janagon
-
కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. మంత్రి ఎర్రబెల్లికి చేదు అనుభవం
Errabelli Dayakar Rao.. సాక్షి, జనగామ: జిల్లాలోని కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును అడ్డుకునేందుకు వీఆర్ఏలు ప్రయత్నించారు. ఈ క్రమంలో వీఆర్ఏలు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో, వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో తోపులాట చోటుచేసుకుంది. అయితే, అంతకుముందు మంత్రి ఎర్రబెల్లి.. గ్రామపంచాయితీ అభివృద్ది పనులకు సంబంధించిన నిధుల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాగి పడేసిన మద్యం సీసాలను గ్రామపంచాయతీ సిబ్బంది సేకరించి వాటిని అమ్మేసి.. వచ్చిన డబ్బులను అభివృద్ధికి వినియోగించుకోవాలని సూచించారు. ఈ క్రమంలో మంత్రి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఇందుకు వ్యతిరేకంగానే నేడు మంత్రిని వీఆర్ఏలు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: కేటీఆర్ ట్వీట్‌కు బండి కౌంటర్ -
మోదీ ఖబడ్దార్.. ఇది తెలంగాణ: సీఎం కేసీఆర్
-
నేడు జనగామ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
-
ఎంతో మందికి శోకాన్ని మిగిల్చింది.. ఆ విషాదానికి 67 ఏళ్లు
సాక్షి, జనగామ(హైదరాబాద్): అన్నా క్షేమంగా వెళ్లి లాభంగా రండి.. ఏవండి ఢిల్లీలో దిగగానే ఉత్తరం రాయండి.. సమయానికి భోజనం చేయడం మరచిపోకండి.. అంటూ ఆప్యాయతల పలకరింపుల అనంతరం రైలెక్కిన గంటకే ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన. ఒక్కటి కాదు.. రెండు కాదు.. మూడు వందల మందిని బలిగొన్న మహాప్రమాదం. అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత జనగామ జిల్లా యశ్వంతాపూర్ వాగు రైలు ప్రమాద ఘటన జరిగి నేటికి (సోమవారం) 67 ఏళ్లు పూర్తవుతున్నాయి. నాటి ప్రమాదంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. 67 ఏళ్ల క్రితం సెప్టెంబర్ 27న.. సరిగ్గా 67 ఏళ్ల క్రితం 1954 సెప్టెంబర్ 27న సోమవారం రాత్రి 10.10 నిమిషాలకు సికాంద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి గ్రాండ్ టాక్ పేరుతో(నిజాముద్దీన్) ఎక్స్‌ప్రెస్ రైలు దేశ రాజధాని న్యూఢిల్లీకి బయలుదేరింది. ఎవరి సీట్లలో వారు కూర్చుని ప్రయాణికులంతా నిద్రకు ఉపక్రమించారు. బయట కుండపోత వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన గంట తర్వాత రైలు జనగామ స్టేషన్‌కు చేరుకుంది. యశ్వంతాపూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అక్కడే 5 నిమిషాల పాటు నిలిపివేశారు. గ్రీన్ సిగ్నల్ రావడంతో బయలుదేరిన రైలు సరిగ్గా 11.15 నిమిషాలకు యశ్వంతాపూర్ వాగుపైకి చేరుకునే సమయంలో మూడు అడుగుల మేర పట్టాలు మునిగిపోయాయి. సిగ్నల్‌తో రూట్ క్లియర్‌గా ఉందని భావించిన రైలు డ్రైవర్ రైలును ముందుకు తీసుకెళ్లాడు. 17 బోగీలతో ఉన్న రైలు.. వాగుపై 12 బోగీలు దాటాక ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో చివరి బోగీ మినహా మిగతా నాలుగు బోగీలు అందులో కొట్టుకుపోయాయి. సుమారు 300 మంది ప్రయాణికులు వాగులో కొట్టుకుపోతుంటే.. ఏం జరుగుతుందో తెలియక మిగతా బోగీల్లోని ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఆ కాలంలో సమాచార వ్యవస్థ సరిగా లేకపోవడంతో రైలు వాగులో కొట్టుకుపోయిన సమాచారం తెల్లవారుజాము వరకు దేశానికి తెలియలేదు. ఆ తర్వాత సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు సైతం అక్కడికి చేరుకుని అధికారులకు సహకరించారు. రైలు మిస్సైయినా.. వెంటాడిన మృత్యువు సికింద్రాబాద్ స్టేషన్లో నిజామొద్దీన్ రైలు మిస్ కావడంతో.. ఓ వ్యాపారి కారులో భువనగిరి వరకు వచ్చి, ఉరుకులు.. పరుగుల మీద రైలెక్కాడు. అతడికి అదే చివరి ప్ర యాణంగా మిగిలిపోయింది. హైదరాబాద్ ప్యారడైజ్ థి యేటర్ యజమాని అంజయ్య.. సికింద్రాబాద్ చేరుకునే సరికే రైలు వెళ్లిపోవడంతో కారులో భువనగిరి వచ్చి రైలు ఎక్కాడు. రైలు ఎక్కిన 35 నిమిషాలకే ఆయన ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కాగా, ఈ ప్రమాదం గురించి మాట్లాడితే ఈ ప్రాంతానికి చెందిన వృద్ధులు నేటికి కన్నీ టి పర్యంతమవుతారు. రైలు ప్రమాదాన్ని గుర్తు చేసుకుంటూ నేటి తరం యువతకు అప్పుడప్పుడు చెబుతుంటారు. కుటుంబాలు చిన్నాభిన్నం.. నిజాముద్దీన్ రైలు ప్రమాదం వందలాది కుటుంబాల్లో విషాదం నింపింది. సమాచార వ్యవస్థ సరిగాలేని నాటి రోజుల్లో ఈ ప్రమాద విషయం దేశానికి ఆలస్యంగా తెలిసింది. యశ్వంతాపూర్ వాగులో రైలు కొట్టుకుపోయిన విషయాన్ని తెలుసుకున్న బాధిత కుటుంబాలు ప్రమాదం జరిగిన చోటుకు చేరుకున్నాయి. తమవారు కనిపించకపోవడంతో ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలతో పిక్కటిల్లింది. చెట్టుకొకరు.. పుట్టకొకరు.. కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయిన మృతదేహాలు చిద్రమై కనిపించడంతో వాగు శవాల దిబ్బగా మారిపోయింది. రైలులో ప్రయాణిస్తున్న పలువురు క్షేమంగా ఉన్నప్పటికీ.. సమాచారం లేకపోవడంతో బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన మరుసటి రోజు తెల్లవారుజాము నుంచి వారం రోజుల పాటు సహాయక చర్యలు కొనసాగాయి. రైల్వే మంత్రి రాజీనామా యశ్వంతాపూర్ రైలు ప్రమాదం తెలుసుకున్న నాటి రైల్వే శాఖ మంత్రి లాల్‌బహదూర్ శాస్త్రీ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. రైలు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం ప్రకటిస్తూ.... ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. తల్లి ఒడిలో చిన్నారి.. రైలు వాగులో కొట్టుకుపోయిన సమయంలో ఓ చిన్నారితో సహా తల్లి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఒడిలో కూతురును హత్తుకుని నీళ్లలో కొట్టుకుపోతూ ఓ చెట్టు కొమ్మకు చిక్కుకుని తల్లి అక్కడే మృతి చెందింది. అమ్మ మృతి చెందిన విషయం తెలియక చిన్నారి తెల్ల వార్లు ఎక్కిక్కి ఏడ్చింది. ఉదయం వ్యవసాయ పనులకు బయలుదేరిన యశ్వంతాపూర్ గ్రామానికి చెందిన కాశ మల్లయ్యకు చెట్ల పొదల్లో పాప ఏడుపు వినిపించడంతో అక్కడికి వెళ్లాడు. తల్లి చనినపోవడంతో పాపను రైల్వే అధికారులకు అప్పగించాడు. అమ్మమ్మ ఇంటి కాడ నుంచి వచ్చిన.. వాగులో రైలు కొట్టుకుపోయిన రాత్రి అమ్మమ్మ ఇంటి కాడ తాటికొండలో ఉన్న. విషయం తెలియగానే కాలినడకన పరుగు పరుగున వచ్చిన. ఆ సమయంలో నాకు పదేళ్ల వయస్సు. ఇంటికి వచ్చి నాయినతో కలిసి సక్కగా వాగు వద్దకు వెళ్లిన. చెల్లా చెదురుగా ఉన్న రైలు బోగీలు, ఏ చెట్టుకు చూసినా శవాలే కనిపించాయి. దుఖం ఆపుకోలేక పోయిన. చిన్నచిన్న చంటిపాపలూ ఉన్నారు. ఆనాటి ఘటన గుర్తుకు చేసుకుంటే రోజంతా బాధగానే ఉంటుంది. - కాముని మల్లేశం, యశ్వంతాపూర్ సంటి పిల్లతల్లిని కాపాడిన.. పొద్దుగాలనే నిద్రలేచి పొలం పనులకు బయలుదేరిన. వాగు వద్దకు వెళ్లగానే ఎవరో అరచినట్టుగా వినిపించింది. మొదటగా నీళ్ల సప్పుడు అనుకున్న. దగ్గరకు వెళ్లి చూస్తే పెద్ద పెద్ద డబ్బాలు కనిపించాయి. ఓ చెట్టును పట్టుకుని కిందకు దిగితే ఓ తల్లి చేతిలో బిడ్డను పట్టుకుని కాపాడండి అంటూ అరుస్తుంది. భయపడకు అంటూ ముందుకు వెళ్లిన. అన్నా నా బిడ్డను కాపాడు.. రాత్రి నుంచి చెట్టును పట్టుకున్నా.. ఇక ఓపిక లేదు అంటూ ఏడ్చింది. చెట్టుకున్న ఓ పొడవాటి కర్రను విరిచి ఆ తల్లి చేతికి ఇచ్చి పట్టుకోమని చెప్పిన. పది నిమిషాల పాటు కష్టపడి ఇద్దరిని కాపాడిన. ఆ సంఘటన ఇప్పటికీ నా కళ్ల ముందు కనిపిస్తుంది. - మారబోయిన పుల్లయ్య, 90ఏళ్లు, యశ్వంతాపూర్ చదవండి: ‘నంబర్ వన్’ టార్గెట్టే ముంచిందా! -
రైలు ప్రమాదం: మంత్రి రాజీనామాకి 66 ఏళ్లు
సాక్షి, జనగామ: కన్నీళ్లకే కన్నీళ్ల పెట్టించే దుర్ఘటన. వందల మంది ప్రాణాలు తీసిన ఘటన. మళ్లొస్తామనే మాటే ఆఖరి ప్రయాణమైన వేళ.. కుటుంబ సభ్యులకు చివరిచూపును కూడా దూరం చేసింది. చివరి క్షణంలో రైలు మిస్సయినా.. ప్రయానికుడిని పరుగులు పెట్టించి ప్రాణం తీసిన జోరు వర్షం.. దేశ ప్రజలను కంటనీరు పెట్టిస్తే... నాటి రైల్వే శాఖ మంత్రి లాల్‌బహదూర్ శాస్త్రిని రాజీనామా చేయించిన మహా విషాదం అది. అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత జనగామ జిల్లా యశ్వంతాపూర్ వాగు వద్ద రైలు ప్రమాద సంఘటనకు నేటి(ఆదివారం)తో 66 ఏళ్లు పూర్తవుతున్నాయి. యావత్ భారతదేశాన్ని కుదిపివేసిన ఈ ప్రమాదంపై కథనం. 1954 సెప్టెంబర్ 27 సరిగ్గా 66 ఏళ్ల క్రితం 1954 సెప్టెంబర్ 27న సోమవారం రాత్రి 10.10 గంటలకు దేశ రాజధాని న్యూఢిల్లీకి గ్రాండ్ టాక్ పేరుతో వెళ్లే(నిజాముద్దీన్) ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరింది. ఎవరి సీట్లలో వారు కూర్చుని నిద్రకు ఉపక్రమించారు. బయట కుండపోతగా కురుస్తున్న వర్షం సవ్వడి వినిపిస్తోంది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన గంట సేపటి తర్వాత రాత్రి 11.15 గంటలకు జనగామ మండలం యశ్వంతాపూర్ రైల్వేస్టేషన్‌కు రైలు చేరుకుంది. అప్పటికే వాగు ఉధృతంగా ప్రవహిస్తూ రైలు పట్టాలను మూడు అడుగుల మేర ముంచేసింది. అయితే, సిగ్నల్‌తో రూట్ క్లియర్‌గా ఉందని భావించిన రైలు డ్రైవర్ మామూలుగానే వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. నాడు రైలు ప్రమాదం జరిగిన ప్రదేశం ఇంతలోనే 17 బోగీలతో ఉన్న రైలు.. వాగుపై 12 బోగీలు దాటాక వాగు ఉధృతి ఒక్కసారిగా పెరగడంతో చివరి బోగీ మినహా మిగతా నాలుగు బోగీలు అందులో కొట్టుకుపోయాయి. 300 మంది ప్రయాణికులు వాగులో కొట్టుకుపోతుంటే.. చిమ్మచీకట్లో ఏం జరుగుతుందో తెలియిని పరిస్థితుల్లో మిగతా బోగీల్లోని వారంతా హాహాకారాలు చేశారు. సమాచార వ్యవస్థ అంతగా లేని సమయంలో రైలు ప్రమాదం జరిగిన కొన్ని గంటల వరకు దేశానికి తెలియలేదు. రైలు ప్రమాద ఘటనను తెల్లవారుజామున తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు సైతం వాగు వద్దకు చేరుకుని అధికారులకు సాయపడ్డారు. కుటుంబాల్లో విషాదం నింపిన ప్రయాణం నిజాముద్దీన్ రైలు ప్రయాణం వందలాది కుటుంబాల్లో పెను విసాదాన్ని నింపింది. ప్రసార మాధ్యమాలు, సెల్ఫోన్లు అందుబాటులో లేకపోవడంతో రైలు ప్రమాదం దేశ ప్రజలకు ఆలస్యం తెలిసింది. యశ్వంతాపూర్ వాగులో రైలు కొట్టుకుపోయిన విషయాన్ని రేడియో ద్వారా తెలుసుకున్న ప్రయాణికుల కుటుంబ సభ్యులు ప్రమాదం జరిగిన చోటకు చేరుకున్నారు. ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో తమవారు కనిపించక పోవడంతో దుఖాఃన్ని ఆపుకోలేక పోయారు. దీంతో ఆ ప్రాంతమంతా కుటుంబ సభ్యులు, బంధువులు ఆర్తనాదాలు పిక్కటిల్లాయి. చెట్టుకొకరు, పుట్టకొకరు, కిలోమీటర్ల దూరంలో కొట్టుకుపోయిన మృతదేహాలు ఛిద్రమై కనిపించడంతో వాగు శవాల దిబ్బగా మారిపోయింది. రైలులో ప్రయాణిస్తున్న కొందరు క్షేమంగా ఉన్నా సమాచారం లేకపోవడతో బందువులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన రాత్రి నుంచి వారం రోజుల పాటు సహాయక చర్యలు కొనసాగాయి. మంత్రి రాజీనామా యశ్వంతాపూర్ రైలు ప్రమాదం తెలుసుకున్న నాటి రైల్వే శా ఖ మంత్రి లాల్‌బహదూర్ శాస్త్రి తన పదవికి వెంటనే రాజీ నామా చేశారు. తీవ్ర మనోవేదనకు గురైనట్లు చెప్పిన మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం అప్పట్లో సంచలనం కలిగింది. మృతి చెందిన బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఆదేశాలు జారీ చేశారు. రైలు మిస్సయినా... సికింద్రాబాద్ స్టేషన్లో నిజామొద్దీన్ రైలు మిస్ కావడంతో కారులో భువనగిరి వరకు వచ్చి రైలు ఎక్కిన ఓ వ్యాపారికి అదే చివరి ప్రయాణంగా మిగిలి పోయింది. హైదరాబాద్ ప్యారడైజ్ థియేటర్ యజమాని ప్రాణాలు భువనగిరిలో రైలు ఎక్కిన 35 నిమిషాలకే అనంత వాయువుల్లో కలిసి పోయాయి. వ్యాపారిని రైలు రూపంలో వచ్చిన మృత్యువు వెంటాడినట్లుగా చెబుతారు. అలాగే ఈ ప్రమాదంపై అనేక మూఢ నమ్మకాలు, విపరీతమైన ప్రచారాలు అప్పట్లో జరిగాయి. రైలు ప్రమాదం గురించి మాట్లాడితే చాలు...నేటికి వృద్ధులు కన్నీళ్లు పెడుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో రైలు ప్రమాదాన్ని నెమర వేసుకుంటూ నేటి తరం యువతకు అప్పుడప్పుడు చెబుతుంటారు. తల్లి ఒడిలో చిన్నారి రాత్రి రైలు వాగులో కొట్టుకుపోయిన సమయంలో ఓ చిన్నారితో సహా తల్లి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఒడిలో కూతురును హత్తుకుని నీళ్లలో కొట్టుకుపోతూ ఓ చెట్టు కొమ్మకు చిక్కుకుని ‘అమ్మ’ అక్కడే తుది శ్వాస విడిచింది. తల్లి మృతి చెందిన విషయం తెలియక చిన్నారి తెల్లవార్లు ఎక్కెక్కి ఏడ్చింది. ఉదయం వాగు వద్దకు వెళ్లిన గ్రామానికి చెందిన కాశ మల్లయ్యకు చెట్ల పొదల్లో పాప ఏడుపు విని అక్కడకు వెళ్లారు. తల్లి చనిపోవడంతో పాపను తీసుకుని రైల్వే అధికారులకు అప్పగించారు. గుండెలను పిండేసే ఆ ఘటనను గుర్తుకు చేసుకున్న 90ఏళ్ల మల్లయ్య కన్నీళ్ల పర్యంతమయ్యారు. శవాలను మోసిన.. రైలు ప్రమాద సమయంలో నా వయస్సు 25 ఏండ్లు. వాగులో రైలు కొట్టుకుపోయిందని తెలిసింది. తెల్లవా రుజామున 6 గంటల సమయంలో వాగు వద్దకు చేరుకున్నా. పుట్టకొకరు.. గుట్టకొకరు పడిఉన్నారు. మనుసు ద్రవించింది. వాగులో కొట్టుకుపోయి, చెట్ల పొదల్లో ఇరుక్కుపోయిన శవాలు...రోదనలు,. కుటుంబ సభ్యులు ఏడుపులతో ఆ ప్రాంతమంతా విషాదం అలుముకుంది. వెంటనే రైలు అధికారులతో కలిసి శవాలను ఒడ్డుకు చేర్చా. ఆనాటి ఘటన తలుచుకుంటే గుండెలను పిండేస్తుంది. – కాశ మల్లయ్య, 90 ఏళ్ల వృద్ధుడు, యశ్వంతాపూర్ బాయి కాడికి పోతుంటే.. రైలు పట్టాల పక్కనే మా వ్యవసాయ బావి ఉంది. రైలు ప్రమాదం జరిగిన సమయంలో నా వయస్సు 15 ఏళ్లు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో నాయినతో కలి సి బయలుదేరిన. వాగు పక్క కు వెళ్లగానే బిగ్గర అరుపులు వినిపించాయి. నాయినా ఎ వరో పిలుస్తున్నారు అంటుండగానే... దూరంగా ఏవో డబ్బాలు పడిపోయినట్లుగా కనిపించాయి. నాయినతో కలిసి అక్కడకు ఉరికిన. అక్కడ వందల సంఖ్యలో చని పోయిన వారు కనిపించడంతో భయంతో ఏడ్చిన. బావి కాడికి ఎప్పుడు వెళ్లినా అదే ఘటనే గుర్తుకొస్తుంది. – కాముని మల్లేశం, యశ్వంతాపూర్ -
విషాదం మిగిల్చిన ఫొటో సరదా
సాక్షి, జనగామ: సెల్ఫోన్లో ఫొటోలు దిగాలనే సరదా ప్రాణాలను బలితీసుకుంది. రిజర్వాయర్‌లోకి దిగిన బావతోపాటు ఇద్దరు మరదళ్లు మృత్యువాత పడిన ఘటన జనగామ జిల్లా నర్మెట మండలం బొమ్మకూర్ వద్ద శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన మాజీ కౌన్సిలర్ మూడ్ లక్ష్మణ్‌నాయక్, కాంతాబాయి దంపతుల కుమారుడు మూడ్ అవినాష్ (29)కు రఘునాథపల్లి మండలం గిద్దెబండ తండా (జీబీతండా)కు చెందిన లకావత్ లక్ష్మణ్, లీల దంపతుల కుమార్తె దివ్య వివాహం ఏడాదిన్నర క్రితం జరిగింది. హైదరాబాద్‌లో ఉంటున్న అవినాష్ శుక్రవారం రాత్రి జనగామకు వచ్చాడు. శనివారం గిద్దెబండతండాలోని అత్తగారింటికి వెళ్లాడు. మధ్యాహ్నం తల్లిగారింటి వద్ద ఉన్న భార్య దివ్యతోపాటు చిన్న మామ లకావత్ అంజయ్య కుమార్తెలు సంగీత (17), సుమలత(15)తో కలసి నర్మెట మండలం బొమ్మకూరు రిజర్వాయర్ వద్దకు వెళ్లారు. ఒడ్డున ఉన్న దివ్య ఫొటోలు తీస్తుండగా అవినాష్, సంగీత, సుమలత నీటిలోకి దిగి సరదాగా ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటున్నారు. అకస్మాత్తుగా రిజర్వాయర్‌లోని ఊబిలోకి అవినాష్ మునిగిపోయాడు. సంగీత, సుమలత సైతం నీటిలో గల్లంతయ్యారు. దివ్య గమనించి కేకలు వేయగా.. చుట్టుపక్కల వాళ్లు వచ్చి నీటిలోకి దిగి గాలించి ముగ్గురి మృతదేహాలను ఒడ్డుకు తీసుకొచ్చారు. పోలీసులు వచ్చి మృతదేహాలను జిల్లా కేంద్రంలోని ఏరియా ఆస్పత్రికి తరిలించారు. సంగీత ఇటీవలే ఇంటర్ ఉత్తీర్ణత కాగా సుమలత పదో తరగతి పాసైంది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సరదాగా చెరువులో ఆడుకుంటు ముగ్గురు మృతి
-
విషాదం: భార్య కళ్లెదుటే భర్త.. చెల్లెళ్లు మృతి
సాక్షి, జనగామ: జిల్లాలోని నర్మెట్ట మండలం బొమ్మకూర్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఈత సరదా ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. రిజర్వాయర్‌ను చూసేందుకు వచ్చిన ఓ యువకుడు, ఇద్దరు యువతులు జలశయంలో సరదాగా ఆడుకుంటున్న క్రమంలో చెరువులో మునిగిపోయి మృతిచెందారు. ఈ ఘటన బొమ్మకూర్ జలాశయం వద్ద శనివారం జరిగింది. చెరువులో గల్లంతైన వారిలో బావ మరదళ్లు అవినాష్ (32), సంగీత (19), సుమలత (20) ఉన్నారు. కాగా ఇద్దరు మరదళ్లతో కలిసి చెరువులోకి దిగిన అవినాష్.. ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. ఈ దృశ్యానంతా అవినాష్ భార్య ఫోన్లో రికార్డు చేస్తునే ఉన్నారు. అప్పటి వరకు నీళ్లలో అడిన ముగ్గరు ఒక్కసారిగా చెరులో గల్లంతయ్యారు. దీంతో ఆమె కన్నీరుమున్నీరవుతున్నారు. మృతులంతా రఘునాథపల్లి మండలం మేకలగుట్ట గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. కాగా సెల్ఫీ దిగే క్రమంలో చాలా మంది ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనలో చనిపోయిన వారి సంఖ్య ఇటీవల కాలంలో విపరీతంగా పెరుగుతోంది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : సరదాగా చెరువులో ఆడుకుంటు ముగ్గురు మృతి -
ఎన్నికల నిఘాను పటిష్టం చేయాలి
సాక్షి, జనగామ అర్బన్: జిల్లాలో ఎన్నికల నిఘాను పటిష్టం చేయడానికి పౌర సమాజాన్ని భాగస్వామ్యం చేయాలని ఎన్నికల నిఘా రాష్ట్ర కన్వీనర్లు వీవీ రావు, బండరు మోహన్‌రావు కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డిని కోరారు. ఎన్నికల నిఘావేదిక ఆధ్వర్యంలో కరపత్రాన్ని సోమవారం ఆవిష్కరించారు. నిఘా కార్యక్రమంలో పౌరసమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని జిల్లా ఎన్నికల నిఘా అధ్యక్షులు సాధిక్ అలీ వివరించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి నిఘా కన్వీనర్ గంగు నవీన్‌శర్మ, జి.శ్రీనివాస్, జనగామ జిల్లా సభ్యులు ఇమ్రాన్, భాను, ఈశ్వర్, ఉదయ్ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యాంకర్‌కు గాయాలు
-
రోడ్డు ప్రమాదంలో యాంకర్‌కు గాయాలు
సాక్షి, జనగాం : ప్రముఖ ‘స్టార్ మా’ యాంకర్, నటుడు మొహమ్మద్ కయిమ్ (లోబో) రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు...ఆటోని ఢీకొంది. ఈ ప్రమాదంలో లోబోతో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం జనగాం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు సమాచారం అందుకున్న జనగాం డీఎస్పీ మల్లారెడ్డి ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించి, వివరాలు అడిగి తెలసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కాగా లోబో... కుమారి 21ఎఫ్ చిత్రంలో తన నటన ద్వారా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. -
ప్రసవానికొస్తే ప్రాణం పోయింది..
జనగామ: నిండు గర్భిణి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోకి ప్రసవానికి వస్తే ఆమెకు పుట్టిన శిశువుతోపాటు ఆమె కూడా ప్రాణాలు కోల్పోయింది. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే ఈ దారుణం జరిగిందని మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ఈ సంఘటన జనగామలోని స్వర్ణ కళామందిర్ థియేటర్ సమీపంలోగల సూర్యవాణి ఆస్పత్రిలో మంగళవారం జరిగింది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకంచకు చెందిన వాతాల లలిత(30) నిండు గర్భిణి కావ డంతో భర్త యాదగిరి ఈ నెల 5వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో సూర్యవాణి ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. రాత్రి లలితకు ఆపరేషన్ చేయగా, కడుపులోనే మగ బిడ్డ చనిపోయి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. మృతిచెందిన శిశువును అదే రోజు తీసుకెళ్లారు. మంగళవారం ఉదయం నుంచి లలిత పరిస్థితి విషమంగా ఉండడంతో డాక్టర్లకు సమాచార మిచ్చినా పెద్దగా స్పందించలేదు. ఉదయం 11 గంటల సమయంలో వచ్చిన డాక్టర్ లలిత పరిస్థితి విషమంగా ఉందని ఆగమేఘాల మీద అంబులెన్స్ మాట్లాడి హైదరాబాద్‌కు పంపించారు. ఆస్పత్రికి వెళుతున్న క్రమంలో ఉప్పల్ సమీపంలో లలిత మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. కేవలం ఆపరేషన్ చేసే సమయంలో అలసత్వం వహించడంతోనే శిశివు, లలిత మృతి చెందినట్లు బంధువు దయాకర్ ఆరోపించారు. లలిత కడుపు భాగంలో పక్క నుంచి రక్త కారుతున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం సిబ్బందితోనే పని కానిచ్చేశాకరని, వైద్యులు కూడా అందుబాటులో లేరన్నారు. సూర్యవాణి, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఎదుట కుటుం బ సభ్యుల రోదనలు మిన్నంటాయి. నిర్లక్ష్యం వహించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పదిహేనేళ్ల క్రితం కూతురు మృతి మృతురాలి పెద్ద కూతురు అనూష సరిగ్గా పదిహేనేళ్ల క్రితం మార్చి 3న విద్యుదాఘాతంతో మృతిచెందింది. తొమ్మిదేళ్ల వయస్సులో ఇంట్లో ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు తల్లిదండ్రులను ఒంటరి చేసి వెళ్లి పోయింది. మరో పాప కోసం పదిహేనేళ్ల తర్వాత ఎదురు చూస్తున్న ఆ కుటుంబానికి అనుకోని విషాదం ఎదురైంది. పురిటి నొప్పులతో ఆస్పత్రికి వెళ్లిన లలిత కడుపులోనే రాత్రి శిశువు(మగబిడ్డ) మృతి చెందగా... మరుసటి రోజు తల్లి అనంతలోకాలకు చేరడంతో భర్త.. కుటుంబ సభ్యులు పుట్టెడు ఖంలో మునిగి పోయారు. మా తప్పేమీలేదు : డాక్టర్ స్వప్న లలితను అడ్మిట్ చేసే సమయంలో ఆమె క్రిటికల్ కండిషన్లో ఉంది. భర్త అనుమతి తీసుకున్న తర్వాతే ఆపరేషన్ మొదలు పెట్టాం. లలిత కడుపులోనే శిశువు మృతి చెందడంతో కుటుంబ సభ్యులకు తెలియజేశాం. రాత్రి సమయంలో పక్కనే ఉన్న కుటుంబసభ్యులు వాటర్ తాగించడంతో పరిస్థితి విషమించినట్లు గుర్తించాం. లలితకు బీపీ, షుగర్ ఉంది. ఆపరేషన్‌లో ఎలాంటి లోపం లేదు. -
జాతీయరహదారిపై రాస్తారోకో: ట్రాఫిక్ జాం
జనగామ: కొత్తగా ఏర్పడిన జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్పూర్, చిల్పూర్, జఫర్గడ్ మండలాలను తిరిగి వరంగల్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ.. స్థానికులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. స్టేషన్ ఘన్పూర్ శివారులోని బొంగుల వాగుపై ఈ రోజు అఖిలపక్షాల నాయకులు ఆందోళన చేపట్టారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి పోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన చేస్తున్న నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
జనగామ జిల్లా కోరుతూ ర్యాలీ
జనగామ: తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రకటించిన 27 జిల్లాల జాబితాలో జనగామ పేరు లేకపోవడంతో.. ఆగ్రహించిన స్థానికులు ఆందోళనల బాటపట్టారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో పలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం అఖిలపక్షం ఆధ్యర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి జనగామను జిల్లాగా ప్రకటించాలని కోరుతూ.. ఆర్డీవోకు వినతిపత్రం అందించారు. ఈ ర్యాలీలో అన్ని పార్టీల నాయకులతో పాటు న్యాయవాదులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.