విశాఖ సాక్షి: విశాఖ ఉక్కు కార్మికులు చేపట్టిన నిరాహా దీక్షను భగ్నం చేయాలనే యోచన చేస్తోంది ఏపీ ప్రభుత్వం. వారిపై ఉక్కు పాదం మోపేందుకు సమాయత్తమైంది. దీనిలో భాగంగా వారి సెలవుల్ని రద్దు చేయాలని చూస్తోంది. శాంతి భద్రతల పేరుతో నిరాహార దీక్ష చేపట్టిన కార్మికుల సెలులు రద్దు చేస్తున్నట్లు మెయిల్స్ పంపుతోంది. ఇలా మెయిల్స్ పంపడంపై ఉక్కు పోరాట కమిటీ ఆగ్రహాం వ్యక్తం చేస్తోంది. శాంతి భద్రతలకు ఉక్కు కార్మికులకు సంబంధం ఏమిటని ప్రశ్నిస్తోంది.
నిరాహార దీక్ష ప్రారంభం
ఉక్కు కార్మికుల నిరాహార దీక్ష ప్రారంభమైంది. ప్రధాని విశాఖ పర్యటన నేపథ్యంలో ఉక్కు కార్మికులు 36 గంటల పాటు నిరసనకు దిగారు. మంగళవారం ఉదయం నుంచి రేపు రాత్రి 8 గంటల వరకు నిరాహార దీక్ష కొనసాగించనున్నారు. ఈ దీక్ష సందర్భంగా విశాఖ ఉక్కుపై ప్రధాని సానుకూల ప్రకటన చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై ప్రధాని మోదీని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు అపాయిట్మెంట్ అడిగారు. అయితే, ఆ అపాయిట్మెంట్‌పై అధికారులు స్పష్టత ఇవ్వలేదు.
Comments
Please login to add a commentAdd a comment