
సాక్షి, జనగాం : ప్రముఖ ‘స్టార్ మా’ యాంకర్, నటుడు మొహమ్మద్ కయిమ్ (లోబో) రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు...ఆటోని ఢీకొంది. ఈ ప్రమాదంలో లోబోతో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం జనగాం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు సమాచారం అందుకున్న జనగాం డీఎస్పీ మల్లారెడ్డి ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించి, వివరాలు అడిగి తెలసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కాగా లోబో... కుమారి 21ఎఫ్ చిత్రంలో తన నటన ద్వారా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment