
సాక్షి, ఒంగోలు : అద్దంకి మండలం చక్రాయపాలెం వద్ద ఓ ఆగంతకుడు పోలీస్ కానిస్టేబుల్‌నంటూ లారీ డ్రైవర్‌ని చితకొట్టాడు. స్టేషన్‌కు తీసుకెళ్తానంటూ బైక్ ఎక్కించుకుని పర్సు కొట్టేశాడు. వివరాలు.. నెల్లూరు నుంచి కోదాడ వెళ్తున్న ఓ లారీ.. అద్దంకి మండలం చక్రాయపాలెం వద్ద.. అద్దంకి నార్కెట్‌పల్లి రాష్ట్ర రహదారిపై ఆగింది. ఇంతలో ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి ‘సీఐ వాహనంపైనే ఉమ్మేసి వస్తావా’ అంటూ చితకబాదాడు. స్టేషన్‌కి తీసుకెళ్తానంటూ బైక్‌పై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లగానే.. అతనిపై దాడిచేసి పర్సు లాక్కెళ్లాడు. పర్సులో రూ.6 వేలు నగదు, ఏటీఎం కార్డు ఉందని డ్రైవర్ వాపోయాడు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్టు బాధితుడు వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment