శ్రీవరసిద్ధి వినాయకుడు కొలువైన చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో ఆదివారం సుమో వాహనం బీభత్సం సృష్టించింది.
హైదరాబాద్ : శ్రీవరసిద్ధి వినాయకుడు కొలువైన చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో ఆదివారం సుమో వాహనం బీభత్సం సృష్టించింది. ఆ వాహనం డ్రైవర్ తప్ప తాగి రోడ్డుపై అతివేగంతో కారు నడిపాడు. దాంతో ఏడుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక భక్తులు వెంటనే స్పందించి డ్రైవర్ను పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు సుమోను సీజ్ చేసి, డ్రైవర్ను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కాణిపాకంలోని ఆసుపత్రికి తరలించారు.