సాక్షి, హన్మకొండ అర్బన్: ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలోకి అనుమతించిన వ్యక్తులు మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది. అందులో ఎన్నికల సంఘం ద్వారా అనుమతించిన వారు కొందరు, ప్రిసైడింగ్ ఆఫీసర్ అనుమతించేవారు ఉంటారు.
వీరికే అనుమతి..
- ప్రిసైడింగ్ అధికారి ఒకసారి ఎంత మంది ఓటర్లను పోలింగ్ బూత్‌లోకి అనుమతిస్తే అంతమందే వెళ్లాలి.
- పోలింగ్ ఆఫీసర్లు, ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది.
- ఎన్నికల సంఘం అనుమతించిన వ్యక్తులు.
- అభ్యర్థులు, వారి ఏజెంట్లు, పోలింగ్ ఏజెంట్లు.
- ఓటు వేయడానికి వచ్చినవారు, చంకన ఎత్తుకున్న పిల్లలు.
- అంథులు, వృద్ధులు, వారికి తోడుగా వచ్చినవారు. లేదంటే ఎన్నికల అధికారి సూచించిన సహాయకులు.
- రిటర్నింగ్ అధికారి, ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రత్యేక పరిస్థితుల్లో నియమించిన వ్యక్తులు మాత్రమే లోనికి వెళ్లాలి.
- ఈ నిబంధనలు అతిక్రమంచినవారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment