wedding group
-
డ్రైవర్‌కు ఫిట్స్ రావడంతో కల్వర్టును ఢీకొన్న కారు.. వరుడు సహా..
సాక్షి, హనుమాన్‌జంక్షన్ రూరల్ (గన్నవరం): బాపులపాడు మండలం అంపాపురం వద్ద చెన్నై – కోల్కత్తా జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నూతన వరుడు, మరో ఇద్దరు తీవ్రంగా, వధువు, మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. డ్రైవర్‌కు ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. వీరవల్లి పోలీసుల కథనం మేరకు.. పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి సమీపంలోని పిప్పరలో శుక్రవారం రాత్రి వివాహం జరిగింది. నూతన వధూవరులు, వారి కుటుంబ సభ్యులు కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. అంపాపురం సమీపంలోని పతంజలి పామాయిల్ ఫ్యాక్టరీ సమీపంలో కారు డ్రైవర్‌కు ఫిట్స్ వచ్చాయి. దీంతో కారు అదుపుతప్పి వేగంగా రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొట్టింది. వరుడు కె.శివకుమార్, ఆయన తల్లి సీతారావమ్మ, డ్రైవర్ సుమంత్ తీవ్రంగా గాయపడ్డారు. వధువు రేణుక, మరో బంధువు గాయత్రి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వీరవల్లి పోలీసులు, హైవే రోడ్ సేఫ్టీ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో చిన్నవుటపల్లి పిన్నమనేని సిద్ధార్థ వైద్యశాలకు తరలించారు. వీరవల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: (కాళ్ల పారాణి ఆరకముందే.. నవ వధువు మృతి) -
ఏరు దాటిన పెండ్లికూతురు
చెన్నై / సేలం: ముంచుకొస్తున్న పెండ్లి ముహూర్తం ముందు ఉధృతంగా ప్రవహిస్తున్న వరద. కుటుంబీకులు, గ్రామస్తులు, అటవీ శాఖ అధికారులు కలిసి శుక్రవారం సాహసంతో పెండ్లికూతురిని ఏరు దాటించారు. ఈరోడ్ జిల్లా సత్యమంగళం సమీపంలో భవనీ సాగర్ పరిధిలోని అడవి ప్రాంతంలో డెంగుమరడ కొండ గ్రామం ఉంది. ఈ గ్రామానికి వెళ్లాలంటే ఇక్కడి మాయారు (ఏరు) దాటాల్సి ఉంది. ఈ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా మాయారు ఉధృతంగా ప్రవహిస్తోంది. మాయారును దాటవద్దని అధికారులు హెచ్చరికలు సైతం జారీ చేసి ఉన్నారు. ఇదిలా ఉండగా డెంగుమరడ గ్రామానికి చెందిన రైతు అవినాశి. ఇతని భార్య సెల్వి. వీరి కుమార్తె రాసాత్తి (24). బీఏ డిగ్రీ పట్టభద్రురాలు. ఈమెకు కోవై జిల్లా ఆలంకొంబు ప్రాంతానికి చెందిన రంజిత్కుమార్తో వివాహం నిశ్చయమైంది. వీరి వివాహం ఈ నెల 20వ తేదీ ఆలంకొంబులో జరిపించేందుకు పెద్దలు ఏర్పాట్లు చేస్తున్నారు. వివాహానికి రెండు రోజులే ఉండడంతో మాయారును ఎలా దాటి వెళ్లాలా, పెండ్లి జరుగుతుందా అనే సందేహాలతో రాసాత్తి కుటుంబీకులు ఆందోళన చెందారు. అటవీ శాఖ అధికారులు వారికి ధైర్యం చెప్పి, గ్రామస్తుల సాయంతో పెండ్లి కూతురు రాస్తాతితో పాటు 15 మంది కుటుంబ సభ్యులను శుక్రవారం బుట్ట పడవలో ఏరు దాటించారు. తర్వాత వారు భవానీసాగర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాసాత్తి మాట్లాడుతూ మాయారులో వరద ఉధృతి చూసి నా పెళ్లి ఆగిపోయినట్లే అనుకున్నాను. అధికారులు ధైర్యం చెప్పి సాహసంతో ఏరు దాటించారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పింది. అదే సమయంలో మాయారు దాటి వెళ్లడానికి వంతెన ఏర్పాటు చేయాలి. బస్సు సౌకర్యం కల్పించాలని రాసాత్తి కోరింది. -
పెళ్లింట చావు భాజా
♦ పెళ్లి బృందం ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ నలుగురు మృతి ♦ పెళ్లి కుమార్తె తమ్ముడు ఒకరు, చిన్న, పెద్ద నాన్న పిల్లలు ఇద్దరు మృతి ♦ వెంగళారుుపల్లిలో విషాదం జీవితంపై ఎన్నో ఊహలతో వివాహ బంధంతో ఒక్కటయ్యూరు. ఆ వెంకటేశుని ఆశీర్వాదం అండగా ఉంటుందనుకున్నారు... వేద మంత్రాలు ఇంకా చెవుల్లోనే గింగురుమంటున్నారుు. అరుంధతీ నక్షత్రం కళ్లలోనే కదలాడుతోంది. వచ్చిన బంధువుల సందడి... పిల్లల ఆటలు...అమ్మలక్కల మాటలు..పెద్దల ఆశీర్వాదాలు ఆనందంఅంబరమైంది.విధికి కన్నుకుట్టిందేమో పెళ్లిపందిరి మృత్యుకుహరమైంది. మంగళ వారుుద్యాలు ... చావు బాజాలుగా మారిపోయూరుు. అన్నీ ఆవిరైపోయూరుు. ఆక్రందనలు మిన్నంటారుు. మృత్యువులోనూ వీడని అన్నదమ్ముల అనుబంధం... మృతి చెందిన నలుగురిలో ముగ్గురు అన్నదమ్ములు. పెళ్లి కుమార్తె సొంత తమ్ముడు ఒకరుకాగా పెదనాన్న, చిన్నాన్న కుమారులు ఇద్దరున్నారు. ఒక్క సారిగా ఒకే కుటుంబంలో ముగ్గురిని కోల్పోవడంతో కుటుం బ సభ్యులు తట్టుకోలేకపోతున్నారు. పెళ్లి పనులన్నీ చేసి వెళ్లిపోయూవా పెళ్లి పనులన్నీ ఒక్కడివే చేసి నన్ను ఇంటికి సాగనంపి నీవు పరలోకానికి చేరావా తమ్ముడూ అంటూ పెళ్లి కుమార్తె మౌనిక చేసే రోదనలు అక్కడున్నవారిని కంట తడిపెట్టిస్తున్నాయి. నా తమ్ముడు నాకు కావాలంటూ కాళ్లపారాణి ఆరని ఆ ఇల్లాలు కన్నీటి పర్యంతమవుతోంది. వద్దన్నా వినలేదయ్యా.. నేను వద్దన్నా వినకుండా అక్కపెళ్లి చూడాలని వచ్చి అందని లోకాలకు వెళ్లావా అయ్యా అంటూ తండ్రి పోలయ్య కుమిలిపోయూడు. నరేష్ మృతి చెందగా, మహేష్ పరిస్థితి విషమంగా ఉంది. నా కొడుకులు ఎక్కడయ్యా.. నా బిడ్డలు ఎక్కడంటూ నరేష్ తల్లిదండ్రులు రోదిస్తూ సృ్పహ కోల్పోయారు. రమ్మన్నా.. రాలేదయ్యా.. సంప్రదాయం ప్రకారం బావ కాళ్లు కడిగేందుకు చిన్న బావమరిది ఉండాలి. కారులో నువ్వురారా అని ఇంట్లో వారందరూ పిలిచినా రాకుండా పైకి పోయాడయ్యా అంటూ ప్రవీణ్ కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు. కనిగిరి: అప్పటిదాకా ఆనందంగా గడిపిన పెళ్లింట్లో ఒక్కసారిగా విషాదం నెలకుంది. ఎంతో ఆనందంగా పెళ్లి ముగించుకొని మరో 20 నిమిషాల్లో ఇంటికి చేరుతామనుకున్న సమయంలో ఆ కుటుంబాలపై విధి విషం చిమ్మింది. సోమవారం ఉదయం 6.30 గంటలకు జరిగిన ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా 15 మంది క్షతగాత్రులుగా మారారు. వివరాల్లోకి వెళితే...పీసీపల్లి మండలం వెంగళాపురం గ్రామానికి చెందిన మోనిక, తిరుపతయ్య వివాహం కనిగిరి పట్టణంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో సోమవారం తెల్లవారు జామున ఐదు గంటలకు పెళ్లి జరిగింది. అనంతరం నవదంపతులు, పెళ్లి బంధువులు ఇంటికి బయలు దేరారు. పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడు మరో నలుగురు ముందుగా కారులో వెళ్లిపోగా వెనుక ట్రాక్టర్లో మొత్తం 25 మంది బయలు దేరారు. ఏబీఆర్ కళాశాల (చిన ఇర్లపాడు క్రాస్‌రోడ్డు) సమీపంలో పెళ్లి బృందం ట్రాక్టర్‌ను కందుకూరు రోడ్డు నుంచి వేగంగా వస్తున్న గ్రానైట్ లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన డి.నర్శింహులు(31), వెంగళాపురానికి చెందిన ఆరో తరగతి విద్యార్థి(11) అక్కడికక్కడే మృతి చెందగా, పెళ్లి కుమార్తె తమ్ముడు ప్రవీణ్(14) (9వ తరగతి), డి.రాఘమ్మ(55)లను మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. బి.పద్మ, పి, పద్మ, డి.అనుషా, డి. పోలయ్య, కె.గురవయ్య, కె.మాలకొండయ్య, వేణు, కాటం రాజు, డి.రాజ్యం, నారాయణ, కొండయ్య, గంగయ్య, శ్రీను, బి.రత్తయ్య, మహేష్‌లకు గాయాలయ్యాయి. వీరిలో మహేష్, రాజ్యం, మాలకొండయ్య, రత్తయ్య, నారాయణలు ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలుడు మహేష్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన డీఎస్పీ, ఆర్డీఓ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటనను తెలుసుకుని ఆర్డీఓ మల్లికార్జునరావు, డీఎస్పీ వి.శ్రీనివాసులు సంఘటనా స్థలానికి వచ్చారు. ఘటన జరిగిన తీరును తెలుసుకుని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీఓ మల్లికార్జున రావు విలేకర్లకు తెలిపారు. బుర్రా సంతాపం రోడ్డు ప్రమాద ఘటన తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ మృతుని బంధువులతో ఫోన్లో మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 93 కులాల ఐక్యవేదిక రాష్ట్ర, జిల్లా నాయకులు పెన్నా నాగయ్య, నాలీ వెంకటేశ్వర్లు, గంగరాజు యాదవ్, దద్దాల నారాయణ, చెరుకూరి కాశయ్యలు మృత దేహాల వద్ద నివాళులు అర్పించారు. మృతులకు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియ, క్షతగాత్రులకు రూ.1.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని వైఎస్ఆర్ సీపీ జిల్లా, మండల నాయకులు ఎస్.రంగనాయకుల రెడ్డి, తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, ఎస్ మోహన్‌రెడ్డి, సంగు సుబ్బారెడ్డిలు డిమాండ్ చేశారు. నివాళులర్పించిన టీడీపీ నాయకులు ఎమ్మెల్యే కదిరి సోదరుడు కదిరి రమణయ్య, ఎంపీపీ నంబుల వెంకటేశ్వర్లు, మాజీ ఎంపీపీ బేరిపుల్లారెడ్డి, కౌన్సిలర్ చింతం శ్రీనివాసుల యాదవ్, దొడ్డా వెంకట సుబ్బారెడ్డిలు సందర్శించి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృత దేహాలకు పోస్టు మార్టం వెంగళాపురానికి చెందిన నరేష్, ప్రవీణ్, రాఘమ్మ, గుంటూరు జిల్లా ఫిరంగిపురానికి చెందిన నర్శింహులు మృతదేహాలకు పోస్టమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించినట్లు ఇన్చార్జి సీఐ లక్ష్మణ్ తెలిపారు. క్లీనర్ నడపడం వల్లే కందుకూరు నుంచి కనిగిరికి వస్తున్న గ్రానైట్ లారీని డ్రైవర్‌కు బదులు క్లీనర్ నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ట్రాక్టర్ పూర్తిగా రోడ్డు కిందకు దిగినా గ్రానైట్ లారీ డ్రైవర్ పక్కకు తప్పించకుండా బలంగా ఢీ కొట్టడంతో ట్రాక్టర్ ముందు కూర్చున్న నర్శింహులు అక్కడికక్కడే మృతి చెందగా, ట్రాక్టర్ వెనుక కూర్చున్న నరేష్ కిందపడి మృతి చెందాడు. ఈ క్రమంలో అదే రూట్లో ట్రాక్టర్ వెనుక వస్తున్న మరో డీసీఎం ఆటోను కూడా గ్రానైట్ లారీ ఢీకొంది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగ లేదు. -
మిడుతూరు వద్ద పెళ్లి బృందం లారీ బోల్తా
పెద్దవడుగూరు/గుత్తి/అనంతపురం మెడికల్ : పెద్దవడుగూరు మండలం మిడుతూరు వద్ద 44వ నంబరు జాతీయరహదారిపై మంగళవారం రాత్రి పెళ్లి బృందం లారీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో 60 మంది గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల కథనం మేరకు... పామిడికి చెందిన సురేఖకు, గుంతకల్లు మండలం వైటీ చెరువుకు చెందిన హరికి పెళ్లి నిశ్చయమైంది. వరుడి ఇంటి వద్ద వివాహం జరగాల్సి ఉంది. ముహూర్తం రోజైన మంగళవారం రాత్రి వధువు బంధువులు, స్నేహితులు, సన్నిహితులు, పరిచయస్తులు దాదాపు 80 మంది వైటీ చెరువుకు లారీలో బయల్దేరారు. పెళ్లి కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా ఉన్నారు. ఈ క్రమంలో డ్రైవర్ సుధీర్ మితిమీరిన వేగంతో వెళుతూ మిడుతూరు వద్దకు రాగానే అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో బోల్తాపడింది. పిల్లలు, పెద్దలు, మహిళలు అందరూ చెల్లాచెదురుగా ఎగిరిపడటంతో రహదారి రక్తమోడింది. తీవ్రగాయాలతో రక్షించండి అంటూ హాహాకారాలు చేశారు. దాదాపు 60 మంది గాయపడటంతో గుత్తి, పామిడి, అనంతపురం, కర్నూలు ఆస్పత్రులకు 108, పోలీసు జీపులు, ప్రైవేట్ వాహనాల్లో తరలించారు. పెళ్లి కుమార్తె సురేఖ స్వల్పంగా గాయపడింది. గుత్తి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో పామిడికి చెందిన బెస్త ఓబులేసు (38) చనిపోయాడు. జే సీ సత్యనారాయణ, ఆర్డీఓ హుసేన్ సాబ్, తహశీల్దార్ ఆదిలింగయ్య, ఎంపీపీ వీరేష్, డీఎస్పీ రవికుమార్, పెద్దవడుగూరు తహశీల్దార్ వెంకటశేషు, డిప్యూటీ తహశీల్దార్ సౌజన్యలక్ష్మీ, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కేఈ సురేష్‌గౌడ్, మాల మహానాడు జిల్లా నాయకులు వెంకటేష్ తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. లారీ బోల్తాపడిన అనంతరం డ్రైవర్ సంఘటన స్థలం నుంచి పరారయ్యాడు. అతివేగంతోపాటు సామర్థ్యానికి మించి ప్రయాణించడం ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. జేసీబీ తెప్పించి రోడ్డుపై నుంచి లారీని పక్కకు తీసి రూట్ క్లియర్ చేశారు. క్షతగాత్రులు వీరే... : పామిడికి చెందిన ఓబుళపతి, సువర్ణ, వసంత, భరత్, ఖాసీం, పుల్లమ్మ, పురుషోత్తం, ప్రవీణ్, భాగ్య మ్మ, గుర్రమ్మ, శివ, రేణుక, జిలాన్, శివశంకర్, సుధాకర్, సురేష్, శింగనమలకు చెందిన కృష్ణమూర్తి, రమాదేవి, శ్రీవాణి, విష్ణువర్ధన్, పాపయ్య, మైథిలి, మధు, సునీల్, చిట్టూరుకు చెం దిన సునీల్, కొప్పల కొండకు చెందిన లక్ష్మిదేవి, ఎర్రి స్వామి, సుంకులమ్మ, నారాయణస్వామి, బెస్తరవి, సాల మ్మ, రాజు , మహేష్, యగ్నేష్, చలపతి, వంశీకృష్ణ, లక్ష్మిదేవి, నాగరాజు, లక్ష్మిదేవి, కాశీం వలి, నడిపి సుంకన్న, పెద్ద పుల్లమ్మ, జిలాన్‌బాషా, శాంతి, రమాదేవి, పాపులమ్మ తదితరులు ఉన్నారు. మిన్నంటిన ఆర్తనాదాలు: గాయపడినవారి ఆర్తనాదాలతో గుత్తి, అనంతపురం సర్వజనాస్పత్రులు మారుమోగాయి. అనంతలో దాదాపుగా 25 మందికి పైగా ఉన్న క్షతగాత్రులకు ఒకే చోట వైద్యం అందించేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు. సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వర రావు, సర్జికల్ హెచ్ఓడీ ప్రొఫెసర్ డాక్టర్ రామస్వామినాయక్, క్యాజువాలిటీ హెచ్ఓడీ డాక్టర్ శివకుమార్ వైద్య సేవలందించడానికి చర్యలు చేపట్టారు. హౌస్ సర్జన్లు, నర్సింగ్ విద్యార్థినులు, సెక్యూరిటీ సిబ్బం ది, జిల్లా ఎపిడమిక్ ధర్మసింగ్ బృందం సేవలందించారు. అనంతపురం తహ శీల్దార్ లక్ష్మినారాయణ పరిస్థితిని సమీక్షంచారు.