ఖమ్మం జిల్లా మణుగూరు పట్టణ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ముగ్గురు గాయాలయ్యాయి.
మణుగూరు: ఖమ్మం జిల్లా మణుగూరు పట్టణ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో ముగ్గురు గాయాలయ్యాయి. పట్టణానికి చెందిన విద్యుత్ శాఖ ఏడీఈ తిలక్‌కు చెందిన కారులో ఆయన భార్య శివలింగాపూర్‌లో ఉన్న శివాలయానికి వెళ్తున్నారు.
మార్గమధ్యంలో వారి వాహనానికి అకస్మాత్తుగా అడ్డువచ్చిన బైక్‌ను ఢీకొట్టి, అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. ఈ ఘటనలో కారులో ఉన్న తిలక్ భార్య గాయపడ్డారు. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులకు స్వల్పగాయాలయ్యాయి. డ్రైవర్ పరారు కాగా స్థానికులు క్షతగాత్రురాలిని కారు నుంచి బయటకు తీసి, ఆస్పత్రికి తరలించారు.