శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా హిరమండలం గొట్టా బ్యారేజీ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి వంశధార ఎడమ కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు.వివరాలు.. విశాఖపట్నంలోని కోరమాండల్ ఫెర్టిలైజర్ సంస్థలో మేనేజర్లుగా పని చేస్తున్న ఎన్ ఎస్ వి పవన్ (32), బి. చంద్ర (45) పాటు మరో ముగ్గురు కలిసి ఒడిశాలోని గజపతి జిల్లా సెంచూరియన్ యునివర్సిటీలో కోరమండల్ ఫెర్టిలైజర్స్ మీటింగ్ నిమ్మిత్తం వెళ్లారు. మీటింగ్ ముగిసిన తర్వాత కారులో తిరిగి వస్తున్న క్రమంలో హిరమండలం గొట్టా బ్యారేజీ వద్దకు రాగానే కారు అదుపుతప్పి ఎడమ కాలువలోకి దూసుకెళ్లింది. కాగా మృతి చెందిన పవన్ స్వస్థలం కాకినాడ, చంద్రది ఖమ్మం జిల్లా అని తెలిసింది. సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను బయటికి తీశారు. గాయపడిన మరో ముగ్గురిని చికిత్స నిమ్మిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
అదుపు తప్పిన కారు; ఇద్దరు మృతి
Published Fri, Jan 31 2020 8:11 AM | Last Updated on Fri, Jan 31 2020 9:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment