శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది.
నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. కారు,లారీ ఢీకొన్న ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందింది. పెళ్లూరు మండలం పెసలగుర్రపుతోట వద్ద ఆదివారం రాత్రి ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన కారు నెంబర్ టీఎస్ 04 ఈడీ 7789 (TS 04 ED 7789) అని పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.