cannal
-
కన్నబిడ్డలనే కాల్వలోకి తోసి...
బిజినేపల్లి: కల్లు తాగొద్దని భర్త హెచ్చరించాడన్న కోపంతో ఓ తల్లి ముక్కుపచ్చలారని తన నలుగురు చిన్నారులను కాల్వలో విసిరేసింది. ఈ ఉదంతం శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని ఎర్రకుంటతండాలో చోటుచేసుకుంది. మండలంలోని లట్టుపల్లి పంచాయతీ పరిధిలోని ఎర్రకుంట తండాకు చెందిన లలిత మంగనూర్‌కు చెందిన శరబందను ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి కూతుళ్లు మహాలక్ష్మి (7), సాత్విక (5), మంజుల (3)తోపాటు 7 నెలల కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో లలిత కొన్నాళ్లుగా మందు కల్లును తాగుతుండటంతో పలుమార్లు భర్త శరబంద మందలించాడు. దీంతో భర్త తరచూ మందలిస్తున్నాడని లలిత శనివారం బిజినేపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. పోలీసులు శరబందను స్టేషన్‌కు రావాలని ఫోన్ చేసి పిలిచారు. మధ్యాహ్నం కావడంతో పిల్లలకు ఏమైనా తినిపించుకు వస్తానని చెప్పి వెళ్లిన లలిత.. పోలీస్‌స్టేషన్ సమీపంలోని కేఎల్ఐ కాల్వలోకి చిన్నారులతో కలిసి దిగింది. అటుగా వెళ్తున్న కొందరు ఆమెను గమనిస్తుండగానే నలుగురు చిన్నారులను కాల్వలోకి విసిరేసింది. వెంటనే వారు బిజినేపల్లి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించి కాల్వలోకి దిగారు. పోలీసులు సైతం కాల్వ వద్దకు వచ్చి గాలించగా.. నీటి ఉధృతికి చిన్నారులు కిలోమీటరు మేర కొట్టుకుపోయారు. చివరికి ముగ్గురు కుమార్తెల మృతదేహాలు లభించగా.. బాలుడు మార్కండేయ ఆచూకీ లభించలేదు. అప్పటికే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. చిన్నారులను కాల్వలో విసిరేసిన తల్లిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న భర్త శరబంద సైతం పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాడు. చిన్నారుల మృతదేహాలను పోలీసులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
క్షేమంగా ఒడ్డుకు చేరిన రైతులు
గంభీరావుపేట(సిరిసిల్ల): ఆరు రోజులుగా వాగు అవతల చిక్కుకున్న ముగ్గురు రైతులు ఎట్టకేలకు క్షేమంగా అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని భీమునిమల్లారెడ్డిపేట రైతులకు గ్రామ శివారులోని మానేరువాగు అవతల దాదాపు 600 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి. వాగు దాటితేనే పొలాల వద్దకు చేరుకుంటారు. ఎప్పటిలాగే అదే గ్రామానికి చెందిన రైతులు అల్లాడి రాజం, మెతుకు ఎల్లయ్య, తిరుపతి గత శనివారం పొలం పనుల కోసం వాగు అవతలికి వెళ్లారు. ఆ సమయంలో మానేరువాగులో వరద తక్కువగా ఉంది. ఆ తర్వాత రోజు నుంచి వర్షం కురవడంతో వాగులో ప్రవాహ ఉధృతి పెరిగిపోయింది. వెంట తీసుకెళ్లిన బియ్యం, కూరగాయలు ఉండటంతో ఆరు రోజులపాటు అక్కడే పొలం పనులు చేసుకుంటూ గడిపారు. సరుకులు ఖాళీ అవడంతో ఇంటికొచ్చేందుకు వారు శుక్రవారం ఉదయం వాగు తీరానికి చేరుకున్నారు. వాగు ఉధృతి తీవ్రంగా ఉండటంతో గ్రామస్తులకు, కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పారు. ఈ విషయం ఎస్పీ అఖిల్‌మహాజన్‌కు తెలియజేయగా...ఆయన జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. వెంటనే గంభీరావుపేట ఎస్సై మహేశ్, తహసీల్దార్ భూపతి, మత్స్యశాఖ అధికారి ఫయాజ్‌తోపాటు డీఆర్ఎఫ్ టీమ్ మానేరువాగు తీరానికి చేరుకుని వారిని సురక్షితంగా ఒడ్డుకు రప్పించారు. -
కాల్వలోకి దూసుకెళ్లిన కారు; ఒకరు మృతి
సాక్షి, తూర్పు గోదావరి: కారు కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఈ విషాదకర ఘటన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద జరిగింది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆత్రేయపురం మండలం వసంతవాడ తీర్థానికి వెళ్లి వస్తుండగా ప్రమాదవశాత్తు కారు లొల్ల లాకుల వద్ద కాలువలోకి దూసుకు వెళ్లింది. ఒకరి మృతదేహం లభ్యమవగా.. మరో ఇద్దరు గల్లంతైనట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.కారులో ఉన్నవారు ఏ ప్రాంతానికి చెందినవారనే దానిపై స్పష్టత రాలేదు. -
విషాదం నింపిన వన భోజనం
నిజామాబాద్ : వన భోజన సంబురం ఒక కుటుంబంలో విషాదాన్ని నింపింది. భోజనాల అనంతరం పాత్రలు శుభ్రం చేస్తుండగా వాగులో కొట్టుకుపోయిన పాత్ర కోసం దిగిన కవల సోదరులిద్దరూ గల్లంతయ్యారు. మోర్తాడ్ మండలంలో గురువారం చోటుచేసుకున్న సంఘటన వివరాలిలా ఉన్నా యి. మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన పూల వ్యాపారి ఖుద్రత్ నలుగురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. కూతుళ్లు, అల్లుళ్లు, మనవలు, మనవరాళ్లు ఇంటికి రావడంతో వారితో సరదాగా గడిపేందుకు ఆయన గురువారం తన కుటుంబ సభ్యులను వనభోజనాల నిమిత్తం గాండ్లపేట్, దొన్కల్‌ల మధ్య ఉన్న పెద్ద వాగు పరిసరాలకు తీసుకువెళ్లాడు. భోజనాల అనంతరం కుటుంబ సభ్యులు పాత్రలను శుభ్రం చేసే క్రమంలో ఒక పా త్ర వాగులో పడిపోయింది. దానిని తీయడానికి కవల సోద రులు తాహెర్, తయ్యూబ్ ప్రయత్నించారు. ఈ క్రమంలో త య్యూబ్ వాగు ప్రవాహంలో కొట్టుకుపోయాడు. దీనిని గమ నించిన సోదరుడు తాహెర్ అతడిని కాపాడేందుకు యతి్నంచి, అతడూ గల్లంతయ్యాడు. వాగు ప్రవాహం ఎక్కువగా ఉండడంతో స్థానిక జాలరులు, గజ ఈతగాళ్లు ఎంత ప్ర యతి్నంచినా ఫలితం లేకపోయింది. గల్లంతైనవారి కోసం మూడు గంటలపాటు గాలించామని గాండ్లపేట్‌కు చెందిన గజ ఈతగాడు మనోజ్ తెలిపారు. ఇసుక, నాచు ఎక్కువగా ఉన్నాయని, వాటిలో ఇరుక్కుపోయి ఉంటారన్నారు. ఆర్మూర్ ఆర్డీవో శ్రీనివాసులు, ఏసీపీ రఘు, భీమ్‌గల్ సీఐ సైదయ్య, మోర్తాడ్ తహసీల్దార్ శ్రీధర్, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సై సంపత్‌కుమార్‌లు గురువారం రాత్రి వరకు గాలింపు చర్యలను పర్యవేక్షించారు. గల్లంతైన వారి కోసం ప్రత్యేక బృందాన్ని రప్పిస్తున్నారు. వాగు ప్రవాహంలో కొట్టుకపోతే వారిని గుర్తించడానికి పాలెం, ధర్మోరాల మధ్య ఉన్న చెక్‌డ్యాం వద్ద వలను ఏర్పాటు చేశారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. -
అదుపుతప్పి బ్యారేజీలో పడిపోయిన కారు
-
అదుపు తప్పిన కారు; ఇద్దరు మృతి
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా హిరమండలం గొట్టా బ్యారేజీ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి వంశధార ఎడమ కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు.వివరాలు.. విశాఖపట్నంలోని కోరమాండల్ ఫెర్టిలైజర్ సంస్థలో మేనేజర్లుగా పని చేస్తున్న ఎన్ ఎస్ వి పవన్ (32), బి. చంద్ర (45) పాటు మరో ముగ్గురు కలిసి ఒడిశాలోని గజపతి జిల్లా సెంచూరియన్ యునివర్సిటీలో కోరమండల్ ఫెర్టిలైజర్స్ మీటింగ్ నిమ్మిత్తం వెళ్లారు. మీటింగ్ ముగిసిన తర్వాత కారులో తిరిగి వస్తున్న క్రమంలో హిరమండలం గొట్టా బ్యారేజీ వద్దకు రాగానే కారు అదుపుతప్పి ఎడమ కాలువలోకి దూసుకెళ్లింది. కాగా మృతి చెందిన పవన్ స్వస్థలం కాకినాడ, చంద్రది ఖమ్మం జిల్లా అని తెలిసింది. సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాలను బయటికి తీశారు. గాయపడిన మరో ముగ్గురిని చికిత్స నిమ్మిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
కాలువ దాటేందుకు ప్రాణాలకు తెగించి..
-
కాలువలో పడి విద్యార్థి మృతి
రామకృష్ణాపూర్ : పట్టణంలోని ఆర్కేపీ ఓపెన్‌కాస్టు గని సమీపంలో గల నీటి కాలువలో పడి శనివారం కంబాల పవన్‌కల్యాణ్(12) అనే విద్యార్థి మృతిచెందాడు. స్థానిక బీజోన్ ఆర్కే4 గడ్డ ప్రాంతానికి చెందిన కూలీ పనిచేసుకునే శ్రీనివాస్–భాగ్య దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కుమారుడైన పవన్‌కల్యాణ్ శనివారం ఉదయం తన తమ్ముడు వంశీ, పెద్దనాన్న కొడుకు జనార్దన్‌తో కలిసి బహిర్భూమికని ఓపెన్‌కాస్టు కార్యాలయం సమీపంలోని చెట్ల పొదల్లోకి వెళ్లాడు. తిరిగి వస్తున్న క్రమంలో ఓసీ క్వారీ నుంచి వెళ్లే నీటి కోసం తీసిన కాలువలో ప్రమాదవశాత్తు పడిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కాలువ ఒడ్డున నడుస్తూ వస్తుండగా మట్టిదిబ్బలు జారడంతో పవన్ కాలువలో పడిపోయాడని వంశీ, జనార్దన్ తెలిపారు. పవన్‌ను కాపాడేందుకు ఓసీ కార్యాలయం వైపు వెళ్లి ఒకరిద్దరిని తీసుకువచ్చామని, కానీ అప్పటికే కాలువలో పూర్తిగా మునిగిపోయి మృతిచెందాడని వారు చెప్పారు. కాగా, స్థానిక సింగరేణి రెస్క్యూ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. పవన్ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం నుంచి స్కూలుకు వెళ్తానమ్మా అని.. ‘అమ్మ ఈ రోజు స్కూలుకి వెళ్లాలనిపించడం లేదు. ఇంటి దగ్గరే ఉంటానమ్మా. సోమవారం నుంచి తప్పకుండా బడికి వెళ్తానమ్మా’ అన్న కొడుకు అంతలోనే అనంత లోకాలకు వెళ్లడంతో ఆ కన్న తల్లి దుఃఖాన్ని దిగమింగుకోలేకపోయింది. శనివారం ఉదయం డబల్ రొట్టె తెచ్చుకుని తిన్న పవన్ అనంతరం బహిర్బూమికని వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటి కాలువ రూపంలో మృత్యువు ఆవహించడంతో అతని కుటుంబం దుఖసాగరంలో మునిగిపోయింది. ఇరుగుపొరుగు వారితో కలివిడిగా ఉండే పవన్ మృత్యువాతపడటం స్థానికులను కలచివేసింది. విషయం తెలుసుకున్న జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు ఘటనా స్థలికి చేరుకుని కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరిహారం కోసం ఆందోళన ఓపెన్‌కాస్టు నీటి కాలువలో పడి మృతిచెందిన పవన్‌కల్యాణ్ కుటుంబానికి నష్ట పరిహారం చెల్లించాలంటూ పలు పార్టీల నాయకులతో పాటు ఆర్కే4 గడ్డ ప్రాంతవాసులు ఆందోళనకు దిగారు. కాలువకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ఘటన సంభవించిందని ఆగ్రహం వ్యక్తం చే స్తూ కార్యాలయం వద్ద రాత్రి 10 గంటల వరకు ఉన్నారు. వీరి ఆందోⶠన విరమింపచేసేందుకు ప్రయత్నించిన మందమర్రి సీఐ సదయ్యతో స్థానికులు తీవ్ర వాగ్వాదానికి దిగారు. మంచిర్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహానికి సాయంత్రమే పోస్టుమార్టం పూర్తిచేసినా రాత్రి 10 గంటల వరకు కూడా మృతదేహం అప్పగించకపోవడమేమిటని మండిపడ్డారు. సింగరేణి యాజమాన్యం పరిహారం చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు.