పెళ్లికి వెళ్లి వస్తూ పరలోకానికి..    | Four Members Died In Road Accident | Sakshi
Sakshi News home page

పెళ్లికి వెళ్లి వస్తూ పరలోకానికి..   

Published Tue, May 1 2018 12:18 PM | Last Updated on Thu, Aug 30 2018 4:20 PM

Four Members Died In Road Accident - Sakshi

రోడ్డుపై రాఘవేందర్, దీప్తి, సాయితేజ, స్నిగ్ధ మృతదేహాలు

డిచ్‌పల్లి : శుభ కార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబం అనంతలోకాలకు చేరింది. మండల కేంద్రం శివారులోని 44వ జాతీ య రహదారిపై సోమవారం సాయం త్రం సుమారు 4 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దీనిలో కోటగిరికి చెందిన పోల విఠల్‌రావు, సుష్మ దంప తుల కుమారుడు పోల రాఘవేందర్‌ (38), కోడలు పోల దీప్తి(34), మనవ డు సాయితేజ(11), మనవరాలు స్నిగ్థ(5) అక్కడికక్కడే మృతి చెందారు.

వీరికి కోటగిరిలో సాయి ఆగ్రో ఇండస్ట్రీస్‌(రైస్‌మిల్‌) ఉంది. ఇందల్వాయి ఎస్‌ఐ రాజశేఖర్, మృతుల బంధువులు తెలిపి న వివరాలిలా ఉన్నాయి. విఠల్‌రావు కుటుంబంతో కలిసి ఆదివారం హైదరాబాద్‌లోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. విఠల్‌రావు దంపతులు అక్కడే ఉండి పోయారు. కాగా రాఘవేందర్‌ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి సోమవారం కోటగిరికి బయలు దేరారు.

వీరు ప్రయాణిస్తున్న కారు(టీఎస్‌ 10 ఈపీ 1299) డిచ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా ముందు టైరు పేలిపోయి ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్‌ను దాటుకుని వెళ్లి రోడ్డుపై పల్టీ కొట్టింది. అదే సమయంలో ఆర్మూర్‌ వైపు నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న లారీ(ఎంహెచ్‌ 04 ఈఎల్‌ 5103) కిందకు దూసుకెళ్లింది. దీంతో లారీ, కారును కొద్ది దూ రం లాక్కెళ్లింది. కారులోని బెలూన్లు తె రుచుకున్నా లారీ కిందకు వెళ్లడంతో అం దులో ఉన్న నలుగురు మృతి చెందారు.

ప్రమాదం జరిగిన వెంటనే ఎదురుగా ఉన్న పోలీస్‌స్టేషన్‌లోని సిబ్బందితో పా టు రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు అక్కడికి చేరుకున్నారు. కారు నుజ్జునుజ్జు కావడంతో అందులో నుంచి మృతదేహాలను వెలికి తీసేందుకు స్థానికులు, పోలీసులు తీవ్రంగా శ్రమించారు. పారలు, ఇనుప రాడ్లతో కారు డోర్లు, పైభాగాన్ని పెకిలించి కారులోని మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాద వా ర్త తెలియగానే రాఘవేందర్‌ తల్లిదండ్రు లు విఠల్‌రావు, సుష్మ హైదరాబాద్‌ నుంచి హుటాహుటిన నిజామాబాద్‌కు బయలుదేరారు.

ఇందల్వాయి ఎస్‌ఐ రాజశేఖర్, డిచ్‌పల్లి ఏఎస్‌ఐ నారాయణ రహదారిపై వాహనాల రాకపోకలను దారి మళ్లించారు. కామారెడ్డి నుంచి నిజామాబాద్‌ వెళ్తున్న రాఘవేందర్‌ స్నే హితుడు శ్రావణ్‌ ఘటనా స్థలం వద్ద ఆగాడు. మృతులను చూడగానే గుర్తించి వారి వివరాలను పోలీసులకు తెలిపా డు. నిజామాబాద్‌ ఏసీపీ ఎం.సుదర్శన్‌ ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు డిచ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కోటగిరిలో విషాదఛాయలు 

కోటగిరి(బాన్సువాడ) : ఉన్న ఒక్కగానొక్క కుమారుడు, కోడలు, మనుమ డు, మనుమరాలు రోడ్డు ప్రమా దం లో మృతిచెందడంతో కోటగిరిలో వి శాదఛాయలు అలుముకున్నాయి. ప లువురు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతినిత్యం తన కళ్ళముందు ఆడు తూ పాడుతూ తిరిగే మనుమడు, మ నుమరాలు మృతిచెందడంతో ఆయన కు తీరని లోటు మిగిలింది.

హైదరా బాద్‌ నుంచి నిజామాబాద్‌కు కారులో వస్తుండగా ప్రమాదం జరిగింది. కోటగిరికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త పోల విఠల్‌సేట్‌కు ఏకైక కుమారుడు పోల రాఘవేందర్‌రావు. ఆదివారం హైదరాబాద్‌లో పెళ్లి జరిగింది. మరో గంటలో ఇంటికి చేరుకుంటారనే సమయంలో రోడ్డు ప్రమాదంలో దంపతులతో పాటు వారి పిల్లలు మృతి చెందడంతో విషాదం నెలకొంది.ప్రమాద వివరాలపై ఆరా 
రోడ్డు ప్రమాద సమాచారం అందుకున్న రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సోమవారం రాత్రి ప్రమాద స్థలాన్ని సందర్శించారు.

ఏసీపీ సుదర్శన్‌ను అడిగి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అప్పటికే మృతదేహాలను జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడంతో మంత్రి ఆస్పత్రికి చేరుకున్నారు. మృతుడి తండ్రి విఠల్‌రావును మంత్రి పోచారం ఓదార్చారు.

లారీ రాకుంటే ప్రమాదం తప్పేది.. 

రాఘవేందర్‌ ప్రయాణిస్తున్న కారు డిచ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుటకు రాగానే కారు ముందు టైరు పేలి అదుపు తప్పింది. డివైడర్‌ పైకెక్కి పూల మొక్కలను దాటుకుని రోడ్డుపై పల్టీ కొట్టింది. కారులో ఉన్న బెలూన్లు వెంటనే తెరుచుకున్నాయి. అయితే దురదృష్టవశాత్తు అదే సమయంలో ఎదురుగా లారీ వేగంగా వస్తుంది. దీంతో లారీ కిందకు దూసుకెళ్లిన కారును లారీ రోడ్డుపై కొంత దూరం ఈడ్చుకెళ్లింది. దీంతో కారు నుజ్జు కావడంతో నలుగురు మృతి చెందారు. ఆ సమయంలో ఎదురుగా లారీ రాకపోయింటే కారులోని నలుగురు బతికి ఉండేవారని అక్కడున్నవారు, పోలీసులు అభిప్రాయపడ్డారు. 

కంటతడి పెట్టిన మంత్రి పోచారం

నిజామాబాద్‌ క్రైం: డిచ్‌పల్లి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి మృతదేహాలను చూసి రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి కంటతడి పెట్టారు. ఉమ్మడి జిల్లాలో రోజంతా సమీక్షలు నిర్వహించాక నేరుగా పోస్టుమార్టం గదికి వెళ్లి విగతజీవులుగా పడి ఉన్నవారి మృతదేహాలను చూసి కంటతడి పెట్టారు. అందరితో సన్నిహితంగా మెలిగే రాఘవేందర్‌ ఆకస్మాత్తుగా మృతిచెందటం జీర్ణించుకోలేని విషయమని మృతుడి తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అధైర్య పడవద్దని, తాను ఉన్నానంటూ మృతుడి కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు. రాత్రి 8.30 గంటలకు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి కావటంతో 9 గంటలకు కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించాగ మృతదేహాలను బంధువులు కోటగిరికి తరలించారు. 

కామారెడ్డికి వెళ్లి ఉంటే.. 

సోమవారం హైదరాబాద్‌ నుంచి కోటగిరికి భార్య దీప్తి, కుమారుడు తేజసాయి, కూతురు స్నిగ్ధతో కలిసి కారులో బయలుదేరారు. వీరి కారు కామారెడ్డికి చేరుకోక ముందే కామారెడ్డిలో రాఘవేందర్‌ స్నేహితుడు ఇక్కడ ఆగాలని కాస్త మాట్లాడుదామని చెప్పాడు. దానికి రాఘవేందర్‌ ఇప్పుడు సమయం లేదని, మరోసారి కామారెడ్డికి వస్తానని చెప్పి కామారెడ్డిలోకి కారు వెళ్లకుండా బైపాస్‌ గుండా వచ్చాడు. అక్కడే ఆగి ఉంటే ప్రమాదం జరిగి ఉండక పోవచ్చని కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.  

రేపు తేజసాయి పుట్టిన రోజు.. 

ప్రమాదంలో మృతిచెందిన రాఘవేందర్‌ కుమారుడు తేజసాయి పుట్టినరోజు బుధవారమే. దీంతో కొడుకు బర్త్‌డేను ఘనంగా చేసేందుకు హైదరాబాద్‌ నుంచి వివిధ వస్తువులు, దుస్తులు కొన్నారు. అంతలోనే తేజసాయికి నిండు నూరేళ్లు నిండిపోవటం బాధాకరం.       

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement