జాతీయరహదారిపై రాస్తారోకో: ట్రాఫిక్ జాం
Published Thu, Oct 20 2016 3:29 PM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM
జనగామ: కొత్తగా ఏర్పడిన జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్, చిల్పూర్, జఫర్గడ్ మండలాలను తిరిగి వరంగల్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ.. స్థానికులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. స్టేషన్ ఘన్పూర్ శివారులోని బొంగుల వాగుపై ఈ రోజు అఖిలపక్షాల నాయకులు ఆందోళన చేపట్టారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి పోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేస్తున్న నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
Advertisement
Advertisement