సైదాపూర్ మండలం దుద్దునపల్లిలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న బైక్ ను ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీ కొట్టి, అదుపుతప్పి పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. ఈ సంఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, బైక్ పై వెళ్తున్న ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు అందిస్తున్నారు.