కొత్త సంవత్సర వేడుకలకు వస్తూ ప్రమాదం
డివైడర్‌ను ఢీకొన్న స్కార్పియో
అక్కడికక్కడే ఒకరు మృతి , ఆసుపత్రిలో మరొకరు ఇద్దరు మృతి
ఇంకొకరి పరిస్థితి విషమం
జమ్మలమడుగు: ఏడాది చివరి రోజే వారి జీవితానికి ఆఖరు రోజు అవుతుందని అనుకోలేదు. అతివేగం వారి ప్రాణాలను హరించింది. సంఘటన స్థలంలోనే ఒకరు మరణించగా మరొకరు ఇద్దరు ప్రభుత్వాసుపత్రిలో మరణించారు. ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా..
పులివెందుల నియోజకవర్గంలోని వే ముల, లింగాల, పులివెందుల ప్రాంతాల కు చెందిన ఏడుగురు స్నేహితులు జనవరి వేడుకలను నిర్వహించుకునేందుకు పర్యాటక కేంద్రమైన గండికోటకు పులివెందుల నుంచి బయలు దేరారు. వీరిలో లింగా ల మండలం పెద్దకుడాల గ్రామానికి చెందిన అబ్దుల్, వేముల మండలం భూమ య్యగారిపల్లికి చెందిన నందీష్, పులివెందులకు చెందిన జగన్, షాహుల్, సింహాద్రిపురం అగ్రహారానికి చెందిన చైతన్య, షాజహాన్, ప్రేమ్ ఉన్నారు. ముద్దనూరు కొండ దిగిన తర్వాత చిటిమిటి చింతల గ్రామానికి సమీపంలో ఉన్న దర్గా మలుపు వద్దకు రాగానే వేగంగా వస్తున్న స్కార్పియోను అదుపు చేయలేక రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొన్నారు.
వేముల మండలం భూమయ్యగారిపల్లి గ్రామానికి చెందిన నందీష్(21) అక్కడికక్కడే మృతి చెందగా కొన ఊపిరితో ఉన్న లింగాల మండలం పెద్ద కుడాల గ్రామానికి చెందిన అబ్దుల్(25)ను జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తీసుకు రాగా చికిత్స పొందుతూ మరణించాడు. పులివెందులకు చెందిన జగన్ పరిస్థితి విషమించడంతో ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు ఉదయం ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ జగన్ మృతి చెందాడు . చైతన్య, షాజహాన్, ప్రేమ్, షాహుల్ జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అర్బన్ పోలీసులు కేసు నమో దు చేసుకుని విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment