బైక్, ట్రాక్టర్ ఢీ: నలుగురి మృతి | Bike bourne police hits tractor, 4died | Sakshi

బైక్, ట్రాక్టర్ ఢీ: నలుగురి మృతి

Sep 17 2016 6:31 AM | Updated on Sep 4 2017 1:53 PM

జిల్లాలోని సైదాపూర్ మండలం జుజ్జనపల్లిలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

కరీంనగర్: జిల్లాలోని సైదాపూర్ మండలం దుద్దునపల్లిలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న బైక్ ను ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీ కొట్టి, అదుపుతప్పి పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. ఈ సంఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, బైక్ పై వెళ్తున్న ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు అందిస్తున్నారు.

దాదాపు 20మీటర్ల లోతు గల బావిలో ట్రాక్టర్ పడటంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతులు చిగురుమామిడి మండలం బొమ్మనపల్లికి చెందిన కత్తుల శివ, పిల్లి సంతోష్, బొల్లి రాజు, కొంకట శ్రీకాంత్ లుగా గుర్తించారు. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement