
సాక్షి, తూర్పు గోదావరి: కారు కాలువలోకి దూసుకెళ్లిన ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఈ విషాదకర ఘటన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల లాకుల వద్ద జరిగింది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆత్రేయపురం మండలం వసంతవాడ తీర్థానికి వెళ్లి వస్తుండగా ప్రమాదవశాత్తు కారు లొల్ల లాకుల వద్ద కాలువలోకి దూసుకు వెళ్లింది. ఒకరి మృతదేహం లభ్యమవగా.. మరో ఇద్దరు గల్లంతైనట్లు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.కారులో ఉన్నవారు ఏ ప్రాంతానికి చెందినవారనే దానిపై స్పష్టత రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment