
కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న ఎన్నికల నిఘా రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు, పాల్గొన్న కలెక్టర్
సాక్షి, జనగామ అర్బన్: జిల్లాలో ఎన్నికల నిఘాను పటిష్టం చేయడానికి పౌర సమాజాన్ని భాగస్వామ్యం చేయాలని ఎన్నికల నిఘా రాష్ట్ర కన్వీనర్లు వీవీ రావు, బండరు మోహన్‌రావు కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డిని కోరారు. ఎన్నికల నిఘావేదిక ఆధ్వర్యంలో కరపత్రాన్ని సోమవారం ఆవిష్కరించారు. నిఘా కార్యక్రమంలో పౌరసమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని జిల్లా ఎన్నికల నిఘా అధ్యక్షులు సాధిక్ అలీ వివరించారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి నిఘా కన్వీనర్ గంగు నవీన్‌శర్మ, జి.శ్రీనివాస్, జనగామ జిల్లా సభ్యులు ఇమ్రాన్, భాను, ఈశ్వర్, ఉదయ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment