మెయినాబాద్‌ను 'శంషాబాద్' లో కలిపితే ఊరుకోం
Published Sat, Sep 10 2016 5:47 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
- రాస్తారోకో, మంత్రి దిష్టిబొమ్మ దహనం
వికారాబాద్ రూరల్ : వెనుకబడిన ప్రాంతాలతో కూడిన వికారాబాద్ జిల్లాలో అంతా ఇంతో మెయినాబాద్ ఉందని సంతృప్తి చెందుతుంటే ఆ మెయినాబాద్‌ను కూడా శంషాబాద్ జిల్లాలో కలిపితే మరోసారి వికారాబాద్ ఉద్యమ సెగ చూపిస్తామని నిరుద్యోగ జేఏసీ హెచ్చరించింది. శనివారం నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులతో పెద్ద ఎత్తున వికారాబాద్ హైదరాబాద్ ప్రధాన బ్రిడ్జిపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం మంత్రి మహేందర్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.అడిగినోళ్లకు అడిగినట్లు ఇచ్చుకుంటూ పోతుంటే అసలు జిల్లాల ఏర్పాటు లక్ష్యం దెబ్బతింటుందని నిరుద్యోగ జేఏసీ జిల్లా కన్వీనర్ జొన్నల రవిశంకర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా పేరుతో నాలుగు నియోజకవర్గాలను వికారాబాద్ జిల్లా కేంద్రంగా చేసి ఇప్పుడు జిల్లాలో నుంచి మొయినాబాద్‌ను శంషాబాద్‌లో కలపడం ఏమిటని ప్రశ్నించారు.
నేడు మొయినాబాద్ వాళ్లు అడిగారని శంషాబాద్‌లో కలిపారూ రేపు శంకర్‌పల్లి, షాబాద్ వాళ్లు కూడా అడుగుతున్నారూ వాళ్లను తీసుకెళ్తారా అని ధ్వజమెత్తారు. వికారాబాద్‌కు జిల్లాకు వికారాబాద్ పేరు లేదా అనంతగిరి పేరును పెట్టాలని లేని పక్షంలో మంత్రి మహేందర్‌రెడ్డి మరోసారి వికారాబాద్ ఉద్యమ సెగ చూపిస్తామని హెచ్చరించారు. వెనుక బడిన ఈ జిల్లాకు అంతో ఇంతో మొయినాబాద్ ఉంది అనుకుంటే దాన్ని కూడా ఇందులో నుంచి తీసి జిల్లాను రెవెన్యూ పరంగా మరింత వెనక్కి పంపిస్తున్నారన్నారు.
Advertisement
Advertisement