
చిన్నారుల మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబసభ్యులు
సాక్షి, నెల్లూరు: నెల్లూరు జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. చెరువు వద్దకు ఆడుకోవడానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయారు. అయితే వారిని కాపాడేందుకు వెళ్లిన ఓ వ్యక్తి కూడా మృతి చెందారు. నలుగురి మృతితో ఓజిలి మండలం రాజుపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రాజుపాలెం గ్రామంలో ఉన్న చెరువు వద్దకు మాచవరం హేమంత్(6), మాచవరం చరణ్ తేజ(8), జాహ్నవి(12) ఆడుకోవడానికి వచ్చారు. ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు చెరువు నీటిలో చిన్నారులు పడిపోయారు. అక్కడే సమీపంలో ఉన్న షేక్ ఖలీల్ (45) వెంటనే వారిని కాపాడేందుకు చెరువులోకి దూకాడు. వారిని కాపాడే క్రమంలో ఖలీల్ కూడా నీటిలో చిక్కుకుని మృతి చెందాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో విషాదంలో మునిగిపోయింది. ముగ్గురు చిన్నారులు ఒకే కుటుంబానికి చెందినవారు. అయితే వారిని కాపాడేందుకు వెళ్లి ఖలీల్ మృతి చెందడం ఆ కుటుంబాన్ని కలచివేసింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment