చత్తీస్గఢ్లో భారీ పేలుడు | Seven injured in explosion at Ch'garh steel plant | Sakshi
Sakshi News home page

చత్తీస్గఢ్లో భారీ పేలుడు

Published Sat, Sep 24 2016 10:05 AM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM

చత్తీస్గఢ్లో భారీ పేలుడు

చత్తీస్గఢ్లో భారీ పేలుడు

రాయ్పూర్: చత్తీస్గఢ్లోని ఓ స్టీల్ ప్లాంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో అక్కడ పనిచేస్తున్న ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
 
టిల్డా పోలీస్స్టేషన్ పరిధిలోని బజరంగ్ ఇస్పాత్తో శుక్రవారం అర్థరాత్రి సమయంలో పేలుడు సంభవించిందని రాయ్పూర్ ఎస్పీ సంజీవ్ శుక్లా తెలిపారు. స్టీల్ ప్లాంట్లోని ఓ చాంబర్ వద్ద వద్ద రాత్రి విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పేలుడులో తీవ్రంగా గాయపడ్డారని ఆయన వెల్లడించారు. సమాచారం అందుకున్న రాయ్పూర్ కలెక్టర్ ఓపీ చౌదరి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాయపడిన సిబ్బందిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు పేలుడుకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement