నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం కడివేడు సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.
చిల్లకూరు: నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం కడివేడు సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కోట మండలం చందోడు గ్రామానికి చెందిన ఎనిమిది మంది చేపల కొనుగోలుకు ఆటోలో నెల్లూరుకు వెళుతున్నారు. కడివేడు సమీపంలో వీరు ప్రయాణిస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్‌తోపాటు చల్లా రమణమ్మ (40), పల్లి పాపమ్మ (34), వలిపి రాజమ్మ (45) మృతి చెందారు. తమ్మిశెట్టి రమణమ్మ, పూసా చెల్లెమ్మ, చల్లా సుజాత, సన్నాసయ్య, బెల్లంకొండ రమణయ్యలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని నెల్లూరుకు తరలించారు. వీరిలో రమణమ్మ, చెల్లెమ్మల పరిస్థితి విషమంగా ఉంది.