Seven injured
-
రోడ్డు ప్రమాదంలో యాంకర్‌కు గాయాలు
-
రోడ్డు ప్రమాదంలో యాంకర్‌కు గాయాలు
సాక్షి, జనగాం : ప్రముఖ ‘స్టార్ మా’ యాంకర్, నటుడు మొహమ్మద్ కయిమ్ (లోబో) రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు...ఆటోని ఢీకొంది. ఈ ప్రమాదంలో లోబోతో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం జనగాం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు సమాచారం అందుకున్న జనగాం డీఎస్పీ మల్లారెడ్డి ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించి, వివరాలు అడిగి తెలసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కాగా లోబో... కుమారి 21ఎఫ్ చిత్రంలో తన నటన ద్వారా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. -
నక్కపల్లి వద్ద రోడ్డుప్రమాదం
నక్కపల్లి(పాయకరావుపేట) : జాతీయరహదారిపై నక్కపల్లి సమీపంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ఏడుగురు గాయపడ్డారు. అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుని తిరుగుప్రయాణంలో ఇంటివెళ్తున్న వారు ప్రమాదానికి గురయ్యారు. ఎస్ఐ సింహాచలం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా రణస్థలానికి చెందిన బొక్కు సత్యం కుటుంబ సభ్యులు గురువారం అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి తమ గ్రామానికి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారును నక్కపల్లి సమీపంలో వెనుకనుంచి వస్తున్న కోళ్లవ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో సత్యం, అతని భార్య పార్వతి,కొడుకు ఎల్లం నాయుడు, కోడలు అన్నపూర్ణ, మనుమలు రాకేష్,లోకేష్ కారుడ్రైవర్ ఆదినారాయణ గాయపడ్డారు. వీరిని నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.వీరిలో ఎల్లంనాయుడు, పార్వతి, అన్నపూర్ణలకు తీవ్రగాయాలై పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.లత -
జర్మనీలో గొడ్డలితో దొరికినవారిని దొరికినట్లు..
జర్మనీ: విదేశాల్లో వరుస దాడులు చోటు చేసుకుంటున్నాయి. ఓపక్క అమెరికాలో జాతి విద్వేశంతో తెల్ల జాతి దుండగులు కాల్పులతో రెచ్చిపోతుండగా జర్మనీలో ఓ వ్యక్తి గొడ్డలితో రాక్షసంగా ప్రవర్తించాడు. ఓ రైల్వే స్టేషన్లోకి చొరబడి విచక్షణా రహితంగా దొరికిన ప్రతి ఒక్కరిని నరకడం మొదలుపెట్టాడు. దీంతో దాదాపు ఏడుగురు గాయాలపాలయ్యారు. జర్మనీలోని డస్సెల్‌డార్ఫ్ నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గతంలో కూడా ఇలాంటి దాడులు ఇక్కడ జరుగగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం గురువారం రాత్రి యుగోస్లావియాకు చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్న ఓ 36 ఏళ్ల వ్యక్తి మానసికంగా బాధపడుతున్నాడు. అతడు అనూహ్యంగా గొడ్డలి తీసుకొని రాత్రి 8.50గంటల ప్రాంతంలో రైల్వేస్టేషన్‌లోకి అడుగుపెట్టి గొడ్డలితో తీవ్రంగా దాడికి చేశాడు. పోలీసులు అక్కడి చేరుకోవడంతో అతడు పారిపోయేందుకు ఓ పెద్ద గోడ నుంచి దూకి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అయితే ప్రస్తుతం అతడిని విచారించే పరిస్థితిల్లో లేడని, మానసికంగా దెబ్బతిని ఉన్నాడని మాత్రం తమకు అర్ధం అయిందని చెప్పారు. ఈ ఘటన కారణంగా స్టేషన్ ప్రాంగణంలో భయానక వాతావరణం నెలకొందని, ఎక్కడికక్కడా ట్రాఫిక్ జామ్ కూడా అయిందని అన్నారు. రైల్వే స్టేషన్ ప్రాంగణం ఎక్కడ చూసిన రక్తపు మరకలతో దర్శనం ఇచ్చింది. -
జర్మనీలో గొడ్డలితో దొరికినవారిని దొరికినట్లు..
-
కారును ఢీకొన్న లారీ
ఏడుగురికి గాయాలు ఒకరి పరిస్థితి విషమం వెంకటాచలం : కారును లారీ ఢీకొనడంతో ఏడుగురు గాయపడ్డారు. ఈ సంఘటన వెంకటాచలం వద్ద జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం జరిగింది. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కోవూరుకు చెందిన వెంకటేష్, నెల్లూరుకు చెందిన ఫణీంద్ర కారులో చెన్నైకు వెళ్తుండగా వెంకటాచలం వద్ద వెనుక నుంచి లారీ ఢీకొంది. దీంతో కారు బస్సు కోసం రోడ్డు పక్కన వేచి ఉన్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న వెంకటేష్, ఫణీంద్ర కారు తలుపులు రాక అందులో ఇరుక్కుపోయారు. అక్కడే ఉన్న ప్రయాణికులు కారు అద్దాలు పగలగొట్టి బయటకు లాగారు వీరిద్దరికి స్వల్పగాయాలయ్యాయి. బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికుల్లో గుడ్లూరువారిపాళెంకు చెందిన సజ్జనపు వెంకటసుబ్బయ్య, సుమన్, మనుబోలు మండలం కొమ్మలపూడికి చెందిన సుభాషిణి, ఆమె కుమారుడు నరసింహ, కోట మండలం కోటపోలూరుకు చెందిన చెంగమ్మకు గాయాలయ్యాయి. వీరిలో వెంకటసుబ్బయ్య పరిస్థితి విషమంగా ఉంది. కారు ఢీకొనడంతో వెంకటసుబయ్య డివైడర్‌పై పడిపోవడంతో పొట్ట భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంకటాచలం ఎస్ఐ వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్ మోహన్‌కృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై 15 నిమిషాలు ట్రాఫిక్ నిలిచిపోయింది. -
కారు బోల్తా.. ఏడుగురికి గాయాలు
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో కారు అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఏడుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వరదయ్యపాలెం మండలం ఉబ్బలమడుగు గ్రామ శివారులో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో కారులో ఉన్న ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. -
చత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు
రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్‌లోని ఓ స్టీల్ ప్లాంట్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అక్కడ పనిచేస్తున్న ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. టిల్డా పోలీస్‌స్టేషన్ పరిధిలోని బజరంగ్ ఇస్పాత్తో శుక్రవారం అర్థరాత్రి సమయంలో పేలుడు సంభవించిందని రాయ్‌పూర్ ఎస్పీ సంజీవ్ శుక్లా తెలిపారు. స్టీల్ ప్లాంట్‌లోని ఓ చాంబర్ వద్ద వద్ద రాత్రి విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పేలుడులో తీవ్రంగా గాయపడ్డారని ఆయన వెల్లడించారు. సమాచారం అందుకున్న రాయ్‌పూర్ కలెక్టర్ ఓపీ చౌదరి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన సిబ్బందిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు పేలుడుకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు : ఒకరి మృతి
ఒంగోలు : ప్రకాశం జిల్లా పంగులూరు మండలం రేణంగివరం వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఒంగోలులోని రిమ్స్‌కు తరలించారు. అలాగే మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకుని... పోస్ట్ మార్టం నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులంతా ఖమ్మం జిల్లా భద్రాచలంకు చెందిన వారని పోలీసులు తెలిపారు. తిరుమల నుంచి భద్రచలం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు. -
ట్యాంకర్‌ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
కొత్తపేట: తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో ఏడుగురికి గాయాలయ్యాయి. రావులపాలెం మండలం ఈతకోట టోల్గేట్ వద్ద ఆగి ఉన్న ట్యాంకర్‌ను వెనుక నుంచి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. బస్సు వెనుకనే వస్తున్న ఓ కారు బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురితోపాటు బస్సులోని ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా అతని పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను కాకినాడ, తణుకు, రాజమండ్రి ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. దట్టమైన పొగమంచు కారణంగా ప్రమాదం జరిగినట్టు సమాచారం. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటో బోల్తా.. ఏడుగురికి గాయాలు
నందవరం: కర్నూలు జిల్లాలో బుధవారం సాయంత్రం ఓ ట్రాలీ ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. నందవరం మండలం హాలహర్వి సమీపంలో ట్రాలీ ఆటో టైరు పేలడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో రాయచూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారంతా కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా మడల్కల్కు చెందిన వారిగా గుర్తించారు. -
లారీ, బస్సు ఢీ: ఏడుగురికి గాయాలు
మహబూబ్ నగర్: వేగంగా వస్తున్న లారీ ఆగి ఉన్న బస్సును ఢీకొట్టిన ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా అయిజ మండలం పరిధిపురం గ్రామ శివారులో సోమవారం ఉదయం జరిగింది. రాయ్‌చూర్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు గ్రామ శివారులో ఆగి ఉన్న సమయంలో కర్నూలు వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ రెండుకాళ్లు విరగడంతో పాటు.. నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. -
ఎల్బీ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం
హైదరాబాద్: ఆగి ఉన్న లారీని పెళ్లి వాహనం ఢీకొంది. ఈ సంఘటన హైదరాబాద్ శివారులో ఎల్బీ నగర్ వద్ద శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ఘటనలో వధూవరులతో సహా ఏడు మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిని తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. గాయపడిని వారిని ఆసుపత్రికి తరలించారు. -
ఆఫ్ఘాన్‌లో పేలుడు: ఐదుగురు మృతి
కాబూల్: ఉత్తర ఆఫ్ఘానిస్థాన్ ప్రావెన్స్లోని బాగ్లన్లో శనివారం బాంబు పేలుడులో ఐదుగురు మృతి చెందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. రహదారి సమీపంలో మోటర్ సైకిల్లో ఉంచిన బాంబు... ఆర్మీ వాహనం సమీపిస్తున్న క్రమంలో పేలుడు సంభవించింది. అయితే ఈ ప్రమాదంలో ఆర్మీ ఉద్యోగులు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు ఈ ఘటనలో మరణించారని చెప్పారు. తాలిబాన్ సంస్థకు చెందిన తీవ్రవాదులే ఈ పేలుడుకు పాల్పడ్డారని వెల్లడించారు. గాయపడిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పేర్కొన్నారు. గతేడాది ఆఫ్ఘానిస్థాన్ లో తాలిబాన్ దాడిలో 3700 మంది పౌరులు మరణించగా, 6800 మంది పౌరులు గాయపడిన సంగతి తెలిసిందే. -
ఆటో బోల్తా: ఏడుగురికి తీవ్ర గాయాలు
నెల్లూరు : నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం అక్కరపాక సమీపంలో శుక్రవారం ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కాలువలో పడ్డ స్కూల్ బస్సు
తడ (నెల్లూరు): వేగంగా వెళ్తున్న స్కూల్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలో పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్ధులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన నెల్లూరు జిల్లా తడ మండలం ఎన్ఎమ్ కంద్రిగ (పెద్ద,చిన్న మాంబట్టు పంచాయతీ) వద్ద బుధవారం జరిగింది. వివరాలు.. సూళ్లూరుపేటలోని నారాయణ స్కూల్‌కు చెందిన బస్సు పిల్లలను తీసుకొని బయలుదేరింది. డ్రైవర్ సింగిల్ రోడ్డులో వేగంగా బస్సును నడపడంతో అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న కాలువలో పడింది. దీంతో బస్సులో ఉన్న ఏడుగురికి గాయాలయ్యాయి. కాగా, ఈ ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ పరారయ్యాడు. పిల్లల్ని గ్రామస్తులు సూళ్లూరుపేట ఆస్పత్రికి తరలించారు. పిల్లల గురించి విచారించాల్సిన నారాయణ స్కూల్ యాజమాన్యం సంఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో బస్సును బయటకు తీసే ప్రయత్నం చేసింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. -
సరిహద్దు వెంబడి కాల్పులు: ఇద్దరు మృతి
జమ్మూ కాశ్మీర్: పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్‌లోని ఆర్.ఎస్.పురా, ఆర్నియా సెక్టార్లపైకి పాక్ సైన్యం శనివారం తుపాకి గుళ్ల వర్షం కురిపించింది. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారని పోలీసులు ఉన్నతాధికారి వెల్లడించారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డరని తెలిపారు. మృతులు మహమ్మద్ అక్రం అతని కుమారుడు అస్లాం (13)గా గుర్తించినట్లు చెప్పారు. అక్రమ భార్యతోపాటు ముగ్గురు చిన్నారులు, ఓ బిఎస్ఎఫ్ జవాన్ గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను జమ్మూ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పాక్ వైపు నుంచి కాల్పుల ఇంకా కొనసాగుతున్నాయని... భారత్ వెంటనే స్పందించి పాక్ బలగాలపైకి కాల్పులకు దిగిందన్నారు. -
సుమో బీభత్సం: ఏడుగురికి గాయాలు
హైదరాబాద్ : శ్రీవరసిద్ధి వినాయకుడు కొలువైన చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో ఆదివారం సుమో వాహనం బీభత్సం సృష్టించింది. ఆ వాహనం డ్రైవర్ తప్ప తాగి రోడ్డుపై అతివేగంతో కారు నడిపాడు. దాంతో ఏడుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక భక్తులు వెంటనే స్పందించి డ్రైవర్‌ను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు సుమోను సీజ్ చేసి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కాణిపాకంలోని ఆసుపత్రికి తరలించారు. -
మణిపూర్ సీఎం నివాసం వద్ద బాంబు పేలుడు
మణిపూర్ రాజధాని ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్ అధికార నివాసం వద్ద ఈ రోజు తెల్లవారుజామున బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. సీఎం భద్రత సిబ్బంది వెంటనే స్పందించి క్షతగాత్రులను ఇంఫాల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు,భద్రత సిబ్బంది అప్రమత్తమైయ్యారు. అడుగడుగునా తనిఖీలు చేపట్టారు. అయితే నిన్న కూడా సీఎం ఇబోబి సింగ్ నివాసానికి కూతవేటు దూరంలో బాంబు పేలుడు సంభవించింది. అలాగే ఈ ఏడాది ఆగస్టులో కూడా సీఎం నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుడు జరిగింది. ఆ రెండు ఘటనలో ఎవరు గాయపడలేదు.