Four died
-
కొత్త సంవత్సర వేడుకలకు వస్తూ ప్రమాదం.. ముగ్గురు మృతి
జమ్మలమడుగు: ఏడాది చివరి రోజే వారి జీవితానికి ఆఖరు రోజు అవుతుందని అనుకోలేదు. అతివేగం వారి ప్రాణాలను హరించింది. సంఘటన స్థలంలోనే ఒకరు మరణించగా మరొకరు ఇద్దరు ప్రభుత్వాసుపత్రిలో మరణించారు. ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా..పులివెందుల నియోజకవర్గంలోని వే ముల, లింగాల, పులివెందుల ప్రాంతాల కు చెందిన ఏడుగురు స్నేహితులు జనవరి వేడుకలను నిర్వహించుకునేందుకు పర్యాటక కేంద్రమైన గండికోటకు పులివెందుల నుంచి బయలు దేరారు. వీరిలో లింగా ల మండలం పెద్దకుడాల గ్రామానికి చెందిన అబ్దుల్, వేముల మండలం భూమ య్యగారిపల్లికి చెందిన నందీష్, పులివెందులకు చెందిన జగన్, షాహుల్, సింహాద్రిపురం అగ్రహారానికి చెందిన చైతన్య, షాజహాన్, ప్రేమ్ ఉన్నారు. ముద్దనూరు కొండ దిగిన తర్వాత చిటిమిటి చింతల గ్రామానికి సమీపంలో ఉన్న దర్గా మలుపు వద్దకు రాగానే వేగంగా వస్తున్న స్కార్పియోను అదుపు చేయలేక రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొన్నారు. వేముల మండలం భూమయ్యగారిపల్లి గ్రామానికి చెందిన నందీష్(21) అక్కడికక్కడే మృతి చెందగా కొన ఊపిరితో ఉన్న లింగాల మండలం పెద్ద కుడాల గ్రామానికి చెందిన అబ్దుల్(25)ను జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తీసుకు రాగా చికిత్స పొందుతూ మరణించాడు. పులివెందులకు చెందిన జగన్ పరిస్థితి విషమించడంతో ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు ఉదయం ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ జగన్ మృతి చెందాడు . చైతన్య, షాజహాన్, ప్రేమ్, షాహుల్ జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అర్బన్ పోలీసులు కేసు నమో దు చేసుకుని విచారణ చేస్తున్నారు. -
ఈతకు వెళ్లి నలుగురు మృత్యువాత
మానవపాడు/కర్నూలు: కృష్ణానదిలో సరదాగా ఈత కోసం వెళ్లిన వారు.. ప్రమాదవశాత్తు మునిగిపోయి మృత్యువాత పడ్డారు. ఒకరిని కాపాడబోయి మరొకరు చివరికి నలుగురు మృతిచెందిన విషాదకర సంఘటన తెలంగాణ రాష్ట్రం జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం పల్లెపాడు శివారు మంగంపేటలో చోటుచేసుకుంది. కోదండాపురం ఎస్ఐ వెంకటస్వామి, స్థానికుల కథనం ప్రకారం.. ఇటిక్యాల మండలంలోని వల్లూరుకు చెందిన అన్నదమ్ములు ఇస్మాయిల్, ఇబ్రహింలు బతుకుదెరువు కోసం 20 ఏళ్ల క్రితం ఏపీలోని కర్నూలు నగరంలోని వీకర్‌సెక్షన్ కాలనీకి వెళ్లి స్థిరపడ్డారు. వేసవిసెలవుల కావడంతో కుటుంబసభ్యులతో కలిసి మానవపాడు మండలంలోని బోరవెల్లిలో బంధువుల ఇంటికి నాలుగు రోజుల క్రితం వచ్చారు. ఈ క్రమంలో సోమవారం ఈత కోసం మేనత్త కుమారుడైన ఇమాంతో కలిసి ఇస్మాయిల్ కుమారులు సమీర్(18), రియాన్(14), ఇబ్రహిం కూతుళ్లు ఆఫ్రిన్(17), నవసీన్ (13)తో పాటు మరో ఐదుగురు కలిసి ఆటోలో మంగంపేట శివారులో కృష్ణానదికి వెళ్లారు. ఈ క్రమంలో నదిలో లోతు గమనించకుండా ముందుకు వెళ్లడంతో రియాన్ మునిగిపోగా.. ఆఫ్రిన్, నవసీన్ కాపాడటానికి వెళ్లగా.. ముగ్గురికీ ఈత రాకపోవడంతో గల్లంతయ్యారు. వెంటనే వీరిని కాపాడేందుకు వెళ్లిన సమీర్ సైతం నీటిలో మునిగిపోయాడు. నలుగురు గల్లంతవడంతో ఇమాం కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మత్స్యకారుల సహాయంతో మృతదేహాలను వెలికితీసి.. పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. విగతా జీవులుగా పడి ఉన్న పిల్లలను చూసి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. -
పట్టాలపై సెల్ఫోన్లో బిజీ.. నలుగురిని చిదిమేసిన రైలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలో ఆదివారం అర్థరాత్రి దాటాక ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని ఇస్లాంపూర్‌లో రైల్వే ట్రాక్‌పై సెల్ఫోన్లో బిజీగా ఉన్న నలుగురు టీనేజర్లు.. రైలు ఢీకొట్టిన ఘటనలో దుర్మరణం చెందారు. రైలు పట్టాలపై కూర్చుని సెల్ఫోన్లో మునిగిపోయిన ఆ నలుగురు యువకులపై నుంచి రైలు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వారంతా 13-14 ఏళ్ల మధ్య వయసు వారని స్థానిక పోలీసులు వెల్లడించారు. ఈ దుర్ఘటనపై ఇస్లాంపూర్ ఎస్పీ సచిన్ మక్కర్ మాట్లాడుతూ.. ఆదివారం రాత్రి రైలు పట్టాలపై కూర్చొని సెల్ఫోన్లో నిమగ్నమైన నలుగురు మైనర్ బాలురు రైలు వస్తున్న విషయాన్ని కూడా గమనించలేదని, దీంతో రైలు వారిపై 50 మైళ్ల వేగంతో దూసుకెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. మృతదేహాలు గర్తుపట్టలేనంతగా ఛిద్రం కావడంతో పోస్ట్‌మార్టం చేసేందుకు కూడా కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని, విషయం తెలుసుకున్న వెంటనే హుటాహుటిన దహన సంస్కారాలు జరిపించారని వెల్లడించారు. ఈ ఘటనపై తమకెటువంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు. సంఘటనా స్థలం వద్ద సెల్ఫోన్ల విడిభాగాలు చెల్లా చెదురుగా పడి ఉండటాన్ని గమనించామని అన్నారు. మృతుల కుటంబ సభ్యులెవరైన ఫిర్యాదు చేస్తే ఘటనపై దర్యాప్తు చేస్తామని తెలిపారు. చదవండి: భర్తను హత్య చేసిన భార్య .. పోలీసుల రంగప్రవేశంతో.. -
తీవ్ర విషాదం: చెరువులో పడి నలుగురు మృతి
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. చెరువు వద్దకు ఆడుకోవడానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయారు. అయితే వారిని కాపాడేందుకు వెళ్లిన ఓ వ్యక్తి కూడా మృతి చెందారు. నలుగురి మృతితో ఓజిలి మండలం రాజుపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజుపాలెం గ్రామంలో ఉన్న చెరువు వద్దకు మాచవరం హేమంత్(6), మాచవరం చరణ్ తేజ(8), జాహ్నవి(12) ఆడుకోవడానికి వచ్చారు. ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు చెరువు నీటిలో చిన్నారులు పడిపోయారు. అక్కడే సమీపంలో ఉన్న షేక్ ఖలీల్ (45) వెంటనే వారిని కాపాడేందుకు చెరువులోకి దూకాడు. వారిని కాపాడే క్రమంలో ఖలీల్ కూడా నీటిలో చిక్కుకుని మృతి చెందాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో విషాదంలో మునిగిపోయింది. ముగ్గురు చిన్నారులు ఒకే కుటుంబానికి చెందినవారు. అయితే వారిని కాపాడేందుకు వెళ్లి ఖలీల్ మృతి చెందడం ఆ కుటుంబాన్ని కలచివేసింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
పట్టాలపై మందు పార్టీ
సాక్షి, చెన్నై: వారంతా ఇంజనీరింగ్ విద్యార్థులు.. పరీక్ష ముగిసిన ఆనందంలో వెన్నెల వెలుగులో మందు పార్టీ అంటూ రైలు పట్టాల మధ్య కూర్చుని పూటుగా మద్యం తాగారు. దురదృష్టవశాత్తూ అదే సమయంలో రైలు వచ్చింది. మద్యం మత్తులో జోగాడుతూ కదల్లేని పరిస్థితుల్లో నలుగురు విద్యార్థులు రైలు కింద పడి దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. రావత్తూరు రైల్వేవంతెన సమీపానికి రైలు వచ్చినప్పుడు ట్రాక్‌పై కొందరు కూర్చుని ఉండడాన్ని గమనించిన డ్రైవర్ హారన్ మోగించాడు. అయినా ఎవరూ కదల్లేదు. రైలును ఆపడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వంతెన దాటాక రైలాగింది. గార్డు, డ్రైవర్లు, భద్రతా సిబ్బంది వెనక్కి వచ్చి చూడగా.. నలుగురు యువకులు సంఘటన స్థలంలోనే విగతజీవులై కనిపించారు. గాయాలతో బయటపడిన మరో యువకుడ్ని ఆస్పత్రికి తరలించారు. విద్యార్థులు సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్నట్టు తేలింది. మృతులను కొడైకెనాల్‌కు చెందిన సిద్ధిక్ రాజ (22), రాజశేఖర్ (22), రాజపాళయంకు చెందిన కరుప్పుస్వామి (22), గౌతమ్ (22)లుగా గుర్తించారు. తేనికి చెందిన విశ్వేషన్ (22) గాయపడ్డారు. -
ఆలయానికి వెళ్తూ అనంతలోకాలకు..
సాక్షి, నిడమనూరు(నాగార్జునసాగర్)/సదాశివనగర్: రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడడంతో నిడమనూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. నిడమనూరు మాజీ సర్పంచ్ విరిగినేని అంజయ్య చెల్లెలు నంబూరి రమాదేవి(రమణ) కూతురు, అల్లుడు దగ్గర హైదరాబాద్‌లో ఉంటున్నారు. బుధవారం తెల్లవారుజామున తమ కూతురు సునీత, కుమారుడు రఘురామ్, అల్లుడు రాకేష్‌లతో కలిసి మనవడు అభిషేక్‌కు అక్షరాభ్యాసం కోసం బాసరకు కారులో వెళ్తున్నారు. కామారెడ్డి సమీపంలో కారు అదుపు తప్పి నిలిపి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ సంఘటనలో రమాదేవి(50), ఆమె కూతురు సునీత(30), కుమారుడు రఘురామ్(28) అక్కడిక్కడే మృతి చెందాడు. ఆమె అల్లుడు రాకేష్, మనుమడు అభిరామ్‌కు తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం తరలించారు. చికిత్స పొందుతూ అభిరామ్ మృతి చెందాడు. రమాదేవిని గుంటూరు జిల్లా కనిగిరికి చెందిన నంబూరి మణికి ఇచ్చి వివాహం జరిపించారు. తర్వాత వారు అక్కడ ఇల్లు అమ్ముకుని ఇతర ప్రాంతాల్లో రవాణా రంగంలో వివిధ వ్యాపారాలు నిర్వహించేవారు. మణి మూడేళ్ల క్రితం మృతి చెందాడు. భర్త మృతితో రమాదేవి కూతురు, అల్లుడు వద్ద హైదరాబాద్‌లో ఉంటున్నారు. రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన వారి మృతదేహాలను విరిగినేని అంజయ్య, ఆయన సోదరుడు ఆదినారాయణలు తమ స్వగ్రామమైన నిడమనూరుకు తరలించారు. ఇటీవలనే వారి చిన్న సోదరుడు నర్సింహారావు ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందడం ఇంతలోనే ఇలా సోదరి కుటుంబం దూరం కావడం పట్ల వారు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. మృతదేహాలను బుధవారం సాయంత్రం 7గంటలకు నిడమనూరుకు చేర్చారు. బాలుడు అభిరామ్ మృతదేహానికి పోస్ట్ మార్టం కోసం ఉంచారని, రాత్రి వరకు చేరుకోవచ్చని వారు తెలిపారు. మిన్నంటిన రోదనలు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడడంతో బంధువుల రోదనలతో ప్రదేశం మిన్నంటింది. వారి రోదనలు చూసిన గ్రామస్తులు సైతం కంటతడి పెట్టారు. అక్షరాభ్యాసం కోసం బాసరకు వస్తుంటే అందరినీ తీసుకెళ్లావా సరస్వతమ్మ అంటూ బంధువులు రోదించారు. అక్కడ వరుసగా ఉన్న మృతదేహాలను చూసినవారు కన్నీటిని ఆపుకోలేకపోయారు. మండల కేంద్రంలో మూడో కుటుంబం..ఒకే కుటుంబానికి చెందిన వారు వివిధ కారణాల వల్ల మృ త్యువాత పడిన సంఘటనలు ఉన్నాయి. నంబూరి రమాదేవి కుటుంబం రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడింది. మండల కేంద్రానికి చెందిన పాల్వాయి నారాయణ లలిత దంపతులు 15 సంవత్సరాల క్రితం ఇంటిలో నిద్రిస్తుండగా మిదె కూలి మృతి చెందారు. వారి ఇద్దరికీ ఒకే సారి అంత్యక్రియలు నిర్వహించారు. అది అప్పట్లో సంచలనంగా మారింది. ఐదు సంవత్సరాల క్రితం వ్యవసాయశాఖలో పని చేసి రిటైర్ అయిన గుండెమెడ సంగీత రావు సతీ మణి స్వరాజ్యం వారి కుమారుడు, హోంగార్డుగా పని చేస్తున్న గుండెమెడ బా బ్జీలు ఒక్క రోజు తేడాతో అనారోగ్యంతో మృతి చెందారు. వారి మృతదేహా లను పక్కపక్కనే పెట్టి తర్వాత ఒకే సారి అంత్యక్రియలు చేశారు. రమాదేవి కటుంబం మాదిరిగానే ఒకే కుటుంబానికి చెందిన వారు గతంలో మృతి చెందిన సంఘటనలను గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. సాక్షి, సదాశివనగర్: హైదరాబాద్‌లోని వనస్థలిపురం హైకోర్టు కాలనీకి చెందిన నాగాల సునీత(31), రాకేష్‌లకు రెండున్నరేళ్ల కుమారుడు నాగాల అభిరాం ఉన్నాడు. రాకేశ్ స్వస్థలం గుంటూరు కాగా ప్రస్తుతం హైదరాబాద్‌లో వ్యాపారం చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నారు. సునీత రాకేష్ దంపతులు తమ కుమారుడికి అక్షరాభ్యాసం చేయించాలని నిర్ణయించుకుని, గురువారం తెల్లవారుజామున మిర్యాలగూడకు చెందిన అత్త నంబూరి రమాదేవి (50), బావమరిది నంబూరి రఘురాం (33)లతో రాకేష్ కుటుంబం కారులో నిర్మల్ జిల్లాలోని బాసరకు బయలుదేరింది. రఘురాం కారు నడిపిస్తున్నారు. వీరి వాహనం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామశివారు ప్రాంతానికి రాగానే డ్రైవింగ్ చేస్తున్న రఘురామ్‌కు నిద్ర ముంచుకువచ్చింది. దీంతో వీరి వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని అవతలివైపు రహదారిపైకి వెళ్లింది. అదే సమయంలో నిజామాబాద్ వైపునుంచి కామారెడ్డి వైపు ఎరువుల లోడ్‌తో వెళ్తున్న లారీ కిందకు వీరి కారు దూసుకెళ్లింది. కారు వేగానికి లారీ డీజిల్ ట్యాంకు పగిలి మంటలు చెలరేగాయి. మంటలతోనే 50 మీటర్ల దూరం వరకు వెళ్లి లారీ ఆగిపోయింది. ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలను ఆర్పివేసింది. దీంతో లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్లు సురక్షితంగా బయటపడ్డారు. ఈప్రమాదంలో నంబూరి రమాదేవి కారులో నుంచి ఎగిరి రోడ్డుపై పడడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. కారు ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినప్పటికి లారీ కింద ఇరుక్కుపోవడంతో నంబూరి రఘురాం, నాగాల సునీత తలలు పగిలి అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. తీవ్రంగా గాయపడిన రాకేష్ ఆయన కుమారుడు అభిరాంలను గ్రేహౌండ్స్ పోలీసులు వెంటనే 108 అంబులెన్స్‌లో హుటాహుటిన కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అభిరాం పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై నరేశ్ తెలిపారు. కొంపముంచిన నిద్రమత్తు! ఈ ప్రమాదంలో వేగంతో ఉన్న కారు ముందు టైర్ రోడ్డు డివైడర్ ఎక్కగానే గమనించి ఉంటే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేది కాదు. కారు డ్రైవర్ డివైడర్ ఎక్కిన విషయాన్ని గమనించకపోవడానికి నిద్రమత్తే కారణమని భావిస్తున్నారు. -
చెరువులో జారిపడి నలుగురు విద్యార్థుల మృతి
-
గ్యాస్ దుర్ఘటన.. నిద్రలో ఉండగానే..
-
గ్యాస్ దుర్ఘటన.. నిద్రలో ఉండగానే..
సాక్షి, చిత్తూరు : జిల్లాలోని ఏర్పేడు మండలం రాజులకండ్రిగలో దారుణం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలిన దుర్ఘటనలో ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. వివరాలు.. భార్య పిల్లలతో కలిసి శ్రీనివాస్‌రెడ్డి స్థానికంగా నివాసముంటున్నాడు. శనివారం రాత్రి ఒంటిగంట సమయంలో వాళ్లింట్లో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్‌రెడ్డితో సహా అతని భార్యాపిల్లలు అగ్నికి ఆహుతయ్యారు. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు ఎగిరిపోయిందని స్థానికులు తెలిపారు. కాగా, గ్యాస్ ఆఫ్ చేయడంలో నిర్లక్ష్యంగా కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ లీకైంది గ్రహించక ఎలక్ట్రిక్ స్విచ్ ఆన్ చేయడంతో ఈ ప్రమాదం జరగొచ్చని భావిస్తున్నారు. ఈ ఘటనలో శ్రీనివాసులురెడ్డి, బుజ్మమ్మ, నితిన్, భవ్య నిద్రలోనే ప్రాణాలొదిలారని పోలీసులు వెల్లడించారు. ఇదిలాఉండగా.. శ్రీనివాస్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండడంతో.. ఘటనకు సంబంధించి ఏదైనా కుట్ర దాగుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అయితే, శ్రీనివాస్‌రెడ్డికి ఎవరితో విభేదాలు లేవని అతని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అతనికి ఏవైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేపడతామని పోలీసులు చెప్పారు ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు చనిపోవడంతో రాజులకండ్రిగలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. -
అతి వేగం.. యమపాశం
‘వేగం కన్నా ప్రాణం మిన్న.. అతివేగం ప్రమాదకరం.. హెల్మెట్ ధరించండి.. ప్రాణాలను కాపాడుకోండి’ పోలీసులు నిత్యం చెప్పే సూచనలు ఇవి... అయితే కొందరు వారి సూచనలను పెడచెవిన పెడుతున్నారు... పర్యవసానంగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు... ప్రొద్దుటూరు మండలంలో మంగళవారం రెండు బైక్‌లు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ప్రొద్దుటూరు క్రైం : రూరల్ పరిధిలోని ఆర్టీపీపీ రహదారిలో మంగళవారం ఎదురెదురుగా వస్తున్న– వెళ్తున్న రెండు బైక్‌లు ఢీకొన్న సంఘటనలో ప్రొద్దుటూరు ఈశ్వరరెడ్డినగర్కు చెందిన జానపాటి నాగసుబ్బయ్య (28), వరకాల నారాయణ (21), ఎర్రగుంట్ల మండలంలోని ఇల్లూరు గ్రామానికి చెందిన ఇల్లూరి గంగరాజు (42), గిత్తగాండ్ల దానమయ్య (38) మృతి చెందారు. రూరల్ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ♦ ఈశ్వరరెడ్డినగర్కు చెందిన నాగమయ్యకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో నాగసుబ్బయ్య రెండో వాడు. చేనేత పని వీరి జీవనాధారం. కుటుంబ సభ్యులందరూ చేనేత పని చేస్తుంటారు. వీరి ఇంటి పక్కనే వరకాల రామకృష్ణ నివాసం ఉన్నాడు. వీరు కూడా చేనేత పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు నారాయణతోపాటు ఉదయ్ అనే ఇద్దరు కుమారులు, విజయ, విజయదుర్గ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నారాయణ పట్టణంలోని రాణీతిరుమలదేవి కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. పెద్ద చదువులు చదివించి కుమారుడ్ని గొప్ప వాడిగా చూడాలనేది తల్లిదండ్రుల కోరిక. ఎర్రగుంట్ల మండలంలోని ఇల్లూరు గ్రామానికి చెందిన ఇల్లూరి గంగరాజు బేల్దారి పనికి వెళ్తుంటాడు. అతనికి భార్య పుల్లమ్మతోపాటు గంగామహేశ్వరి అనే కుమార్తె ఉన్నారు. అతను రోజూ బేల్దారి పని చేయడానికి ప్రొద్దుటూరు వెళ్తాడు. అదే గ్రామంలోని గిత్తగాండ్ల దానమయ్య ప్రొద్దుటూరుకు చెందిన ఒక వ్యక్తి ట్రాక్టర్‌కు డ్రైవర్‌గా వెళ్తున్నాడు. అతనికి భార్య జ్యోతితోపాటు గ్లోరీ అనే నాలుగేళ్ల కుమార్తె ఉన్నారు. మృత్యువులోనూ వీడని స్నేహం ఈశ్వరరెడ్డినగర్కు చెందిన నాగసుబ్బయ్య, నారాయణ ఇళ్లు పక్కనే ఉండటంతో ఎక్కడికైనా వెళ్లాలంటే ఇద్దరూ కలసి వెళ్తుంటారు. ఈ క్రమంలో కలమల్లలో ఉన్న తన స్నేహితుడి వద్దకు వెళ్దామని నారాయణ చెప్పడంతో అతనితో కలసి బైక్‌లో నాగసుబ్బయ్య వెళ్లాడు. బేల్దార్ పనికి వెళ్లిన గంగరాజు మ««ధ్యాహ్నం భోజనం చేయడానికి ప్రొద్దుటూరు నుంచి ఇల్లూరుకు బయల్దేరేందుకు ఆర్టీపీపీ రోడ్డులో నిల్చున్నాడు. ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్న దానమయ్య పని ముగించుకొని బైక్‌లో గ్రామానికి వెళ్తుండగా.. దారిలో ఉన్న గంగరాజు ఆ బైక్ ఎక్కాడు. కలమల్లలో పని ముగించుకున్న నారాయణ ఇంటికి పయనమయ్యారు. అయితే ప్రొద్దుటూరు పెన్నా నది సమీపంలోకి రాగానే.. ముందు వైపు వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేశారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న గంగరాజు బైక్‌ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో నాగసుబ్బయ్య అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్లిన కొన్ని నిమిషాల్లోనే డిగ్రీ విద్యార్థి నారాయణ మృతి చెందాడు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు గంగరాజును తిరుపతికి, దానమయ్యను కర్నూలుకు తరలించే ఏర్పాట్లు చేశారు. అయితే దువ్వూరు సమీపంలోకి వెళ్లగానే దానమయ్య, చాపాడు వద్దకు వెళ్లేలోపు గంగరాజు చనిపోయారు. మిన్నంటిన రోదనలు జిల్లా ఆస్పత్రిలోని మార్చురీ వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈశ్వరరెడ్డినగర్కు చెందిన మృతుల బంధువులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు తరలివచ్చారు. చేతికి అందివచ్చిన కుమారుడు మృత్యువాత పడటంతో నారాయణ తల్లిదండ్రులు, చెల్లెలు విజయ బోరున విలపించారు. ‘గొప్ప వాడివి అవుతావని కలలు కన్నానే’ అని చెప్పుకుంటూ తల్లి లక్ష్మీదేవి రోదించింది. ♦ దానమయ్య, గంగరాజు మృతి చెందంతో ఇల్లూరు గ్రామంలో విషాదం నెలకొంది. భార్య పుల్లమ్మ, కుమార్తె గంగామహేశ్వరి గంగరాజు మృతదేహంపై పడి కన్నీరుమున్నీరయ్యారు. ‘నీవు లేకుండా కుమార్తెను ఎలా పోషించుకోవాలా’ అంటూ భార్య విలపించింది. దానమయ్యకు నాలుగేళ్ల కుమార్తె ఉంది. ఊహ తెలియని వయసులో తండ్రి మరణించడంతో చిన్నారిని చూసిన వాళ్లు చలించిపోయారు. ఆయన భార్య జ్యోతిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. భర్త మృతదేహం వద్ద రోదిస్తూ సొమ్మసిల్లి పడిపోయింది. ♦ ప్రొద్దుటూరు వైఎస్సార్సీపీ నాయకుడు బంగారురెడ్డి, ఇల్లూరు నాయకులు దస్తగిరిరెడ్డి, వెంకటసుబ్బారెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించి, సానుభూతి వ్యక్తం చేశారు. -
అమెరికాలోని ఫ్లోరిడాలో భారీ కాల్పులు
-
ఫ్లోరిడాలో భారీ కాల్పులు
జాక్సన్విల్లే: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం జాక్సన్విల్ నగరాన్ని ఆదివారం తుపాకీ కాల్పులు వణికించాయి. జాక్సన్విల్ ల్యాండింగ్ ప్రాంతంలో భారీగా కాల్పులు చోటుచేసుకున్నాయి. కాగా ఈ కాల్పుల్లో నలుగురు మరణించారని, 11 మంది గాయపడ్డారని స్థానిక మీడియా తెలిపింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పోలీసుల ఎదురు కాల్పుల్లో ఒక అనుమానితుడు మరణించాడు. ‘ప్రజలు జాక్సన్విల్ ల్యాండింగ్ ప్రాంతానికి దూరంగా ఉండండి. ప్రస్తుతం అక్కడికి వెళ్లడం సురక్షితం కాదు’ అని స్థానిక పోలీసు అధికారి ఒక ట్వీట్లో హెచ్చరించారు. మ్యాడెన్ వీడియోగేమ్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న ప్రాంతంలో కాల్పులు జరిగాయని దాని నిర్వాహకులు ఒక ట్వీట్లో తెలిపారు. సెయింట్ జాన్స్ నదీ తీరంలో ఉన్న ఈ ప్రాంతం వినోద కార్యక్రమాలకు పేరుగాంచింది. -
శుభకార్యానికి వెళ్లొస్తూ మృత్యుఒడిలోకి !
కోదాడఅర్బన్ : వారంతా తమ బంధువుల శుభకార్యానికి హాజరై తిరిగి స్వగ్రామానికి వస్తున్నారు. మరో గంటసేపట్లో గమ్యం చేరనున్నారు. ఇంతలోనే వారు ప్రయాణిస్తున్న ఆటో కోదాడ బైపాస్ వద్దకు రాగానే టైర్ బరస్ట్ అయింది. అదుపుతప్పి వాహనం బోల్తాపడడంతో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా, మరొకరు చికిత్స నిమిత్తం విజ యవాడ తరలిస్తుండగా మృతి చెందాడు. మరో 17 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదివారం సాయంత్రం కోదాడ బైపాస్‌లోని ఎస్ ఆర్ఎం పాఠశాల ఎదుట జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆం ధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా వత్సవాయి మం డలం మక్కపేటకు చెందిన శీలం గోపి పాత ఇను ము వ్యాపారం చేస్తున్నాడు. తన పిల్లలకు పుట్టువెంట్రుకలు తీయించేందుకుగాను సూర్యాపేట జిల్లాకేంద్రం సమీపంలోని నెమ్మికల్‌లో గల దండుమైసమ్మ ఆలయానికి వచ్చారు. శుభకార్యానికి అతడు తన స్నేహితులు, బంధువులను పిలవడంతో వారంతా అక్కడకు గోపి బంధువు సుభానికి చెందిన ట్రాలీ ఆటో నంబర్ 16 టీఈ 4693లో వచ్చారు. వీరంతా మధ్యాహ్నం విందు ముగించుకుని తిరిగి మక్కపేట, భీమవరంలకు వెళ్లేందుకు తిరుగు ప్రయాణమయ్యారు. ఆటోటైరు ఒత్తిడికి గురై.. ట్రాలీఆటోలో వెనుక మొత్తం 25మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఆటో కోదాడ బైపాస్‌రోడ్‌లోని ఎస్ఆర్ఎం పాఠశాల సమీపంలోకి చేరుకోగానే ఆటో టైర్ ఒత్తిడికి గురై ఒక్కసారిగా పగిలిపోయిం ది. దీంతో ఆటో రోడ్డుపైనే బోల్తాపడింది. ఆటోలో ప్రయాణిస్తున్న వారంతా సామగ్రితో సహా రో డ్డుపై పడిపోయారు. ఈ క్రమంలో ఆటో బోల్తాపడిన వేగానికి మక్కపేటకు చెందిన ఆళ్ల గురుస్వామి(25), పల్లెబోయిన వీరయ్య(50), షేక్ హుస్సేన్‌సాహెబ్(35) తీవ్ర గాయాలై అక్కడిక్కడే మరణించారు. మరో 17మందికి గాయాలయ్యా యి. ప్రమాద సంఘటన సమాచారమందుకున్న పట్టణ సీఐ శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను, క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రక్తసిక్తమైన బైపాస్ రోడ్డు ఒకేసారి ముగ్గురు మృతిచెందడం, 17మంది గా యపడడంతో బైపసా రోడ్డు పూర్తిగా రక్తసిక్తమైంది. మృతుల బంధువుల రోదనలతో కోదాడ ప్రభుత్వాసుపత్రి దద్దరిల్లింది. ప్రమాద సంఘటన తెలుసుకున్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ కోదాడ ప్రభుత్వాసుపత్రికి చేరకుని మృతదేహాలను సందర్శించారు. సానుభూతి తెలి పారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా సాయం అందిస్తామని తెలిపారు. ఈ సంఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
కుమురం భీం జిల్లాలో రోడ్డు ప్రమాదం:నలుగురు మృతి
-
బొలెరో వాహనం బోల్తా.. నలుగురు మృతి
సాక్షి, కుమురం భీం : జిల్లాలోని రెబ్బెన మండలం సోనాపూర్ వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వంతెన పై నుంచి బొలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. గోలేటి నుంచి కైరిగుడ వెళ్తుండగా ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
‘నిపా’ ఎఫెక్ట్..నలుగురు మృతి
కోజికోడ్/కేరళ: ప్రాణాంతక నిపా వైరస్ బారిన పడి కేరళలో మరో వ్యక్తి మరణించాడు. ఇప్పటికే అదే కుటుంబంలోని ముగ్గురు నిపా వైరస్ సోకి చనిపోగా గురువారం వీ.మూసా (61) అనే వృద్ధుడు చికిత్స పొందుతూ కోజికోడ్ ఆస్పత్రిలో గురువారం ప్రాణాలు విడిచాడు. మెదడు పనితీరుపై ప్రభావం చూపి ప్రాణాలు తోడేసే ఈ వైరస్ బారిన పడి కేరళలో మరణించిన వారి సంఖ్య 12కి చేరింది. ఒకే కుటుంబంలోని నలుగురు ఈ కారణంగా చనిపోవడంతో మూసా కుటుంబం నివాసముంటున్న కోజికోడ్ పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నిపా వైరస్ ప్రధానంగా గబ్బిలాల ద్వారా వ్యాపిస్తుందని వైద్యాధికారులు చెప్తున్నారు. మూసా ఇంటి పరిసరాల్లో గల పాడుబడిన బావిలో చనిపోయిన గబ్బిలాలు పదుల సంఖ్యలో పడి ఉన్నాయని కేరళ వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. బహుశా ఈ బావిలోని గబ్బిలాల ద్వారానే నిపా వైరస్ వ్యాపించి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, వ్యాధికి గురైన మూసా, అతని ఇద్దరి కుమారులు, సోదరికి చికిత్సనందిస్తూ నర్సు లినీ సోమవారం మృతిచెందిన సంగతి తెలిసిందే. -
పెళ్లికి వెళ్లి వస్తూ పరలోకానికి..
డిచ్పల్లి : శుభ కార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబం అనంతలోకాలకు చేరింది. మండల కేంద్రం శివారులోని 44వ జాతీ య రహదారిపై సోమవారం సాయం త్రం సుమారు 4 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీనిలో కోటగిరికి చెందిన పోల విఠల్‌రావు, సుష్మ దంప తుల కుమారుడు పోల రాఘవేందర్ (38), కోడలు పోల దీప్తి(34), మనవ డు సాయితేజ(11), మనవరాలు స్నిగ్థ(5) అక్కడికక్కడే మృతి చెందారు. వీరికి కోటగిరిలో సాయి ఆగ్రో ఇండస్ట్రీస్(రైస్‌మిల్) ఉంది. ఇందల్వాయి ఎస్ఐ రాజశేఖర్, మృతుల బంధువులు తెలిపి న వివరాలిలా ఉన్నాయి. విఠల్‌రావు కుటుంబంతో కలిసి ఆదివారం హైదరాబాద్‌లోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. విఠల్‌రావు దంపతులు అక్కడే ఉండి పోయారు. కాగా రాఘవేందర్ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి సోమవారం కోటగిరికి బయలు దేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు(టీఎస్ 10 ఈపీ 1299) డిచ్పల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ముందు టైరు పేలిపోయి ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను దాటుకుని వెళ్లి రోడ్డుపై పల్టీ కొట్టింది. అదే సమయంలో ఆర్మూర్ వైపు నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న లారీ(ఎంహెచ్ 04 ఈఎల్ 5103) కిందకు దూసుకెళ్లింది. దీంతో లారీ, కారును కొద్ది దూ రం లాక్కెళ్లింది. కారులోని బెలూన్లు తె రుచుకున్నా లారీ కిందకు వెళ్లడంతో అం దులో ఉన్న నలుగురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎదురుగా ఉన్న పోలీస్‌స్టేషన్‌లోని సిబ్బందితో పా టు రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు అక్కడికి చేరుకున్నారు. కారు నుజ్జునుజ్జు కావడంతో అందులో నుంచి మృతదేహాలను వెలికి తీసేందుకు స్థానికులు, పోలీసులు తీవ్రంగా శ్రమించారు. పారలు, ఇనుప రాడ్లతో కారు డోర్లు, పైభాగాన్ని పెకిలించి కారులోని మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాద వా ర్త తెలియగానే రాఘవేందర్ తల్లిదండ్రు లు విఠల్‌రావు, సుష్మ హైదరాబాద్ నుంచి హుటాహుటిన నిజామాబాద్‌కు బయలుదేరారు. ఇందల్వాయి ఎస్ఐ రాజశేఖర్, డిచ్పల్లి ఏఎస్ఐ నారాయణ రహదారిపై వాహనాల రాకపోకలను దారి మళ్లించారు. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వెళ్తున్న రాఘవేందర్ స్నే హితుడు శ్రావణ్ ఘటనా స్థలం వద్ద ఆగాడు. మృతులను చూడగానే గుర్తించి వారి వివరాలను పోలీసులకు తెలిపా డు. నిజామాబాద్ ఏసీపీ ఎం.సుదర్శన్ ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు డిచ్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కోటగిరిలో విషాదఛాయలు కోటగిరి(బాన్సువాడ) : ఉన్న ఒక్కగానొక్క కుమారుడు, కోడలు, మనుమ డు, మనుమరాలు రోడ్డు ప్రమా దం లో మృతిచెందడంతో కోటగిరిలో వి శాదఛాయలు అలుముకున్నాయి. ప లువురు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతినిత్యం తన కళ్ళముందు ఆడు తూ పాడుతూ తిరిగే మనుమడు, మ నుమరాలు మృతిచెందడంతో ఆయన కు తీరని లోటు మిగిలింది. హైదరా బాద్ నుంచి నిజామాబాద్‌కు కారులో వస్తుండగా ప్రమాదం జరిగింది. కోటగిరికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త పోల విఠల్సేట్కు ఏకైక కుమారుడు పోల రాఘవేందర్రావు. ఆదివారం హైదరాబాద్‌లో పెళ్లి జరిగింది. మరో గంటలో ఇంటికి చేరుకుంటారనే సమయంలో రోడ్డు ప్రమాదంలో దంపతులతో పాటు వారి పిల్లలు మృతి చెందడంతో విషాదం నెలకొంది.ప్రమాద వివరాలపై ఆరా రోడ్డు ప్రమాద సమాచారం అందుకున్న రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సోమవారం రాత్రి ప్రమాద స్థలాన్ని సందర్శించారు. ఏసీపీ సుదర్శన్‌ను అడిగి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అప్పటికే మృతదేహాలను జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడంతో మంత్రి ఆస్పత్రికి చేరుకున్నారు. మృతుడి తండ్రి విఠల్‌రావును మంత్రి పోచారం ఓదార్చారు. లారీ రాకుంటే ప్రమాదం తప్పేది.. రాఘవేందర్ ప్రయాణిస్తున్న కారు డిచ్పల్లి పోలీస్ స్టేషన్ ఎదుటకు రాగానే కారు ముందు టైరు పేలి అదుపు తప్పింది. డివైడర్ పైకెక్కి పూల మొక్కలను దాటుకుని రోడ్డుపై పల్టీ కొట్టింది. కారులో ఉన్న బెలూన్లు వెంటనే తెరుచుకున్నాయి. అయితే దురదృష్టవశాత్తు అదే సమయంలో ఎదురుగా లారీ వేగంగా వస్తుంది. దీంతో లారీ కిందకు దూసుకెళ్లిన కారును లారీ రోడ్డుపై కొంత దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో కారు నుజ్జు కావడంతో నలుగురు మృతి చెందారు. ఆ సమయంలో ఎదురుగా లారీ రాకపోయింటే కారులోని నలుగురు బతికి ఉండేవారని అక్కడున్నవారు, పోలీసులు అభిప్రాయపడ్డారు. కంటతడి పెట్టిన మంత్రి పోచారం నిజామాబాద్ క్రైం: డిచ్పల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి మృతదేహాలను చూసి రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి కంటతడి పెట్టారు. ఉమ్మడి జిల్లాలో రోజంతా సమీక్షలు నిర్వహించాక నేరుగా పోస్టుమార్టం గదికి వెళ్లి విగతజీవులుగా పడి ఉన్నవారి మృతదేహాలను చూసి కంటతడి పెట్టారు. అందరితో సన్నిహితంగా మెలిగే రాఘవేందర్ ఆకస్మాత్తుగా మృతిచెందటం జీర్ణించుకోలేని విషయమని మృతుడి తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అధైర్య పడవద్దని, తాను ఉన్నానంటూ మృతుడి కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. రాత్రి 8.30 గంటలకు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి కావటంతో 9 గంటలకు కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించాగ మృతదేహాలను బంధువులు కోటగిరికి తరలించారు. కామారెడ్డికి వెళ్లి ఉంటే.. సోమవారం హైదరాబాద్ నుంచి కోటగిరికి భార్య దీప్తి, కుమారుడు తేజసాయి, కూతురు స్నిగ్ధతో కలిసి కారులో బయలుదేరారు. వీరి కారు కామారెడ్డికి చేరుకోక ముందే కామారెడ్డిలో రాఘవేందర్ స్నేహితుడు ఇక్కడ ఆగాలని కాస్త మాట్లాడుదామని చెప్పాడు. దానికి రాఘవేందర్ ఇప్పుడు సమయం లేదని, మరోసారి కామారెడ్డికి వస్తానని చెప్పి కామారెడ్డిలోకి కారు వెళ్లకుండా బైపాస్ గుండా వచ్చాడు. అక్కడే ఆగి ఉంటే ప్రమాదం జరిగి ఉండక పోవచ్చని కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రేపు తేజసాయి పుట్టిన రోజు.. ప్రమాదంలో మృతిచెందిన రాఘవేందర్ కుమారుడు తేజసాయి పుట్టినరోజు బుధవారమే. దీంతో కొడుకు బర్త్‌డేను ఘనంగా చేసేందుకు హైదరాబాద్ నుంచి వివిధ వస్తువులు, దుస్తులు కొన్నారు. అంతలోనే తేజసాయికి నిండు నూరేళ్లు నిండిపోవటం బాధాకరం. -
చిత్తూరు జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం
-
విద్యుదాఘాతానికి నలుగురు బలి
జిల్లాలో వేర్వేరు చోట్ల శనివారం విద్యుదాఘాతానికి గురై నలుగురు మృతి చెందారు. పొదిలి మండలం మామిళ్లపల్లికి చెందిన పెద్ద యోగయ్య (67), కురిచేడు మండలంలోని గంగదొనకొండకు చెందిన గండి కోటేశు (23), కొరిశపాడు మండలం తమ్మవరానికి చెందిన దేవరపల్లి అమర్‌బాబు (23). కొత్తపట్నం మండలం మోటుమాలకు చెందిన పురిణి నరసింహ (14)విద్యుత్ షాక్‌కు గురై మృత్యువాత పడ్డారు. జిల్లాలో వేర్వేరు చోట్ల ఘటనలు.. పొదిలి : జిల్లాలో శనివారం వేర్వేరు చోట్ల విద్యుదాఘాతానికి గురై నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నిరుగా విలపిస్తున్నారు. ప్రమాదవశాత్తు కరెంటు తీగలు తగిలి ఓ వృద్ధుడు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన కాటూరివారిపాలెం సమీపంలోని ఓ మిల్క్ లైన్లో శనివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన మామిళ్లపల్లి పెద్ద యోగయ్య (67) మిల్క్లైన్లో పని చేస్తుంటాడు. ఆవరణలో ఉన్న కొలనును నీటితో నింపేందుకు మోటార్ ఆన్ చేశాడు. పైపులు తగిలించే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడి పెద్ద యోగయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో యువకుడు కూడా.. కురిచేడు : విద్యుదాఘాతానికి గురై మరో యువకుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన మండలంలోని గంగదొనకొండలో శనివారం ఉదయం జరిగింది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గండి కోటేశు (23), ఆయన భార్య జ్యోతిలు ఉదయం 11 గంటల సమయంలో ఇంట్లో ఉన్నారు. ఉక్క పోస్తుండటంతో టేబుల్ ఫ్యాను పెట్టుకున్నారు. ఫ్యాన్ వైరుకు ఉన్న జాయింట్ వద్ద కోటేశు చేయి తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. కంగారులోవ భర్తను పట్టుకోవడంతో జ్యోతి కూడా విద్యుదాఘాతానికి గురైంది. ఆమె పెద్దగా కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి తలుపులు తీసి చూసే సరికి ఇద్దరూ విద్యుదాఘాతానికి గురై ఉన్నారు. స్థానికుడు జయరావు గమనించి జ్యోతిని కర్రతో బలంగా లాగాడు. ఆమె గాయాలతో బయటపడగా కోటేశు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి తల్లి, తండ్రి, తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు. ఇంకొక యువకుడు కూడా.. మేదరమెట్ల : విద్యుదాఘాతానికి గురై ఇంకొక యువకుడు కూడా మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని తమ్మవరంలో శనివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన దేవరపల్లి అమర్‌బాబు (23) బేల్దారి పనులతో పాటు కరెంటు పైపులు కోసే పనులు చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. గ్రామంలోని ఓ ఇంట్లో విద్యుత్ యంత్రంతో గాడులు కొడుతున్నాడు. కరెంటు లేదనుకొని వైర్లు పట్టుకోవడంతో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే పడిపోయాడు. సహచరులు అతడిని హుటాహుటిన మేదరమెట్లలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లగా అమర్‌బాబు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం తెలుసుకున్న కొరిశపాడు ఎస్ఐ వెంకటేశ్వరరావు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును సహచర కూలీలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి తల్లి, సోదరుడు ఉన్నాడు. ఏడాది క్రితమే తండ్రి మరణించాడు. చేతికి అందివచ్చిన కుమారుడు మరణించడంతో తల్లి కన్నీరుమున్నీరుగా రోదిస్తోంది. మోటుమాలలో బాలుడు.. మోటుమాల (కొత్తపట్నం) : విద్యుదాఘాతంతో బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని మోటుమాలలో శనివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన పురిణి నరసింహ (14) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. బాలుడి స్వగ్రామం నెల్లూరు జిల్లా పంట అల్లూరు. ఏడాది క్రితం అమ్మమ్మ ఇంటికి మోటుమాల వచ్చాడు. అప్పటి నుంచి ఇక్కడే చదువుతున్నాడు. పాఠశాలకు వెళ్లి వచ్చిన తర్వాత పొలంలో గేదెలు మేపుతున్న తాత నాటారు వెంకయ్యకు భోజనం ఇచ్చేందుకు వెళ్లాడు. ఆ తర్వాత బాలుడికి తాటి ముంజలు తినాలని కోరిక కలిగింది. పొలంలో ఉన్న తాటి చెట్టు ఎక్కేందుకు ప్రయత్నించి విఫలం చెంది 20 అడుగుల అల్యూమినియం పైపుతో తాటి కాయలు కోసేందుకు ప్రయత్నించాడు. తాటి చెట్టుపైన ఉన్న 11 కేవి విద్యుత్ తీగలపై పైపు పడింది. పైపునకు బిగించి ఉన్న కొక్కేం విద్యుత్ తీగకు తగులుకుంది. విద్యుదాఘాతానికి గురై బాలుడు నరసింహ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి స్థానిక ఎస్ఐ సీహెచ్ శివబసవరాజు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించాడు. వివరాలు సేకరించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పోస్టమార్టం కోసం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు నలుగురు మృతి
-
కల సాకారం కాకుండానే..
అందరినీ ఆప్యాయంగా పలకరించే ఆ యువకులను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. దైవదర్శనం చేసుకుని తిరిగి వస్తారనుకున్న వారు విగతజీవులై వస్తున్నట్లు తెలిసి కుటుంబ సభ్యులు, బంధువులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు కన్నీటి పర్యంతమవుతన్నారు. నిన్నటి వరకు తమతో మాట్లాడిన వారు ఇక లేరనే నిజాన్ని నమ్మలేకపోతున్నారు. పామిడి: తమిళనాడులోని తిరుమంగళం వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పామిడికి చెందిన పోలీస్ బ్రదర్స్ పేరం రఘు(30), పేరం రాంప్రసాద్(29)తో పాటు క్లాత్ మర్చంటర్ బీ మధుసూదన్‌రెడ్డి(35), డ్రైవర్ కుమ్మర మహేష్(24) దుర్మరణం చెందారు. బోర్వెల్ నిర్వాహకుడు తాటిచెర్ల సుబ్బరాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. నాలుగురోజుల క్రితం పామిడి నుంచి శబిరిమలైలో సుబ్రమణ్యం స్వామిని దర్శించుకొని తిరుగుపయనంలో సోమవారం రాత్రి మధురై మీనాక్షి దేవాలయ దర్శనానికి ఐ 20 కారులో వెళుతుండగా తిరుమంగళం వద్ద డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రుడు తాటిచెర్ల సుబ్బరాయుడును మధురై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లోయలోకి ఎగిరిపడిన రఘు, రాంప్రసాద్, మధుసూధన్‌రెడ్డి, కుమ్మర మహేష్ మృతదేహాలను వెలికితీశారు. వాటిని మార్చురీకి తరలించారు. మంగళవారం సాయంత్రం పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాలను బంధువులకు అప్పగించారు. పామిడికి బుధవారం తెల్లవారు జామున చేరుకోనున్నారు. నలుగురి మృతితో పామిడిలోని బొడ్రాయి ప్రాంతం విషాదంలో మునిగిపోయింది. ఎక్సైజ్ కానిస్టేబుల్ నుంచి ఎస్ఐగా ఎదిగి... ఎంసీఏ చదివిన రఘు 2011 పోలీస్ రిక్రూట్మెంట్కు సంబంధించి ఎస్ఐ, ఎక్సైజ్ కానిస్టేబుల్ రాత పరీక్ష రాశాడు. ముందుగా ఎక్సైజ్ పోలీస్ ఫలితాలు వచ్చాయి. దాంట్లో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా రఘు సెలెక్ట్ అయ్యాడు. అందులో భాగంగా ఆరు నెలలు ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా అనంతపురంలో విధులు నిర్వర్తించాడు. 2013లో 14వ బ్యాచ్ ఎస్ఐ ఫలితాల్లోనూ ఎస్ఐ పోస్టుకు ఎంపికయ్యాడు. మొదటి పోస్టింగ్‌గా షామీర్పేట ఎస్ఐగా పనిచేశారు. ప్రస్తుతం కమాండ్ అండ్ కంట్రోల్ సైబరాబాద్ క్రైమ్ ఎస్ఐగా విధులు నిర్వర్తించేవారు. ఇక తమ్ముడు రాంప్రసాద్ డిగ్రీ మధ్యలో ఆపేసి 2009లో మడకశిర కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం ధర్మవరం పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఐదు నెలల క్రితం విధులకు సెలవు పెట్టి.. పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదం రూపంలో పోలీస్ బ్రదర్స్‌ను బలిగొనడంతో ఆ కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు చూపరులను కంటితడి పెట్టించాయి. కానిస్టేబుల్ కల సాకారం కాకుండానే.. బీకాం పూర్తి చేసిన కుమ్మర మహేష్ కానిస్టేబుల్ కావాలని కలలు కనేవాడు. రాతపరీక్ష కోసం హైదరాబాద్‌లో శిక్షణ తీసుకున్నాడు. కానీ విధి వెక్కిరించడంతో అర్ధమార్కులో కానిస్టేబుల్ ఉద్యోగం చేజారింది. దీంతో తాత్కాలికంగా కారు డ్రైవర్‌గా వెళ్లేవాడు. ఇంతలోనే మహేష్‌ను మృత్యువు కబళించింది. కుమారుడి మరణ వార్త తెలియని తల్లి డిగ్రీ చదివిన బి.మధుసూదన్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయాన్ని తల్లి నాగలక్ష్మికి తెలపడానికి బంధువులు సాహసించడం లేదు. గతంలో భర్త భోగిరెడ్డి మృతుని తట్టుకోలేక నాగలక్ష్మి స్పృహతప్పి పడిపోయింది. ఇప్పుడు కుమారుడి మరణ వార్త తెలిపితే ఏమవుతుందోనన్న భయంతో చెప్పడానికి ఎవరూ సాహసించడం లేదు. మృతదేహం వచ్చాక చెబుదామన్న నిర్ణయానికి వచ్చారు. బంధువుల ఒక్కొక్కరు ఇంటికి వస్తుండడంతో అనుమానం వచ్చిన భార్య హేమలత, పెద్దకుమార్తె అమృత(8), చిన్న కుమార్తె అనూష(3)లు మధుసూదనరెడ్డితో మాట్లాడించాలని పట్టుబట్టడంతో.. సీరియస్‌గా ఉందని, మాట్లాడలేడని దాటవేశారు. -
వేగం.. ఘోరం
పశ్చిమ గోదావరి / కాళ్ల: రెండు మోటార్ సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా జక్కరం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాళ్ల మండలం జక్కరం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మొగల్తూరు మండలం తూర్పుతాళ్లు గ్రామానికి చెందిన చేమకూరి బాలాజీ (29) తన బైక్‌పై భీమవరం వైపు నుంచి కలిదిండి వైపు వెళుతున్నారు. అదే సమయంలో భీమవరంలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒడిశా రాష్ట్రం రాయగఢ్ జిల్లా బత్క్లి గ్రామానికి చెందిన కె.రాజేష్ (25), కె.గోపీనాథ్ (26), హెచ్.మల్లేష్ (26)లు ఎదురుగా మోటార్ సైకిల్‌పై వస్తున్నారు. రెండు వాహనాలు ఎదురెదురుగా వచ్చి వేగంగా ఢీకొన్నాయి. అక్కడికక్కడే బాలాజీ, రాజేష్ మృతి చెందారు. మిగిలిన ఇద్దరిని 108లో భీమవరం ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గం మధ్యలో గోపీనాథ్, ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మల్లేష్ ప్రాణాలు విడిచారు. తూర్పుతాళ్లు గ్రామానికి చెందిన చేమకూరి బాలాజీకి కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలో చెరువులు ఉండడంతో శుక్రవారం రాత్రి భీమవరంలోని బంధువుల ఇంటి వద్ద భోజనం చేసి చెరువు వద్దకు బయల్దేరాడు. ముగ్గురు ఒడిశా వాసులు బైక్‌పై కాళ్ల మండలం సీసలి గ్రామం నుంచి అతివేగంగా రావడంతో మోటార్ సైకిళ్లు ఢీకొన్నట్లు పోలీసులు నిర్ధారణ చేశారు. బాలాజీకి ముగ్గురు అక్కచెల్లెళ్లు, తల్లిదండ్రులు ఉన్నారు. ఆడ పిల్లలకు పెళ్లిళ్లు కాగా, బాలాజీకి ఇటీవలే వివాహ సంబంధం కుదిరినట్లు బంధువులు తెలిపారు. కుటుంబానికి ఆసరాగా ఉన్న బాలాజీ మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భీమవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తూర్పుతాళ్లు గ్రామస్తులు పెద్దెత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఒడిశా వాసుల మృతి వార్తను సదరు ఫ్యాక్టరీలోని వారి బంధువులకు తెలపడంతో వారు కూడా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ప్రమాద సంఘటనా ప్రాంతాన్ని నర్సాపురం డీఎస్పీ ప్రభాకర్‌బాబు, సీఐలు నాగరాజు, వెంకటేశ్వరరావు, ఎస్ఎఐలు రాజ్‌కుమార్, రవివర్మ శనివారం ఉదయం పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అటు వెళుతున్న వ్యక్తి చెప్పడంతో ప్రమాద విషయాలను తెలుసుకున్నామని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణం రెండు వాహనాలు ఢీకొనడంతో నలుగురు వ్యక్తులు మృతి చెందిన ప్రమాదానికి కారణం అతి వేగమేనని తెలుస్తోంది. తెల్లవారుజామున రెండు గంటల సమయంలో రోడ్డుపై వెళుతున్న వాహనాలు రెండూ అతివేగంగా ఢీకొనడమే ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు తెలుపుతున్నారు. అయితే గతంలో అదే మలుపులో చాలా ప్రమాదాలు జరిగాయి. ఇక్కడ ఎటువంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయక పోవడమే మరో నలుగురి మృతికి కారణమైందని పలువురు అంటున్నారు. -
పిడుగుపాటుకు నలుగురు మృతి
కూసుమంచి/తిరుమలాయపాలెం(పాలేరు): ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో పిడుగుపాటుకు నలుగురు మృత్యువాత పడ్డారు. మృతుల్లో భార్యాభర్తలు ఉన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నేలపట్ల గ్రామానికి చెందిన దంపతులు జాలె మల్లేశ్ (25), విజయలక్ష్మి(22) మంగళవారం మిర్చి తోటకు మందు కొట్టేందుకు వెళ్లారు. ఈ లోగా వర్షం రావడంతో చెట్టుకిందికి వెళ్లారు. వారితో వెళ్లిన కూలీలూ అదే చెట్టుకిందికి రావడంతో భార్యాభర్తలు మరో చెట్టు కిందికి వెళ్లారు. ఆ చెట్టుపై పిడుగు పడటంతో ఇద్దరూ చనిపోయారు. తిరుమలాయపాలెం మండలం ఎదుళ్లచెరువు పంచాయతీ పరిధిలోని రమణా తండాకు చెందిన బాదావత్ జగ్మాల్ (35) భూమి కౌలుకు తీసుకొని మిర్చి సాగు చేస్తున్నాడు. భార్య భద్రమ్మ కలుపుతీస్తుండగా, జగ్మాల్ పశువులకు మేత వేస్తూ వేపచెట్టు కిందికి వెళ్లాడు. ఈ చెట్టుపై పిడుగు పడడంతో మృతి చెందాడు. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం ఆంబోతుతండాకు చెందిన ఆంబోతు సుక్యా కుమారుడు అరవింద్(13) హైదరాబాద్‌లో ఆరో తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులు రావడంతో స్వగ్రామానికి వచ్చాడు. మంగళవారం సాయంత్రం తండాలోని తమ పొలం వద్దకు వెళ్తుండగా వర్షం కురిసింది. ఈ క్రమంలో పిడుగుపడి అరవింద్ అక్కడికక్కడే మృతి చెందాడు. -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి
టెక్కలి రూరల్: జాతీయ రహదారిపై టెక్కలిలోని అయోధ్యపురం కూడలి సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సును వెనుకనుంచి ప్రమాదవశాత్తు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మందస మండలం మద్దూరు గ్రామానికి చెందిన బిల్లంగి శేఖరరావు(60) అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై మందస నుంచి టెక్కలి వైపు వస్తుండగా అయోధ్యపురం కూడలి సమీపంలో ఆగివున్న ఆర్టీసీ బస్సును ప్రమాదవశాత్తు ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శేఖరరావును టెక్కలి ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందడంతో ఆయన కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుడితి సీహెచ్‌సీ సూపర్వైజర్ దుర్మరణం జలుమూరు: జలుమూరు వంశధార కాలువ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బుడితి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపర్వైజర్ పోలాకి గణపతిరావు(59) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.... టెక్కలి నుంచి బుడితి సీహెచ్‌సీకి డ్యూటీకి తన మోపెడ్‌పై గణపతిరావు వెళుతుండగా వెనుకనుంచి వస్తున్న వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన తలకు బలమైన గాయమైంది. తారు రోడ్డు అంచుకు తల గట్టిగా తగలడంతో అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో 108 వాహనం అక్కడకు చేరుకొని సిబ్బంది ప్రథమ చికిత్స అందించేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. తలకు హెల్మెంట్ ఉంటే మృతి చెందేవాడు కాదని పోలీసులు చెబుతున్నారు. కాగా గణపతిరావుకు భార్య శ్రీదేవి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెడ్‌కానిస్టేబుల్ కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కోటబొమ్మాళి తరలించారు. జంగాలపాడు వద్ద... మెళియాపుట్టి: గంగరాజపురం గ్రామానికి సరిహద్దు ఒడిశాలోని జంగాలపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన బుసికిడి గ్రామస్తుడు బి.రామరాజు(17) మృతి చెందాడు. బుసికిడిలో పండుగ ముగింపు సందర్భంగా సరిహద్దు గ్రామమైన పెద్దలక్ష్మీపురం(ఆంధ్రా)లో ఉంటున్న తన తాత సోనాపురం రోహిణి ఇంటికి భోజనం క్యారేజ్‌ను ద్విచక్రవాహనంపై తీసుకువస్తున్నాడు. ఎదురుగా వస్తున్న లగేజీ వ్యాను ఢీకొనడంతో తీవ్రగాయాలపాలై ప్రమాద సంఘటన వద్దే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రెండు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. -
మృత్యు పిడుగులు
► పిడుగు పాటుతో నలుగురు మృతి ► చిత్రదుర్గం జిల్లాలో ఘోరాలు సాక్షి, బళ్లారి : చిత్రదుర్గం జిల్లాలో మంగళవారం వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు గురై నలుగురు మరణించారు. చిత్రదుర్గం జిల్లా హిరియూరు తాలూకా వాణివిలాస సాగర(మారికణివె) పోటు జలాల్లో ఈత కొట్టేందుకు కురుబరహళ్లి గ్రామానికి చెందిన 9 మంది వెళ్లగా పిడుగు పడటంతో లెక్చరర్ మాలేశ్ నాయక్(30), ఉపాధ్యాయుడు ఛాయాపతి, డ్రైవర్ హరీష్‌లు మృతి చెందారు. దీంతో కురుబరహళ్లి గ్రామం విషాదంలో మునిగి పోయింది. ఈ ఘటనపై హిరియూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో ఘటనలో మొళకాల్మూరు తాలూకా బండ్రావి సమీపంలో గొర్రెలు మేపేందుకు వెళ్లిన జంబక్క(35) అనే మహిళ మంగళవారం సాయంత్రం పిడుగుపాటుకు గురై మరణించింది. ఈ ఘటనపై మొళకాల్మూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి
చివ్వెంల(సూర్యాపేట): గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందగా.. ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన మండల పరిధిలోని అక్కలదేవిగూడెం గ్రామశివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారిపై సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం పట్టణంలోని ప్రకాశ్‌నగర్‌కు చెందిన షేక్ తాజుద్దీన్(25) లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నెల రోజులుగా మండల పరిధిలోని కుడకుడ గ్రామంలోని అత్తగారి ఇంటి వద్ద భార్యపిల్లలతో కలిసి ఉంటున్నాడు. సోమవారం రాత్రి భార్యతో ఘర్షణ పడి ఇద్దకు కుమారులు హయన్, రియాజ్‌లను తీసుకుని బైక్‌పై ఖమ్మం వెళ్తుండగా మార్గమధ్యంలోని అక్కలదేవిగూడెం శివారులో సూర్యాపేట నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో తాజుద్దీన్ అక్కడిక్కడే మృతిచెందగా, కుమారులు ఇద్దరికి తీవ్రగాయలయ్యాయి. క్షతగాత్రులను 108లో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పెద్ద కుమారుడు హయన్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. ఈ మరకు మేరకు ఎస్ఐ బి.ప్రవీన్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి భువనగిరిఅర్బన్: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి కూనూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కేసారం గ్రామానికి చెందిన రాజబోయిన అనిల్(25) కూలిపని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అనిల్ సోమవారం రాత్రి రాయగిరి నుంచి కేసారం గ్రామానికి తన బైకుపై బయల్దేరాడు. కూనూరు గ్రామశివారులో రోడ్డుపై నిలిపిఉన్న ట్రాక్టర్‌ను వెనుకనుంచి ఢీ కిట్టాడు. దీంతో అనిల్ అక్కడిక్కడే మృతిచెందాడు. భువనగిరి రూరల్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనిల్ భార్య శిరిష ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు రూరల్ ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. వంగపల్లి వద్ద ఒకరు.. యాదగిరిగుట్ట(ఆలేర): వరంగల్– హైదరాబాద్ జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా.. మరొకరికి గాయాలైలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండఅర్బన్ జిల్లాకు చెందిన బొయపాటి దీక్షిత్‌రెడ్డి, బాసాని ప్రణయ్ వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో బోయపాటి దీక్షిత్‌రెడ్డి, బాసాని ప్రణయ్‌కి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గాంధీ ఆస్పతికి తరలిస్తుండగా దీక్షిత్‌రెడ్డి మార్గమధ్యంలో మృతిచెందాడు. బాహుపేట వద్ద.. యాదగిరిగుట్ట మండలం బాహుపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈస్ట్ మారెడ్‌పల్లికి చెందిన వల్లపు ఎల్లయ్య బైక్‌పై వరంగల్ వైపు వెళ్తున్నారు. బాహుపేట వద్దకు రాగానే ఎల్లయ్య వాహనాన్ని గుర్తు తెలియని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో పుల్లయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ రెండు ప్రమాదాలు జరిగిన ప్రదేశాలను యాదగిరిగుట్ట పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ–2 నాగిరెడ్డి తెలిపారు. -
చెట్టును ఢీకొన్న కారు
అన్నానగర్: చెట్టును కారు ఢీకొన్న ప్రమాదంలో తండ్రి,కుమార్తె సహా నలుగురు మృతిచెందారు. ఈ సంఘటన తెన్‌పసియారు సమీపంలో చోటుచేసుకుంది. రామనాథపురం జిల్లా సాయల్‌కుడి సమీపంలో ఉన్న ఎస్.దురైపాండి గ్రామానికి చెందిన మారిసెల్వం (52). ఇతను కుటుంబంతో కలిసి ఆంధ్రాలో ఉన్న తన ఇంటికి వెళ్లాలని కారులో బయలుదేరారు. వారితో పాటు బంధువులైన శాంతి, పుష్పలను కూడా తీసుకువెళ్లారు. చెన్నై– తిరుచ్చి హైవే రోడ్డులో వెళుతుండగా తెన్‌పసియారు బస్టాండ్ సమీపంలో అదుపుతప్పిన కా రు చెట్టును ఢీకొని, రోడ్డుపక్కన ఉన్న గుంతలో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మారిసెల్వం, దివ్య, శాంతి, పుష్ప సంఘటన స్థలంలోనే మృతి చెందారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఈ ప్రమాదంపై విచారణ చేస్తున్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి మృతి
అప్పన్నపేట (గరిడేపల్లి) : వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. గరిడేపల్లి, మిర్యాలగూడ, మఠంపల్లి, చింతపల్లి మండలాల పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు.. గరిడేపల్లి మండలం వెంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన దాసర్ల సైదులు, నిడమనూరుకు చెందిన గుంజ గోపాల్‌లు ద్విచక్ర వాహనంపై తమ బంధువుల ఇంటికి ఖమ్మం వెళుతున్నారు. ఈ క్రమంలో అప్పన్నపేట శివారులో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దాసర్ల సైదులు (28) అక్కడికక్కడే మృతి చెందగా గుంజ గోపాల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకు న్న పోలీసులు అక్కడకు చేరుకుని గోపాల్‌ను చికిత్స నిమిత్తం హు జూర్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా సంఘటన స్థలంలో దొరికిన సెల్‌ఫోన్, డబ్బులను 108 సిబ్బంది స్థానిక పోలీసులకు అప్పగించి తమ నిజాయితీ చాటుకున్నారు. దాసర్ల సైదులు తల్లి మణెమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు గరిడేపల్లి ఏఎస్ఐ ఎన్. జగన్మోహన్రెడ్డి తెలిపారు. క్రేన్ ఢీకొని మేకల కాపరి.. మిర్యాలగూడ రూరల్: మిర్యాలగూడ పట్టణం శివారు రాంనగర్ కాలనీకి చెందిన ఆవుల మహేష్(20)బదలాపురం మేకల యజమాని వద్ద మేకల కాపరీగా పని చేస్తున్నాడు. ఉదయం 9 గంటల సమయంలో రోజు మాదిరిగానే మహేష్ మేకలను తోలుకుని రోడ్డు వెంట అటవికి వెళుతున్నాడు. కాగా మిర్యాలగూడ పట్టణం నుంచి అవంతీపురం వైపు వెళుతున్న క్రేన్ మేకలను తోలుకొని రోడ్డు వెంట వెళుతున్న మహేష్‌ను ప్రమాద వశాత్తు ఢీకొట్టింది. ఈ ఘటనతో తీవ్రగాయాలైన మహేæష్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు అవివాహితుడు. మృతుడి తల్లిదండ్రులు పుల్లమ్మ, ముత్తయ్యలకు ఇద్దరు కొడుకులు కాగా మహేష్ చిన్నవాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరళించారు. ప్రమాదానికి కారణమైన క్రేన్ , డైవర్‌ను అదుపులోకి తీసుకొన్నట్లు రూరల్ ఎస్సై కుంట శ్రీకాంత్ తెలిపారు. కుమారుడి మృతదేహం వద్ద తల్లిదండ్రులు రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ప్రమాదవశాత్తు కిందపడి ఉత్తర్‌ప్రదేశ్ వాసి.. మఠంపల్లి: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ఖుషీ నగర్ జిల్లా సిద్ధియా బంగర్భట్ గ్రామానికి చెందిన మృతుడు కపిల్ సహాని సంవత్సర కాలంగా అదే పరిశ్రమలో కాంట్రాక్టర్ సిరాజుద్దీన్ వద్ద గ్యాస్ కట్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 5న మధ్యాహ్నం డ్యూటీ దిగి సరుకులు తెచ్చుకునేందుకు మఠంపల్లి వైపు వెళ్లాడు. తిరిగి అదేరోజు రాత్రి 10 గంటలకు ఎన్సీఎల్ మెయిన్ గేటు ముందు ఆటో దిగి నడుచుకుంటూ పరిశ్రమలోని బ్యారక్ సమీపంలో కాలుజారి కింద పడిపోయాడు. అయితే ఈ విషయమై రాత్రి తన రూం లోని మిత్రులతో తలనొప్పిగా ఉందని చెప్పి నిద్రపోయాడు. సోమవారం ఉదయం నిద్రపోయిన సహాని అలాగే మృతిచెంది ఉన్నాడు. పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని హుజూర్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై కాంట్రాక్టర్ సిరాజుద్దీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు. -
అమెరికాలో భారీ తుపాను
లాస్ ఏంజిలెస్: అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా సహా పలు ప్రాంతాల్లో తుపాను ధాటికి శుక్రవారం నలుగురు మృతిచెందారు. విద్యుదాఘాతంతో ఒకరు, కారు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందగా... కారు నీట మునగడంతో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. తుపాను కారణంగా 300 విమానాలను రద్దు చేశారు. పలు జాతీయ రహదారులను మూసివేశారు. విద్యుత్ వ్యవస్థ స్తంభించిపోయింది. పలు కార్లు నీటిలో కొట్టుకుపోయాయి. రోడ్లన్నీ బురదతో నిండిపోయాయి. కాలిఫోర్నియా సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో పాటు గంటకు 70 కి.మీ వేగంతో పెనుగాలులు వీచాయి. ప్రమాదంలో చిక్కుకున్న వారిని సహాయక బృందాలు రక్షించాయి. -
నలుగురి దుర్మరణం
వేర్వేరు ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు మరో ఆరుగురికి తీవ్ర గాయాలు బుక్కపట్నం : మండలంలో ఆదివారం రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. గశికవారిపల్లి సమీపంలో రాళ్లు కొట్టేందుకు వెళ్లిన ముదిగుబ్బకు చెందిన పెచ్చల రమణ (30) ప్రమాదవ శాత్తు రాయి మీద పడి మృతి చెందాడు. మరో ప్రమాదంలో బుక్కపట్నానికి చెందిన బోయ అంజి (38) బేల్దారి కొత్తచెరువు మండలం నారేపల్లిలో మొహర్రం ముగించుకుని బైక్‌లో బుక్కపట్నం వస్తుండగా కడపనాగేపల్లి, బుచ్చయ్యగారిపల్లి మధ్యలో ఆంజనేయస్వామి గుడి సమీపంలో అదుపు తప్పి తీవ్రంగా గాయపడ్డాడు. బంధువులు అతడిని ఆస్పత్రి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంకేపల్లి క్రాస్ సమీపంలో వేంపల్లె వాసి.. ముదిగుబ్బ : సంకేపల్లి క్రాస్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున వైఎస్సార్ జిల్లా వేంపల్లికి చెందిన కోనేటి ఆంజనేయులు (34) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బంధువుల వివరాల మేరకు.. కోనేటి ఆంజనేయులు సంకేపల్లి క్రాస్‌లో తన నర్సరీ వద్ద నుంచి తెల్లవారుజామున ద్విచక్ర వాహనంలో ముదిగుబ్బవైపు వెళ్తుండగా కదిరివైపు నుంచి వస్తున్న టాటా మ్యాజిక్ కారు ఢీకొనింది. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని చికిత్స కోసం బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందాడు. మృతుడికి భార్య భాగ్యలక్ష్మి, ముగ్గురు కుమారులు ఉన్నారు. భార్య ప్రస్తుతం గర్భిణి. ఎస్ఐ జయానాయక్ కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కదిరి ప్రభుత్వాస్పత్రికి పంపారు. గుత్తిలో వృద్ధురాలు.. గుత్తి: స్థానిక చెరువు బ్రిడ్జి కట్టపై ఆటో అదుపు తప్పిన ప్రమాదంలో విడపనకల్లు మండలం గడేకల్కు చెందిన సుంకమ్మ(68) అక్కడికక్కడే మరణించింది. అదే గ్రామానికి చెందిన లింగమ్మ, గుత్తి చెర్లోపల్లి కాలనీకి చెందిన ఎరికల రోగన్న, బాచుపల్లికి చెందిన గిడ్డమ్మ తీవ్రంగా గాయపడ్డారు. గొల్లలదొడ్డికి చెందిన ఆటో గుత్తి నుంచి గుంతకల్లుకు ప్రయాణికులతో బయలుదేరింది. మార్గమధ్యంలో గుత్తి చెరువు కట్టకు ఎదురుగానున్న బ్రిడ్జి కట్టపై ప్రయాణిస్తుండగా ఆటో ముందు టైరు పంక్చర్ అయింది. దీంతో అదుపు తప్పి బ్రిడ్జి పక్కన ఉన్న వరి మడుల్లో బోల్తా పడటంతో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను గుత్తి ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని సీఐ మ««దlుసూదన్ గౌడ్, ఎస్ఐలు చాంద్‌బాషా, రామాంజనేయులు, హెడ్ కానిస్టేబుల్ చలమయ్య తమ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బ్రాహ్మణపల్లి సమీపంలో మరో ముగ్గురికి గాయాలు సోమందేపల్లి : మండలంలోని బ్రాహ్మణపల్లి సమీపంలో ఆదివారం రెండు బైక్‌లు పరస్పరం ఢీకొని ముగ్గురు గాయపడ్డారని ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. సోమందేపల్లి వైపు నుంచి కేతగానిచెరువుకు బైక్‌లో బయలుదేరిన వెంకటేశులు, నారాయణప్పను మోతుకుపల్లి నుంచి ఈదుళబళ్లాపురానికి బయలుదేరి ఎదురొచ్చిన నల్లప్ప అనే మరో స్కూటరిస్టు ఢీకొనడంతో ముగ్గురూ గాయపడ్డారన్నారు. వారిని హిందూపురం ఆస్పత్రికి తరలంచారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్, ట్రాక్టర్ ఢీ: నలుగురి మృతి
-
బైక్, ట్రాక్టర్ ఢీ: నలుగురి మృతి
కరీంనగర్: జిల్లాలోని సైదాపూర్ మండలం దుద్దునపల్లిలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న బైక్ ను ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీ కొట్టి, అదుపుతప్పి పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. ఈ సంఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, బైక్ పై వెళ్తున్న ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు అందిస్తున్నారు. దాదాపు 20మీటర్ల లోతు గల బావిలో ట్రాక్టర్ పడటంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతులు చిగురుమామిడి మండలం బొమ్మనపల్లికి చెందిన కత్తుల శివ, పిల్లి సంతోష్, బొల్లి రాజు, కొంకట శ్రీకాంత్ లుగా గుర్తించారు. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పౌర్ణమి రోజున చీకట్లు
మహాలయ పౌర్ణమి రోజున నాలుగు కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి. అందరూ సంతోషంగా పండుగ జరుపుకుంటున్న వేళ రోడ్డు ప్రమాద రూపంలో నలుగురిని మృత్యువు కబళించింది. బంధువుల ఇంటికి వెళ్లి వస్తూ ఓ యువకుడు.. రోడ్డు మలుపులో అదుపుతప్పి ఓ వ్యక్తి.. ట్రాక్టర్ బోల్తా పడి మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది. టిప్పర్ ఢీకొని ఇద్దరు యువకులు.. చెన్నేకొత్తపల్లి మండలం యర్రంపల్లి వద్ద శుక్రవారం సాయంత్రం టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. పోలీసులు,బంధవులు తెలిపిన మేరకు... ఆత్మకూరు మండలం తోపుదుర్తికి చెందిన యువకులు రామ్మూర్తి (28), వెంకటేష్ (26) ద్విచక్రవాహనంలో చెన్నేకొత్తపల్లి మండలం చిన్నపల్లి గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ పని ముగించుకొని స్వగ్రామానికి బయలు దేరారు. యర్రంపల్లి జంక్షన్ వద్దకు రాగానే వారి ద్విచక్రవాహనాన్ని ఎస్ఆర్సీ కంపెనీకి చెందిన టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందగా.. రామ్మూర్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్ఐ మహమ్మద్ రఫీ సంఘటనా స్థలానికి చేరుకుని రామ్మూర్తిని హుటాహుటిన పోలీస్ వాహనంలో ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో రాత్రి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కర్ణాటక వాసి .. మడకశిర మండలం గోవిందాపురం రోడ్డు మలుపు వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటక వాసి ఒకరు మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం పావగడ తాలూకా గంగవరానికి చెందిన క్రిష్టప్ప (45), రొళ్ల మండలం గుడ్డుగుర్కికి చెందిన రామాంజినేయులు ద్విచక్రవాహనంలో మడకశిరకు వస్తుండగా గోవిందాపురం రోడ్డు మలుపులో కిందపడిపోయారు. తీవ్రంగా గాయపడిన వీరిని స్థానికులు 108 ద్వారా మడకశిర ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే క్రిష్టప్ప మృతి చెందాడు. రామాంజినేయులు చికిత్స పొందుతున్నాడు. వీరు అదుపు తప్పి కిందపడ్డారా.. లేక ఏదైనా వాహనం ఢీకొందా అనేది తెలియడం లేదు. పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ట్రాక్టర్‌బోల్తా పడి ఒకరు.. వజ్రకరూరు మండలం గూళ్యపాళ్యం సమీపంలో శుక్రవారం సాయంత్రం పొలంలో అడ్డు వేసేందుకు ట్రాక్టర్లో రాళ్లు తీసుకు వస్తుండగా అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన షెక్షావలి(40)పై రాళ్లు పడ్డాయి. తీవ్రంగా గాయపడిన అతడిని చుట్టుపక్కల వారు గమనించి గుంతకల్లు ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే అతను మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వజ్రకరూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య నూర్జహాన్‌తోపాటు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మ ండల కోఆప్షన్ సభ్యుడు పీర్‌బాషా, సీపీఎం మండల కన్వీనర్ విరూపాక్షి తదితరులు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి
జిల్లాలో గురువారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. కనగానపల్లి మండల పరిధిలోని భానుకోట సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడి జార్ఖండ్ కూలీ మృతి చెందగా, కుమ్మరవాండ్లపల్లి సమీపంలో జరిగిన ప్రమాదంలో హరి అనే యువకుడు మృతి చెందాడు. అలాగే ఓడీ చెరువు మండలంలోని నాయనకోట వద్ద జరిగిన ప్రమాదంలో ఓబుళరెడ్డిపల్లికి చెందిన భారతి అనే వివాహిత మృత్యువాత పడింది. కర్ణాటక రాష్ట్రం తుమకూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అమరాపురం మండల పరిధిలోని గౌడనకుంటకు చెందిన గొల్ల కుమార్ మృతి చెందాడు. ఉపాధికి వెళుతూ.. ఓడీ చెరువు: ఓడీ చెరువు మండలంలోని నాయనకోట వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓబుళరెడ్డిపల్లికి చెందిన భారతి (25) గురువారం మృతి చెందింది. ఎస్ఐ తెలిపిన వివరాల మేరకు.. ఓబుళరెడ్డిపల్లికి చెందిన సురేష్, భార్య భారతితో కలసి ద్విచక్రవాహనంలో స్వగ్రామం నుంచి జీవనోపాధి కోసం బెంగళూరుకు బయలుదేరారు. మార్గమధ్యంలో కొండకమర్ల సమీపంలోని నవాబుకోట మలువు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న బొలేరో వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో భారతి అక్కడిక్కడే మృతి చెందింది. భర్త సురేష్ తలకు హెల్మెట్ ఉండటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఎస్ఐ సత్యనారాయణ, ఏఎస్ఐ ఇస్మాయిల్ కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కదిరికి తరలించారు. నిమజ్జనానికి వెళుతూ.. అమరాపురం: మండల పరిధిలోని గౌడనకుంట గ్రామానికి చెందిన గొల్ల కుమార్(30) కర్ణాటక రాష్ట్రం తుమకూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. మృతుడు కుమార్, నాగరాజు బెంగళూరు నుండి బైక్‌లో గురువారం ఉదయం తమ స్వగ్రామానికి బయలు దేరి వచ్చారు. తుమకూరు వద్ద రోడ్డు డివైడర్‌కు ఢీ కొనడంతో కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. నాగరాజుకు తీవ్రగాయలయ్యాయి. అతన్ని తుమకూరులోని ఆసుపత్రిలో చికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గణపతి నిమజ్జన కార్యక్రమం శుక్రవారం నిర్వహిస్తుండడంతో అందులో పాల్గొనాలని వస్తూ్త ఇలా మృతి చెందడంతో గౌడనకుంటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ట్రాక్టర్ కింద పడి జార్ఖండ్ కూలీ.. కనగానపల్లి : మండల పరిధిలోని భానుకోట సమీపంలో గురువారం ట్రాక్టర్ కింద పడి జార్ఖండ్‌కు చెందిన కూలీ సుధీర్ కుమార్(18) మృతి చెందాడు. వివరాలిలా ఉన్నా యి. వేపకుంట, మద్దులచెరువు గ్రామాల సమీపంలో గాలిమరలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో పనిచేసేందుకు జార్ఖండ్ నుంచి కూలీలు వచ్చారు. వీరిలో సుధీర్‌ను ఓ ట్రాక్టర్లో భానుకోటకు వెళ్లారు. అయితే మార్గమధ్యలో అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో డ్రైవర్ పక్కన కుర్చున్న సుధీర్ ఇంజన్లో ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తి దుర్మరణం.. కదిరి అర్బన్ : రూరల్ మండల పరిధిలోని కుమ్మరవాండ్లపల్లి సమీపంలో లఘువమ్మ కొండ వద్ద కదిరి–రాయచోటి రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్పీకుంట మండలం కొండలోల్లపల్లికి చెందిన హరి(35) దుర్మరణం చెందగా పవన్‌కల్యాన్ అనే మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. మృతుడికి భార్య,కుమారుడు ఉన్నారు. పవన్కళ్యాన్ను స్థానికులు కదిరి ప్రభుత్వాసుపత్రికి, అక్కడి నుంచి తిరుపతికి తరలించారు. -
ఉత్సవాల్లో విద్యుత్ షాక్ : నలుగురి మృతి
చెన్నై: తమిళనాడు మేరీమాత ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. తిరునల్వేలి జిల్లాలో విద్యుదాఘాతానికి గురై నలుగురు వ్యక్తులు మృతిచెందారు. దిశయన్‌విలై సమీపంలోని ఉబరి గ్రామంలో ప్రతి ఏడాది మేరీమాత ఆలయ ఉత్సవాలు వైభవంగా జరుపుతుంటారు. ఇందులో భాగంగా ఉత్సవాల్లో చివరి రోజైన గురువారం సప్రం ఊరేగింపు జరిగింది. మేరీమాత విగ్రహాన్ని సప్రంలో అధిష్టించి ఊరేగింపుగా వెళ్లుతున్న క్రమంలో సప్రంకు విద్యుత్ తీగలు తగలడంతో షార్ట్ సర్క్యూట్ అయ్యింది. ఈ ప్రమాదంలో ఉబరి గ్రామానికి చెందిన రాజ(38), లిమాసన్(22), రాజ్(19), క్లైవ్ (23) అక్కడికక్కడే మృతిచెందగా మరో 30 మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉత్సవాల్లో నలుగురు మరణించడంతో స్థానికంగా విషాదం నెలకొంది. -
విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి
అనకాపల్లి(విశాఖపట్టణం): విశాఖ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డ ప్రమాదం సంభవించింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొత్తూరు నర్సింగరావుపేట హైవే జంక్షన్ వద్ద శుక్రవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. -
కారు బోల్తా...నలుగురి దుర్మరణం
అద్దంకి : వేగంగా వెళున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టిన ఘటనలో నలుగురు మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన ప్రకాశం జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి సమీపంలో అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. నెల్లూరు జిల్లా బిట్రగుంట మండలం జేపీ గూడూరుకు చెందిన గునుపాటి వెంకటేశ్వరరెడ్డి(50) కుటుంబ సభ్యులతో కలిసి గుంటూరు జిల్లాకు వచ్చి తిరిగి వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది. కారు వేగంగా వెళ్తున్న సమయంలో.. ముందు టైరు పేలడంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో వెంకటేశ్వరరెడ్డితో సహా కారులో ఉన్న బుజ్జమ్మ(55), రమణమ్మ(54), జ్యోతి(21) అక్కడికక్కడే మృతిచెందగా.. శ్రీనివాస్‌రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లింట చావు భాజా
♦ పెళ్లి బృందం ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ నలుగురు మృతి ♦ పెళ్లి కుమార్తె తమ్ముడు ఒకరు, చిన్న, పెద్ద నాన్న పిల్లలు ఇద్దరు మృతి ♦ వెంగళారుుపల్లిలో విషాదం జీవితంపై ఎన్నో ఊహలతో వివాహ బంధంతో ఒక్కటయ్యూరు. ఆ వెంకటేశుని ఆశీర్వాదం అండగా ఉంటుందనుకున్నారు... వేద మంత్రాలు ఇంకా చెవుల్లోనే గింగురుమంటున్నారుు. అరుంధతీ నక్షత్రం కళ్లలోనే కదలాడుతోంది. వచ్చిన బంధువుల సందడి... పిల్లల ఆటలు...అమ్మలక్కల మాటలు..పెద్దల ఆశీర్వాదాలు ఆనందంఅంబరమైంది.విధికి కన్నుకుట్టిందేమో పెళ్లిపందిరి మృత్యుకుహరమైంది. మంగళ వారుుద్యాలు ... చావు బాజాలుగా మారిపోయూరుు. అన్నీ ఆవిరైపోయూరుు. ఆక్రందనలు మిన్నంటారుు. మృత్యువులోనూ వీడని అన్నదమ్ముల అనుబంధం... మృతి చెందిన నలుగురిలో ముగ్గురు అన్నదమ్ములు. పెళ్లి కుమార్తె సొంత తమ్ముడు ఒకరుకాగా పెదనాన్న, చిన్నాన్న కుమారులు ఇద్దరున్నారు. ఒక్క సారిగా ఒకే కుటుంబంలో ముగ్గురిని కోల్పోవడంతో కుటుం బ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు. పెళ్లి పనులన్నీ చేసి వెళ్లిపోయూవా పెళ్లి పనులన్నీ ఒక్కడివే చేసి నన్ను ఇంటికి సాగనంపి నీవు పరలోకానికి చేరావా తమ్ముడూ అంటూ పెళ్లి కుమార్తె మౌనిక చేసే రోదనలు అక్కడున్నవారిని కంట తడిపెట్టిస్తున్నాయి. నా తమ్ముడు నాకు కావాలంటూ కాళ్లపారాణి ఆరని ఆ ఇల్లాలు కన్నీటి పర్యంతమవుతోంది. వద్దన్నా వినలేదయ్యా.. నేను వద్దన్నా వినకుండా అక్కపెళ్లి చూడాలని వచ్చి అందని లోకాలకు వెళ్లావా అయ్యా అంటూ తండ్రి పోలయ్య కుమిలిపోయూడు. నరేష్ మృతి చెందగా, మహేష్ పరిస్థితి విషమంగా ఉంది. నా కొడుకులు ఎక్కడయ్యా.. నా బిడ్డలు ఎక్కడంటూ నరేష్ తల్లిదండ్రులు రోదిస్తూ సృ్పహ కోల్పోయారు. రమ్మన్నా.. రాలేదయ్యా.. సంప్రదాయం ప్రకారం బావ కాళ్లు కడిగేందుకు చిన్న బావమరిది ఉండాలి. కారులో నువ్వురారా అని ఇంట్లో వారందరూ పిలిచినా రాకుండా పైకి పోయాడయ్యా అంటూ ప్రవీణ్ కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు. కనిగిరి: అప్పటిదాకా ఆనందంగా గడిపిన పెళ్లింట్లో ఒక్కసారిగా విషాదం నెలకుంది. ఎంతో ఆనందంగా పెళ్లి ముగించుకొని మరో 20 నిమిషాల్లో ఇంటికి చేరుతామనుకున్న సమయంలో ఆ కుటుంబాలపై విధి విషం చిమ్మింది. సోమవారం ఉదయం 6.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా 15 మంది క్షతగాత్రులుగా మారారు. వివరాల్లోకి వెళితే...పీసీపల్లి మండలం వెంగళాపురం గ్రామానికి చెందిన మోనిక, తిరుపతయ్య వివాహం కనిగిరి పట్టణంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం తెల్లవారు జామున ఐదు గంటలకు పెళ్లి జరిగింది. అనంతరం నవదంపతులు, పెళ్లి బంధువులు ఇంటికి బయలు దేరారు. పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడు మరో నలుగురు ముందుగా కారులో వెళ్లిపోగా వెనుక ట్రాక్టర్లో మొత్తం 25 మంది బయలు దేరారు. ఏబీఆర్ కళాశాల (చిన ఇర్లపాడు క్రాస్‌రోడ్డు) సమీపంలో పెళ్లి బృందం ట్రాక్టర్‌ను కందుకూరు రోడ్డు నుంచి వేగంగా వస్తున్న గ్రానైట్ లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన డి.నర్శింహులు(31), వెంగళాపురానికి చెందిన ఆరో తరగతి విద్యార్థి(11) అక్కడికక్కడే మృతి చెందగా, పెళ్లి కుమార్తె తమ్ముడు ప్రవీణ్(14) (9వ తరగతి), డి.రాఘమ్మ(55)లను మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. బి.పద్మ, పి, పద్మ, డి.అనుషా, డి. పోలయ్య, కె.గురవయ్య, కె.మాలకొండయ్య, వేణు, కాటం రాజు, డి.రాజ్యం, నారాయణ, కొండయ్య, గంగయ్య, శ్రీను, బి.రత్తయ్య, మహేష్‌లకు గాయాలయ్యాయి. వీరిలో మహేష్, రాజ్యం, మాలకొండయ్య, రత్తయ్య, నారాయణలు ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలుడు మహేష్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన డీఎస్పీ, ఆర్డీఓ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటనను తెలుసుకుని ఆర్డీఓ మల్లికార్జునరావు, డీఎస్పీ వి.శ్రీనివాసులు సంఘటనా స్థలానికి వచ్చారు. ఘటన జరిగిన తీరును తెలుసుకుని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ మల్లికార్జున రావు విలేకర్లకు తెలిపారు. బుర్రా సంతాపం రోడ్డు ప్రమాద ఘటన తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ మృతుని బంధువులతో ఫోన్లో మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 93 కులాల ఐక్యవేదిక రాష్ట్ర, జిల్లా నాయకులు పెన్నా నాగయ్య, నాలీ వెంకటేశ్వర్లు, గంగరాజు యాదవ్, దద్దాల నారాయణ, చెరుకూరి కాశయ్యలు మృత దేహాల వద్ద నివాళులు అర్పించారు. మృతులకు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియ, క్షతగాత్రులకు రూ.1.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని వైఎస్ఆర్ సీపీ జిల్లా, మండల నాయకులు ఎస్.రంగనాయకుల రెడ్డి, తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, ఎస్ మోహన్‌రెడ్డి, సంగు సుబ్బారెడ్డిలు డిమాండ్ చేశారు. నివాళులర్పించిన టీడీపీ నాయకులు ఎమ్మెల్యే కదిరి సోదరుడు కదిరి రమణయ్య, ఎంపీపీ నంబుల వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ బేరిపుల్లారెడ్డి, కౌన్సిలర్ చింతం శ్రీనివాసుల యాదవ్, దొడ్డా వెంకట సుబ్బారెడ్డిలు సందర్శించి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృత దేహాలకు పోస్టు మార్టం వెంగళాపురానికి చెందిన నరేష్, ప్రవీణ్, రాఘమ్మ, గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన నర్శింహులు మృతదేహాలకు పోస్టమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించినట్లు ఇన్చార్జి సీఐ లక్ష్మణ్ తెలిపారు. క్లీనర్ నడపడం వల్లే కందుకూరు నుంచి కనిగిరికి వస్తున్న గ్రానైట్ లారీని డ్రైవర్‌కు బదులు క్లీనర్ నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ట్రాక్టర్ పూర్తిగా రోడ్డు కిందకు దిగినా గ్రానైట్ లారీ డ్రైవర్ పక్కకు తప్పించకుండా బలంగా ఢీ కొట్టడంతో ట్రాక్టర్ ముందు కూర్చున్న నర్శింహులు అక్కడికక్కడే మృతి చెందగా, ట్రాక్టర్ వెనుక కూర్చున్న నరేష్ కిందపడి మృతి చెందాడు. ఈ క్రమంలో అదే రూట్లో ట్రాక్టర్ వెనుక వస్తున్న మరో డీసీఎం ఆటోను కూడా గ్రానైట్ లారీ ఢీకొంది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగ లేదు. -
ఘోర రోడ్డుప్రమాదం: నలుగురి మృతి
నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. కారు,లారీ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందింది. పెళ్లూరు మండలం పెసలగుర్రపుతోట వద్ద ఆదివారం రాత్రి ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన కారు నెంబర్ టీఎస్ 04 ఈడీ 7789 (TS 04 ED 7789) అని పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఢిల్లీ హైవేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
-
రోడ్డు ప్రమాదంలోనలుగురి మృతి
-
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం: నలుగురి దుర్మరణం
చిల్లకూరు: నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం కడివేడు సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కోట మండలం చందోడు గ్రామానికి చెందిన ఎనిమిది మంది చేపల కొనుగోలుకు ఆటోలో నెల్లూరుకు వెళుతున్నారు. కడివేడు సమీపంలో వీరు ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తోపాటు చల్లా రమణమ్మ (40), పల్లి పాపమ్మ (34), వలిపి రాజమ్మ (45) మృతి చెందారు. తమ్మిశెట్టి రమణమ్మ, పూసా చెల్లెమ్మ, చల్లా సుజాత, సన్నాసయ్య, బెల్లంకొండ రమణయ్యలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని నెల్లూరుకు తరలించారు. వీరిలో రమణమ్మ, చెల్లెమ్మల పరిస్థితి విషమంగా ఉంది. -
ఆర్టీసీ బస్సు లారీ ఢీ.. ఐదుగురి మృతి
పిడుగురాళ్ల: గుంటూరు జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా.. మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. పిడుగురాళ్ల మండలం జాన్పాడ్ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. కారంపూడి నుంచి పిడుగురాళ్ల వెళ్తున్న ఆర్టీసీ బస్సు, పిడుగురాళ్ల వైపు పెళ్లి బృందంతో వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో ఉన్న ఐదుగురు ప్రయాణికులు మృతిచెందగా.. మరో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను 108 సాయంతో ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఓ పదేళ్ల చిన్నారితో పాటు, నలుగురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుల్లో కొంతమందిని పిడుగురాళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించే పనిలో అధికారులు ఉన్నారు. -
సిలిండర్ పేలి ముగ్గురి మృతి
-
దేవుడా.. ఎంత ఘోరమయ్యా..
* శ్రీవారి దర్శనానికి వస్తుండగా ఢీకొన్న డీజిల్ ట్యాంకర్ * ఏపీలో ఒకే కుటుంబంలో నలుగురి మృతి బంగారుపాళెం: తిరుమల వేంకటేశ్వరుడి దర్శనానికి వెళుతున్న ఓ కుటుంబంలో నలుగురిని శుక్రవారం ఏపీలోని చిత్తూరు జిల్లా బంగారుపాళెం మండలంలో డీజిల్ ట్యాంకర్ రూపంలో మృత్యువు కబళించింది. కర్ణాటక రాష్ట్రం తుముకూరు జిల్లా, పావగడ తాలూకా, మారణహళ్లికి చెందిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఆరుగురు శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కారులో తిరుమలకు బయలుదేరారు. మార్గం మధ్యలో బంగారుపాళెం మండలం శేషాపురం గ్రామం వద్ద వీరి కారును, యాదమరి మండలం నుంచి బి.కొత్తకోటకు వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న శ్రీనివాస్(37), అతని భార్య శ్వేత(30), తాత హనుమంతరెడ్డి(75) అక్కడికక్కడే మరణించగా తల్లి సువర్ణమ్మ(54) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. తండ్రి వెంకట్రామరెడ్డి(61) తీవ్ర గాయాలతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీనివాసరెడ్డి కుమార్తె శ్రీవాత్స(7) స్వల్ప గాయంతో బయటపడింది. డీజిల్ ట్యాంకర్ డ్రైవర్ పరారయ్యాడు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
పుష్కర విషాదం
రెండు ప్రమాదాల్లో నలుగురు మృతి 16మందికి తీవ్రగాయాలు మృతులు, క్షతగాత్రులు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందినవారు గోదావరి పుష్కర యాత్రల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. యాత్రికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించడం, రాత్రి వేళ ప్రయాణం దుర్ఘటనలకు దారితీస్తున్నాయి. సబ్బవరం మండలంలో రెండు వ్యాన్లు ఢీకొనడంతో ముగ్గురు మరణించగా ఎనిమిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఎస్.రాయవరం మండలంలో కోనవానిపాలెం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఆగివున్న లారీని.. పుష్కరాల నుంచి వస్తున్న ప్రైవేట్ బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, ఎనిమిదికి తీవ్ర గాయాలయ్యాయి. గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించాలన్న తపన.. ఈసారి తప్పితే మళ్లీ పన్నెండేళ్లకు గానీ అవకాశం రాదన్న ఆత్రుతలతో భక్తులు వరదలా పోటెత్తుతున్నారు.. ఏ వాహనం దొరికితే అందులో ప్రయాణిస్తున్నారు. ఈ తొందరపాటు, నిర్లక్ష్యం ప్రాణాంతకంగా మారాయి. ప్రైవేటు వాహనాల్లో రాత్రి ప్రయాణాలు ఉసురు తీస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున జిల్లాలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు పుష్కర యాత్రికులు మృతి చెందగా పదహారుమంది తీవ్రగాయాల పాలయ్యారు. వీరంతా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందినవారు. సబ్బవరం : పుష్కర పుణ్యస్నానం ఆచరించి, తరించాలన్న వారి ఆశ నెరవేరలేదు. వారు ప్రయాణిస్తున్న వాహనమే మృత్యుశకటమై కబళించింది. మూడు కుటుంబాల్లో విషాదం నింపింది. రాజమండ్రి వెళ్లేందుకు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నుంచి మంగళవారం అర్ధరాత్రి టాటా మేజిక్ వ్యానులో 11మంది బయలుదేరారు. బుధవారం తెల్లవారుజామున ఈ వాహనాన్ని రాజమండ్రి పుష్కరాల నుంచి వస్తున్న మరో వ్యాన్ సబ్బవరం మండలం అసకపల్లి పంచాయతీ సున్నపుబట్టీల సమీపాన జాతీయ రహదారిపై ఢీకొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నరసన్నపేట మండలం రాళ్లపాడు గ్రామానికి చెందిన బోర ఎర్రప్పడు (60), గార మండలం రెడ్డిపేట గ్రామస్తురాలు కర్రి సుభద్రమ్మ(40) అక్కడికక్కడే మరణించారు. జలుమూరు మండలం టెక్కలిపాడు గామానికి చెందిన పిట్టా అప్పలరాజు (25) తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. జలుమూరు మండలం టెక్కలిపాడు గ్రామానికి చెందిన బోర సరస్వతి (44), కళ్యాణి మల్లేసు (60), కళ్యాణి అమ్మన్నమ్మ (40), కళ్యాణి లక్ష్మి (30), కర్ర సన్యాసిరావు (45), సిమ్మ పారయ్య(60), సిమ్మ రాములమ్మ (56), బొజ్జ లక్ష్మి (30) తీవ్రగాయాలపాలయ్యారు. వీరిని విశాఖ కేజీహెచ్‌కి, మరో రెండు ప్రయివేటు ఆస్పత్రులకు అంబులెన్సుల్లో తరలించారు. ఎస్ఐ వి.చక్రధర్‌రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పుష్కర యాత్ర ముగించుకొని వస్తూ ఢీకొన్న వాహనంలో నరసన్నపేట మండలం ఈదల వలస గ్రామానికి యాత్రికులున్నారు. సంఘటన స్ధలంలో క్షతగాత్రుల రోదనలు మిన్నంటాయి. -
విద్యుదాఘాతానికి నలుగురి మృతి
కాకినాడ క్రైం : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో శనివారం సంభవించిన విద్యుదాఘాతాల్లో నలుగురు మృత్యు వాత పడ్డారు. కాకినాడ రూరల్ మండలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగలడంతో షాక్‌కు గురై ఓ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గొల్లపేటకు చెందిన మొగలినీడి నవీన్ కుమార్ (14) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. సెలవులు కావడంతో పేపర్ బాయ్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం ఆర్ఆర్ నగర్‌లోని కాపు కల్యాణ మంటపం సమీపంలో పేపర్ వేసేందుకు వెళ్తుండగా విద్యుత్ తీగ తెగి పడింది. విద్యుదాఘాతానికి గురైన నవీన్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న సర్పవరం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ నాయకుడు పిల్లి సత్యనారాయణ మూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. నవీన్‌కుమార్ కుటుంబసభ్యులు సంఘటనా స్థలంలో రోదించిన తీరు కలచివేసింది. బాలుడి మృతదేహాన్ని కాకినాడ ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. కేసును సర్పవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గొల్లప్రోలులో.. గొల్లప్రోలు : కేబుల్ వైరు నుంచి విద్యుత్ ప్రసరించడంతో షాక్‌కు గురై గొల్లప్రోలు ఈబీసీ కాలనీకి చెందిన ఇంధన శ్రీనివాస్ (27) శనివారం మృతి చెందాడు. శుక్ర వారం రాత్రి కురిసిన భారీ వర్షం, పిడుగు పాటు వల్ల టీవీ దెబ్బ తింటుందనే ఉద్దేశ్యం తో టీవీకి ఉన్న కేబుల్ వైరు తొలగించాడు. శనివారం ఉదయం టీవీకి కేబుల్ వైర్ అమర్చుతుండగా షాక్‌కు గురై మృతి చెందాడు. మృతుడికి భార్య దేవి, ఏడాదిన్నర వయస్సుగల కుమార్తె నవ్యభారతి ఉన్నారు. శ్రీనివాస్ మృతితో ఈబీసీ కాలనీలో విషాదం అలుముకుంది. మృతుడు పచ్చళ్ల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. యానాంలో వైర్ మెన్ మృతి యానాం టౌన్ : ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌కు గురై ఒక వైర్‌మెన్ మృతి చెందిన సంఘటన శనివారం యానాం లో చోటుచేసుకుంది. స్థానిక విద్యుత్ శాఖలో వైర్‌మెన్‌గా పనిచేస్తున్న స్థానిక ఫరంపేట గ్రామానికి చెందిన కర్రి భైరవమూర్తి (43) ఉదయం యానాం శివారు దొమ్మేటిపేటలో ఒక ఇంటికి సంబంధించి సర్వీస్ వైర్ కలుపుతుండగా ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెంది నట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఎస్సై బడుగు కనకారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షాక్‌కు గురై ఎలక్ట్రీషియన్ మృతి గోకవరం : మండలంలోని గుమ్మళ్లదొడ్డి గ్రామంలో విద్యుతాఘాతానికి గురై ఓ ఎలక్ట్రీషియన్ మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సూరిశెట్టి రామారావు (70) శనివారం ఉదయం తన ఇంట్లో స్విచ్ బోర్డును రిపేరు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన పంచాయతీ ఎలక్ట్రీషియన్‌గా సేవలందిస్తున్నాడు. విషయం తెలుసుకున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు శనివారం గ్రామంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. దీనిపై తమకు ఎటువంటి సమాచారం అందలేదని గోకవరం పోలీసులు తెలిపారు. -
రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి
వలిగొండ వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. జిల్లాలోని మునగాల, వలిగొండ విశాఖ పట్టణం జిల్లా పరిధిలో చోటు చేసుకున్న ఘటనల వివరాలు.. ప్రకాశం జిల్లా దర్శీ ప్రాంతానికి చెందిన బండారి వెంకటేశ్వర్లు(50) వలిగొండ ప్రాంతంలో ధాన్యపుబస్తాలను అద్దెకిస్తూ జీవనం సాగిస్తున్నాడు. బస్తాల సేకరణలో భాగంగా శనివారం తనమోపెడ్పై నాగారం నుంచి కమ్మగూడెం వైపు వెళ్తుండగా కల్వర్టు సమీపంలో ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతిచెందారు. పోష్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఏఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు. లారీని వెనుక నుంచి ఢీకొని.. మాధవరం(మునగాల): కృష్ణా జిల్లా ఇబ్రహీం పట్నం నుంచి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి ఐదుగురు ప్రయాణికులతో వెళుతున్న ఇన్నోవా కారు మార్గమధ్యలో మాధవరం శివారులో ముందుగా వెళుతున్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణా జిల్లా ఇబ్రహీం పట్నానికి చెందిన దేశిని శ్రీకాంత్(33)తో పాటు కృష్ణాజిల్లా జి.కొండూరు గ్రామానికి చెందిన తండ్రి, కుమారుడు ఉయ్యూరి ముఖేష్‌గౌడ్, ఉయ్యూరి సూరిబాబు, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన కారుడ్రైవర్ మాదావత్ నవీన్‌లకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని జాతీయ రహదారి వాహనం 1033లో చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ దేశిని శ్రీకాంత్ మృతిచెం దాడు. కాగా మిగిలిన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం ఇద్దరిని హైదరాబాద్‌లోని నిమ్స్, మరొకరిని ఎల్బీనగర్లో గల కామినేని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు స్టేషన్ ఇన్చార్జి జి.చినమల్సూర్ తెలిపారు. దేశిని శ్రీకాంత్ మృతదేహానికి సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో శవపరీక్ష నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. రెండు బస్సులు ఢీ పలువురికి స్వల్పగాయాలు మండలంలోని మాధవరం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. పోలీసులు ట్రాఫిక్‌ను పునఃరుద్ధరిస్తున్న సమయంలో రెండు బస్సులు ఢీకొన్న సంఘటనలో పలువురికి స్వల్ప గాయాలైనట్లు స్టేషన్ ఇన్చార్జి జి.చినమల్సూర్ తెలిపారు. విజయవాడ ఆటోనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఓ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు బస్సులలో ఉన్న పలువురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరిని మునగాల పోలీసులు 108వాహనంలో చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. బైక్‌పై నుంచి పడి మహిళ.. మునగపాక (విశాఖ జిల్లా) : రాంబిల్లి మండలం వాడపాలెం గ్రామానికి చెందిన కుడా లక్ష్మి(29) తన భర్తతో కలిసి నాగార్జునసాగర్‌లో ఉంటోంది. ఆమె ఇటీవల తన పుట్టింటికి వచ్చింది. తిరుగు ప్రయాణంలో శనివారం ఉదయం తన అన్నయ్య గరికిని తాతారావుతో కలిసి బైక్‌పై అనకాపల్లి రైల్వేస్టేషన్‌కు బయలుదేరింది. మార్గమధ్యలో స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో బైక్ గోతిని తప్పించే క్రమంలో కిందపడిపోయింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కాగా, అనకాపల్లి వంద పడకల ఆస్పత్రికి తరలించారు. లక్ష్మి అప్పటికే మృతి చెందిన ట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద బోరున విలపించారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని.. వట్టిమర్తి (చిట్యాల) : హైదరాబాదుకు చెందిన దామెర భానుమూర్తి (51) తన కుటుంబ సభ్యులతో శుక్రవారం కారులో నర్సారావుపేట వెళ్లారు. తిరుగు ప్రయాణంలో హైదరాబాదుకు వస్తూ వట్టిమర్తి స్టేజీ సమీపంలో కారు ఆపుకుని మూత్ర విసర్జనం కోసం దిగి వెళుతుండా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈప్రమాదంలో తీవ్ర గాయాలైన భానుమూర్తిని చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్ఐ యాదగిరి పేర్కొన్నారు. -
నిర్లక్ష్యమే ముంచింది
►ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కర్ణాటక బస్సు ►నలుగురి మృతి.. 15మందికి తీవ్ర గాయాలు ►మృతుల్లో తల్లీబిడ్డ, మహిళ, ఓ బాలుడు ►డ్రైవర్ గుట్కా అలవాటు వల్లే ప్రమాదం ►బాధితులను ఆదుకుంటాం: మంత్రి మహేందర్‌రెడ్డి మహబూబ్‌నగర్ క్రైం : ఆర్టీసీ బస్సును కర్టాటకకు చెందిన ఓ బస్సు ఢీకొనడంతో నలుగురు మృత్యువాతపడ్డారు. మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మంగళవారం మహబూబ్‌నగర్ మండలం ధర్మాపూర్ సమీపంలోని జేపీఎన్సీఈ కళాశాల వద్ద చోటుచేసుకుంది. హైదారాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దెబస్సు కర్ణాటకలోని రాయిచూర్ నుంచి ఉదయం హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లింది. మార్గమధ్యంలో మరికల్ స్టేజీ వద్ద ఊట్కూర్ మండలం పులిమామిడి గ్రామానికి చెందిన సుంకరి బాలమ్మ(28), తన కొడుకు(నాలుగు నెలలు) అజయ్‌తో కలిసి బస్సు ఎక్కింది. మరికల్‌కు చెందిన విద్యార్థి సోహైల్(14)జిల్లా కేంద్రానికి రావడానికి బస్సులో ప్రయాణమయ్యారు. వీరితో పాటు మక్తల్‌కు చెందిన మరికొందరు కూడా అందులో ఎక్కారు. ధర్మాపూర్ గ్రామశివారులోని జేపీఎన్ఎస్ కళాశాల సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన కర్ణాటక బస్సును డ్రైవర్ అత్యంత నిర్లక్ష్యంగా నడుపుతూ ఢీకొట్టాడు. బస్సులో ఉన్న బాలమ్మతో పాటు కొడుకు అజయ్, సోహైల్, హసీనాబేగం(45) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే సంఘటనస్థలంలో ప్రాణాలు విడిచారు. వీరిలో జిల్లా కేంద్రంలోని ధనలక్ష్మినగర్ కాలనీకి చెందిన సాయబన్న కుడిచేయి పూర్తిగా విరిగి రోడ్డుపై పడింది. అతడితో పాటు మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పార్లమెంటరీ కార్యదర్శి వి.శ్రీనివాస్‌గౌడ్, డీఎస్పీ కృష్ణమూర్తి సంఘటనస్థలాన్ని సందర్శించారు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్‌గౌడ్ పోలీసులను ఆదేశించారు. క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి విషమించడంతో చికిత్సకోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కర్ణాటక బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే.. కర్ణాటక బస్సు డ్రైవర్ గుట్కా వేసుకుని బస్సు నడుపుతున్నాడు. సంఘటన సమీపంలోకి రాగానే బస్సు అద్దాల నుంచి గుట్కా ఉమ్మేస్తుండగానే బస్సుపూర్తిగా కుడివైపు మళ్లి.. ఎదురుగా వస్తున్న హైదరాబాద్‌కు చెందిన ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ గుట్కా వల్లే నలుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 14మంది క్షతగాత్రులుగా మారారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కర్ణాటకకు చెందిన డ్రైవర్లు ఎక్కువగా గుట్కా, తంబాకు, పాన్ మసాలాలు తింటూ ఇటువంటి ప్రమాదాలకు గురవుతున్నట్లు తెలుస్తున్నది. బాధితకుటుంబాలకు పరిహారం విషయం తెలుసుకున్న రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి వి.శ్రీనివాస్‌గౌడ్, అ డిషనల్ ఎస్పీ మల్లారెడ్డి జిల్లా ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు. మృతి చెందిన నలుగురి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. వీరితోపాటు క్షతగాత్రులకు రూ.ఐదువేలు ప్రభుత్వం నుంచి అందిస్తున్నట్లు తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు సూచించారు. 15ఏళ్లకే నూరేళ్లు ధన్వాడ: చేతికొచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఆ కు టుంబంలో విషాదం నిండింది. మండలంలోని మరికల్‌కు చెందిన బాబా, గౌషియాకు కొడుకు, కూతురు ఉన్నారు. వీరి ది పేద కుంటుంబం కావడంతో తండ్రి బాబా సైకిల్ ట్యాక్సీని నిర్వహిస్తూ కుం టుంబాన్ని పోషిస్తూ పిల్లలను చదివిస్తున్నాడు. సోహైల్(15)ఆర్టీసీ బస్సులో మహబూబ్‌నగర్‌కు వెళ్తూ తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. ఒక్కగానొక కొడుకు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడు సోహైల్ స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. మక్తల్: అమ్మ అనే పిలుపునకు దూరమయ్యారు ఆ చిన్నారులు. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఆ చిన్నారుల రోదన గుండెల్ని పిండేసింది. ఊట్కూర్ మండలం పులిమామిడి గ్రామానికి చెందిన బాలమ్మ(35) జిల్లాకేంద్రంలోని ఆస్పత్రిలో చికిత్స కోసం ఇంటి నుంచి ఆర్టీసీ బస్సులో బయలుదేరింది. ధర్మాపూర్ సమీపంలో క ర్టాటక బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటనలో బాలమ్మతోపాటు తన నాలుగు నెలల కొడుకు అజయ్ చనిపోయారు. విషయం తెలుసుకున్న బాలమ్మ అత్త అనంతమ్మ, భర్త రాజు సంఘటనాస్థలానికి చేరుకొని బోరున విలపించారు. తల్లితో పాటు తమ్ముడి మృతితో లావణ్య, కావేరి, హారిక రోదనలు చూపరులను కంటతడిపెట్టించాయి. ‘అమ్మా.. అమ్మా ఇంటికి ఎప్పుడు వస్తావమ్మా..’ అని విలపిస్తుండగా అక్కడున్నవారు కంటతడిపెట్టారు. -
స్విట్జర్లాండ్‌లో నలుగురిని కాల్చి చంపిన పోలీసు
జెనివా: ప్రశాంతతకు పెట్టింది పేరైన స్విట్జర్లాండ్‌లో కాల్పులు కలకలం రేపాయి. ఆరుగ్వా పట్టణానికి సమీపంలోని వురెన్లింగెన్ అనే గ్రామంలో శనివారం రాత్రి 36 ఏళ్ల ఓ పోలీసు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి నలుగురి ప్రాణాలను బలిగొన్నాడు. అనంతరం తనను తాను కాల్చుకొని చనిపోయాడు. రెండు ఇళ్లలోకి చొరబడి అతడు ఈ దారుణానికి తెగబడ్డాడు. మొదట ఓ ఇంట్లోకి చొరబడి ముగ్గురిని కాల్చాడు. వీరిలో ఆయన సమీప బంధువులు కూడా ఉన్నారు. అనంతరం పొరుగింటికి వెళ్లి మరో వ్యక్తిని కాల్చి చంపాడు. తర్వాత తనను కాల్చుకున్నాడు. మాసిడోనియా ఘర్షణల్లో 22 మంది మృతి స్కోప్‌జీ: మాసిడోనియాలోని కుమనోవోలో శనివారం పోలీసులకు, గుర్తుతెలియని సాయుధ దుండగులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 22 మంది మృతిచెందారు. వీరిలో 8 మంది పోలీసులు, 14 మంది సాయుధ దుండగులు ఉన్నారు. మరొక పోలీసు పరిస్థితి విషమంగా ఉంది. దేశ రాజధాని స్కోప్జీకి 40 కి.మీ. దూరంలో ఉన్న కుమనోవోలో ఆదివారం ఉదయం వరకు సాగిన ఈ ఘర్షణల్లో 37 మంది పోలీసులు కూడా గాయపడ్డారు. దుండగులు పోలీసులపై గ్రెనేడ్లు విసిరి, ఆటోమేటిక్ తుపాకులతో కాల్పులు జరిపారు. దుండగులు పొరుగుదేశమైన కొసావో నుంచి వచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. -
పిడుగు కాటు
♦ పిడుగుపడి నలుగురు మృతి ♦ మృతుల్లో దంపతులు ♦ రైతు కుటుంబాల్లో అంతులేని విషాదం ♦ సహాయ కార్యక్రమాలకు అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే బూడి, కలెక్టర్ యువరాజ్ వారి బతుకులపై ప్రకృతి కన్నెర్ర చేసింది...అనుకోకుండా వాన కురుస్తుండటంతో తలదాచుకునేందుకు చెట్టుకిందకు వెళ్లిన వారిని పిడుగు పొట్టనపెట్టుకుంది. ఒకేసారి నలుగురిని బలితీసుకున్న ఈ సంఘటన కోటపాడు మండంల పిడ్రంగిని విషాదంలోకి నెట్టేసింది. ఈ దుర్ఘటనలో దంపతులు కన్నుమూయగా మరో ఇద్దరు కూలీలు విగతజీవులయ్యారు. పొలానికి వెళ్లిన వారు శవాలుగా మారడంతో వారి కుటుంబాలు కన్నీరుమున్నీరయ్యాయి. కూలినాలి చేసుకునే బతుకుల్లో పిడుగు పెనుకల్లోలం నింపింది ఆధారం కోల్పోయిన కుటుంబాలు కూలిపనికి వెళ్లిన తమ ఇంటి యజమానులు సాయంత్రం వస్తారని ఎదురుచూసిన కుటుంబసభ్యులకు మరణ వార్త తీవ్ర విషాదంలో ముంచింది. జాగారపు సన్నిబాబు, జాగారపు ఈశ్వరరావులు వరుసకు అన్నదమ్ములు. రోజూ కూలిపని చేసుకుంటూ కుంటుంబాలను పోషించుకుంటున్నారు. ఆకస్మికంగా వీరి మృతితో ఆయా కుటుంబాలు ఆధారం లేకుండా పోయింది. సన్నిబాబుకు భార్య, కుమార్తె,కుమారుడు ఉన్నారు. ఈశ్వరరావుకు భార్య, కుమార్తె,కుమారుడు ఉన్నారు. కుమార్తెలకుపెళ్లిలుఅయిపోయాయి. కె.కోటపాడు : ఒకే రోజు పిడుగుపాటుకు నలుగురు మృతితో మండలంలోని పిండ్రంగిలో విషాదం చోటుచేసుకుంది. ఆయా రైతు, రైతుకూలీ కుటుంబాల్లో అంతులేని వేదన మిగిలింది. చోడిపంట నూర్పిడికి శుక్రవారం పొలానికి వెళ్లిన సింగంపల్లి అప్పారావు(53), కళావతి(38) దంపతులతోపాటు కూలీపనికి వచ్చిన గ్రామానికి చెందిన జాగారపు సన్నిబాబు(49), జాగారపు ఈశ్వరరావు(48)లు మధ్యాహ్నం వరకు పంటను నూర్పిడి చేశారు. భారీ వర్షంతో నలుగురూ సమీపంలోని చెట్టుకిందకు చేరారు. దానిపై పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతిచెందారు. నలుగురు మృతిచెందారన్న వార్తతో ఆయా కుటుంబాల్లో విషాదం అలుముకుంది. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి పరుగులు తీశారు. విగత జీవులుగా పడి ఉన్న తమవారిని చూసి బోరున విలపించారు. రోదనలతో గ్రామం శోకసంద్రమైంది. చావులోనూ వీడని బంధం: వ్యవసాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న రైతు సింగంపల్లి అప్పారావు, అతని భార్య కళావతిలు చావులోనూ వీడలేదు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు ఇటీవల పెళ్లి చేశారు. కొడుకు రాజేష్‌ను ఇంజినీర్‌ను చేయాలని ఆశపడ్డారు. ఆరుగాలం కష్టపడేవారు. వచ్చిన ఆదాయంతో కొడుకును ఇంజినీరింగ్ చదివించారు. నేడోరేపో ఉద్యోగం వస్తుందని ఎదురుచూస్తున్న సమయంలో మృత్యువు పిడుగు రూపంలో ఆ దంపతులను కబళించింది. కొడుకు రాజేష్ గుండెలవిసేలా రోదిస్తున్నాడు. తనకు దిక్కెవరంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. అప్పారావుకు 80 ఏళ్లు పైబడిన వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు. కొడుకుకోడలు మృతితో వారు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎమ్మెల్యే ముత్యాలనాయుడు వాకబు నియోజకవర్గంలో ఒకే గ్రామానికి చెందిన నలుగురు మృతిచెందారని తెలుసుకున్న మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు కర్నూలు నుంచి ఫోన్లో ఆయా కుటుంబసభ్యులను పరామర్శించారు. సాయం అందించాలని ఇన్చార్జి తహాశీల్దార్ నాగేశ్వరరావును ఆదేశించారు. ఆర్డీఓ పద్మావతి సంఘటన స్థలానికి వచ్చారు. ఇదిలావుండగా జిల్లా కలెక్టర్ యువరాజ్, ఉపముఖ్యమంత్రి చినరాజప్ప ఫోన్ ద్వారా సంఘటపై ఆరాతీసి బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నాలుగు మృతదేహాలను పిండ్రంగి గ్రామ పొలిమేరకు శుక్రవారం రాత్రి తరలించారు. శనివారం మృతదేహాలకు పోస్టుమార్టం చేస్తారు. -
వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం బోయిన్పల్లి సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మతి చెందారు. కారు, లారీ ఢీకొనడంతో ఈ ఘోరం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది తిరుపతి నుంచి వస్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. (రాజంపేట) -
రోడ్డు ప్రమాదాల్లో నలుగురి మృతి, పలువురికి గాయాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే రోజు జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మరణించగా, పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదాలు సంభవించాయి. గుంటూరు జిల్లా దాచేపల్లిలో నర్సరావుపేట నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సును ఓ లారీ ఢీకొంది. హైదరాబాద్‌లో జరగనున్న పెళ్లి కోసం ఓ పెళ్లి బృందం ఈ బస్సులో నర్సరావుపేట నుంచి బయల్దేరింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మరణించగా, పెళ్లి బృందంలోని ఎనిమిది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఇక మరోవైపు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నెలవాడలో జాతీయ రహదారిపై ఉన్న పాదచారులను ఓ లారీ ఢీకొంది. దాంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. వైఎస్ఆర్ జిల్లా తొండూరు మండలం మాల్యాల వద్ద కూలీల ట్రాక్టర్, లారీ పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, పదిమంది గాయపడ్డారు. -
ఏసి పేలి నలుగురి మృతి!
చెన్నై: తమిళనాడులోని వేలూరులో ఎయిర్ కండిషనర్ పేలి నలుగురు దుర్మరణం చెందారు. ఓ వ్యాపారవేత్త ఇంటిలో ఈ ఘటన జరిగింది. ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. హైఓల్టేజ్ కారణంగా ఈ పేలుడు సంభవించినట్లు భావిస్తున్నారు. ఒక ఎయిర్ కండిషనర్ పేలడం వల్ల నలుగురు మృతి చెందడంతో ఆ ప్రాంతవాసులు విస్తుపోయారు. -
రోడ్డు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం
మాధవరం,(మునగాల): మండలంలోని మాధవరం గ్రామ శివారులో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ గొర్రెల కాపరి మృతిచెందాడు. పోలీ సులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన దాసరి వీరయ్య(53) గొర్రెలను పోషించుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమం లో శనివారం రాత్రి పొలం వద్ద ఉన్న గొర్రెల దగ్గరకు వెళ్లేందుకు జాతీయ రహదారి దాటే ప్రయత్నం చేస్తుండగా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే కారు అతన్ని ఢీకొట్టి వెళ్లింది. ఈ ప్రమాదంలో వీరయ్య తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. కాగా మృతుని భార్య మూడు నెలల క్రితం ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందడంతో వీరయ్య స్వగ్రామంలోనే ఉన్న తన కూతురు మంగమ్మ వద్ద ఉంటూ గొర్రెలు కాస్తూ జీవనం సాగిస్తున్నాడు. మృతునికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. గంట క్రితం ఇంటకి వచ్చి భోజనం చేసి గొర్రెల వద్దకు వెళుతున్నానని చెప్పిన తండ్రి ఇంతలోనే మృత్యువాత పడటంతో అతని కూతురు నాగమ్మ బోరున విలపించింది. సంఘటన స్థలంలో స్పృహ కోల్పోయింది. మునగాల హెడ్ కానిస్టేబుల్ సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. రహదారిపై ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని గూడూరు(మిర్యాలగూడ రూరల్): గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామ పంచాయతీ పరిధిలోని కిష్టాపురంలో అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిపై జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలం జాన్పాడ్కు చెందిన కోట్ల కృష్ణప్రసాద్(35) స్వగ్రామంలో కిరాణ దుకాణం నిర్వహిస్తున్నాడు. కిరాణ సామాను కోసం మిర్యాలగూడకు బైక్‌పై వస్తున్నాడు. కిష్టాపురం సమీపంలో గుర్తు తెలియని వాహనం అతన్ని ఢీకొట్టడంతో కృష్ణప్రసాద్ అక్కడికక్కడే మృతి చెం దాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాహుల్‌దేవ్ తెలిపారు. కోదాడలో... కోదాడఅర్బన్: పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరు మండలం బేతవోలుకు చెందిన రెమిడాల దుర్గప్రసాద్ కొబ్బరిబొండాల వ్యాపారం చేస్తున్నాడు. ఇతడు శనివారం ఉదయం కోదాడ బస్టాండ్ ఎదురుగా కొబ్బరి బొండాలు తీసుకెళ్లేందుకు వచ్చాడు. సమీపంలోని హోటల్లో టిఫిన్ చేసి బయటకు వచ్చాడు. రోడ్డు దాటుతుండగా కోదాడ నుంచి ఖ మ్మం వైపు సాధిక్‌బాబా (19) అనే యువకుడు మోటార్ సైకిల్‌పై వెళ్తూ అతన్ని ఢీకొట్టాడు. ఈప్రమాదంలో దుర్గప్రసాద్‌కు, సాధిక్బాబాకు తీవ్రగాయాలయ్యాయి. దుర్గప్రసాద్‌ను ఖమ్మం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సాధిక్బాబాను హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా మృతి చెందాడు. దుర్గప్రసాద్ బంధువు ఆనందరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వర్రావు తెలిపారు. దైవదర్శనానికి వెళ్తొస్తూ... నార్కట్‌పల్లి: యాదగిరిగుట్ట దైవదర్శనానికి వెళ్లొస్తున్న ఒ వ్యక్తిని బస్సు ఢీకొనడంతో మృతి చెందాడు. శనివారం నార్కట్‌పల్లి ఆర్టీసీ బస్టాండ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కేతపల్లి మండలం బీమారం గ్రామనికి చెందిన పురం పాండయ్య(52), అతని భార్య సోమలక్ష్మి శనివారం ఉదయం యాదగిరిగుట్టకు వెళ్లారు. దైవదర్శనం అంతనం స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలో నార్కట్‌పల్లి బస్టాండ్‌లో దిగారు. పాండయ్య వస్తువు కొనడానికి బస్టాండ్ నుంచి బయటకు వెళ్తుండగా నార్కట్‌పల్లి డిపోకు చెందిన బస్సు బస్టాండ్ లోపలికి వస్తూ అతన్ని ఢీకొట్టింది. తీవ్రగాయాలైన పాండయ్యను స్థానిక కామినేని అస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్ఐ ప్రణీత్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
వడదెబ్బతో నలుగురి మృత్యువాత
న్యూస్‌లైన్, నెట్వర్క్: వడదెబ్బకు సీమాంధ్రలో వివిధ జిల్లాల్లో నలుగురు మృతిచెందారు. అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం గంగినపల్లికి చెందిన కుమ్మరి ఆదినారాయణ (50) వ్యవసాయ కూలీ. మంగళవారం ఉదయం వరిగడ్డిని లోడ్ చేసేందుకు కొత్తచెరువు మండలం మైలేపల్లికి వెళ్లాడు. ఎండలోనే పనిచేస్తూ వడదెబ్బకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే ఇదే జిల్లా గుత్తి మండలం చెర్లోపల్లికి చెందిన రంగన్న (70) సోమవారం గ్రామ శివార్లలో గేదెలను మేపేందుకు వెళ్లాడు. ఎండలో ఎక్కువ సమయం ఉండటంతో సాయంత్రం ఇంటికి రాగానే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం కొత్త తిమ్మాపురంలో మంగళవారం మేకలు మేపేందుకు పొలానికి వెళ్లిన సి.మునిరాజ (32) మధ్యాహ్నం ఎండతీవ్రతకు స్పృహ కోల్పోరుు మృతి చెందాడు. మరో ఘటనలో.. విజయనగరం జిల్లా తెర్లాం మండలంలోని రాజయ్యపేట పంచాయతీ పరిధిలోని రామన్న అగ్రహారం గ్రామానికి చెందిన ఉపాధి కూలీ గుగ్గిలాపు తాత(55) మంగళవారం ఉదయం వడదెబ్బతో మృతి చెందాడు. గ్రామానికి సమీపంలోని బొమ్మినాయుని చెరువులో ఉపాధి హామీ పనికి వచ్చాడు. ఎండతీవ్రంగా ఉండడంతో తట్టతో మట్టిని మోస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందాడు. -
పట్టపగలే నాలుగు హత్యలు!!
మహారాష్ట్రలోని థానె జిల్లాలో ఒకేరోజు పట్టపగలు నాలుగు హత్యలు జరిగాయి. హతుల్లో ఇద్దరు గృహిణులు కూడా ఉన్నారు. గంగ్రిపాద ప్రాంతంలో ఐదారుగురు వ్యక్తులు పాతికేళ్ల యువకుడిపై పదునైన ఆయుధాలతో దాడి చేశారు. కరెంటు స్తంభానికి కొట్టేసి మరీ ఈ ఘాతుకానికి పాల్పడటంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. మరో మూడు సంఘటనలు థానె పోలీసు కమిషనరేట్ పరిధిలో జరిగాయి. కాన్ గ్రామంలో 32 ఏళ్ల తరన్నుమ్ అస్లాంఖాన్ అనే మహిళను ఆమె భర్త చంపేసి, గోనెసంచిలో శవాన్ని కట్టేసి, ఓ పైప్‌లైను వద్ద విసిరేశాడు. బద్లాపూర్ రైల్వేస్టేషన్ వద్ద రాత్రి 10.40 గంటల ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఏజెంటు ఒకరిని కాల్చిచంపారు. సంతోష్ సాల్వి తన స్నేహితుడితో కలిసి మద్యం తాగుతుండగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వెంటనే మహేంద్ర భాగుల్ అనే ఆ స్నేహితుడు కాల్చిచంపాడు. లవ్‌కుశ్ హౌసింగ్ సొసైటీ ప్రాంతంలో నివిసించే పూనమ్ గజ్రానీ అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. గ్యాస్ సిలిండర్‌తో ఆమె తలపై మోది, కత్తులతో పొడిచి, గొంతుకు వైరు బిగించి మరీ చంపారు. -
అర్ధరాత్రి వేళ మర్వెల్లిలో అగ్ని ప్రమాదం
జోగిపేట/అల్లాదుర్గం రూరల్: పెద్దాపూర్ గ్రామానికి చెందిన బుడిగజంగం పెంటయ్య ఐదేళ్ల కిందట బతుకుదెరువు కోసం మర్వెల్లి గ్రామానికి వచ్చాడు. యాచక వృత్తితో పాటు, గ్రామంలో కథలు చెప్పి సంసారాన్ని లాగుతున్నాడు. సంగమేశ్వర్ అనే గ్రామ పెద్దమనిషి దానంగా ఇచ్చిన 60 గజాల స్థలంలో గుడిసె వేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. గురువారం రాత్రి పెంటయ్య తన మామ పోచయ్యను తీసుకొని అదే గ్రామానికి చెందిన మల్లేశంగౌడ్ ఇంటి వద్ద కథ చెప్పేందుకు వెళ్లాడు. కథ మధ్యలో ఉండగానే ఊరు చివర నుంచి మంటలు ఎగసి పడుతుండటంతో తన గుడిసె మంటల్లో కాలిపోతుందనే ఆనుమానంతో పెంటయ్య గ్రాామస్థులతో కలిసి పరుగె త్తుకుంటూ వెళ్లి చూశారు. అప్పటికే గుడిసెను మంటలు చుట్టుముట్టాయి. ఆ మంటల్లో తన భార్య లక్ష్మి(35), అత్త చంద్రమ్మ(50), కూతరు పోచమ్మ(7), కుమారుడు(1) ఆహుతి అవుతుండడంతో నెత్తీనోరు బాదుకుంటూ గుడిసెలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా మంటలు తీవ్రస్థాయిలో ఎగసి పడటంతో సాధ్యం కాలేదు. అప్పటికే చట్టుపక్కల నివాసాల్లోని ప్రజలు బిందెలు, బకెట్లతో నీళ్లు తెచ్చి చల్లినా మంటలు అదుపులోకి రాలేదు. గుడిసె పూర్తిగా కాలిపోయింది. దాంతో అందులో నిద్రిస్తున్న నలుగురు కూడా సజీవ దహనమైపోయారు. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడాలని ధైర్యం చేసినా మంటలు వెళ్లనీయలేదని ప్రత్యక్ష సాక్షులు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. రోజూ మా ఇళ్ల ముందు ఆడుకునే చిన్నారులు కళ్ల ముందే తగలబడిపోయారని వారు రోదిస్తూ తెలిపారు. మాంసం ముద్దలుగా శవాలు గుడిసెకు నిప్పంటుకోవడంతో గాఢనిద్రలో ఉన్న ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు మంటల్లో కాలిపోయి మాంసం ముద్దలుగా మారారు. బిడ్డా ఏమైపోయారంటూ చిన్నారుల తండ్రి పెంటయ్య ఆర్తనాదాలు గ్రామస్తుల కళ్లల్లో నీళ్లు తెప్పించాయి. తమ పిల్లలను చూడండి ఎలా అయిపోయారో.. మాకు దిక్కెవరంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు. సంఘటన స్థలం నుంచి క్లూస్ టీం ఆధారాలు సేకరించించింది. సీఐ రాజేందర్ నేతృత్వంలోని అధికారుల బృందం ప్రమాదంపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. స్థలం కోసమే గుడిసె తగలబెట్టారు... ఇది ప్రమాదమా? లేక విద్రోహ చర్యా? అనే దానిపై పోలీసుల్లో సందిగ్ధత ఉంది. బాధితుడు పెంటయ్య మాత్రం తన గుడిసెను తగలబెట్టారనే చెప్తున్నాడు. అతని మాటల్లోనే... ‘నేను నివాసం ఉంటున్న స్థలంపై మంగళవారం ఇదే గ్రామానికి చెందిన మేతి ఆదాం అనే వ్యక్తితో వివాదం జరిగింది. గ్రామ పటేల్ సంగమేశ్వర్ వద్ద ఈ స్థలం కొన్నానని, కొంత అడ్వాన్సు కూడా ఇచ్చానని, వెంటనే స్థలం ఖాళీ చేసి వెళ్లిపోవాలని మేతి ఆదాం గొడవపడ్డాడు. ఇదే విషయాన్ని పటేల్ సంగమేశ్వర్ వద్దకు వెళ్లి చెప్పా... దాంతో ఆయన వచ్చి ఆదాంకు సంబంధించి ఇంటి స్థలాన్ని చూపించి రాళ్లను పాతించి, నేను నివాసం ఉంటున్న స్థలంలోనే నన్ను ఉండమని చెప్పి వెళ్లిపోయాడు. అయితే అదే రోజు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆదాం మళ్లీ వచ్చి స్థలం నాది వెళ్లిపోవాలని, లేనట్లయితే ఏం చేయాలో అది చేస్తానంటూ బెదిరించాడు. ఆదాం చెప్పినట్టుగానే నా గుడిసెను తగలబెట్టి ఉండవచ్చు’ అని పెంటయ్య పోలీసులకు, తహశీల్దారుకు వాంగ్మూలం ఇచ్చారు. విచారణ జరిపిస్తాం: డీఎస్పీ ఎస్.గోద్రూ ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని, ప్రమాదవశాత్తు జరిగిందా? ఉద్దేశపూర్వకంగా చేశారా? అనే విషయమై సమగ్ర విచారణ జరిపిస్తామని డీఎస్పీ ఎస్. గోద్రూ తెలిపారు. శుక్రవారం ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వివరాలను స్థానిక ఎస్ఐ నరేందర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు సీఐ బి.సైదానాయక్ ఉన్నారు. కాగా మృతదేహాలకు జోగిపేట వైద్యాధికారి నందిత, సిబ్బంది సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. -
రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి
సాక్షి, ముంబై: అమరావతి నుంచి బుల్డాణా దిశగా వెళ్తున్న ఎంఎస్ఆర్టీసీ బస్సు శనివారం రాత్రి ప్రమాదానికి గురవడంతో నలుగురు దుర్మరణం పాల య్యారు. అకోలా సమీపంలోని మర్జితాపూర్ ప్రాంతంలో ఎదురుగా వస్తున్న కంటెయినర్ లారీ బస్సును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 24 మందికి తీవ్ర గాయాలవడంతో అకోలాలోని ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ముగ్గురి వివరాలు మాత్రమే తెలిశాయి. వారిని కిరణ్ భురసాకలే (53), రవీంద్ర తావ్డే (52), వీర్ బేండ్వాల్‌గా గుర్తించారు. ఇంకొకరి గురించి తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఎంఎస్ఆర్టీసీ ఆర్థికసాయం అందజేయనుంది. మృతుల కుటుంబానికి రూ.ఐదు వేలు, గాయపడిన వారికి రూ.500 చొప్పున ఆర్థికసాయం ప్రకటించింది. -
రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి
చెన్నై, సాక్షి ప్రతినిధి: పళని సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెం దారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన వారు. మదనపల్లె ప్రాంతానికి చెందిన 18 మంది అయ్యప్పభక్తులు రెండురోజుల క్రితం వ్యానులో శబరిమలై వెళ్లారు. మంగళవారం అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో పళనిలోని సుబ్రమహ్మణ్య స్వామిని దర్శించుకోవడానికి వెళుతున్నారు. తేనీ జిల్లా నుంచి పొల్లాచ్చికి వెళుతున్న లారీని పళని సమీపంలో మునీశ్వరన్ ఆలయం వద్ద నిలిపారు. లారీ డ్రైవర్ మునియాండీ (55), క్లీనర్ ముత్తు సెల్వం ఆలయాన్ని దర్శించుకున్నారు. మళ్లీ ప్రయాణమయ్యేందుకు మునియాండీ లారీని ఎక్కుతున్న సమయంలో మదనపల్లివాసులు ప్రయాణిస్తున్న వ్యాన్ అత్యంతవేగంగా ఆయన్ను ఢీకొట్టింది. అదే వేగంలో కొద్దిదూరం ప్రయాణించి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ మునియాండీతోపాటూ వ్యాన్‌లో ప్రయాణిస్తున్న సెన్రాయలు (52), రెడ్డి ప్రసాద్ ( 26), ఇమామ్ సాహేబ్ (45) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తేనీ ఎస్పీ మహేష్, డీఎస్పీ సేతు జయమంగళం, ఎస్ఐ సురేష్ సంఘటన స్థలానికి చేరుకుని మృతులను, క్షతగాత్రులను ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు. వ్యాన్‌లోని 12 మంది తీవ్రంగా గాయపడగా, వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వ్యాన్ డ్రైవర్ మహేశ్వరన్ (36)ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
ధన్‌బాద్ బొగ్గుగని ప్రమాదంలో నలుగురి మృతి
జార్ఖండ్: ధన్‌బాద్ బిసిసిఎల్ బొగ్గుగనిలో పైకప్పు కూలిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతులు నలుగురూ మైనర్లేనని తెలుస్తోంది. పలువురు గాయపడ్డారు. గని శిథిలాల కింద మరో 50 మంది కార్మికులు ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.