chicken centre
-
ఇక్కడ చికెన్ చీప్ గురూ!
సాక్షి, కామారెడ్డి: పౌల్ట్రీ రంగంలో కార్పొరేట్ సంస్థలు ఎంత పోటీ పడినా, ధర విషయంలో మాత్రం కలిసే నిర్ణయిస్తాయి. వాళ్లు చెప్పిన ధరే చెల్లుబాటవుతుంది. రోజూ లైవ్ బర్డ్, డ్రెస్స్డ్ చికెన్, స్కిన్లెస్ చికెన్ ధరలను నిర్ణయించి పత్రికల ద్వారా వెల్లడిస్తారు. ఆ రేట్ల ప్రకారమే రాష్ట్రమంతటా విక్రయాలు జరుగుతాయి. కానీ కామారెడ్డి మార్కెట్లో ఎక్కడికి వెళ్లినా ‘ఈ రోజు పేపర్ రేటుపై కిలోకు రూ. 30 తక్కువ’అన్న ఫ్లెక్సీలు దర్శనమిస్తాయి. ఒక్కోసారి తక్కువ ధరతో పాటు పలు ఆఫర్లు కూడా ప్రకటిస్తుంటారు. కిలో చికెన్ కొంటే ఆరు కోడిగుడ్లు ఉచితంగా ఇస్తుంటారు. రూ. 30 నుంచి రూ. 50 వరకు తగ్గింపు.. కామారెడ్డి పట్టణంలో హోల్‌సెల్ చికెన్ సెంటర్లు దాదాపు 40 ఉండగా, రిటైల్ దుకాణాలు వందకు పైగా ఉన్నాయి. కామారెడ్డి మినహా మిగతా పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాలకు వెళ్తే పత్రిక ధర ప్రకారమే చికెన్ విక్రయాలు సాగుతాయి. కొన్ని చోట్ల పేపర్ ధర కన్నా కొంత ఎక్కువకే అమ్ముతారు. కామారెడ్డిలోని చికెన్ వ్యాపారులు మాత్రం ధర తగ్గించుకుని విక్రయిస్తున్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు సంబంధించి ఎక్కువ మొత్తంలో కొంటే కిలోకు రూ.30 నుంచి రూ.50 వరకు తగ్గింపు ఇస్తున్నారు. కామారెడ్డికి చెందిన చికెన్ వ్యాపారి ఒకరు ఇటీవల సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మూడు బ్రాంచ్‌లను తెరిచి, పేపర్ ధరపై రూ.30 తగ్గిస్తున్నట్లు ఫ్లెక్సీలు కట్టారు. ఏళ్ల తరబడిగా చికెన్ వ్యాపారం చేస్తున్న సిరిసిల్ల వ్యాపారులు ఈ ఫ్లెక్సీలను చూసి ఇబ్బంది పడుతున్నట్లు తెలిసింది. నాలుగైదేళ్లుగా ఇదే పోటీ.. కామారెడ్డి పట్టణంలో గడచిన నాలుగైదేళ్లుగా ఈ పోటీ నెలకొంది. ఒకరిని చూసి ఒకరు అన్నట్టుగా అందరూ తగ్గింపు ధరలకే ఇస్తున్నారు. ఇటీవల కామారెడ్డిలో కొత్తగా ఓ బ్రాంచ్ తెరిచిన చికెన్ వ్యాపారి.. తగ్గింపు ధరతో పాటు కిలో చికెన్ కొంటే అర డజను కోడిగుడ్లు ఉచితంగా అందించాడు. మరో వ్యాపారి పత్రిక ధరపై కిలోకు రూ.35 తక్కువ అన్న బోర్డు పెట్టాడు. శనివారం రాష్ట్రంలో డ్రెస్స్డ్ చికెన్ ధర కిలోకు రూ.220 ఉండగా, కామారెడ్డిలో రూ.180కి విక్రయించారు. అంటే కిలోకు రూ.40 వరకు తగ్గించారు. కొన్ని చోట్ల కిలో ధర రూ.170కి కూడా అమ్మారు. అయితే కొందరు బడా వ్యాపారుల జిమ్మిక్కులతో చిరు వ్యాపారులు నలిగిపోతున్నారు. పెద్ద ఎత్తున అమ్మకాలు.. కామారెడ్డి జిల్లా కేంద్రంలో చికెన్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆదివారం రోజైతే టన్నుల కొద్దీ విక్రయాలు సాగుతాయి. రోజూ హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు ఆర్డర్‌పై సరఫరా చేస్తుంటారు. అలాగే ఫంక్షన్లు, పండుగలు, పెళ్లిళ్లకు పెద్ద ఎత్తున చికెన్ సరఫరా చేస్తారు. కొందరు వ్యాపారులైతే ఎక్కువ మొత్తంలో చికెన్ ఆర్డర్ చేస్తే డోర్ డెలివరీ కూడా చేస్తారు. కామారెడ్డికి చుట్టుపక్కల గ్రామాలు, ఇతర పట్టణాల నుంచి కూడా చికెన్ కోసం వస్తారు. పొరుగునే ఉన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల్లోని సమీప గ్రామాలతో పాటు కామారెడ్డి జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి ఎక్కువ మొత్తంలో చికెన్ అవసరం ఉంటే కామారెడ్డికి వచ్చి కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం శ్రావణమాసం కావడంతో అమ్మకాలు కొంత తగ్గాయి. -
చికెన్ సెంటర్లోకి దూసుకెళ్లిన కారు
మన్సూరాబాద్: మద్యం మత్తులో అర్ధరాత్రి అతివేగంగా కారును నడపడంతో అదుపుతప్పి చికెన్ సెంటర్లోకి దూసుకెళ్లిన సంఘటన మన్సూరాబాద్‌లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మన్సూరాబాద్ సాయినగర్‌కాలనీలోని పెట్రోల్ పంప్ ఎదురుగా కొప్పుల రమేష్ అనే వ్యక్తి గత కొంతకాలంగా జ్యోతి చికెన్ మార్కెట్ నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి షాపును మూసివేసి షాపులో పనిచేస్తున్న సాయి,నాగేష్ అక్కడే నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి బిగ్‌బజార్ నుంచి మన్సూరాబాద్ వైపు అతివేగంగా వచ్చిన ఫోర్డ్ ఫీగో కారు రోడ్డు పక్కన ఉన్న తోపుడు బండిని ఢీకొట్టి, చికెన్ సెంటర్లోకి దూసుకెళ్లింది. వనస్థలిపురం ప్రాంతానికి చెందిన వెంకటష్ మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల ప్రమాదం జరిగిందని, కారులో అతడితో పాటు మరో ఇద్దరు యువకులు ఉన్నట్లు తెలిపారు. సదరు యువకులు కారును అక్కడే వదిలి పారిపోయారు. సాయి, నాగేష్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. -
మైనర్ బాలికపై అత్యాచారం
అనంతపురం క్రైం : బుక్కరాయసముద్రం మండలంలో ఓ మైనర్ బాలిక(15)పై అత్యాచారం జరిగింది. నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి కాళ్లు చేతులు కట్టిపడేసి.. ఓ యువకుడు అత్యాచారం చేయగా.. మరో యువకుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మరో ఇద్దరు ఈ దాష్టీకానికి కాపలాగా ఉన్నారు. బాధితురాలు, ఆమె తల్లిదండ్రులు తెలిపిన మేరకు వివరాలు.. బుక్కరాయసముద్రం మండలంలోని ఒక గ్రామానికి చెందిన బాలిక (15) ఏడో తరగతి వరకు చదువుకుంది. తల్లిదండ్రులు ఓ చికెన్ సెంటర్లో పనిచేస్తున్నారు. బుధవారం సాయంత్రం బాలిక బహిర్భూమి కోసం సమీపంలోని వంకవద్దకెళ్లి వస్తుండగా ప్రసాద్, శివతోపాటు మరో ఇద్దరు యువకులు రెండు బైక్‌లపై వచ్చి బాలికను కిడ్నాప్ చేశారు. నోటిని అదిమిపట్టి.. అరిస్తే చంపుతామని బెదిరించి ఎస్ఆర్ఐటీ కళాశాల వెనుకవైపు ఓ పాడుబడిన గుడిసెలోకి తీసుకెళ్లారు. అక్కడ బాలిక కాళ్లు, చేతులు కట్టేసి.. ముగ్గురు యువకులు బయట నిల్చోగా...ప్రసాద్ అత్యాచారం చేశాడు. ఆ తర్వాత శివ లోనికి వచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అనంతరం బాలికను తాడిపత్రి వైపు తీసుకెళ్లేందుకు నలుగురూ చర్చించుకుంటుండగా బాలిక కేకలు వేసింది. అరవకపోతే ఊరిలో వదిలేస్తామని చెప్పడంతో వారు చెప్పినట్టు చేసింది. బైక్‌లో ఎక్కించుకుని రాత్రి 9 గంటల తర్వాత గ్రామ శివారులోని ప్రభుత్వ పాఠశాల వద్ద వదిలేసిన యువకులు.. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని మరోసారి హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాత్రి 7.30 గంటలకు ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు కూతురు కనిపించకపోవడంతో పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. అనుమానం ఉన్న వ్యక్తులపై ఫిర్యాదు చేయబోతే ‘మీ ఊర్లో ఎప్పుడూ ఇదే పంచాయితీనా.. వెళ్లండంటూ’ ఓ పోలీసు చీదరించుకున్నాడు. దీంతో చేసేదిలేక స్వగ్రామానికి తిరిగి వస్తున్న తల్లిదండ్రులకు గ్రామంలోని పాఠశాల వద్ద ఏడ్చుకుంటూ నిస్సహాయ స్థితిలో ఉన్న కూతురు కనిపించింది. గురువారం ఉదయం ఓ దళితనేత సహకారంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే అక్కడ ఓ అధికారి జోక్యం చేసుకుని తాను ఇటుకలపల్లి సీఐకి చెబుతాను.. అక్కడికెళ్లి కలవండంటూ సూచిం చారు. ఈ మేరకు వారు ఇటుకలపల్లి సర్కిల్ కార్యాలయానికి వెళ్లగా సీఐ అందుబాటులో లేరు. ఈ లోపు బుక్కరాయసముద్రం ఎస్ఐ దళిత నేతకు ఫోన్ చేసి.. తాము కేసు నమోదు చేసుకోమని చెప్పామా.. అంటూ మందలించి.. వెంటనే స్టేషన్‌కు రావాల్సిందిగా ఆదేశించారు. ఎట్టకేలకు ప్రసాద్, శివపై కేసు నమోదు చేసుకున్నారు. -
కైకలూరు మార్కెట్లో మళ్లీ అగ్నిప్రమాదం
కైకలూరు, న్యూస్‌లైన్ : కైకలూరు నీలం సంజీవరెడ్డి సంత మార్కెట్లో మంగళవారం ఓ చికెన్ సెంటర్లో అగ్నిప్రమాదం ఘటన కలకలం సృష్టించింది. గత నెల 12న ఇక్కడ బజ్జీల బండి వద్ద స్టౌ పేలి కుళాయిలో వేడి నూనె చిమ్మడంతో 10 మంది గాయపడ్డారు. వారిలో నలుగురు చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటన మరువకముందే సంతమార్కెట్లో మంగళవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో పిచ్చికల సూర్యనారాయణకు చెందిన చికెన్ దుకాణం వద్ద గ్యాస్ సిలిండర్ పైపు నుంచి మంటలు వ్యాపించాయి. కొద్ది నిముషాల్లోనే దుకాణం మొత్తం కాలిపోయింది. ఈ ఘటన లో 30 కోళ్లు దగ్ధమయ్యాయి. దుకాణం వెనుక నివాసం ఉంటున్నామని, అక్కడ వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ లీకయిందని దుకాణ యజమాని సూర్యనారాయణ చెప్పా డు. ఈ ఘటన జరిగిన సమయంలోనే గోపవరం గ్రామం లో గడ్డివామికి నిప్పంటుకోవడంతో ఫైరింజన్ అక్కడకు వె ళ్లింది. దీంతో సంతలో వ్యాపారులు స్పందించి, చికెన్ దు కాణంలో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో గ్యాస్ సిలిండర్లు పేలుతున్నాయంటూ పుకార్లు రేగడంతో ఆ ప్రాంతం లోనివారు భయంతో పరుగులు తీశారు. కొరవడిన అధికారుల నిఘా.. ఇటీవల భారీ అగ్నిప్రమాదం జరిగి నలుగురి ప్రాణాలు పోయినా అధికారుల్లో చలనం రాలేదు. ప్రమాదం జరిగిన చికెన్ దుకాణం వెనుక భాగాన ఏకంగా నాలుగు గ్యాస్ సి లిండర్లు ఉన్నాయి. ప్రతి మంగళవారం ఇక్కడి సంతకు వేల సంఖ్యలో కొనుగోలుదారులు వస్తుంటారు. ఇక్కడ విచ్చలవిడిగా గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉంటున్నాయి. అధికారులు స్పందించి, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.