Car roll over
-
వివాహానికి వెళ్లొస్తూ మృత్యు ఒడికి
గణపవరం: పంట కాల్వలో కారు బోల్తా కొట్టిన ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మహిళలు మృతి చెందగా మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. ఈ విషాద ఘటన ఏలూరు జిల్లా గణపవరం మండలం వల్లూరు – అర్ధవరం గ్రామాల మధ్య సోమవారం రాత్రి జరిగింది. మృతులు భీమవరంలోని కొత్త బస్టాండ్ ప్రాంతానికి చెందినవారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భీమవరం కొత్త బస్టాండు సమీపంలో నివాసం ఉంటున్న మహబూబ్ బాషా బంధువుల వివాహం ఏలూరులో జరిగింది. దీనికి అమర్జహాన్ (50), మహ్మద్ సంషాద్ (55), ఫాతిమా జహర్బీ (45), అమర్జహాన్ కుమారుడు కమాల్ బాషా, ఎండీ రహీమా కారులో బయలుదేరి వెళ్లారు. ఫంక్షన్ పూర్తి అయ్యాక తాడేపల్లిగూడెంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ నుంచి రాత్రి ఎనిమిది గంటల సమయంలో కారులో భీమవరం బయలుదేరారు. కారు వల్లూరు వద్ద రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి.. పంట కాల్వలోకి దూసుకుపోయింది. స్థానికులు వెంటనే కారులో ఉన్నవారిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. నీటిలో సగం వరకు కారు మునిగిపోవడంతో కారులో ఉన్న అమర్జహాన్, మహ్మద్ సంషాద్ (55), ఫాతిమా జహర్బీ (45) అనే ముగ్గురు మహిళలు ఊపిరాడక కారులోనే ప్రాణాలు విడిచారు. కారు నడుపుతున్న అమర్జహాన్ కుమారుడు కమాల్ బాషా, ఎండీ రహీమాను స్థానికులు రక్షించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కాలువలోకి దూసుకెళ్లిన కారు
హిరమండలం: పాతహిరమండలం సమీపంలోని వంశధార కుడి ప్రధాన కాలువలోకి మంగళవారం తెల్లవారుజామున ఓ కారు దూసుకెళ్లింది. కారులో ఉన్న వ్యక్తులు అప్రమత్తమై అద్దాలు పగులగొట్టి బయటకు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాలకొండకు చెందిన సత్యనారాయణ, కారు డ్రైవరు మురళీకృష్ణలు కంచిలిలో పని ముగించుకొని సోమవారం అర్ధరాత్రి తిరుగు ప్రయాణమయ్యారు. వీరు పాతపట్నం, హి రమండలం మీదుగా పాలకొండ చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. హిరమండలం వచ్చేసరికి ఉదయం నాలుగు గంటలైంది. పాత హిరమండలం దాటాక వంశధార కుడి ప్రధా న కాలువ సమీపంలోకి వచ్చేసరికి డ్రైవర్ నిద్రమత్తులో ఉండి కారును అదుపు చేయలేకపోవడంతో అమాంతం కాలువలో పడిపోయింది. అప్పటికే కాలువలో పది అడుగుల మేర నీటి ప్రవాహం ఉంది. అయితే అద్దాలను పగులగొట్టి సత్యనారాయణ, మురళీకృష్ణ ఎలాగోలా బయట పడ్డారు. స్థానికులు కూడా వీరిని గుర్తించి సాయం చేశారు. పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ఐ గోవిందరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారిలో హెచ్చరిక బోర్డులు ఏర్పా టు చేయలేదని, కొద్ది రోజుల కిందట కూడా ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటుచేయాలని ప్రజలు కోరుతున్నారు. -
ఫ్లైఓవర్ పైనుంచి కారు బోల్తా
హైదరాబాద్: మితిమీరిన వేగం మరో ప్రాణాన్ని బలితీసుకుంది. హైదరాబాద్‌లో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ నుంచి కారు కింద పడిన ఘటన మరచిపోకముందే అలాంటిదే మరో ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని భరత్‌నగర్ ఫ్లైఓవర్‌పైకి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. అదుపుతప్పి కింద పడిపోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఓ వ్యక్తి మృతిచెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఫ్లైఓవర్ కింద భరత్‌నగర్ మార్కెట్‌కు వచ్చిన కూరగాయల వ్యాపారులు, విద్యుత్ కేబుల్ కార్మికులు ఉన్నారు. అయితే, అదృష్టవశాత్తు కారు వారికి కాస్త దూరంగా పడటంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. 30 అడుగుల ఎత్తు నుంచి... బోరబండ పండిట్ నెహ్రూనగర్, స్వరాజ్నగర్లకు చెందిన స్నేహితులు మహ్మద్ సోహెల్ (27), మెహిజ్ (19), గౌస్ (20), ఇర్ఫాన్ (18), అశ్వక్ (18) సోమవారం రాత్రి భోజనం చేయడానికి హైటెక్‌సిటీకి వెళ్లారు. సోహెల్ మామయ్యకు చెందిన హ్యుందాయ్ ఆక్సెంట్ కారు (ఏపీ 11ఆర్ 9189)ను సునీల్ (22) నడుపుతున్నాడు. భోజనం చేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో మూసాపేట నుంచి ఎర్రగడ్డ వైపు వస్తున్నారు. భరత్‌నగర్ ఫ్లైఓవర్‌పైకి వేగంగా వెళ్లిన కారు.. ఒక్కసారిగా అదుపు తప్పింది. అడుగున్నర ఎత్తున్న ఫుట్‌పాత్ ఎక్కి, అంతటితో ఆగకుండా రెయిలింగ్‌ను ఢీకొట్టి 30 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయింది. పెద్ద శబ్దంతో కారు కింద పడటంతో అక్కడ ఉన్న కూరగాయల వ్యాపారులు, విద్యుత్ కేబుల్ కార్మికులు ఏం జరిగిందో తెలియక భయాందోళనతో పరుగులు తీశారు. అనంతరం తేరుకుని కారు వద్దకు చేరుకున్నారు. జేసీబీ సాయంతో కారు రేకులు తొలగించి అం దులో ఉన్న ఆరుగురిని బయటకు తీశారు. ఈ ఘటనలో డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న సోహెల్ అక్కడికక్కడే మృతి చెందగా.. మిగతా ఐదుగురు గాయపడ్డారు. మృతుడు సోహెల్ తండ్రి షఫీ చాయ్ హోటల్ నడుపుతున్నారు. అశ్వక్, ఇర్ఫాన్, మొహిజ్లు స్వరాజ్‌నగర్‌లో ఏసీ రిపేరింగ్ పనులు చేస్తుంటారు. గౌస్ అల్మారా పనులు చేస్తుండగా.. సునీల్ లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గాయపడిన వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. -
అదుపుతప్పి బ్యారేజీలో పడిపోయిన కారు
-
అదుపు తప్పిన కారు; ఇద్దరు మృతి
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా హిరమండలం గొట్టా బ్యారేజీ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి వంశధార ఎడమ కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు.వివరాలు.. విశాఖపట్నంలోని కోరమాండల్ ఫెర్టిలైజర్ సంస్థలో మేనేజర్లుగా పని చేస్తున్న ఎన్ ఎస్ వి పవన్ (32), బి. చంద్ర (45) పాటు మరో ముగ్గురు కలిసి ఒడిశాలోని గజపతి జిల్లా సెంచూరియన్ యునివర్సిటీలో కోరమండల్ ఫెర్టిలైజర్స్ మీటింగ్ నిమ్మిత్తం వెళ్లారు. మీటింగ్ ముగిసిన తర్వాత కారులో తిరిగి వస్తున్న క్రమంలో హిరమండలం గొట్టా బ్యారేజీ వద్దకు రాగానే కారు అదుపుతప్పి ఎడమ కాలువలోకి దూసుకెళ్లింది. కాగా మృతి చెందిన పవన్ స్వస్థలం కాకినాడ, చంద్రది ఖమ్మం జిల్లా అని తెలిసింది. సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను బయటికి తీశారు. గాయపడిన మరో ముగ్గురిని చికిత్స నిమ్మిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
ప్రాణం తీసిన అతి వేగం
పలమనేరు (చిత్తూరు జిల్లా): అతివేగం రెప్పపాటులో ఐదు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. చిత్తూరు జిల్లాలో శనివారం ఉదయం కారు బోల్తా పడి అగ్నికి ఆహుతైన దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనమయ్యారు. కారును నడుపుతున్న టీటీడీ ఉద్యోగి విష్ణు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రెయిలింగ్‌ను ఢీకొట్టి బోల్తా.. తిరుపతికి చెందిన విష్ణు తన సోదరిని బెంగళూరులో దింపేందుకు కుటుంబ సభ్యులతో కలసి కారులో వెళ్తుండగా పలమనేరు నియోజవర్గ పరిధిలోని టీటీడీ గోశాల వద్ద అదుపు తప్పి రోడ్డుకు ఎడమ వైపు రెయిలింగ్‌ను ఢీకొని వంద మీటర్ల దూరంలో ఎగిరిపడింది. కారు ఇంజన్ రెయిలింగ్‌ను రాసుకోవడంతో క్షణాల్లో మంటలు చెలరేగి పెట్రోల్ ట్యాంకుకు నిప్పంటుకుంది. సగం కాలిపోయి ఆర్తనాదాలు చేస్తున్న విష్ణును సమీపంలో పొలం పనులు చేసుకుంటున్న రైతులు రక్షించి 108లో పలమనేరు ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వేలూరు సీఎంసీకి రిఫర్ చేశారు. అనంతరం గంగవరం పోలీసులు అక్కడకు చేరుకుని జేసీబీతో కారును బయటకు తీశారు. అప్పటికే కారులోని వారంతా అగ్నికి ఆహుతయ్యారు. మృతులు విష్ణు భార్య జాహ్నవి (35), కుమారుడు పవన్రామ్ (13), కుమార్తె అస్త్రిత (10), విష్ణు సోదరి కళ (42), ఆమె కుమారుడు భానుతేజ (19)గా గుర్తించారు. పెట్రోలు లీకై మంటలు వ్యాపించడంతో.. చిత్తూరు ఎస్పీ వెంకటప్పలనాయుడు ఆస్పత్రి వద్దకు చేరుకుని మృతుల బంధువులను ఓదార్చారు. పెట్రోలు కారు కావడం, ప్రమాద సమయంలో 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుండటంతో అదుపు తప్పి దుర్ఘటన జరిగినట్లు ఎస్పీ చెప్పారు. అందరూ తిరుమలేశుని పరమ భక్తులు టీటీడీ ఉద్యోగి చంద్రశేఖర్, ఆయన భార్య నాగరత్నమ్మ తిరుమల వెంకటేశ్వర స్వామికి పరమ భక్తులు. వారి కుమారుడు విష్ణు ఉన్నత చదువులు పూర్తిచేసి అమెరికాలో ఉద్యోగం చేస్తుండేవాడు. కోడలు జాహ్నవి ఆయుర్వేద వైద్య నిపుణురాలు. కాగా తమ బిడ్డ విష్ణు శ్రీవారి చెంత సేవలు చేయాలని భావించిన చంద్రశేఖర్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. అమెరికాలో ఉంటున్న తమ బిడ్డకు టీటీడీలో అవకాశం కల్పించారు. దీంతో విష్ణు తిరుపతిలోనే ఉంటున్నారు. మరోవైపు బెంగళూరులో ఉంటున్న ఆయన చెల్లి శ్రీవారి దర్శనం కోసం బిడ్డ భానుతేజతో కలసి తిరుపతి వచ్చారు. దర్శనం అనంతరం తిరిగి బెంగళూరుకు వెళ్లేందుకు సిద్ధం కాగా.. విష్ణు బెంగుళూరులో ఉంటున్న తమ మామ రామకృష్ణ (భార్య తండ్రి) అనారోగ్యం బారిన పడటంతో ఆయనను చూసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వారివెంట వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. -
మాదాపూర్‌లో కారు బోల్తా
హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మాదాపూర్‌లో ఆదివారం ఉదయం›4.30 ప్రాంతంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో అదే కారులో ప్రయాణిస్తున్న బీటెక్ విద్యార్థిని చనిపోగా.. పలువురికి గాయాలయ్యాయి. కారును డ్రైవ్ చేసిన యువకుడు మద్యం సేవించి ఉండటమే దీనికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏపీలోని గుంటూరులోని బ్రాడీపేటకు చెందిన సాయి విహిత (20) కూకట్‌పల్లిలోని హాస్టల్లో ఉంటోంది. గీతం యూనివర్సిటీలో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. అదే కాలేజీ నుంచి బీటెక్ పూర్తి చేసిన కూకట్పల్లి వాసి సుచిత్‌బాబు (28) ఈమెకు స్నేహితుడు. ప్రాజెక్టు వర్క్ పని ఉందంటూ విహి త వారం రోజులుగా కాలేజీకి వెళ్లట్లేదు. శనివారం రాత్రి ప్రాజెక్ట్ వర్క్ నిమిత్తం సుచిత్‌తో కలసి అతడి కారులో (ఏపీ37 ఎస్ 0444) హాస్టల్ నుంచి బయటకు వెళ్లింది. ఆదివారం ఈ వాహనం మాదాపూర్‌లోని వంద అడుగుల రోడ్డులో ప్రయాణిస్తోంది. పర్వత్‌నగర్ చౌరస్తా, కల్లు కాంపౌండ్ చౌరస్తా మధ్య ఉన్న రెస్ట్రో హోటల్ వద్ద మితిమీరిన వేగం కారణంగా కారు అదుపు తప్పింది. అక్కడ ఉన్న ఓ ఆటోను వెనుక నుంచి ఢీకొంది. అప్పటికీ అదుపులోకి రాని కారు ఫుట్‌పాత్ ఎక్కి బోల్తా కొట్టింది. ఈ ప్రమా దంలో కారు నుంచి బయటకు పడిపోయిన విహిత తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఆటోడ్రైవర్ చందర్‌కు కుడికాలు, మెడ వద్ద గాయాలయ్యా యి. ప్రమాదంపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి, విహిత మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఆమె కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. కారును వదిలి పారిపోయిన సుచిత్‌బాబు సెల్‌ఫోన్ అందులోనే పడిపోయింది. దీన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కాల్ రికార్డుల్ని పరిశీలించారు. శనివారం తర్వాత అతడికి వచ్చిన ఫోన్‌కాల్స్‌లోని సంభాషణలు, కారులో లభించిన మద్యం సీసాల ఆధారంగా ఇది డ్రంక్ అండ్ డ్రైవింగ్‌గా అనుమానిస్తున్నారు. సుచిత్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తేనే వీరి ద్దరూ ఎక్కడకు వెళ్లారు? ఏ సమయంలో వెళ్లారు? తదితర వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. -
అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో కారు బోల్తా
-
కారు బోల్తా: పారిశ్రామికవేత్త మృతి
తమిళనాడు, అన్నానగర్: ఊత్తుక్కులి సమీపంలో ఆదివారం కారు బోల్తాపడిన ప్రమాదంలో సేలంకు చెందిన పారిశ్రామికవేత్త మృతి చెందాడు. అతని స్నేహితుడి పరిస్థితి విషమంగా ఉంది. సేలం అళగాపురం పెరియపుదూర్ పిళ్లైయార్ ఆలయ వీధికి చెందిన మణియన్ (48). పారిశ్రామికవేత్త అయిన ఇతను కోవైలో తన స్నేహితులతో కలిసి బనియన్ సంస్థ నడుపుతున్నాడు. ఆదివారం ఉదయం మణియన్ స్నేహితుడు సేలంకి చెందిన నాగరాజ్ (40)తో కారులో కోవైకి వెళ్లాడు. అక్కడ పని ముగించుకుని అనంతరం కోవై నుంచి సేలంకి కారులో తిరిగి వస్తున్నారు. కారును మణియన్ నడిపాడు. కోవై–సేలం హైవే రోడ్డులో ఊత్తుక్కులి సమీపం సెంగపల్లి ప్రాంతంలో వస్తుండగా హఠాత్తుగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న గుంతలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మణియన్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్రగాయాలతో ప్రాణాలకు పోరాడుతున్న నాగరాజ్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం తిరుప్పూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతనికి తీవ్ర చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై ఊత్తుక్కులి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. -
త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం
తూర్పుగోదావరి, యానాం (ముమ్మిడివరం): అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలు భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వస్తోంది. వందలాది మంది ప్రయాణించే పలు కల్వర్టులకు రెయిలింగ్‌లు, పిట్టగోడలు కట్టకపోవడంతో వాటిపై వెళుతున్న వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. నియోజకవర్గ పరిధిలోని దొమ్మేటిపేట ఇండస్ట్రియల్ రహదారికి వెళ్లే ప్రదేశంలో ప్రధాన రహదారికి చేర్చి ఉన్న కల్వర్టుకు రెయిలింగ్ లేకపోవడంతో ఆదివారం నలుగురు కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్న మారుతీకారు అదుపుతప్పి ఎనిమిది అడుగుల లోతు ఉన్న కాలువలోకి దూసుకుపోయింది. కారులోని మహిళకు గాయాలు కాగా, మరో వ్యక్తి తలకు తీవ్రగాయమైంది. కారు డ్రైవర్‌ది స్వీయ తప్పిదం కావడంతో పోలీస్ కేసు నమోదు కాలేదు. వీరు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విధంగా గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగాయి. ముఖ్యంగా పరిశ్రమలు ఉండే ప్రదేశం కావడంతో లారీలు, ట్రాక్టర్లు, భారీ వాహనాలు ఈ కల్వర్టు మీదుగా వెళుతుంటాయి. ఇది వరకు కల్వర్టుకు ఒకవైçపు మాత్రమే పిట్టగోడ ఉండేది. అదీ కూడా ఇటీవల పడిపోవడంతో రెండు వైపులా రక్షణ గోడ లేక తరుచూ వాహనాలు పడిపోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణం సంబంధిత అధికారులు స్పందించి ఇరువైపులా రెయిలింగ్‌ను నిర్మించాలని కోరుతున్నారు. -
చికెన్ సెంటర్లోకి దూసుకెళ్లిన కారు
మన్సూరాబాద్: మద్యం మత్తులో అర్ధరాత్రి అతివేగంగా కారును నడపడంతో అదుపుతప్పి చికెన్ సెంటర్లోకి దూసుకెళ్లిన సంఘటన మన్సూరాబాద్‌లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మన్సూరాబాద్ సాయినగర్‌కాలనీలోని పెట్రోల్ పంప్ ఎదురుగా కొప్పుల రమేష్ అనే వ్యక్తి గత కొంతకాలంగా జ్యోతి చికెన్ మార్కెట్ నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి షాపును మూసివేసి షాపులో పనిచేస్తున్న సాయి,నాగేష్ అక్కడే నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి బిగ్‌బజార్ నుంచి మన్సూరాబాద్ వైపు అతివేగంగా వచ్చిన ఫోర్డ్ ఫీగో కారు రోడ్డు పక్కన ఉన్న తోపుడు బండిని ఢీకొట్టి, చికెన్ సెంటర్లోకి దూసుకెళ్లింది. వనస్థలిపురం ప్రాంతానికి చెందిన వెంకటష్ మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల ప్రమాదం జరిగిందని, కారులో అతడితో పాటు మరో ఇద్దరు యువకులు ఉన్నట్లు తెలిపారు. సదరు యువకులు కారును అక్కడే వదిలి పారిపోయారు. సాయి, నాగేష్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. -
అదుపు తప్పి కారు బోల్తా
వైఎస్ఆర్ జిల్లా, రామాపురం : కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై మండల పరిధిలోని చిట్లూరు పంచాయతీ పాలన్నగారిపల్లె సమీపంలో మంగళవారం సాయంత్రం కారు అదుపుతప్పి బోల్తా పడడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. తెలం గాణ రాష్ట్రం మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వేణుగోపాలాచారి తన కుటుంబంతో కలసి టీఎస్ 06 ఈఆర్ 6484 నంబరు గల కారులో తిరుపతి వెళ్లి తిరుగు ప్రయాణంలో కాణిపాకంలో వినాయకుడిని దర్శనం చేసుకొని మహబూబ్‌నగర్‌కు బయలుదేరారు. రామాపురం మండలం పాలన్నగారిపల్లె సమీపంలోకి రాగానే కారు టైర్ పంక్చర్ కావడంతో అదుపు తప్పి బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న భార్య సంధ్య, కుమార్తె వైష్ణవి, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108కు ఫోన్ చేసినప్పటికి ఎంతకూ రాకపోవడంతో అటుగా వెళుతున్న మరో వాహనంలో ఆసుపత్రికి తరలించారు. రామా«పురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
హుస్సేన్‌సాగర్‌లోకి దూసుకెళ్లిన కారు
ఖైరతాబాద్: వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి హుస్సేన్‌సాగర్‌లోకి దూసుకెళ్లిన సంఘటన సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మూసారాంబాగ్ ప్రాంతానికి చెందిన మణికంఠ బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం తన పుట్టిన రోజు కావడంతో స్నేహితులు వెంకట రమణయ్యశెట్టి, పవన్‌కుమార్, వత్సల్‌తో కలిసి ఐ–10 కారులో అర్ధరాత్రి ఎన్టీఆర్మార్గ్కు వచ్చి ఫొటోలు దిగారు. అనంతరం లుంబినీ పార్క్ వైపునకు వెళ్తుండగా ఎన్టీఆర్ ఘాట్ సమీపంలో కారు అదుపు తప్పి హుస్సేన్‌సాగర్ వైపు దూసుకెళ్ళి ఇనుప గ్రిల్‌ను ఢీ కొని సాగర్‌లో పడిపోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వాహదారుల సమాచారంతో సైఫాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సాయంతో కారును బయటకు తీశారు. యువకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సైదిరెడ్డి తెలిపారు. -
తప్పిన పెను ప్రమాదం
భువనగిరిఅర్బన్ : యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావు రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం భువనగిరి– వలిగొండ మార్గంలో నందనం వద్ద ఆయన వెళ్తున్న కారును మరో కారు ఢీకొట్టడంతో మూడు ఫల్టీలు కొట్టింది. కారు బోల్తా పడటంతో ప్రమాదం నుంచి శ్యాంసుందర్‌రావు క్షేమంగా బయటపడగా, ఆయన కారు డ్రైవర్ నానికి బలమైన దెబ్బలు తగిలాయి. వివరాల్లోకి వెళితే స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీవీ శ్యాంసుందర్‌రావు వలిగొండలో జరిగే శ్రీ రేణుక ఎల్లమ్మతల్లి కల్యాణానికి హాజరయ్యేందుకు తన కారులో వెళ్తున్నాడు. ఈ క్రమంలో నందనం గ్రామంలో ఉన్న కాటమయ్య ఆలయం వద్ద ఉన్న మూలమలుపు వద్దకు చేరుకోగానే వలిగొండ నుంచి భువనగిరి వైపు వస్తున్న స్వీఫ్ట్ డిజైర్ కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కారు మూడు çఫల్టీలు కొట్టుకుంటు వెళ్లి రోడ్డు పక్కన వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదానికి గురికాగానే గాలిబెలూన్లు తెరుచుకోవడంతో ఎలాంటి ప్రమాదానికి గురికాకుండా బయటపడ్డారు. కారులో ఉన్న శ్యాంసుందర్‌రావు, కారు డ్రైవర్ ఇద్దరు కారు లోపలి నుంచి బయటకు వచ్చారు. కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయి.కాగా ప్రమాదం జరిగిన సమయంలో ఎదురుగా వస్తున్న బైక్ కారు కిందికి దూసుకుపోయింది. బైక్ పై వెళ్తున్న నరాల జంగయ్య, బి. వేదేశ్వర్ చాకచక్యంగా బైక్‌ను వదిలి కిందకు దూకడంతో వారు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. బైక్ రాకపోతే కారు బావిలో పడేదా ? ఈ రోడ్డు ప్రమాదంలో శ్యాంసుందర్‌రావు కారు కిందకు నరాల జంగయ్య బైకు వెళ్లక పోతే ఆ కారు అలాగే ఫల్టీలు కోట్టుకుంటూ పక్కనే ఉన్న బావిలో పడేదని స్థానికులు చెబుతున్నారు. ఆసమయంలో బైకు కారు కిందికి రావడంతో పెను ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. కారు మీద ఉన్న ఇద్దరు కిందికి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. అదే సమయంలో వారి బైక్ కారు కిందికి దూసుకుపోవడంతో అక్కడే ఆగిపోయింది. రోడ్డు పక్కన గల వ్యవయాసాయ బావిలో కారు పడిపోకుండా ఆగిపోవడంతో రెండు నిండు ప్రాణాలు నిలిచిపోయాయి. గాయపడ్డ శ్యాంసుందర్‌రావును, డ్రైవర్‌ను ప్రాథమికి చికిత్స కోసం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం విషయం తెలియగానే బీజేపీ కార్యకర్తలు, నాయకులు, శ్యాంసుందర్ అభిమానులు పెద్ద ఎత్తున ఏరియా ఆస్పత్రికి తరలి వచ్చారు. ఆయన యోగ క్షేమాలు తెలుసుకున్నారు. ప్రమాదం నుంచి బయటపడడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మెరుగైన చికిత్స నిమిత్తం డ్రైవర్‌ను సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నర్ల నర్సింగ్‌రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు భువనగిరి రూరల్ పోలీసులు తెలిపారు. -
ముంబైలో కారు బోల్తా ఆరుగురు మృతి
-
కారు బోల్తా.. ఏడుగురికి గాయాలు
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో కారు అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఏడుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వరదయ్యపాలెం మండలం ఉబ్బలమడుగు గ్రామ శివారులో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో కారులో ఉన్న ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. -
కారు బోల్తా: ముగ్గురికి గాయాలు
మణుగూరు: ఖమ్మం జిల్లా మణుగూరు పట్టణ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ముగ్గురు గాయాలయ్యాయి. పట్టణానికి చెందిన విద్యుత్ శాఖ ఏడీఈ తిలక్‌కు చెందిన కారులో ఆయన భార్య శివలింగాపూర్‌లో ఉన్న శివాలయానికి వెళ్తున్నారు. మార్గమధ్యంలో వారి వాహనానికి అకస్మాత్తుగా అడ్డువచ్చిన బైక్‌ను ఢీకొట్టి, అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. ఈ ఘటనలో కారులో ఉన్న తిలక్ భార్య గాయపడ్డారు. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులకు స్వల్పగాయాలయ్యాయి. డ్రైవర్ పరారు కాగా స్థానికులు క్షతగాత్రురాలిని కారు నుంచి బయటకు తీసి, ఆస్పత్రికి తరలించారు. -
కారు బోల్తా...నలుగురి దుర్మరణం
అద్దంకి : వేగంగా వెళున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టిన ఘటనలో నలుగురు మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన ప్రకాశం జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి సమీపంలో అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. నెల్లూరు జిల్లా బిట్రగుంట మండలం జేపీ గూడూరుకు చెందిన గునుపాటి వెంకటేశ్వరరెడ్డి(50) కుటుంబ సభ్యులతో కలిసి గుంటూరు జిల్లాకు వచ్చి తిరిగి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. కారు వేగంగా వెళ్తున్న సమయంలో.. ముందు టైరు పేలడంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో వెంకటేశ్వరరెడ్డితో సహా కారులో ఉన్న బుజ్జమ్మ(55), రమణమ్మ(54), జ్యోతి(21) అక్కడికక్కడే మృతిచెందగా.. శ్రీనివాస్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పుష్కరాలకు వెళ్లి.. తిరిగిరాని లోకాలకు
గంటలో చేరుతామనగా ప్రమాదం యలమంచిలి వద్ద కారు బోల్తా ఒకరు మృతి.. నలుగురికి గాయాలు యలమంచిలి : గోదావరి పుష్కరాలకు వెళ్లి తిరిగి గాజువాక వస్తుండగా కారు అదుపు తప్పి బోల్తా పడి ఒకరు తిరిగిరాని లోకాలకు వెళ్లగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. యలమంచిలి సమీపంలో పెదపల్లి హైవే జంక్షన్ వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదం వివరాలిలా ఉన్నాయి...నిద్రమత్తులో డ్రైవర్ కళ్లుమూతపడటంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కగా ఉన్న లోయలోకి దూసుకుపోయి చెట్టును ఢీకొని పల్టీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనం 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడంతో ముందు సీటులో కూర్చున్న గాజువాక పంతులుగారి ప్రాంతానికి చెందిన లేళ్ల నర్సింగరావు (55) అక్కడికక్కడే దుర్మరణం పొందాడు. కారు నడుపుతున్న నర్సింగరావు కొడుకు కుమార్ లేళ్ల శ్రీధర్ రెండుకాళ్లు విరిగిపోయాయి. ఇదే కారులో ప్రయాణిస్తున్న దంపతులు కామశాని రత్నాకరరావు, కామశాని దేవిమణి, గాజువాక సరిగమవైన్స్ యజమాని గూడెల జయరామ్ తీవ్రగాయాలపాలయ్యారు. దేవిమణి తలకు, ఇతర శరీరభాగాలకు బలమైన గాయాలు తగిలాయి. జయరామ్ రెండుకాళ్లు, చేయి వేరిగిపోయాయి. రత్నాకరరావుకు కూడా తీవ్రగాయాలు అయ్యాయి. సమాచారం మేరకు యలమంచిలి సీఐ కె.వెంకట్రావు, పట్టణ ఎస్ఐ జి.బాలకృష్ణ సంఘటన స్థలానికి వెళ్లి క్షతగాత్రులను యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వారిని గాజువాక సుప్రజా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో దేవిమణి పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేర్ ఆస్పత్రికి తరలించినట్టు పట్టణ ఎస్ఐ బాలకృష్ణ చెప్పారు. పోస్టుమార్టం అనంతరం నర్సింగరావు మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ బాలకృష్ణ చెప్పారు. -
కారు బోల్తా : ఇంజనీరింగ్ విద్యార్థి మృతి
హైదరాబాద్: కారు బోల్తా పడడంతో ఒక ఇంజనీరింగ్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం కోంపల్లిలోని పేట్ జహీరాబాద్ పోలీస్‌స్టేషన్ ఎదురుగా జరిగింది. ఇంజనీరింగ్ చదువుతున్న నలుగురు విద్యార్థులు కారులో మేడిచర్ల నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. ఈక్రమంలో పేట్ జహీరాబాద్ పోలీస్‌స్టేషన్ ఎదురుగా కారు బోల్తా పడడంతో సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న లగిశెట్టి అనిల్(21) అక్కడికక్కడే మృతి చెందాడు. సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న సాయికృష్ణ, సుమన్, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న రిషప్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానిక బాలాజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.