కారు బోల్తా.. ఏడుగురికి గాయాలు
Published Wed, Oct 12 2016 6:28 PM | Last Updated on Thu, May 10 2018 12:34 PM
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో కారు అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఏడుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వరదయ్యపాలెం మండలం ఉబ్బలమడుగు గ్రామ శివారులో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో కారులో ఉన్న ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement