
మన్సూరాబాద్: మద్యం మత్తులో అర్ధరాత్రి అతివేగంగా కారును నడపడంతో అదుపుతప్పి చికెన్ సెంటర్‌లోకి దూసుకెళ్లిన సంఘటన మన్సూరాబాద్‌లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మన్సూరాబాద్ సాయినగర్‌కాలనీలోని పెట్రోల్ పంప్ ఎదురుగా కొప్పుల రమేష్ అనే వ్యక్తి గత కొంతకాలంగా జ్యోతి చికెన్ మార్కెట్ నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి షాపును మూసివేసి షాపులో పనిచేస్తున్న సాయి,నాగేష్ అక్కడే నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి బిగ్‌బజార్ నుంచి మన్సూరాబాద్ వైపు అతివేగంగా వచ్చిన ఫోర్డ్ ఫీగో కారు రోడ్డు పక్కన ఉన్న తోపుడు బండిని ఢీకొట్టి, చికెన్ సెంటర్‌లోకి దూసుకెళ్లింది. వనస్థలిపురం ప్రాంతానికి చెందిన వెంకటష్ మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల ప్రమాదం జరిగిందని, కారులో అతడితో పాటు మరో ఇద్దరు యువకులు ఉన్నట్లు తెలిపారు. సదరు యువకులు కారును అక్కడే వదిలి పారిపోయారు. సాయి, నాగేష్‌లకు స్వల్ప గాయాలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment