new apps
-
ఇన్స్టాగ్రామ్ ‘పీక్’ ఫీచర్‌ని ఎప్పుడైనా ట్రై చేశారా!
‘పీక్’ అనే కొత్త ఫీచర్‌ని పరీక్షిస్తోంది ఫొటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్. ఈ ఫీచర్ ద్వారా ఒక వ్యూ తరువాత మాయం అయ్యే ఎడిట్ చేయని, అన్‌ఫిల్టర్, ఇన్–ది–మూమెంట్ ఫొటోలను యూజర్లు స్పీడ్‌గా క్యాప్చర్, షేర్ చేయవచ్చు. స్నాప్‌చాట్, బీరియల్ను స్ఫూర్తిగా తీసుకొని ‘పీక్’పై దృష్టి పెట్టింది ఇన్‌స్టా. ఫొటోలు, వీడియోలను 24 గంటల ΄ాటు చూడడానికి అనుమతించే ఇన్‌స్టాగ్రామ్‌లోని ప్రస్తుత ‘స్టోరీస్’ ఫీచర్లా కాకుండా ‘పీక్’ ఫొటోలు సింగిల్ వ్యూలో అదృశ్యం అవుతాయి, ‘లిటిల్ మూమెంట్స్ విత్ ది పీపుల్ యూ లవ్’ అని ‘పీక్’ గురించి చెప్పింది ఇన్స్టాగ్రామ్.గూగుల్ కొత్త ఏఐ వీడియో అండ్ ఇమేజ్ జనరేటర్స్..కొత్త ఏఐ వీడియో అండ్ ఇమేజ్ జనరేటర్స్ వియో, ఇమాజెన్ 3లను గూగుల్ లాంచ్ చేసింది. టెక్స్ట్ ప్రాంప్ట్‌ల నుంచి వీడియోలను జనరేట్ చేయడానికి వియో ఉపయోగపడుతుంది. ఇమాజెన్ 3 అనేది గూగుల్‌కు సంబంధించి అత్యంత అధునాతన ‘టెక్ట్స్–టు–ఇమేజ్’ మోడల్. ‘ఇమాజెన్ 3 అనేది టెక్స్›్ట–టు–ఇమేజ్ హైక్వాలిటీ మోడల్.ఫొటోరియలిస్టిక్, లైఫ్‌లైక్ ఇమేజ్‌లను సృష్టించే సామర్థ్యం దీని సొంతం’ అంటుంది గూగుల్. మోస్ట్ అడ్వాన్స్డ్ వీడియో మోడల్‌గా గూగుల్ చెబుతున్న ‘వియో’ వెరైటీ స్టైల్స్‌లో హై–క్వాలిటీ 1080పి వీడియోలను ్ర΄÷డ్యూస్ చేస్తుంది. ఈ ఏఐ మోడల్ ‘టైమ్‌ల్యాప్స్’ ‘ఏరియల్ ష్టార్స్’లాంటి సినిమాటిక్ కాన్సెప్ట్‌లను కూడా అర్థం చేసుకుంటుంది. వీడియో క్రియేటర్లకు ఇది గేమ్–చేంజర్ అవుతుందని ప్రకటించింది గూగుల్.హువావే మేట్ బుక్ 14..సైజ్: 14.2 అంగుళాలు రిజల్యూషన్: 2880్ఠ1920 పిక్సెల్స్బరువు: 1.31 కేజీ మెమోరీ: 16జీబి స్టోరేజ్: 512 జీబి/1టీబిబ్యాటరీ లైఫ్: 19 గంటలు, ఏఐ ఫీచర్స్, ఇన్టెల్ కోర్ ఆల్ట్రా చిప్ఆల్ట్రా హ్యూమన్ రింగ్ ఏయిర్..థిక్: 2.5 ఎంఎంవైడ్: 8.1 ఎంఎం బరువు: 3 గ్రా. కలర్ ఆప్షన్: టైటానియం పీపీజీ ఆప్టికల్ సెన్సర్: హార్ట్ రేట్ అండ్ బ్లడ్ ఆక్సిజన్ సాచ్యురేషన్, వాటర్ రెసిస్టెంట్,సపోర్ట్స్: 22 వర్కవుట్ మోడ్స్హెచ్ఎండీ టీ21 ట్యాబ్..సైజ్: 10.36 అంగుళాలు వోఎస్: ఆండ్రాయిడ్ 13రిజల్యూషన్: 1200్ఠ2000 పిక్సెల్స్ కలర్: బ్లాక్ స్టీల్ఇంటర్నల్: 64జీబి 4జీబి ర్యామ్/ 128జీబి 4జీబి ర్యామ్ బ్యాటరీ: 8200 ఎంఏహెచ్, స్కాచ్ రెసిస్టెంట్ గ్లాస్ఇవి చదవండి: గేమింగ్.. 'రక్షకుడు' వచ్చాడు! -
‘నా ఓటు’ యాప్‌లో సమగ్ర సమాచారం..
సాక్షి, జనగామ: ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈసారి ఎలక్షన్ కమిషన్ పకరడ్బందీగా చర్యలు చేపట్టింది. ‘నా ఓటు’ అనే సరికొత్త యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఓటరు పోలింగ్ కేంద్రంతో పాటు పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. సమగ్ర సమాచారం.. ‘నా ఓటు’ యాప్‌లో ‘ఓటరు అన్వేషణ’ ద్వారా గ్రామం, వయస్సు, పేరు, తండ్రి, లింగం, జిల్లా, నియోజకవర్గం నమోదు చేస్తే అన్ని వివరాలు తెరపై కనిపిస్తాయి. ఎలక్ట్రానిక్ ఫొటో ఐడెంటీ కార్టు(ఎపిక్) సంఖ్యతో సహా కేంద్రం వివరాలు వస్తాయి. ఇవి కాకుండా ఎపిక్ సంఖ్య నమోదు చేసినా ఓటరు వివరాలు తెలుస్తాయి. దివ్యాంగుల కోసం ‘పికప్ సర్వీస్’ అనే ఆప్షన్ ఉంది. ఎపిక్ నంబర్ నమోదు చేస్తే పోలింగ్ కేంద్రానికి తీసుకు వెళ్లాలనే సమాచారం నిర్దేశిత బీఎల్ఓకు వెళ్తుంది. దివ్యాంగుల ఫోన్ నంబర్ అనుసంధానం చేసి ఉండాలి. అలా లేకపోయినా సబంధిత బీఎల్ఓకు ఫోన్ చేస్తే పీడబ్ల్యూడీ వలం టీర్లు వచ్చి పోలింగ్ కేంద్రానికి తీసుకువెళ్తారు. ఓటు వేసిన తర్వాత తిరిగి ఇంటికి చేరుస్తారు. ప్రభుత్వం పంపిణీ చేసే ఓటరు చీటిపై సంబంధిత బీఎల్ఓ నంబర్ ఉంటుంది. పోలింగ్ కేంద్రం పేరును నొక్కితే సంబంధిత వలంటీర్ పేరు, హోదా, ఫోన్ నంబర్ తెరపై ప్రత్యక్షమవుతాయి. అభ్యర్థుల వివరాలు ముందస్తు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సమాచారం, వారి పార్టీ పేర్లు యాప్‌లో కనిపించనున్నాయి. అలాగే జిల్లా ఎన్నిక ల అధికారి, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఇ–మెయిల్ వివరాలు సైతం ఉంటాయి. వీటితోపాటు ఎన్నికల షెడ్యూల్ విరాలు పొందుపరిచారు. కేంద్రానికి ఎలా వెళ్లాలంటే.. ఈ యాప్‌లో పోలింగ్ రూట్ మ్యాప్ తెలిపే ఆప్షన్ ఇచ్చారు. ఇందులో ఓటర్లు తాము ఉన్న ప్రదేశం నుంచి నిర్దేశిత పోలింగ్ కేంద్రానికి చేరుకోవడానికి రూట్ మ్యాప్‌తో పాటు చిరునామా కనిపిస్తుంది. సంబంధిత ఫోన్లో జీపీస్ పనిచేయాల్సి ఉంటుంది. అలాగే యాప్ కింది భాగంలో పోలింగ్ స్టేషన్, పోలీస్టేషన్, బస్టాప్ వివరాలతో కూడిన ఆప్షన్ల ఉన్నాయి. ఓటర్లు తాము ఉన్న ప్రదేశానికి సమీపంలోని పోలీస్టేషన్, స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. -
సైబర్ సైకో.. ఆ వీడియోలతో బెదిరింపులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: అతనో కామాంధుడు. సభ్యత, సంస్కారం లేదు. వావి వరసలు అంతకంటే లేవు. తనలోని కామతృష్ణ తీర్చుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకున్నాడు. యువతులు, వివాహితులపై ప్రయోగించి అంతరంగిక సంభాషణలు, ఫొటోలు, వీడియో దృశ్యాలు వారికి తెలియకుండానే తస్కరించాడు. వాటిని చూపి బెదిరించి లొంగదీసుకున్నాడు. వీడియో తీసి విదేశీ పోర్న్‌సైట్లకు అమ్మి సొమ్ము చేసుకున్నాడు. స్వయానా సోదరి సహా 80 మంది యువతుల దృశ్యాలను తిలకిస్తూ ఆనందించాడు. దినేష్‌కుమార్ అనే సైబర్ సెక్స్ సైకోను తమిళనాడు పోలీసులు సినీఫక్కీలో వలవేసి అరెస్ట్ చేశారు. వివరాలు.. తమిళనాడు, రామనాథపురం జిల్లా పరైక్కుళం సమీపం తామరైకుళంకు చెందిన దినేష్‌కుమార్ ఎంసీఏ పట్టభద్రుడు. బంధుమిత్రుల ఇళ్లలోని సోదరీమణులు, వివాహితలు, యువతులతో మంచిగా మాట్లాడుతూ స్మార్ట్‌ఫోన్ చూసిస్తానని తీసుకుంటాడు. ఫోన్లలోని ఫొటో గ్యాలరీల్లో భర్త లేదా బాయ్‌ఫ్రెండ్‌కు పంపిన అర్ధనగ్న దృశ్యాలు, వీడియోలు ఉంటే తన ఫోన్‌కు పంపించుకుంటాడు. ఫోన్లో సరికొత్త యాప్‌లను డౌన్లోడ్ చేసిస్తానని మభ్యపెట్టి వారికి తెలియకుండా ఓ యాప్‌ను ఇన్స్టాల్ చేసి తన ఫోన్‌తో అనుసంధానం చేస్తాడు. ట్రాక్ వ్యూ వల్ల ఆయా మహిళలు జరిపే సంభాషణలు, పంపుతున్న ఫొటోలు, వీడియోలు తన సెల్‌ఫోన్ ద్వారా వీక్షిస్తాడు. ఆయా అంశాలను తన ల్యాప్‌టాప్‌లో నిక్షిప్తం చేస్తాడు. తానెవరో చెప్పకుండా సదరు మహిళలకు ఫోన్ చేసి తన లైంగిక కోర్కెలు తీర్చాలని, లేకుంటే వాటిని ఇంటర్నెట్లో పెడతానని బెదిరించి వారిని లొంగదీసుకునేవాడు. ఈ క్రమంలో ఒక బాధితురాలు విషయాన్ని తన సోదరికి చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంది. సోదరి సలహామేరకు దినేష్‌కుమార్‌కు ఫోన్ చేసి పలానా చోటకు రావాలని కోరింది. దినేష్‌కుమార్ అక్కడికి రాగానే అతన్ని చూసిన బాధిత మహిళ, ఆమె సోదరుడు, బంధువులు బిత్తరపోయారు. వరసకు తమ్ముడైన వ్యక్తే ఇలాంటి దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుసుకుని దేహశుద్ధి చేసి దేవీపట్నం పోలీసులకు అప్పగించారు. దినేష్‌కుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతని ఇంటికి వెళ్లి తనిఖీలు చేపట్టి రెండు ల్యాప్‌టాప్‌లు, మూడు సెల్ఫోన్లు, మహిళలు ధరించే దుస్తులు స్వాధీనం చేసుకున్నారు. తనకు లొంగిన మహిళల దుస్తులను సేకరించి దినేష్ ఇంట్లో భద్రపరుచుకున్నట్టు తెలిసింది. లొంగని మహిళల ఫొటోలు, దృశ్యాలను విదేశీ పోర్న్‌సైట్లకు అమ్మి సొమ్ము చేసుకున్నాడు. అంతరంగిక విషయాలను గుట్టురట్టు చేస్తానంటూ వాట్సాప్ కాల్‌తో విదేశాల నుంచి మాట్లాడుతున్నట్లు వ్యవహరించడంతో ఎవరు మాట్లాడుతున్నారో తెలియక ఎందరో బాధిత మహిళలు భయంతో తల్లడిల్లిపోయారు. దినేష్‌కుమార్ నుంచి స్వాధీనం చేసుకున్న రెండు ల్యాప్‌టాప్‌లలో 80 మంది వివాహితలు, యువతుల అంతరంగిక వివరాలను పోలీసులు గుర్తించారు. అంతేగాక తోడబుట్టిన సోదరి తన భర్తతో మాట్లాడిన అంతరంగిక సంభాషణలు, భర్తతో గడిపిన ఫొటోలు, వీడియో దృశ్యాలను సైతం ల్యాప్‌టాప్‌లో నిక్షిప్తం చేసుకుని ఉన్నాడు. నిందితుడిపై సమాచార వ్యవస్థ దుర్వినియోగం, మహిళలపై వేధింపులు వంటి కేసులు నమోదు చేసి దేవీపట్నం పోలీసులు బుధవారం అతన్ని అరెస్ట్ చేశారు. -
‘స్మార్ట్’ గార్డెనింగ్
కాజీపేట : గతంలో ఏ పల్లెకు వెళ్లినా పచ్చదనం ఉట్టిపడుతుండేది. అటు పల్లెలతో పాటు ఇటు పట్టణాల్లో సైతం రహదారులు, ప్రధాన కూడళ్లు, ఇళ్లలో సైతం పలు రకాల మొక్కలు కనువిందు చేస్తుండేవి. అయితే పట్టణీకరణ, అధునాతన సౌకర్యాల కల్పన, రహదారుల విస్తరణతో పచ్చదనం కనుమరుగవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మొక్కల పెంపకం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. కొంత మందికి మొక్కలు పెంచేందుకు సరిపడా స్థలాలు ఉన్నా.. అవగాహన, గైడెన్స్ లేకపోవడంతో మొక్కలు పెంచలేకపోతున్నారు. అలాంటి వాళ్ల కోసం టెక్నాలజీ పలు రకాల అవకాశాలను కల్పిస్తోంది. ఎక్స్‌క్లూజివ్‌గా మొక్కల పెంపకం కోసమే పలు యాప్‌లు అందుబాటులోకి కూడా వచ్చాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు అనేక యాప్‌లు మొక్కల పెంపకం కోసం మనల్ని గైడ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. మొక్కల పెంపకం ఓ కళ... ఇంటి ఆవరణలో పూలు, పండ్లు, కూరగాయల మొక్కలు పెంచడం అనేది ఒక అందమైన కళ. అలాంటి వాటిపై ఆసక్తి ఉన్న వారి కోసమే స్మార్ట్ ఫోన్లో పలు యాప్‌లు తీర్చిదిద్దబడ్డాయి. ఏ కాలంలో ఎలాంటి మొక్కలు నాటాలి.. ఎటువం టి మట్టిని ఎంపిక చేసుకోవాలి.. కృత్రిమ, సేంద్రీయ ఎరువులను ఎలా అందించాలి.. తదితర సమాచారాలను ఈ యాప్‌లు సమగ్రంగా వివరిస్తున్నాయి. గార్డెన్ టిప్స్ యాప్... కుండీల్లో పెంచుకునే మొక్కల వివరాలు గురించి ఎక్కువగా ఈ యాప్‌లో తెల్సుకునే వీలుంది. ఇంట్లో ఉండే కీటకాలు, బొద్దింకలు, ఈగలు, దోమలను తరిమికొట్టేందుకు ఎలాంటి మొక్కలను పెంచుకోవాలనే అంశాలను ఈ యాప్‌లో పొందుపరిచారు. రోస్ గార్డెన్ యాప్... ప్రత్యేకంగా గులాబీ మొక్కలను పెంచుకునే విధానం, అనుసరించాల్సిన పద్ధతుల గురించి తెలిపే యాప్ ఇది. అందుబాటులో ఉన్న మట్టికి అనుగుణంగా ఎటువంటి రోజా మొక్కలు వేసుకోవచ్చు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అందమైన రోస్ గార్డెన్ తయారవుతుంది అనే అంశాలను వివరంగా పొందుపరిచారు. పువ్వులు ఎక్కువ కాలం నిలువ ఉండేందుకు ఎలాంటి పద్ధతులు అవలంభించాలో అనే అంశాలు కూడా ఉన్నాయి. వెజిటబుల్ పాట్ గార్డెనింగ్... ఇంటి ఆవరణలో కుండీల్లో పలు రకాల కూరగాయల మొక్కలను పెంచుకోవడానికి అనుగుణంగా ఈ యాప్‌ను రూపొందించారు. ఎటువంటి కుండీలు వినియోగించాలి.. మట్టి రకాలు.. ఏయే కూరగాయలు పెంచుకోవచ్చనే విషయాలు సమగ్రంగా ఉంటాయి. ఇంకెందుకు మరి ఆలస్యం వెంటనే మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో ఈ యాప్స్‌ని డౌన్లోడ్ చేసుకొని.. మొక్కల పెంపకాన్ని ప్రారంభించండి..హోమ్ గార్డెనింగ్ యాప్...పెరట్లో కూరగాయలు, ఇంటి ఆవరణలో అందాన్ని ఇచ్చే మొక్కలు పెంపకానికి సంబంధించిన యాప్ ఇది. విత్తనాలు ఎలా ఎంచుకోవాలి.. నకిలీ విత్తనాలను ఎలా గుర్తించాలన్న ఏడు అంశాలతో కూడిన వివరాలను ఈ యాప్‌లో పొందుపర్చారు. ఇంటి పరిసరాల్లో ఎలాంటి మొక్కలు నాటాలి.. ఎంత విస్తీర్ణంలో నాటుకోవాలి.. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలను ఎలా నాటుకోవచ్చో ఇందులో వివరంగా ఉంటుంది. ఈ యాప్‌లో వీడియోల ద్వారా అవగాహన పెంచుకునే అవకాశం కూడా కల్పించారు. -
మహిళల రక్షణకు సరికొత్తగా 'సేఫ్టీ పిన్' యాప్
కొత్త కొత్త ఆప్స్ మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. వాటివల్ల మొబైల్ వినియోగదారులకు ఎంతో ఉపయోగం ఉంటోంది. ఇప్పుడు కొత్త మొబైల్ అప్లికేషన్ మార్కెట్లోకి రానుంది. ఈ అప్లికేషన్ తన సర్కిల్లో ఉండేవారికి సమాచారాన్ని షేర్ చేస్తుంది. తోటివారి రక్షణ, సేఫ్టీ గురించి, వారు ఉండే చోటు వంటి వాటి గురించి ఆ గ్రూప్‌లో వారికి ఎప్పటికప్పుడు తెలియచేస్తుంది. ‘సేఫ్టీపిన్’ అనేది మ్యాప్ బేస్డ్ అప్లికేషన్. తమ చుట్టు పక్కన ఉన్నవారితో ఒక సర్కిల్‌గా ఏర్పడి, వారి వివరాలను అందచేసే ఆప్ ఇది. ఈ ఆప్‌లో ఏది పోస్ట్ చేసినా అది ఆ సర్కిల్లో ఉన్నవారి వాల్ ట్యాగ్ మీద కనపడుతుంది. సేఫ్టీపిన్ కో ఫౌండర్ అయిన ఆశిష్ బాబు ఈ ఆప్ గురించి మాట్లాడుతూ, ‘‘ఈ ఆప్ వాడకందార్లు ఎప్పటికప్పుడు ఆడిట్ చేసుకోవచ్చు. రోడ్డు తేడాగా ఉందా, సర్కిల్లోని ఏదైనా ప్రదేశంలో ఇబ్బందులున్నాయా, వీధి దీపాలు పగిలిపోయాయా, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ఎలా ఉంది... వంటివి తెలుసుకుని, అవి అనువుగా లేనప్పుడు ఆ దారిలోకి వెళ్లకుండా ఉండేందుకు ఈ ఆప్ ఉపయోగపడుతుంది’ అన్నారు. యూజర్లు తమకు నచ్చిన చిత్రాలను ఈ అప్లోడ్ చేయవచ్చు. ఏవైనా ప్రదేశాలు చూసి వచ్చినప్పుడు అక్కడ కలిగే అనుభూతులను, వారి భావాలను విశదపరచవచ్చు. ఇవి ఆ సర్కిల్లో వారికి షేర్ చేయవచ్చు. అది చూసి ఆ సర్కిల్లోని వారంతా వారి కామెంట్లు పొందుపరచవచ్చు. వీటికితోడు, అతి సమీపంగా ఉండే ఫార్మశీ, పోలీస్ స్టేషన్ గురించి కూడా పొందుపరచవచ్చు. ‘సేఫ్టీ పిన్’ తన వాడకందార్లకు ఒక మ్యాప్‌ను ఇచ్చి, నగరంలోని ప్రాంతాలను చూపుతుంది. ప్రమాదకరమైన ప్రాంతాలు వచ్చినప్పుడు రెడ్ కలర్, రక్షణ మధ్యస్థంగా ఉన్న ప్రాంతాలను ఆరెంజ్ కలర్తోను, క్షేమకరమైన ప్రాంతాలను ఆకుపచ్చరంగుతోను సూచిస్తుంది. ఈ ఆప్ వాడకందార్లు, అప్పటికప్పుడు పడుతున్న చిత్రహింసను, రక్షణ లోపాలను, అంటే వీధి దీపాలు పగిలిపోయినా, డ్రైనేజీ మూతలు ఓపెన్ అయిపోయి ఉండటం వంటివి తెలుస్తాయి. ‘సేఫ్టీ పిన్ ద్వారా ప్రజలు సమాజరక్షణ విషయంలో పాలుపంచుకోవచ్చు. రోడ్డు మీద ఎవరైనా ఎవరినైనా హింసిస్తున్నా, స్త్రీలు దాడులకు గురవుతున్నా ఆ సర్కిల్లోని వారికి సమాచారం అందుతుంది’ అని కో ఫౌండర్ అయిన కల్పనా విశ్వనాథ్ తెలిపారు. ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్, ఐ ఫోన్ మీద దొరుకుతుంది.