అద్దంకి : వేగంగా వెళున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టిన ఘటనలో నలుగురు మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన ప్రకాశం జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి సమీపంలో అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.
నెల్లూరు జిల్లా బిట్రగుంట మండలం జేపీ గూడూరుకు చెందిన గునుపాటి వెంకటేశ్వరరెడ్డి(50) కుటుంబ సభ్యులతో కలిసి గుంటూరు జిల్లాకు వచ్చి తిరిగి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. కారు వేగంగా వెళ్తున్న సమయంలో.. ముందు టైరు పేలడంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో వెంకటేశ్వరరెడ్డితో సహా కారులో ఉన్న బుజ్జమ్మ(55), రమణమ్మ(54), జ్యోతి(21) అక్కడికక్కడే మృతిచెందగా.. శ్రీనివాస్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కారు బోల్తా...నలుగురి దుర్మరణం
Published Thu, Mar 24 2016 5:00 PM | Last Updated on Sun, Sep 3 2017 8:29 PM
Advertisement
Advertisement