పెళ్లింట చావు భాజా | sad news in marriage home lorry accident four members die | Sakshi
Sakshi News home page

పెళ్లింట చావు భాజా

Published Tue, Mar 22 2016 5:36 AM | Last Updated on Sun, Sep 3 2017 8:20 PM

పెళ్లింట చావు భాజా

పెళ్లింట చావు భాజా

పెళ్లి బృందం ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ నలుగురు మృతి
పెళ్లి కుమార్తె తమ్ముడు ఒకరు, చిన్న, పెద్ద నాన్న పిల్లలు ఇద్దరు మృతి
వెంగళారుుపల్లిలో విషాదం

జీవితంపై ఎన్నో ఊహలతో వివాహ బంధంతో ఒక్కటయ్యూరు.  ఆ వెంకటేశుని ఆశీర్వాదం అండగా ఉంటుందనుకున్నారు...  వేద మంత్రాలు ఇంకా చెవుల్లోనే గింగురుమంటున్నారుు. అరుంధతీ నక్షత్రం కళ్లలోనే కదలాడుతోంది.  వచ్చిన బంధువుల సందడి... పిల్లల ఆటలు...అమ్మలక్కల మాటలు..పెద్దల ఆశీర్వాదాలు ఆనందంఅంబరమైంది.విధికి కన్నుకుట్టిందేమో పెళ్లిపందిరి మృత్యుకుహరమైంది.   మంగళ వారుుద్యాలు ... చావు బాజాలుగా మారిపోయూరుు. అన్నీ ఆవిరైపోయూరుు. ఆక్రందనలు మిన్నంటారుు.  

మృత్యువులోనూ వీడని అన్నదమ్ముల అనుబంధం...
మృతి చెందిన నలుగురిలో ముగ్గురు అన్నదమ్ములు. పెళ్లి కుమార్తె సొంత తమ్ముడు ఒకరుకాగా పెదనాన్న, చిన్నాన్న కుమారులు ఇద్దరున్నారు. ఒక్క సారిగా ఒకే కుటుంబంలో ముగ్గురిని కోల్పోవడంతో కుటుం బ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు.

 పెళ్లి పనులన్నీ చేసి వెళ్లిపోయూవా
పెళ్లి పనులన్నీ ఒక్కడివే చేసి నన్ను ఇంటికి సాగనంపి నీవు పరలోకానికి చేరావా తమ్ముడూ అంటూ పెళ్లి కుమార్తె మౌనిక చేసే రోదనలు అక్కడున్నవారిని కంట తడిపెట్టిస్తున్నాయి. నా తమ్ముడు నాకు కావాలంటూ కాళ్లపారాణి ఆరని ఆ ఇల్లాలు కన్నీటి పర్యంతమవుతోంది.

 వద్దన్నా వినలేదయ్యా.. 
నేను వద్దన్నా వినకుండా అక్కపెళ్లి చూడాలని వచ్చి అందని లోకాలకు వెళ్లావా అయ్యా అంటూ తండ్రి పోలయ్య కుమిలిపోయూడు. నరేష్ మృతి చెందగా, మహేష్ పరిస్థితి విషమంగా ఉంది. నా కొడుకులు ఎక్కడయ్యా.. నా బిడ్డలు ఎక్కడంటూ నరేష్ తల్లిదండ్రులు రోదిస్తూ  సృ్పహ కోల్పోయారు. 

 రమ్మన్నా.. రాలేదయ్యా..
సంప్రదాయం ప్రకారం బావ కాళ్లు కడిగేందుకు చిన్న బావమరిది ఉండాలి. కారులో నువ్వురారా అని ఇంట్లో వారందరూ పిలిచినా రాకుండా పైకి పోయాడయ్యా అంటూ ప్రవీణ్  కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు.

 కనిగిరి: అప్పటిదాకా ఆనందంగా గడిపిన పెళ్లింట్లో ఒక్కసారిగా విషాదం నెలకుంది. ఎంతో ఆనందంగా పెళ్లి ముగించుకొని మరో 20 నిమిషాల్లో ఇంటికి చేరుతామనుకున్న సమయంలో ఆ కుటుంబాలపై విధి విషం చిమ్మింది. సోమవారం ఉదయం 6.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా 15 మంది క్షతగాత్రులుగా మారారు.

 వివరాల్లోకి వెళితే...పీసీపల్లి మండలం వెంగళాపురం గ్రామానికి చెందిన మోనిక, తిరుపతయ్య వివాహం కనిగిరి పట్టణంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం తెల్లవారు జామున ఐదు గంటలకు పెళ్లి జరిగింది. అనంతరం నవదంపతులు, పెళ్లి బంధువులు ఇంటికి బయలు దేరారు. పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడు మరో నలుగురు ముందుగా కారులో వెళ్లిపోగా వెనుక ట్రాక్టర్‌లో మొత్తం 25 మంది బయలు దేరారు. ఏబీఆర్ కళాశాల (చిన ఇర్లపాడు క్రాస్‌రోడ్డు) సమీపంలో పెళ్లి బృందం ట్రాక్టర్‌ను కందుకూరు రోడ్డు నుంచి వేగంగా వస్తున్న గ్రానైట్ లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన డి.నర్శింహులు(31), వెంగళాపురానికి చెందిన ఆరో తరగతి విద్యార్థి(11) అక్కడికక్కడే మృతి చెందగా, పెళ్లి కుమార్తె తమ్ముడు ప్రవీణ్(14) (9వ తరగతి), డి.రాఘమ్మ(55)లను మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. బి.పద్మ, పి, పద్మ, డి.అనుషా, డి. పోలయ్య, కె.గురవయ్య, కె.మాలకొండయ్య, వేణు, కాటం రాజు, డి.రాజ్యం, నారాయణ, కొండయ్య, గంగయ్య, శ్రీను, బి.రత్తయ్య,  మహేష్‌లకు గాయాలయ్యాయి. వీరిలో మహేష్, రాజ్యం, మాలకొండయ్య,  రత్తయ్య,  నారాయణలు ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలుడు మహేష్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.     

 సంఘటనా స్థలాన్ని సందర్శించిన డీఎస్పీ, ఆర్డీఓ
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటనను తెలుసుకుని ఆర్డీఓ మల్లికార్జునరావు, డీఎస్పీ వి.శ్రీనివాసులు సంఘటనా స్థలానికి వచ్చారు. ఘటన జరిగిన తీరును తెలుసుకుని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ మల్లికార్జున రావు విలేకర్లకు తెలిపారు.

 బుర్రా సంతాపం
రోడ్డు ప్రమాద ఘటన తెలుసుకున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ మృతుని బంధువులతో ఫోన్లో మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 93 కులాల ఐక్యవేదిక రాష్ట్ర, జిల్లా నాయకులు పెన్నా నాగయ్య, నాలీ వెంకటేశ్వర్లు, గంగరాజు యాదవ్, దద్దాల నారాయణ, చెరుకూరి కాశయ్యలు మృత దేహాల వద్ద నివాళులు అర్పించారు. 

 మృతులకు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియ, క్షతగాత్రులకు రూ.1.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా, మండల నాయకులు ఎస్.రంగనాయకుల రెడ్డి, తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, ఎస్ మోహన్‌రెడ్డి, సంగు సుబ్బారెడ్డిలు డిమాండ్ చేశారు.

 నివాళులర్పించిన టీడీపీ నాయకులు
ఎమ్మెల్యే కదిరి సోదరుడు కదిరి రమణయ్య, ఎంపీపీ నంబుల వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ బేరిపుల్లారెడ్డి, కౌన్సిలర్ చింతం శ్రీనివాసుల యాదవ్, దొడ్డా వెంకట సుబ్బారెడ్డిలు సందర్శించి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

 మృత దేహాలకు పోస్టు మార్టం
వెంగళాపురానికి చెందిన నరేష్, ప్రవీణ్, రాఘమ్మ, గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన నర్శింహులు మృతదేహాలకు పోస్టమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించినట్లు ఇన్‌చార్జి సీఐ లక్ష్మణ్ తెలిపారు.

క్లీనర్ నడపడం వల్లే
కందుకూరు నుంచి కనిగిరికి వస్తున్న గ్రానైట్ లారీని డ్రైవర్‌కు బదులు క్లీనర్ నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ట్రాక్టర్ పూర్తిగా రోడ్డు కిందకు దిగినా గ్రానైట్ లారీ డ్రైవర్ పక్కకు తప్పించకుండా బలంగా ఢీ కొట్టడంతో ట్రాక్టర్ ముందు కూర్చున్న నర్శింహులు అక్కడికక్కడే మృతి చెందగా, ట్రాక్టర్ వెనుక కూర్చున్న నరేష్ కిందపడి మృతి చెందాడు. ఈ క్రమంలో అదే రూట్లో ట్రాక్టర్ వెనుక వస్తున్న మరో డీసీఎం ఆటోను కూడా గ్రానైట్ లారీ  ఢీకొంది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగ లేదు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement