Man Killed By Married Woman Due To Extramarital Affair In Kadapa - Sakshi
Sakshi News home page

అత్తతో వివాహేతర సంబంధం.. నేనుండగా మరో పెళ్లి ఎలా చేసుకుంటావంటూ..

Published Sat, Dec 10 2022 9:19 PM | Last Updated on Mon, Dec 12 2022 10:54 AM

Man Deceased with Extramarital Affair in YSR Kadapa District - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప(రాజుపాళెం): వివాహేతర సంబంధం ఓ యువకుడిని బలి తీసుకుంది. అత్త వరుసైన మహిళే ఇందుకు కారణమైంది. ఈ సంఘటన వైఎస్సార్‌ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రమైన రాజుపాళెంలో నివాసముంటున్న పర్లపాడు నరసమ్మకు కొన్నేళ్ల క్రితం భర్త చనిపోయాడు. ఓ కుమార్తె, కుమారుడున్నారు. కుమార్తెను పక్కవీధిలోని ఎస్సీకాలనీకి చెందిన ఫొటోగ్రాఫర్‌ మిద్దె పెద్దదస్తగిరికిచ్చి పెళ్లిచేసింది. అతడికి తల్లి మాబున్ని, తమ్ముడు చిన్న దస్తగిరి(28) ఉన్నారు. తండ్రి కొన్నేళ్ల క్రితం చనిపోయాడు.

ఈ నేపథ్యంలో నరసమ్మకు, చిన్న దస్తగిరికి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. కుట్టుమిషన్లు రిపేరు చేసే చిన్నదస్తగిరికి ఇటీవల పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం నరసమ్మ అతడి ఇంటి వద్దకు వచ్చి తనుండగా వేరేవారిని ఎలా పెళ్లి చేసుకుంటావంటూ వాగ్వాదానికి దిగింది. ఆవేశంతో కత్తి తీసుకుని చిన్నదస్తగిరిని పొడవటంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. హతుడి తల్లి మిద్దె మాబున్ని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని రూరల్‌ సీఐ మధుసుదన్‌ గౌడ్, ఎస్‌ఐ రాజగోపాల్‌ పరిశీలించారు.

చదవండి: (సాఫ్ట్‌వేర్‌ భర్త నిర్వాకం.. స్నేహితులతో గడపాలని భార్యను బలవంతం)  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement