‘నా ఓటు’ యాప్‌లో సమగ్ర సమాచారం.. | Na Vote App By Election Commission Of India | Sakshi
Sakshi News home page

‘నా ఓటు’ యాప్‌లో సమగ్ర సమాచారం..

Published Thu, Dec 6 2018 10:07 AM | Last Updated on Thu, Dec 6 2018 10:07 AM

Na Vote App By Election Commission Of India - Sakshi

సాక్షి, జనగామ: ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈసారి ఎలక్షన్‌ కమిషన్‌ పకరడ్బందీగా చర్యలు చేపట్టింది. ‘నా ఓటు’ అనే సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఓటరు పోలింగ్‌ కేంద్రంతో పాటు పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు.  

సమగ్ర సమాచారం..
‘నా ఓటు’ యాప్‌లో ‘ఓటరు అన్వేషణ’ ద్వారా గ్రామం, వయస్సు, పేరు, తండ్రి, లింగం, జిల్లా, నియోజకవర్గం నమోదు చేస్తే అన్ని వివరాలు తెరపై కనిపిస్తాయి. ఎలక్ట్రానిక్‌ ఫొటో ఐడెంటీ కార్టు(ఎపిక్‌) సంఖ్యతో సహా కేంద్రం వివరాలు వస్తాయి. ఇవి కాకుండా ఎపిక్‌ సంఖ్య నమోదు చేసినా ఓటరు వివరాలు తెలుస్తాయి. దివ్యాంగుల కోసం ‘పికప్‌ సర్వీస్‌’ అనే ఆప్షన్‌ ఉంది. ఎపిక్‌ నంబర్‌ నమోదు చేస్తే పోలింగ్‌ కేంద్రానికి తీసుకు వెళ్లాలనే సమాచారం నిర్దేశిత బీఎల్‌ఓకు వెళ్తుంది. దివ్యాంగుల ఫోన్‌ నంబర్‌ అనుసంధానం చేసి ఉండాలి. అలా లేకపోయినా సబంధిత బీఎల్‌ఓకు ఫోన్‌ చేస్తే పీడబ్ల్యూడీ వలం టీర్లు వచ్చి పోలింగ్‌ కేంద్రానికి తీసుకువెళ్తారు. ఓటు వేసిన తర్వాత తిరిగి ఇంటికి చేరుస్తారు. ప్రభుత్వం పంపిణీ చేసే ఓటరు చీటిపై సంబంధిత బీఎల్‌ఓ నంబర్‌ ఉంటుంది. పోలింగ్‌ కేంద్రం పేరును నొక్కితే సంబంధిత వలంటీర్‌ పేరు, హోదా, ఫోన్‌ నంబర్‌ తెరపై ప్రత్యక్షమవుతాయి.

అభ్యర్థుల వివరాలు
ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సమాచారం, వారి పార్టీ పేర్లు యాప్‌లో కనిపించనున్నాయి. అలాగే జిల్లా ఎన్నిక ల అధికారి, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారుల పేర్లు, ఫోన్‌ నంబర్లు, ఇ–మెయిల్‌ వివరాలు సైతం ఉంటాయి. వీటితోపాటు ఎన్నికల షెడ్యూల్‌ విరాలు పొందుపరిచారు.

కేంద్రానికి ఎలా వెళ్లాలంటే..
ఈ యాప్‌లో పోలింగ్‌ రూట్‌ మ్యాప్‌ తెలిపే ఆప్షన్‌ ఇచ్చారు. ఇందులో ఓటర్లు తాము ఉన్న ప్రదేశం నుంచి నిర్దేశిత పోలింగ్‌ కేంద్రానికి చేరుకోవడానికి రూట్‌ మ్యాప్‌తో పాటు చిరునామా కనిపిస్తుంది. సంబంధిత ఫోన్‌లో జీపీస్‌ పనిచేయాల్సి ఉంటుంది. అలాగే యాప్‌ కింది భాగంలో పోలింగ్‌ స్టేషన్, పోలీస్టేషన్, బస్టాప్‌ వివరాలతో కూడిన ఆప్షన్ల ఉన్నాయి. ఓటర్లు తాము ఉన్న ప్రదేశానికి సమీపంలోని పోలీస్టేషన్, స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరూ గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఈ యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement