోరు ఉధృతం
-
రేపు రహదారుల దిగ్బంధం.. ఎల్లుండి రైల్‌రోకో
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం మెడలువంచే దిశగా ఆందోళనలకు పిలుపిచ్చింది. మంగళవారం (ఏప్రిల్ 10న) రహదారుల దిగ్బంధం, బుధవారం (ఏప్రిల్ 11న) రైల్‌రోకో నిర్వహించనున్నట్లు పార్టీ ఒక ప్రకటన విడుదలచేసింది. వైఎస్సార్సీపీ ఎంపీల ఆమరణ దీక్షకు సంఘీభావంగా ఇప్పటికే అన్ని మండలాల్లో కొనసాగుతోన్న రిలే నిరాహారదీక్షలకు తోడు ఆందోళనా కార్యక్రమాలూ నిర్వహిస్తామని పార్టీ పేర్కొంది. రాష్ట్రవ్యాప్తం జరిగే ఈ ఆందోళనా కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులతోపాటు ప్రజలూ పాల్గొనాలని కోరారు. హోదా సాధన పోరులో భాగంగా సభ్యత్వాలకు రాజీనామాలు చేసిన ఐదుగురు వైఎస్సార్సీపీ ఎంపీలు.. ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. సోమవారం నాటికి దీక్ష నాలుగో రోజుకు చేరింది. దీక్ష చేస్తూ అస్వస్థతకు గురైన ముగ్గురు ఎంపీలు మేకపాటి, వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డిలను పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. అవినాశ్‌రెడ్డి, మిథున్‌రెడ్డిలు యధావిధిగా దీక్ష కొనసాగిస్తున్నారు. వారికి మద్దతుగా రాష్ట్రంలో సంఘీభావ దీక్షలతోపాటు ఆందోళనలూ చేపట్టాలని వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. -
చిత్తూరులో రాస్తారోకో
-
జాతీయరహదారిపై రాస్తారోకో: ట్రాఫిక్ జాం
జనగామ: కొత్తగా ఏర్పడిన జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్, చిల్పూర్, జఫర్గడ్ మండలాలను తిరిగి వరంగల్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ.. స్థానికులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. స్టేషన్ ఘన్పూర్ శివారులోని బొంగుల వాగుపై ఈ రోజు అఖిలపక్షాల నాయకులు ఆందోళన చేపట్టారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి పోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేస్తున్న నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
అనంతపురంలో ఆగ్రిగోల్డ్ బాధితుల రాస్తారోకో
-
ఆగ్రిగోల్డ్ బాధితుల రాస్తారోకో
-
మెయినాబాద్‌ను 'శంషాబాద్' లో కలిపితే ఊరుకోం
- రాస్తారోకో, మంత్రి దిష్టిబొమ్మ దహనం వికారాబాద్ రూరల్ : వెనుకబడిన ప్రాంతాలతో కూడిన వికారాబాద్ జిల్లాలో అంతా ఇంతో మెయినాబాద్ ఉందని సంతృప్తి చెందుతుంటే ఆ మెయినాబాద్‌ను కూడా శంషాబాద్ జిల్లాలో కలిపితే మరోసారి వికారాబాద్ ఉద్యమ సెగ చూపిస్తామని నిరుద్యోగ జేఏసీ హెచ్చరించింది. శనివారం నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులతో పెద్ద ఎత్తున వికారాబాద్ హైదరాబాద్ ప్రధాన బ్రిడ్జిపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం మంత్రి మహేందర్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.అడిగినోళ్లకు అడిగినట్లు ఇచ్చుకుంటూ పోతుంటే అసలు జిల్లాల ఏర్పాటు లక్ష్యం దెబ్బతింటుందని నిరుద్యోగ జేఏసీ జిల్లా కన్వీనర్ జొన్నల రవిశంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా పేరుతో నాలుగు నియోజకవర్గాలను వికారాబాద్ జిల్లా కేంద్రంగా చేసి ఇప్పుడు జిల్లాలో నుంచి మొయినాబాద్‌ను శంషాబాద్‌లో కలపడం ఏమిటని ప్రశ్నించారు. నేడు మొయినాబాద్ వాళ్లు అడిగారని శంషాబాద్‌లో కలిపారూ రేపు శంకర్పల్లి, షాబాద్ వాళ్లు కూడా అడుగుతున్నారూ వాళ్లను తీసుకెళ్తారా అని ధ్వజమెత్తారు. వికారాబాద్‌కు జిల్లాకు వికారాబాద్ పేరు లేదా అనంతగిరి పేరును పెట్టాలని లేని పక్షంలో మంత్రి మహేందర్‌రెడ్డి మరోసారి వికారాబాద్ ఉద్యమ సెగ చూపిస్తామని హెచ్చరించారు. వెనుక బడిన ఈ జిల్లాకు అంతో ఇంతో మొయినాబాద్ ఉంది అనుకుంటే దాన్ని కూడా ఇందులో నుంచి తీసి జిల్లాను రెవెన్యూ పరంగా మరింత వెనక్కి పంపిస్తున్నారన్నారు. -
కాపు నేతల రాస్తారోకో
పి.గన్నవరం: తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం జి.తెల్లపూడి గ్రామంలో కాపునేతలు బుధవారం ఉదయం రాస్తారోకో నిర్వహించారు. ముద్రగడకు మద్దతుగా కాపు సామాజికవర్గానికి చెందిన ప్రజలు రాస్తారోకో చేశారు. దాంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. మరో వైపు పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణంలోని భక్తాంజనేయస్వామి ఆలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్న కాపు నేతలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ముద్రగడ దీక్షకు మద్దతుగా కొవ్వూరులో కాపు నేతలు రిలే దీక్షలకు కూర్చున్నారు. -
విలేకరిపై దాడికి నిరసనగా రాస్తారోకో
ఓడీచెరువు (అనంతపురం జిల్లా) : ఓడీ చెరువు 'సాక్షి' విలేకరి చంద్రశేఖర్ రెడ్డిపై దాడికి నిరసనగా సీపీఐ, వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఓడీ చెరువులో శనివారం రాస్తారోకోకు దిగారు. దాడికి పాల్పడిన రేషన్ డీలర్ యజమానిని వెంటనే అరెస్ట్ చేయాలని, డీలర్షిప్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఓడీచెరువు మండలంలోని మహమ్మదాబాద్ క్రాసింగ్ వద్ద నున్న చౌక ధరల దుకాణం డీలర్ మానస తమకు సరుకులు సక్రమంగా ఇవ్వడంలేదని కార్డుదారులు ఫిర్యాదు చేశారు. దీనిపై గురువారం డిప్యూటీ తహశీల్దార్ మహబూబ్‌పీరా గ్రామానికి వెళ్లి విచారణ జరిపారు. ఈ అంశాన్ని ‘సాక్షి’తో పాటు అన్ని పత్రికలూ ప్రచురించాయి. అయితే సాక్షిలో ఫోటోతో పాటు ప్రచురించారంటూ డీలర్ భర్త రాజశేఖరా చారి, అతడి అత్తమామలు మునిస్వామి, వెంకటలక్ష్మి శుక్రవారం సాక్షి విలేకరిపై దాడి చేసి దుర్భాషలాడారు. స్థానికులు కల్పించుకుని విలేకరిని కాపాడారు. దాడికి పాల్పడ్డ వారిపై బాధితుడు ఓడీ చెరువు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. -
సాగునీటి కోసం గ్రామస్తుల ఆందోళన
పెంటపాడు (పశ్చిమగోదావరి జిల్లా) : పెంటపాడు మండలం మౌంజీపాడు, జెట్లపాలెం గ్రామాలకు చెందిన రైతులు శుక్రవారం రహదారిపై రాస్తారోకోకు దిగారు. పంట సాగుకు నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులను అడ్డుకున్నారు. నీళ్లు వదులుతామని హామీ ఇచ్చే వరకు అధికారులను విడిచిపెట్టేది లేదని భీష్మించుకు కూర్చున్నారు. ఈ విషయం గురించి అధికారులకు అడిగితే..వంతులవారీ విధానం ప్రకారం నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. మరో 3 రోజులు ఆగాల్సి ఉందని అన్నారు. -
'ఆసరా' కోసం రాస్తారోకో
బీర్కూర్ (నిజామాబాద్ జిల్లా) : గడచిన కొన్ని నెలలుగా ఆసరా ఫించన్ అందకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన బాట పట్టారు. సోమవారం బీర్కూర్ మండల కేంద్రంలో దాదాపు గంటసేపు రోడ్డుపై బైఠాయించి తమ ఫించన్‌ను అందించాలని రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోలో సుమారు 50 మంది పాల్గొన్నారు. -
మద్దతు ధర కోసం రైతుల రాస్తారోకో
తిరుమలగిరి : నల్లగొండ జిల్లా తిరుమలగిరిలో వేరుశనగ మద్దతు ధర కోసం రైతులు సోమవారం రాస్తారోకో చేశారు. మార్కెట్‌యార్డులో క్వింటాలు వేరుశనగ శనివారం రూ.5,900 నుంచి రూ.6,300 పలికింది. సోమవారం ఆ ధరను రూ.4 వేల నుంచి రూ.5 వేలకు తగ్గించేశారు. దీంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సుమారు 300 మంది రైతులు మద్దతు ధర ఇవ్వాలనే డిమాండ్‌తో మధ్యాహ్నం సూర్యాపేట-జనగామ రహదారిపై రాస్తారోకో చేశారు. -
ప్రిన్సిపాల్‌ను తొలగించాలంటూ రాస్తారోకో
నేలకొండపల్లి (ఖమ్మం) : విద్యార్థుల బాగోగులను పట్టించుకోని ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలంటూ ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో రాస్తారోకో జరిగింది. స్థానిక ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో ఆదివారం ప్రమాదవశాత్తు ఒక విద్యార్థిని కరెంట్ షాక్‌కు గురైంది. ఈ ఘటన అనంతరం ప్రిన్సిపాల్ వెంకట లక్ష్మి సరిగ్గా స్పందించలేదని ఆరోపిస్తూ సోమవారం ఉదయం మాలమహానాడు, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కొందరు పాఠశాల ఎదురుగా రహదారిపై బైఠాయించారు. దాదాపు రెండు గంటలపాటు ఆందోళన కొనసాగింది. సీఐ కిరణ్‌కుమార్ అక్కడికి చేరుకుని, వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో వారు ఆందోళన విరమించారు. -
కళాశాలలో వసతులు లేవని రాస్తారోకో
లక్సెట్టిపేట్ (ఆదిలాబాద్) : కళాశాలలో కనీస వసతులు కూడా కరువయ్యాయని ఆందోళన వ్యక్తం చేస్తూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కనీసం మరుగుదొడ్లు కూడా లేవంటూ మంగళవారం విద్యార్థినీవిద్యార్థులు మంచిర్యాల-ఆదిలాబాద్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. సుమారు అరగంటపాటు చేపట్టిన ఆందోళనతో ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కాగా పోలీసులు విద్యార్థులను సముదాయించి, ఆందోళన విరమింపజేశారు. -
రైతు సమస్యలపై కాంగ్రెస్ రాస్తారోకో
గొల్లపల్లి (కరీంనగర్) : అన్నదాతల సమస్యలను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ విదేశీ పర్యటనలు చేస్తున్నారంటూ శుక్రవారం కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ప్రభుత్వ వైఖరి వల్లే రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఈ సందర్భంగా నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు జగిత్యాల- ధర్మారం రోడ్డుపై గంటసేపు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం స్థానిక తహశీల్దార్ సురేఖకు వినతిపత్రం అందజేశారు. -
భూములిచ్చి వెనక్కి తీసుకోవటంపై రాస్తారోకో
విడపనకల్లు (అనంతపురం) : తమకు ప్రభుత్వం పంపిణీ చేసిన భూములను ఖాళీ చేయాలంటూ అధికారులు నోటీసులివ్వటంపై లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం వి.కొత్తకోట గ్రామానికి చెందిన 29 మంది ఎస్సీలకు ప్రభుత్వం సాగుభూమిని పంపిణీ చేసింది. అయితే ఆ భూమిని తిరిగి స్వాధీనం చేయాలంటూ అధికారులు ఇటీవల నోటీసులు పంపారు. దీనిపై వారంతా ఆగ్రహం చెంది ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో విడపనకల్లు తహశీల్దార్ కార్యాలయం ఎదుట 42వ నంబర్ జాతీయ రహదారిపై బైఠాయించారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు రాస్తారోకో చేశారు. దీంతో అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో ఆందోళనను విరమించారు. -
రుణమాఫీ కోసం రైతుల రాస్తారోకో
కొల్చారం (మెదక్ జిల్లా) : మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని చిన్నఘనాపూర్ గ్రామానికి చెందిన రైతులు మంగళవారం మెదక్-జోగిపేట ప్రధాన రహదారిపై రుణమాఫీ కోరుతూ రాస్తారోకోకు దిగారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు రాస్తారోకోలో పాల్గొని అటు ప్రభుత్వానికి, బ్యాంక్ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో ఇరువైపుల వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. దీంతో అక్కడికి చేరుకున్న కొల్చారం పోలీసులు రైతులను సముదాయించి రోడ్డుపై నుంచి తప్పించారు. రైతులు మాట్లాడుతున్న చిన్నఘనాపూర్ గ్రామం మెదక్ ఏడిబి బ్యాంక్ పరిధిలో కొనసాగుతుంది. ప్రభుత్వం రుణమాఫీలో భాగంగా 25శాతం డబ్బులను రైతులకు అందించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. కాగా బ్యాంక్ అధికారులు మాత్రం రుణానికి సంబంధించి 75శాతం డబ్బులు రుణాన్ని రీషెడ్యూల్ చేస్తేనే 25శాతం మాఫీని వర్తింపజేస్తామని రైతులకు షరతులు విధించిందని ఆరోపించారు. దీంతో పాటు కొత్తగా రుణాలు కూడా ఇవ్వడం లేదని రైతులు ఆరోపించారు. అసలే ఉన్న డబ్బులను పంటసాగు కోసం పెట్టుబడి పెట్టి చేతిలో చిల్లిగవ్వలేకుండా ఉన్న తాము అప్పును రెన్యువల్ చేసే పరిస్థితి లేదని బ్యాంక్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. -
బస్సుల కోసం రాస్తారోకో
పెద్ద గోల్కొండ (శంషాబాద్ రూరల్) : సరిపడా బస్సు సౌకర్యాలు కల్పించాలని కోరుతూ మండలంలోని పెద్దగోల్కొండలో సోమవారం విద్యార్థులు, గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించి ఆందోళన చేపట్టారు. నాగారం-శంషాబాద్ రూట్లో వచ్చే బస్సులను అడ్డుకున్నారు. గ్రామానికి సరైన బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నామని వారు పేర్కొన్నారు. నాగారం వైపు నుంచి వచ్చే బస్సులు కిక్కిరిసి వస్తున్నాయని, అందులో ఎక్కేందుకు స్థలం దొరకడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సందర్భాల్లో బస్సులను ఇక్కడి బస్టాప్‌లో నిలపడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రూట్లో బస్సు సర్వీసులను పెంచాలని ఆర్టీసీ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించడంలేదని వారు పేర్కొన్నారు. సుమారు అరగంట పాటు నాగారం, శంషాబాద్ రూట్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో శాంతించారు. -
ఉల్లి ధరలు తగ్గించాలని రాస్తారోకో
అమలాపురం (తూర్పుగోదావరి జిల్లా) : చుక్కలనంటుతున్న ఉల్లి ధరలు వెంటనే తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్సీపీ రాస్తారోకోకు దిగింది. ఈ మేరకు గురువారం తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని వైఎస్సార్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. మాజీ మంత్రి విశ్వరూప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మేరకు పెరిగిన ఉల్లి ధరలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాస్తారోకో
అనంతపురం (హిందూపురం) : పోలీసులకు, లారీ అసోసియేషన్ సభ్యులకు మధ్య ఏర్పడిన వివాదం రాస్తారోకోకు దారి తీసింది. అనంతపురం జిల్లా హిందూపురంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ వ్యక్తి ఎలాంటి సభ్యత్వం లేకుండా సరకు రవాణా చేస్తుండటాన్ని అసోసియేషన్ అడ్డుకుంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి అసోసియేషన్ సభ్యులను మందలించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే పీఎ ఆదేశాలతో పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారంటూ అసోసియేషన్ సభ్యులు రాస్తారోకోకు దిగారు. -
'కళంకిత మంత్రులను వెంటనే తొలగించాలి'
ఎల్బీనగర్ (హైదరాబాద్) : కేంద్ర ప్రభుత్వ మంత్రి వర్గంలో ఉన్న కళంకిత మంత్రులను వెంటనే తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ ఎల్బీనగర్ చింతల్‌కుంటలో జాతీయ రహదారి-65 పై రాస్తోరోకో నిర్వహించారు. కళంకిత మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలను రోడ్డుపై దహనం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు పాల్గొన్నారు. జాతీయరహదారిపై రాస్తోరోకోకు దిగడంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. -
‘ఓటుకు కోట్లు’తో పాలన పడక
-
‘ఓటుకు కోట్లు’తో పాలన పడక
కేసు నుంచి బయటపడటంపైనే సర్కారు దృష్టి ♦ పక్షం రోజులుగా సమయమంతా దానికే వెచ్చిస్తున్న సీఎం, మంత్రులు ♦ కేబినెట్ భేటీలు సైతం తూతూ మంత్రం ♦ రాష్ట్రంలో సమస్యలను పట్టించుకున్న నాథుడే లేడు ♦ ఎరువులు, విత్తనాల కోసం రైతన్నల ఆందోళన ♦ బడులు ప్రారంభమైనా అందని పాఠ్యపుస్తకాలు ♦ నిత్యావసరాల ధరలు పైపైకి.. సాక్షి, హైదరాబాద్: వరుస విపత్తుల తర్వాత తొలకరి వర్షాలతో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు విత్తనాలు, ఎరువుల కొరతతో సతమతమవుతున్నారు. పంటల సాగుకు అవసరమైన పెట్టుబడుల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా.. రుణాలందక అష్టకష్టాలు పడుతున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటికీ పుస్తకాలు, యూనిఫామ్‌లు అందకపోవడంతో విద్యార్థులు చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే పూర్తికావాల్సిన ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ అడుగు ముందుకు పడలేదు. మరోవైపు కూరగాయలు, పప్పు దినుసుల రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చకచకా నిర్ణయాలు తీసుకుని సమస్యల పరిష్కారం దిశగా అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాల్సిన పాలకులు పక్షం రోజులుగా పాలనను గాలికొదిలేశారు. గత నెల 31వ తేదీన ‘ఓటుకు కోట్లు’ వ్యవహారం బయటపడింది మొదలు రాష్ట్రంలో ఈ పరిస్థితి కొనసాగుతోంది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎమ్మెల్యేల ఓట్లు కొనుగోలు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాన్నుంచి బయటపడే మార్గాలపైనే సమయాన్నంతా వెచ్చిస్తున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులతో ఈ అంశంపై చర్చల్లో మునిగితేలుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ఒకటీ అరా సమీక్షలు నిర్వహించినా తూతూమంత్రంగానే సాగుతున్నాయి. చివరకు కేబినెట్ సమావేశాల్లోనూ ఈ కేసుల వ్యవహారంపైనే చర్చోపచర్చలు. ఈ నెల 9 తర్వాత తాజాగా బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ ‘ఓటుకు కోట్లు’ కేసుపైనే చర్చ తప్ప.. తక్షణం పరిష్కరించాల్సిన ప్రజా సమస్యలపై దృష్టి సారించలేదు. క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకోవాల్సిన మంత్రులంతా హైదరాబాద్‌లోనే మకాం వేసి సీఎం చుట్టూ తిరుగుతున్నారు. రుణాల కోసం బ్యాంకుల చుట్టూ రైతులు రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో వేరుశనగ విత్తనాల కోసం రైతులు రోడ్డెక్కారు. మొన్నటి వర్షాలతో దుక్కి చేసిన రైతులు వరి విత్తనాలు, ఎరువుల కోసం చాలా అవస్థలు పడుతున్నారు. విశాఖపట్నం జిల్లాకు ఖరీఫ్‌లో 72 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం కాగా వ్యవసాయ శాఖ వద్ద కేవలం 6వేల క్వింటాళ్లు మాత్రమే ఉన్నాయి. జిల్లాలో రూ.1,200 కోట్ల రుణాలు ఇవ్వాలనేది లక్ష్యం కాగా ఇప్పటివరకు రూ.5 కోట్లు కూడా ఇవ్వలేదు. గుంటూరు జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో రూ.8,000 కోట్ల బ్యాంకు రుణాలు ఇప్పించాలని జిల్లా అధికారులు రుణ ప్రణాళిక రూపొందించినా ఇంతవరకు ఒక్క రైతుకు కూడా పంట రుణం ఇవ్వకపోవటం గమనార్హం. సీజన్‌కు ముందే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశం నిర్వహించి రుణ ప్రణాళిక నిర్ణయించి లక్ష్యం మేరకు అప్పులిచ్చేలా చర్యలు తీసుకోవాల్సిన సర్కారు అసలు సమావేశం ఎప్పుడో కూడా నిర్ణయించలేదు. కౌలు రైతులకు రుణ అర్హత కార్డుల జారీ అంశాన్ని పూర్తిగా మర్చిపోయింది. గత పక్షం రోజుల్లో అన్ని రకాల పప్పుల ధరలు భారీగా పెరిగాయి. కూరగాయల ధరలైతే ఏకంగా రెట్టింపయ్యాయి. నూనెల ధరలు సలసలా కాగుతున్నాయి. మొన్నటివరకు రూ. 95 ఉన్న కందిపప్పు రూ. 120కి పెరిగింది. పచ్చిమిర్చి కిలో రూ.60 పలుకుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు గోదావరి పుష్కరాల సమయం దగ్గరపడుతున్నా ఉభయగోదావరి జిల్లాల్లో కీలకమైన పనులు అసంపూర్తిగానే మిగిలాయి. స్తంభించిన పోలీసింగ్.. రాష్ట్రంలో పోలీసు పాలన కూడా స్తంభించింది. ఓటుకు కోట్లు వ్యవహారంలో చట్ట ప్రకారం నడుచుకోవలసిన పోలీసులు.. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి సేవల్లో మునిగి తేలుతున్నారనే ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులంతా గత పక్షం రోజులుగా ఈ కేసు వ్యవహారంపైనే దృష్టి సారించారు. సమయమంతా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కౌంటర్ తయారు చేయడానికే వెచ్చించాల్సి వస్తోందని ఒకవర్గం పోలీసు ఉన్నతాధికారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. శాంతిభద్రతల్ని కాపాడటం, చట్టాన్ని అమలు చేయడం తమ ప్రాథమిక విధులని, తాజా పరిణామాల నేపథ్యంలో వీటికి బదులు ప్రభుత్వం కోరుతున్న ‘ఆధారాలను’ సమర్పించడానికే సమయం చాలట్లేదని వ్యాఖ్యానిస్తున్నారు. గడిచిన 17 రోజులుగా రాష్ట్రంలో పోలీసింగ్ దాదాపు నిలిచిపోయినట్లే భావించాల్సి వస్తోందని అంటున్నారు. అన్నీ వదిలి పట్టిసీమకెందుకో..? పంటల సాగుకు అత్యంత ప్రధానమైన విత్తనాలు, ఎరువుల కొరతను పరిష్కరించే మార్గం చూడకుండా, రైతులకు రుణాలపై ఆలోచన చేయకుండా గురువారం సీఎం గోదావరి జిల్లాలకు వెళ్లి పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. వర్షాల సమయంలో పట్టిసీమ లిఫ్ట్‌తో పనేమిటని రైతులు నిలదీస్తున్నారు. వర్షాలు రాకముందే పుష్కర పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోకుండా ఇప్పుడు హడావుడి చేస్తే ప్రయోజనం ఏముంటుందని ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారు. ‘పనిలోపనిగా గురువారం రాత్రి విజయవాడలో మకాం వేసి ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంపై ముఖ్యమైన నేతలు, అధికారులతో చర్చించారు..’ అని ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు ‘సాక్షి’తో అన్నారు. -
రోజాపై అక్రమకేసుతో ఆగ్రహం
* నగరిలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో దళితుల ధర్నా, రాస్తారోకో * రాజకీయంగా ఎదుర్కొలేకే తప్పుడు కేసులంటూ ఆగ్రహం విజయపురం (నగరి ) : నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో దళితులు సోమవారం నగరిలో పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ఎమ్మెల్యే రోజాపై పెట్టిన అక్రమ కేసు ఎత్తి వేయాలని దళితులు నినాదాలు చేస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్రయువజన కార్యదర్శి శ్యామ్‌లాల్, నత్తం కృష్ణమూర్తి తదితర ఐదు మండలాల దళితనేతల ఆధ్వర్యంలో పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయ సమీపంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద నుంచి ర్యాలీ బయలుదేరి ఓం శక్తి దేవాయలయం వద్దకు చేరుకుంది. అక్కడ దళితులు బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలంటే ఎమ్మెల్యే రోజాకు ఎంతో అభిమానమని, వారి ఇంట జరిగే శుభాకార్యాలకు అందరికి కంటే ముందుగా ఉంటూ వారిని ఆదరిస్తున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు ఎస్సీ, ఎస్టీలపై ప్రత్యేకమైన ప్రేమ ఉన్నట్లు ఇది చేస్తా, అది చేస్తా అని ఆశ చూపించి ఓట్లు దండుకుని ఇప్పుడు అనేక కారణాలు చూపించి మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నగరి మాజీ శాసనసభ్యుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు నేడు దళితులపై కపట ప్రేమను చూపించి తమలో తమకు చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. నిజంగా ఎస్సీ, ఎస్టీల హక్కుల కోసం పోరాడుతున్న ఎమ్మెల్యే రోజా దళిత వ్యతిరేకి అని అభాండాలు వేయించి తమలో చీలిక తేవడానికి ప్రయత్నించే నీచ రాజకీయాలను ఆయన మానుకోవాలని హితవు పలికారు. అటువంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా నెరవేరవ రని, తమ హృదయాల్లో స్థానం సంపాదించి తమ కోసం పోరాడుతున్న నేత ఎవరో తమకు స్పష్టంగా తెలుసునని చెప్పారు. కుట్రపూరిత పన్నాగాలకు తాము లోబడమని హెచ్చరించారు. తమ లో తమకు చిచ్చుపెట్టే ప్రయత్నాలు మానుకోకుంటే టీడీపీకి తగిన గుణపాఠం చెబుతామని, దళితులు టీడీపీలో ఉండే పరిస్థితి లేదని తీవ్రంగా హెచ్చరించారు. ఈ ధర్నా,రాస్తారోకోలో మున్సిపల్ చైర్పర్సన్ కేజే శాంతి, వైస్ చైర్మన్ నీలమేఘం, చంద్రారెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. కొం దరు నాయకులు రాజకీయంగా ఎదుర్కొలేక ఎస్సీ, ఎస్టీలను రెచ్చకొట్టి నడిరోడ్డుకు ఈడుస్తున్నారని వారు విమర్శించారు. దళితనాయకులు ఆర్ముగం, సుబ్రమణ్యం, యోహాన్, యకోబ్, రవి, శీన, వజ్రవేలు, రాజాముత్తు, చిన్నదొర, పిచ్చెమ్మ (కౌన్సిలర్) దినకర్, సీఫెన్, సెల్వం, బాలన్, అమ్ములు, మురుగన్, తెరణిరవి, శేఖర్, కన్నప్ప, గోవర్థన్, శేఖర్, నాటరాజన్, ధనపాల్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, కేజే సురేష్, యువరాజ్, రాజాదాస్, తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాత ఆగ్రహం
ముచ్చర్ల విద్యుత్ సబ్‌స్టేషన్‌పై రైతుల దాడి - ఫర్నిచర్ ధ్వంసం - కార్యాలయం ఎదుట రాస్తారోకో కామేపల్లి :విద్యుత్ సరఫరా సక్రమంగా లేక పంటలు ఎండిపోతున్నాయని, నిర్ణీత సమయమంటూ లేకుండా విద్యుత్ కోతలు విధిస్తున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కామేపల్లి మండలం ముచ్చర్ల సబ్‌స్టేషన్‌పై బుధవారం తెల్లవారుజామున మద్దులపల్లి గ్రామ రైతులు దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. సబ్‌స్టేషన్ గేటు తొలగించి రోడ్డుపై పడేశారు. కిటికీలు పగలకొట్టి రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ప్రతిరోజు రాత్రిపూట కనీసం నాలుగు గంటలు విద్యుత్ సరఫరా చేయాల్సి ఉండగా, వారం రోజులుగా తీవ్రంగా కోత విధిస్తున్నారని, ఏ సమయంలో విద్యుత్ వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియడం లేదని, కనీసం రాత్రి 30 నిమిషాలు కూడా కరెంట్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో విద్యుత్ ఇస్తామని చెపుతున్న సిబ్బంది వారం రోజులుగా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. వేలకు వేలు అప్పు చేసి పంటలకు పెట్టుబడి పెడితే విద్యుత్ సరఫరా లేక అవి ఎండిపోతున్నాయని, దీంతో తమకు భారీ నష్టం వాటిల్లుతోందని వాపోయారు. పరిస్థితి ఇలాగే ఉంటే తమకు ఆత్మహత్యే శరణ్యమని అన్నారు. విద్యుత్ సరఫరా వేళల గురించి సమాచారం చెప్పే విద్యుత్ సిబ్బంది కరువయ్యారని, దీంతో రాత్రింబవళ్లు పొలాల వద్దే జాగారం చేయాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఏఈ భీంసింగ్ సబ్‌స్టేషన్ వద్దకు రాగా ఆయనను రైతులు నిలదీశారు. తమకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కాగా సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందని, మరమ్మతు చేయించే వరకు జాప్యం జరుగుతుందని, ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమీపంలో ఉన్న సబ్‌స్టేషన్ నుంచి వ్యవసాయానికి విద్యుత్ అందిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు. -
రోడ్డెక్కిన రైతన్న
వ్యవసాయానికి కరెంటు కోతలపై కన్నెర్ర సబ్‌స్టేషన్ ఎదుట రాస్తారోకో సారంగాపూర్ : వ్యవసాయానికి అందించే త్రిఫేజ్ విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాన్ని నిరసిస్తూ సోమవారం సారంగాపూర్ మండలం బోరిగాం గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. సుమారు 150 మంది రైతులు చించోలి(బి) సబ్‌స్టేషన్ ఎదుట స్వర్ణ-నిర్మల్ ప్రధాన రహదారిపై గంటపాటు రాస్తారోకో చేశారు. కొద్ది రోజులుగా వ్యవసాయానికి అందించే విద్యుత్ సరఫరాలో పదేపదే అంతరాయం కలగడంతో సక్రమంగా నీరందక పంటలు ఎండుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. సరఫరా నిలిచిన సమయంలో సబ్‌స్టేషన్‌కు ఫోన్ చేస్తే పైనుంచి పవర్ పోయిందని అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. అదే సమయంలో పక్కనే ఉన్న సారంగాపూర్, స్వర్ణ గ్రామాల్లోని సబ్స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరా ఉంటోందని పేర్కొన్నారు. సమస్యను సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి పరిష్కార చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. ఆదివారం సైతం త్రిఫేజ్ సరఫరాలో నాలుగుసార్లు అంతరాయం కలిగిందని, సుమారు రెండు గంటల విద్యుత్ సరఫరాను నష్టపోయామని తెలిపారు. ట్రాన్స్‌కో ఏఈ మల్లేశ్ సబ్‌స్టేషన్‌కు చేరుకొని రైతులతో మాట్లాడారు. ఆదివారం జరిగిన కరెంటు నష్టాన్ని మిగతా రోజుల్లో భర్తీ చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి వెనుదిరిగారు. -
రుణాలు మాఫీ చేయాలి
డ్వాక్రా సంఘాల సభ్యుల రాస్తారోకో రెబ్బెన : తాము గతంలో తీసుకున్న రుణాలు మాఫీ చేయాలని డ్వాక్రా సంఘాల సభ్యులు డిమాండ్ చేశారు. శనివారం డ్వాక్రా సంఘాల మహిళలంతా మండల కేంద్రంలోని అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి ఆందోళనలో పాల్గొని సభ్యులనుద్దేశించి మాట్లాడారు. రైతుల పంటరుణాల మాఫీ నేపథ్యంలో డ్వాక్రా సంఘాల సభ్యుల రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న డ్వాక్రా సంఘాల సభ్యులను ఆదుకోవాల్సిన బాధ్యత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్రంలో రైతులతోపాటు మహిళలు సైతం ఓట్లు వేస్తేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాల రుణ పరిమితి పెంచే బదులు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తే సభ్యులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే మహిళలందరూ రుణమాఫీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. డ్వాక్రా సంఘాల సభ్యుల రుణాలు మాఫీ చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రెబ్బెన సర్పంచ్ పెసరి వెంకటమ్మ, డ్వాక్రా సంఘాల సభ్యులు అనిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
హింసించి కాన్పుచేశారు
బి.కొత్తకోట, న్యూస్‌లైన్: ప్రసవం కోసం వచ్చిన ఓ మహిళను వైద్యసిబ్బంది హింసించి ప్రసవం చేయించారని, దీనికారణంగానే పురిటిబిడ్డ మృతిచెందిందని బంధువులు, సీపీఐ నాయకులు, కార్యకర్తలు బి.కొత్తకోటలో మంగళవారం ఆందోళన నిర్వహించారు. పురిటిబిడ్డ మరణంపై వైద్యాధికారులు విచారణ చేపట్టారు. బాధితుల కథనం మేరకు బి.కొత్తకోట మండలంలోని దిన్నిమీదపల్లెకు చెందిన గర్భవతి జీ.సిద్దమ్మ (25)కు మంగళవారం తెల్లవారుజామున పురిటినొప్పులొచ్చారుు. భర్త వెంకటనారాయణ 108కు ఫోన్‌చేశాడు. అది రాగానే ఆమెను కుటుంబ సభ్యులు మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించాలని కోరారు. దగ్గరలో బి.కొత్తకోట ప్రభుత్వాస్పత్రి ఉండటం, సిద్దమ్మకు మూడో కాన్పు కావడంతో బి.కొత్తకోటకే తరలించారు. నర్సులు వరలక్ష్మి, జ్యోత్స్న పరీక్షించారు. కాన్పు ఇబ్బందికరమైతే మదనపల్లెకు పంపాలని వారిని వెంకటనారాయణ కోరాడు. నర్సులు అవసరంలేదంటూ కాన్పు చర్యలు చేపట్టారు. ఈ సమయంలో నర్సులు తీవ్రంగా హింసించారని బాలింత సిద్దమ్మ విలపించింది. చెంపలపై కొట్టారని, కడుపుపై చేతులుపెట్టి గట్టిగా నొక్కారని చెప్పింది. చెంపలపై కొట్టిన దెబ్బలకు చె వి, ముక్కులోంచి రక్తం కారిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ప్రసవం జరగ్గా మరణించిన మగశిశువును అప్పగించారని భర్త వెంకటనారాయణ పేర్కొన్నాడు. ప్రసవం ఇబ్బంది అయితే మదనపల్లెకు రెఫర్ చేయాలని కోరినా పట్టించుకోకుండా ఇలా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశాడు. కుటుంబీకులు, బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకుని సిబ్బంది నిర్లక్ష్యంపై నిలదీశారు. దీనిపై వైద్యాధికారిణి గంగాదేవి మాట్లాడుతూ ప్రసవ సమయంలో పురిటిబిడ్డ తల బయటకు రాకుండా ఇరుక్కుపోవడంవల్లే ప్రాణం పోయిందని, ఇందులో సిబ్బంది నిర్లక్ష్యం లేదని చెప్పారు. నిరసనగా రాస్తారోకో పురిటిబిడ్డ మరణంపై బాధిత కుటుంబీకులు, సీపీఐ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వాస్పత్రి ఎదుట రాస్తారోకో నిర్వహించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు. ప్రసవం కోసం వస్తే పురిటిబిడ్డ ప్రాణాలు తీశారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి దశరధరామయ్య ఆందోళనకారులతో ఫోన్లో మాట్లాడారు. ఈ ఘటనపై విచారణ జరిపించి, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్థానిక తహశీల్దార్ శివయ్య బాధితులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు మనోహర్‌రెడ్డి, మహమ్మద్‌ఖాసీం, అషఫ్రల్లీ, రఘునాథ్, చిన్నరెడ్డెప్ప, సలీంబాషా పాల్గొన్నారు. నర్సుల నిర్లక్ష్యమని తేలితే చర్య పురిటిబిడ్డ మరణం విషయంలో నర్సులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తేలితే చర్యలు తప్పవని జిల్లా అదనపు వైద్యాధికారి, జిల్లా ప్రాజెక్టు అధికారి మునిరత్నం చెప్పారు. పురిటిబిడ్డ మరణంపై వైద్యాధికారులు మంగళవారం సాయంత్రం ఆయన విచారణ చేపట్టారు. ఆయన వెంట మదనపల్లె, తంబళ్లపల్లె క్లస్టర్ అధికారులు లక్ష్మీనరసింహులు, వెంకటస్వామి, స్థానిక వైద్యాధికారిణి గంగాదేవి ఉన్నారు. బాధితురాలు ఆస్పత్రికి వచ్చినప్పటి నుంచి ప్రవసం అయ్యే దాకా వైద్యపరంగా తీసుకున్న చర్యలను అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విచారణ జరిపి సంబంధిత నివేది కను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి అప్పగిస్తామని మునిరత్నం చెప్పారు. -
‘అంగన్వాడీల’ ఆందోళన
మేడ్చల్, న్యూస్‌లైన్: తమ డిమాండ్ల సాధన కోసం హైదారాబాద్‌లో చేపట్టిన దీక్షలకు మద్దతుగా మేడ్చల్‌లో అంగన్వాడీలు శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. విస్తరాకుల్లో మట్టితో వినూత్నం గా నిరసన వ్యక్తం చేశారు. డివిజన్ ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని మేడ్చల్, శామీర్‌పేట్, కీసర, కుత్బుల్లాపూర్ మండలాల అంగన్వాడీ కార్యకర్తలు పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయం నుంచి మేడ్చల్ ప్రధాన వీధుల మీదుగా బస్ డిపో వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్లను వెంటనే తీర్చాలన్నారు. 44వ జాతీయ రహదారిపై కార్యకర్తలు బైఠాయించి రాస్తారోకో చేశారు. దీంతో వాహనాలు నిలిచిపోయాయి. వినూత్న నిరసన ప్రభుత్వం తమకిస్తున్న వేతనాలతో కుటుంబానికి ఒక్కపూట భోజనం కూడా రావడం లేదని, దీంతో తాము వేతనాల పెంపు కోరుతున్నట్లు చెపాపరు. అంగన్వాడీ కార్యకర్తలు రహదారిపై సహ పంక్తిగా కూర్చొని విస్తరాకుల్లో మట్టి పోసుకుని నిరసన తెలిపారు. రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం కావడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అంగన్వాడీలతో వారికి సంఘీభావంగా తరలివచ్చిన సీఐటీయూ నాయకులను అరెస్ట్ చేసే యత్నం చేశారు. ఈక్రమంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు అంగన్వాడీ కార్యకర్తలను సముదాయించడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ఉన్నారు. -
సాగర్‌నీటి కోసం రైతుల రాస్తారోకో
తల్లాడ, న్యూస్‌లైన్: సిరిపురం మేజరు కాల్వకు సాగర్ నీటి సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మల్లవరం, నారాయణపురం, తల్లాడ, అన్నారుగూడెం గ్రామాలకు చెందిన రైతులు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఎన్ఎస్పీ సబ్‌డివిజన్ కార్యాలయం వద్ద నాలుగు గంటలపాటు ధర్నా చేశారు. అయినా ఏఈ, డీఈలు రాకపోవడంతో ఆగ్రహించి ఎన్ఎస్పీ కార్యాలయం నుంచి తహశీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్లి గంటపాటు ధర్నా చేశారు. ఎన్ఎస్సీ ఎస్ఈకి తహశీల్దార్ ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఆందోళనకారుల వద్దకు వచ్చి సాగర్ జలాలపై మాట్లాడాలని కోరారు. అందుకు ఎస్ఈ నిరాకరించారు. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్రీయ రహదారిపై రాస్తారోకో చేశారు. సాగర్‌నీటిని వారబందీ పద్ధతిలో సక్రమంగా సరఫరా చేయాలని, 150 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిరిపురం మేజరుకు 70 క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదల చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాస్తారోకో చేస్తున్న రైతుల వద్దకు వైరా సీఐ ఎన్.ఎస్.మోహన్‌రాజా, తల్లాడ ఎస్సై ప్రవీణ్‌కుమార్ వచ్చి వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈక్రమంలో పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కార్యక్రమంలో అఖిలపక్షం నాయుకులు గుంటుపల్లి వెంకటయ్య, రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, ఎర్రి నరసింహారావు, బొడ్డు వెంకటేశ్వర్రావు, నల్లమోతు మోహన్‌రావు, గోవింద్ శ్రీను, మల్లవరం సర్పంచ్ మేడి సీతారాములు, ఎస్.వి.రాఘవులు, పులి వెంకటనరసయ్య, ఎర్రి కృష్ణారావు, కటికి చినసత్యం, ప్రకాశరావు పాల్గొన్నారు.